Shuru
Apke Nagar Ki App…
నిజాంసాగర్ మండలం వడ్డేపల్లికి చెందిన సాయిలు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య, చికిత్స పొందుతూ మృతి కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం వడ్డేపల్లికి చెందని కుంటోళ్ల సాయిలు(50) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, తల్లి అనారోగ్యం, నిరుద్యోగ సమస్యలతో మనస్తాపం చెందిన ఆయన, శనివారం సాయంత్రం ఇంట్లో విషగుళికలు మింగాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుని కుమారుడు మహేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI శివకుమార్ చెప్పారు.
Narmala Swapna
నిజాంసాగర్ మండలం వడ్డేపల్లికి చెందిన సాయిలు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య, చికిత్స పొందుతూ మృతి కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం వడ్డేపల్లికి చెందని కుంటోళ్ల సాయిలు(50) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, తల్లి అనారోగ్యం, నిరుద్యోగ సమస్యలతో మనస్తాపం చెందిన ఆయన, శనివారం సాయంత్రం ఇంట్లో విషగుళికలు మింగాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుని కుమారుడు మహేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI శివకుమార్ చెప్పారు.
More news from తెలంగాణ and nearby areas
- కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సీతాయిపల్లిలో వృద్ధురాలు రుక్మవ్వ(73)ను హత్యకు గురైంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. ఆదివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న సమయంలో ఆమె రెండో కోడలు కోటవ్వ తలపై బండతో కొట్టింది. దీంతో రుక్మవ్వ అక్కడికక్కడే చనిపోయింది. ఆమె మెడలోని బంగారం, చెవి కమ్మలను కోడలు ఎత్తుకెళ్లింది. మృతురాలు కుమార్తె కిష్టవ్వ ఫిర్యాదు మేరకు ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.1
- తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం గరుడ గంగా నది తీరాన స్వయంభుగా వెలసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాతా ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున ఆలయ పూజారి పార్థివ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి మంజీరా నదిజలాలతో అభిషేకం పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం పసుపు కుంకుమలతో అందంగా అలంకరించారు. పట్టు వస్త్రలంకరణ చేసి పుష్పాలంకరణ నిమ్మకాయల హారం అలంకరణ వివిధ రంగుల పుష్పలతో అందంగా అలంకరించారు.పుష్పార్చన కావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు కుంకుమార్చన సహస్రనామార్చిన అనంతరం మంగళహారతి ఇచ్చారు.అమ్మవారికి వివిధ రకాల పండు పూలతో నైవేద్యం సమర్పించారు మంగళ హారతి ఇచ్చారు. ఆలయ ఈవో వీరేశం ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది భక్తులకుమౌలిక స్వరూపాయలు కల్పించారు పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.1
- *గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం సర్వసభ్య సమావేశం* * శరవేగంగా శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణం పనులు * వాసవి మాత కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలి - మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి * దాదాపు 10 కోట్ల రూపాయల తో ఆలయ నిర్మాణం గజ్వేల్, 29 ఆదివారం మార్చ్ 2026 సిద్దిపేట : జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆర్యవైశ్య భవన్ వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ పనులను పరిశీలించిన అనంతరం వైశ్య భవనంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ సీ సంతోష్ మాట్లాడుతూ, ఆర్యవైశ్య కుల దైవం జగన్మాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కరుణాకటాక్షాలతో అందరూ బాగుండాలని కోరుకుంటూ, గత ప్రభుత్వం కేటాయించిన వైశ్య భవన్ స్థలంలో ఆర్యవైశ్యుల దాతల సహకారంతో, దాదాపు పది కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని త్వరలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇచ్చేవారు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు, ఈ కార్యక్రమంలో కొమురవేల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, 2వ వార్డ్ కౌన్సిలర్ గోలి మమత సంతోష్, ఏ ఏం సి డైరెక్టర్ మహంకాళి శ్రీనివాస్, ఉప్పల శ్రీనివాస్, కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు సిద్ది బిక్షపతి, అత్తెల్లి శ్రీనివాస్, కైలాస ప్రభాకర్, మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్, ఎర్రం శ్రీనివాస్, తోట బిక్షపతి, ములుగు రంగయ్య, గుడాల రాధాకృష్ణ, ఉప్పల కృష్ణమూర్తి, అత్తెల్లి నాగేంద్రం, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం నాయకులు, మహిళా మణులు, చిన్నారులు యువకులు తదితరులు పాల్గొన్నారు.4
- సిద్దిపేట జిల్లా జిల్లా గజ్వేల్ పట్టణంలోని బస్ స్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్వీ జ్యూవెల్లరీ వన్ గ్రామ్ గోల్డ్ షోరూమ్‌ను ఖమ్మంపల్లి సర్పంచ్ కరుణాకరన్ రెడ్డి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆయన తొలి విక్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్వేత కరుణాకరన్ రెడ్డి, మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, సామాన్య ప్రజలు అసలు బంగారాన్ని కొనలేని పరిస్థితి నెలకొందని, ఇలాంటి తరుణంలో గజ్వేల్ ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన వన్ గ్రామ్ గోల్డ్ నగలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. మహిళలకు నచ్చే విధంగా, లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా అనేక రకాల డిజైన్లు ఈ షాపులో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా పెళ్లికూతురు అలంకరణకు అవసరమైన నగలు, మహిళలు, యువతీ యువకులు వివిధ శుభకార్యాలకు ధరించే ప్రత్యేక ఆభరణాలు ఇక్కడ లభిస్తాయన్నారు. గజ్వేల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నాణ్యతతో కూడిన వన్ గ్రామ్ గోల్డ్ నగలు ఇక్కడ సరసమైన ధరలకే లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షాపు యాజమాన్యం , నిర్వాహకులు, స్థానిక నాయకులు, మహిళలు, మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- సంగారెడ్డి న్యూస్: భవాని గుడి నుండి తాళ్లపల్లి రోడ్ దుర్గమ్మ గుడి ముందు చాలా పురాతనమైన బావి ఉన్నది రోడ్డు నుండి బావి చాలా ప్రమాదకరంగా వాహనాలు రాత్రి సమయంలో అదుపుతప్పితే బావిలోకి పడిపోవడం ఖాయం ఇటువంటి ప్రమాదకరమైన బావికి కనీసం ఫెన్సింగ్ గాని భారీగాడు గాని ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరం సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ గారు దీనిపైన వెంటనే స్పందించాలి మరియు మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా చర్య తీసుకోవాలని మనవి🙏1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద ధర్నా నిర్వహించిన గుండ్లపల్లి గ్రామస్తులు వారం రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగి ఇద్దరు యువకులు మరణించారు. దానికి సంబంధించి స్టేజ్ వద్ద డివైడర్,బారిగేడ్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు చెప్పిన కుడా టోల్ ప్లాజా వారు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ధర్నా నిర్వహించారు.రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడి ధర్నాను వీరమింప చేశారు.1
- Post by Solanke Ravi8
- కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం వడ్డేపల్లికి చెందని కుంటోళ్ల సాయిలు(50) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, తల్లి అనారోగ్యం, నిరుద్యోగ సమస్యలతో మనస్తాపం చెందిన ఆయన, శనివారం సాయంత్రం ఇంట్లో విషగుళికలు మింగాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుని కుమారుడు మహేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI శివకుమార్ చెప్పారు.1