Shuru
Apke Nagar Ki App…
26 27 మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్ సభ్యులు మెదక్ మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్న మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్ అధ్యక్షతన జరిగింది సమావేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అధికారుల తీరును కౌన్సిలర్ ఆంజనేయులు విమర్శించారు ఈ సమావేశంలో కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ డి ఈ మహేష్ ఏఈ అధికారులుకౌషన్సిలర్లు తధితరులు పాల్గొన్నారు
మెదక్ న్యూస్
26 27 మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్ సభ్యులు మెదక్ మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్న మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్ అధ్యక్షతన జరిగింది సమావేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అధికారుల తీరును కౌన్సిలర్ ఆంజనేయులు విమర్శించారు ఈ సమావేశంలో కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ డి ఈ మహేష్ ఏఈ అధికారులుకౌషన్సిలర్లు తధితరులు పాల్గొన్నారు
More news from తెలంగాణ and nearby areas
- విద్యార్థులకు మెనూ కచ్చితంగా పాటిస్తూ నాణ్యమైన భోజనం ఇవ్వాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) విద్యాలయంలో కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్, స్టోర్ రూమ్ లో ఆహార సామగ్రి, కోడి గుడ్లు, కూరగాయలు, విద్యార్థుల కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలు, తరగతి, వసతి గదులను పరిశీలించారు. మెనూ ప్రకారం చికెన్, మటన్, కోడి గుడ్లు ఇస్తున్నారా అని ఆరా తీశారు. ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశించారు. పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవు తుండగా, కలెక్టర్ వారితో మాట్లాడి.. పలు సూచనలు చేశారు. విద్యార్థులందరూ చదువు పై శ్రద్ధ పెట్టాలని, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. తాము అనుకున్న ఉద్యోగాలు, ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.1
- వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ సాయి డెంటల్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ర్యాగింగ్ పేరిట వేధిస్తున్న సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ డిమాండ్ చేశారు. ర్యాగింగ్ చేస్తున్న అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్ లిస్ట్ సిపిఎం వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున డెంటల్ కళాశాల యజమాన్యానికి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. ర్యాగింగ్ చేస్తున్న విద్యార్థుల పై ర్యాగింగ్ గురవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారని, వెంటనే పోలీసులు కళాశాల సిబ్బందితో విద్యార్థులతో అవేర్నెస్ ప్రోగ్రాములు ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇలాంటి ర్యాగింగ్లు ఎక్కడ జరగకుండా జాగ్రత్త తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.1
- హనుమకొండలో టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ ఉద్ధృతం: ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల రాకపై అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన! హనుమకొండ: ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశాన్ని నిరసిస్తూ హనుమకొండలో బస్టాండ్ వద్ద టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుల వెంకన్న ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఈదుల వెంకన్న మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పరోక్షంగా ఆర్టీసీని ప్రైవేటీకరించడమేనని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.ఆర్టీసీని కాపాడుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించారు.1
- "Auto drivers struggling due to gas shortage." "No gas, no work: Auto drivers in distress." "Fuel crisis hitting auto drivers hard."1
- Post by Tagore1
- మెట్‌పల్లి మార్చి 30: పట్టణంలోని 26వ వార్డులో భద్రతను బలోపేతం చేసే దిశగా బీజేపీ 26వ వార్డు కౌన్సిలర్, పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో ప్రతి వీధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఎస్పీ రాములు, మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, సీఐ అనిల్, ఎస్సై కిరణ్, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్ హాజరై సీసీ కెమెరాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడిన డీఎస్పీ రాములు, మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ, ఈ సీసీ కెమెరాలు ప్రజలకు అన్నివేళలా నిఘా నేత్రాలుగా పనిచేస్తాయని తెలిపారు. వీటి ద్వారా చైన్ స్నాచింగ్, ఈవ్ టీజింగ్, దొంగతనాల వంటి ఘటనలను త్వరగా గుర్తించి నిందితులను పట్టుకోవడం పోలీసులకు సులభమవుతుందని వివరించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొడ్ల ఆనంద్, ధర్మపురి స్వరూప, వేణు, నాయకులు బొడ్ల రాహుల్, సుంకేటి విజయ్, సతీష్, బొడ్ల గౌతం, అజిత్, సంజీవ్, అంజయ్య, జెట్టి రూపేష్, శ్రీకాంత్, లత, లక్ష్మి, రాజు, భాయ్, హరితతో పాటు వార్డు ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.3
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో భక్తులు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని రాజన్నకు ప్రీతిపాత్రమైన కోడిమొక్కులను చెల్లించుకున్నారు.1
- తమిళనాట మొదలైన ఎన్నికల కురుక్షేత్రం: నామినేషన్ దాఖలు చేసిన టీవీకే (TVK) అధినేత విజయ్! చెన్నై/హైదరాబాద్:తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరు క్లైమాక్స్‌కు చేరుకుంది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో కీలక అడుగు వేశారు. సోమవారం నాడు ఆయన పెరంబూర్ నియోజకవర్గం నుండి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. తన తొలి ఎన్నికల బరిలో విజయ్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఒకటి చెన్నైలోని పెరంబూర్ కాగా, మరొకటి తిరుచ్చి (ఈస్ట్) నియోజకవర్గం. భారీ భద్రత నడుమ, వేలాది మంది అభిమానులు మరియు పార్టీ కార్యకర్తల కోలాహలం మధ్య విజయ్ రిటర్నింగ్ కేంద్రానికి చేరుకున్నారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన పెరంబూర్ నియోజకవర్గంలో భారీ ఎన్నికల ర్యాలీని ప్రారంభించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సీఎం స్టాలిన్ వర్సెస్ విజయ్: మరోవైపు, ఇదే రోజున తమిళనాడు ముఖ్యమంత్రి మరియు డీఎంకే (DMK) అధినేత ఎం.కె. స్టాలిన్ కూడా తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరు నుండి నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి మరియు రాష్ట్రంలో ఎదుగుతున్న కొత్త రాజకీయ శక్తి విజయ్ ఒకే రోజు నామినేషన్లు వేయడంతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా 234 స్థానాల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తోందని, అవినీతి రహిత పాలనే తన లక్ష్యమని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ఎన్నికల్లో యువత మరియు మహిళా ఓటర్లే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు.1
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 18 వ వార్డులో దోమల నివారణ చర్యల్లో భాగంగా వాట్ కౌన్సిలర్ వాల సుప్రజా నవీన్ ఆధ్వర్యంలో ఫాగింగ్ స్ప్రే నిర్వహించారు.దోమలను చంపడానికి, వ్యాప్తిని అరికట్టడానికి ఇంటింటికీ తిరిగి ఫాగింగ్ స్ప్రే నిర్వహించారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు వార్డు ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.1