logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మెనూ కచ్చితంగా పాటించాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఈఎంఆర్ఎస్ విద్యాలయంలో ఆకస్మిక తనిఖీ విద్యార్థులకు మెనూ కచ్చితంగా పాటిస్తూ నాణ్యమైన భోజనం ఇవ్వాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) విద్యాలయంలో కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్, స్టోర్ రూమ్ లో ఆహార సామగ్రి, కోడి గుడ్లు, కూరగాయలు, విద్యార్థుల కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలు, తరగతి, వసతి గదులను పరిశీలించారు. మెనూ ప్రకారం చికెన్, మటన్, కోడి గుడ్లు ఇస్తున్నారా అని ఆరా తీశారు. ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశించారు. పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవు తుండగా, కలెక్టర్ వారితో మాట్లాడి.. పలు సూచనలు చేశారు. విద్యార్థులందరూ చదువు పై శ్రద్ధ పెట్టాలని, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. తాము అనుకున్న ఉద్యోగాలు, ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.

3 hrs ago
user_Satheesh gangu
Satheesh gangu
జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
3 hrs ago

మెనూ కచ్చితంగా పాటించాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఈఎంఆర్ఎస్ విద్యాలయంలో ఆకస్మిక తనిఖీ విద్యార్థులకు మెనూ కచ్చితంగా పాటిస్తూ నాణ్యమైన భోజనం ఇవ్వాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) విద్యాలయంలో కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్, స్టోర్ రూమ్ లో ఆహార సామగ్రి, కోడి గుడ్లు, కూరగాయలు, విద్యార్థుల కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలు, తరగతి, వసతి గదులను పరిశీలించారు. మెనూ ప్రకారం చికెన్, మటన్, కోడి గుడ్లు ఇస్తున్నారా అని ఆరా తీశారు. ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశించారు. పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవు తుండగా, కలెక్టర్ వారితో మాట్లాడి.. పలు సూచనలు చేశారు. విద్యార్థులందరూ చదువు పై శ్రద్ధ పెట్టాలని, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. తాము అనుకున్న ఉద్యోగాలు, ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.

More news from తెలంగాణ and nearby areas
  • జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ లో కూరగాయలు కోసే పనిలో ఉన్న కామాటి శ్రీనివాస్ మద్యం మత్తులో చిన్నారులపై దాడికి పాల్పడ్డాడు. విద్యార్థులను చీపురితో కొట్టాడు. నిత్యం మద్యం మత్తులో వేధింపులకు గురి చేస్తున్నాడని విద్యార్థులు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. మద్యం మత్తులో హాస్టల్ కు వచ్చే కామాటి శ్రీనివాస్ విద్యార్థులు రాత్రి పడుకునే సమయంలో చీపురుతో కొడుతున్న విజువల్స్ రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలాంటి ఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయని విద్యార్థులు తెలిపారు. తాళ్ళధర్మారం నుంచి డిప్యూటేషన్‌పై జగిత్యాలకు వచ్చిన కామాటి శ్రీనివాస్, గత నాలుగు నెలలుగా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నాడని అధికారులకు పిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పలుమార్లు హాస్టల్ వార్డెన్ మధుసూదన్ మందలించిన శ్రీనివాస్ లో మార్పు రాలేదని తెలిపారు. చివరకు ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్‌కుమార్‌కు పిర్యాదు చేశారు. దీంతో రాజ్ కుమార్ సీరియస్ గా స్పందిస్తు విచారణ జరిపి శ్రీనివాస్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
    3
    జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ లో కూరగాయలు కోసే పనిలో ఉన్న కామాటి శ్రీనివాస్ మద్యం మత్తులో చిన్నారులపై దాడికి పాల్పడ్డాడు. విద్యార్థులను చీపురితో కొట్టాడు. నిత్యం మద్యం మత్తులో వేధింపులకు గురి చేస్తున్నాడని విద్యార్థులు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. మద్యం మత్తులో హాస్టల్ కు వచ్చే కామాటి శ్రీనివాస్ విద్యార్థులు రాత్రి పడుకునే సమయంలో చీపురుతో కొడుతున్న విజువల్స్ రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలాంటి ఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయని విద్యార్థులు తెలిపారు. తాళ్ళధర్మారం నుంచి డిప్యూటేషన్‌పై జగిత్యాలకు వచ్చిన కామాటి శ్రీనివాస్, గత నాలుగు నెలలుగా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నాడని అధికారులకు పిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పలుమార్లు హాస్టల్ వార్డెన్ మధుసూదన్ మందలించిన శ్రీనివాస్ లో మార్పు రాలేదని తెలిపారు. చివరకు ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్‌కుమార్‌కు పిర్యాదు చేశారు. దీంతో రాజ్ కుమార్ సీరియస్ గా స్పందిస్తు విచారణ జరిపి శ్రీనివాస్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం వడ్డేపల్లికి చెందని కుంటోళ్ల సాయిలు(50) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, తల్లి అనారోగ్యం, నిరుద్యోగ సమస్యలతో మనస్తాపం చెందిన ఆయన, శనివారం సాయంత్రం ఇంట్లో విషగుళికలు మింగాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుని కుమారుడు మహేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI శివకుమార్ చెప్పారు.
    1
    కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం వడ్డేపల్లికి చెందని కుంటోళ్ల సాయిలు(50) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, తల్లి అనారోగ్యం, నిరుద్యోగ సమస్యలతో మనస్తాపం చెందిన ఆయన, శనివారం సాయంత్రం ఇంట్లో విషగుళికలు మింగాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుని కుమారుడు మహేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI శివకుమార్ చెప్పారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    1 day ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 29 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిఆర్ఎస్ నేతలు దేవి రవీందర్, బెండ మధు మీడియా సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్, చేర్యాల, జనగామ ప్రాంతాల్లో 15 నుంచి 17 గంటల విద్యుత్ ఇస్తుంటే.. గజ్వేల్‌లో మాత్రం 14 గంటలకే పరిమితం చేయడం అన్యాయమని మండిపడ్డారు. ఎండాకాలంలో సాగుకు విద్యుత్, నీరు అత్యవసరమని, వెంటనే 18 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే రైతులతో కలిసి ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.
    2
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 29 ప్రజా తెలంగాణ న్యూస్/
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిఆర్ఎస్ నేతలు దేవి రవీందర్, బెండ మధు మీడియా సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్, చేర్యాల, జనగామ ప్రాంతాల్లో 15 నుంచి 17 గంటల విద్యుత్ ఇస్తుంటే.. గజ్వేల్‌లో మాత్రం 14 గంటలకే పరిమితం చేయడం అన్యాయమని మండిపడ్డారు.
ఎండాకాలంలో సాగుకు విద్యుత్, నీరు అత్యవసరమని, వెంటనే 18 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే రైతులతో కలిసి ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    21 hrs ago
  • జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో మోస్తా నుండి భారీ వర్షం నమోదవుతుంది. సోమవారం సాయంత్రం మూడున్నర గంటలకు ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. అనంతరం జన్నారంతో పాటు పలు గ్రామాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం పడుతోంది. జన్నారం మండలంలో ప్రతిరోజు 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో ఎండ వేడి తట్టుకోలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా కురిసిన భారీ వర్షంతో వాతావరణం చల్లబడింది.
    1
    జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో మోస్తా నుండి భారీ వర్షం నమోదవుతుంది. సోమవారం సాయంత్రం మూడున్నర గంటలకు ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. అనంతరం జన్నారంతో పాటు పలు గ్రామాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం పడుతోంది. జన్నారం మండలంలో ప్రతిరోజు 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో ఎండ వేడి తట్టుకోలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా కురిసిన భారీ వర్షంతో వాతావరణం చల్లబడింది.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • ఆదివారం రోజున కౌడిపల్లి సర్పంచ్ ఆధ్వర్యంలో. శ్రీ సీతారాములవారి పల్లకి సేవలను నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలు అందరూ కలిసి శ్రీ సీతారాములవారి పల్లకినీ గ్రామంలో ఆటపాటలతో, వివిధ రకాల వేషధారణలతో శ్రీరామ భజన చేస్తూ కనుల పండుగగ నిర్వహించినరూ. ఇలాంటి వేడుకలను నిర్వహించినందుకు గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ కు అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ గారు, ఉపసర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్ గారు, వాడు సభ్యులు మబ్బులు ,మురళి, దేవేందర్ ,రమేష్, మరియు గ్రామ పెద్దలు చంద్రం , మల్లేష్ ,దుర్గయ్య గౌడ్ ,టీ మల్లేష్, శ్రీనివాస్ గుప్తా, ఉడుత కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
    4
    ఆదివారం రోజున కౌడిపల్లి సర్పంచ్ ఆధ్వర్యంలో. శ్రీ సీతారాములవారి పల్లకి సేవలను నిర్వహించడం జరిగింది. 
గ్రామ ప్రజలు అందరూ కలిసి శ్రీ సీతారాములవారి పల్లకినీ గ్రామంలో ఆటపాటలతో, వివిధ రకాల వేషధారణలతో శ్రీరామ భజన చేస్తూ కనుల పండుగగ నిర్వహించినరూ. 
ఇలాంటి వేడుకలను నిర్వహించినందుకు గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ కు అభినందనలు తెలిపారు.
ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ గారు, ఉపసర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్ గారు, వాడు సభ్యులు మబ్బులు ,మురళి, దేవేందర్ ,రమేష్, మరియు గ్రామ పెద్దలు చంద్రం , మల్లేష్ ,దుర్గయ్య గౌడ్ ,టీ మల్లేష్, శ్రీనివాస్ గుప్తా, ఉడుత కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
    user_Vishwanath Goud
    Vishwanath Goud
    Grocer కౌడిపల్లి, మెదక్, తెలంగాణ•
    12 hrs ago
  • Post by Tagore
    1
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    13 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో భక్తులు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని రాజన్నకు ప్రీతిపాత్రమైన కోడిమొక్కులను చెల్లించుకున్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో భక్తులు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని రాజన్నకు ప్రీతిపాత్రమైన కోడిమొక్కులను చెల్లించుకున్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 hrs ago
  • కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరును నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరును నిరసిస్తూ హుజురాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల వీధి రౌడీ లా కౌశిక్ రెడ్డి వ్యవహరించారని ఆరోపిస్తు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఫోటోతో ఉన్న ప్లెక్సీ ని చెప్పుతో కొడుతు నిరసన తెలిపారు. హుజురాబాద్ జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఎమ్మెల్యే అనే సోయి మరిచిపోయి విచక్షణరహితంగా ప్రవర్తిస్తున్న కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి కి వ్యతిరేకం గా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే పై తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని లేనిచో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కడియం శ్రీహరి పట్ల అనుచితంగా ప్రవర్తించిన కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. లేనిచో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.
    1
    కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరును నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరును నిరసిస్తూ హుజురాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల వీధి రౌడీ లా కౌశిక్ రెడ్డి వ్యవహరించారని ఆరోపిస్తు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఫోటోతో ఉన్న ప్లెక్సీ ని చెప్పుతో కొడుతు నిరసన తెలిపారు. హుజురాబాద్ జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఎమ్మెల్యే అనే సోయి మరిచిపోయి విచక్షణరహితంగా ప్రవర్తిస్తున్న కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి కి వ్యతిరేకం గా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే పై తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని లేనిచో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కడియం శ్రీహరి పట్ల అనుచితంగా ప్రవర్తించిన కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. లేనిచో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
  • రోడ్డు మధ్యలో గ్యాప్ రావడంతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ముల్కలగూడా రోడ్డులో మధ్యలోని సిమెంటు రోడ్డుకు గ్యాప్ రావడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల సౌకర్యార్థం నిర్మించిన రోడ్డు మధ్యలో గ్యాప్ రావడంతో వాహనాలు అదుపుతప్పి ప్రజలు పడిపోతున్నారు. దీంతో అంబులెన్స్ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మధ్యలో ఏర్పడిన గ్యాప్ ను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
    1
    రోడ్డు మధ్యలో గ్యాప్ రావడంతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు
లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ముల్కలగూడా రోడ్డులో మధ్యలోని సిమెంటు రోడ్డుకు గ్యాప్ రావడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల సౌకర్యార్థం నిర్మించిన రోడ్డు మధ్యలో గ్యాప్ రావడంతో వాహనాలు అదుపుతప్పి ప్రజలు పడిపోతున్నారు. దీంతో అంబులెన్స్ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మధ్యలో ఏర్పడిన గ్యాప్ ను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.