logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కామోల్ లో వైభవంగా రాములవారి ఊరేగింపు కామోల్ గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత ఘనంగా, భక్తిశ్రద్ధలతో ముగిశాయి. ఆదివారం నిర్వహించిన సీతారాముల వారి శోభాయాత్ర గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తుల హర్షధ్వానాల మధ్య స్వామివారి ఊరేగింపు కొనసాగగా, భజనలు, కోలాటాలు, దీక్షా స్వాముల ఆధ్యాత్మిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. గ్రామమంతా “జై శ్రీరామ్” నినాదాలతో మార్మోగి భక్తి వాతావరణం నెలకొంది. ఈ శోభాయాత్రలో మహిళలు, యువత, పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ప్రసాదం అందించారు. భక్తుల రద్దీతో గ్రామ వీధులన్నీ కిక్కిరిసిపోయి, కామోల్ అంతా పండుగ వాతావరణంలో కళకళలాడింది.

3 hrs ago
user_Solanke Ravi
Solanke Ravi
Local News Reporter భైంసా, నిర్మల్, తెలంగాణ•
3 hrs ago
165ee7a0-1344-4ea8-961a-d51720acd135
a1bcf768-d9ce-486c-8236-06ad7bfcdec2
2954e2c0-f192-40a9-999d-3b2bfa673f5a

కామోల్ లో వైభవంగా రాములవారి ఊరేగింపు కామోల్ గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత ఘనంగా, భక్తిశ్రద్ధలతో ముగిశాయి. ఆదివారం నిర్వహించిన సీతారాముల వారి శోభాయాత్ర గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తుల హర్షధ్వానాల మధ్య స్వామివారి ఊరేగింపు కొనసాగగా, భజనలు, కోలాటాలు, దీక్షా స్వాముల ఆధ్యాత్మిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. గ్రామమంతా “జై శ్రీరామ్” నినాదాలతో మార్మోగి భక్తి వాతావరణం నెలకొంది. ఈ శోభాయాత్రలో మహిళలు, యువత, పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ప్రసాదం అందించారు. భక్తుల రద్దీతో గ్రామ వీధులన్నీ కిక్కిరిసిపోయి, కామోల్ అంతా పండుగ వాతావరణంలో కళకళలాడింది.

More news from తెలంగాణ and nearby areas
  • Post by Solanke Ravi
    8
    Post by Solanke Ravi
    user_Solanke Ravi
    Solanke Ravi
    Local News Reporter భైంసా, నిర్మల్, తెలంగాణ•
    3 hrs ago
  • కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సీతాయిపల్లిలో వృద్ధురాలు రుక్మవ్వ(73)ను హత్యకు గురైంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. ఆదివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న సమయంలో ఆమె రెండో కోడలు కోటవ్వ తలపై బండతో కొట్టింది. దీంతో రుక్మవ్వ అక్కడికక్కడే చనిపోయింది. ఆమె మెడలోని బంగారం, చెవి కమ్మలను కోడలు ఎత్తుకెళ్లింది. మృతురాలు కుమార్తె కిష్టవ్వ ఫిర్యాదు మేరకు ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
    1
    కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సీతాయిపల్లిలో వృద్ధురాలు రుక్మవ్వ(73)ను హత్యకు గురైంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. ఆదివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న సమయంలో ఆమె రెండో కోడలు కోటవ్వ తలపై బండతో కొట్టింది. దీంతో రుక్మవ్వ అక్కడికక్కడే చనిపోయింది. ఆమె మెడలోని బంగారం, చెవి కమ్మలను కోడలు ఎత్తుకెళ్లింది. మృతురాలు కుమార్తె కిష్టవ్వ ఫిర్యాదు మేరకు ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ఎండల తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. ఆదివారం మ.2.30 గంటలకు జన్నారంతో పాటు పలు గ్రామాలలో 41 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. ఇది గత సంవత్సరం కంటే మూడు డిగ్రీలు ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు అలాగే దండేపల్లిలో 39, లక్షెట్టిపేటలో 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజల ఇళ్లకే పరిమితం కాగా, ప్రధాన, గ్రామీణ రోడ్లు జన సంచారం లేక బోసిపోయాయి. మధ్యాహ్నం వేళ ప్రజలు బయటికి రావద్దని, వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు.
    1
    జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ఎండల తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. ఆదివారం మ.2.30 గంటలకు జన్నారంతో పాటు పలు గ్రామాలలో 41 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. ఇది గత సంవత్సరం కంటే మూడు డిగ్రీలు ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు అలాగే దండేపల్లిలో 39, లక్షెట్టిపేటలో 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజల ఇళ్లకే పరిమితం కాగా, ప్రధాన, గ్రామీణ రోడ్లు జన సంచారం లేక బోసిపోయాయి. మధ్యాహ్నం వేళ ప్రజలు బయటికి రావద్దని, వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    11 hrs ago
  • తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా శాసనసభ, శాసనమండలి సభ్యుల కోసం లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్ - 2026 ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన క్రీడల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఉత్సాహంగా పాల్గొన్నారు. నిత్యం ప్రజల సమస్యల పరిష్కారంలో గడిపే బొజ్జు పటేల్ క్రీడా మైదానంలో తనదైన శైలిలో ఆటలు ఆడి అందరినీ ఆశ్చర్యపరిచారు.
    1
    తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా శాసనసభ, శాసనమండలి సభ్యుల కోసం లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్ - 2026 ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన క్రీడల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఉత్సాహంగా పాల్గొన్నారు. నిత్యం ప్రజల సమస్యల పరిష్కారంలో గడిపే బొజ్జు పటేల్ క్రీడా మైదానంలో తనదైన శైలిలో ఆటలు ఆడి అందరినీ ఆశ్చర్యపరిచారు.
    user_Bojanapu Surendar
    Bojanapu Surendar
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    15 hrs ago
  • తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం గరుడ గంగా నది తీరాన స్వయంభుగా వెలసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాతా ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున ఆలయ పూజారి పార్థివ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి మంజీరా నదిజలాలతో అభిషేకం పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం పసుపు కుంకుమలతో అందంగా అలంకరించారు. పట్టు వస్త్రలంకరణ చేసి పుష్పాలంకరణ నిమ్మకాయల హారం అలంకరణ వివిధ రంగుల పుష్పలతో అందంగా అలంకరించారు.పుష్పార్చన కావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు కుంకుమార్చన సహస్రనామార్చిన అనంతరం మంగళహారతి ఇచ్చారు.అమ్మవారికి వివిధ రకాల పండు పూలతో నైవేద్యం సమర్పించారు మంగళ హారతి ఇచ్చారు. ఆలయ ఈవో వీరేశం ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది భక్తులకుమౌలిక స్వరూపాయలు కల్పించారు పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
    1
    తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం గరుడ గంగా నది తీరాన   స్వయంభుగా వెలసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాతా ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున ఆలయ పూజారి పార్థివ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి మంజీరా నదిజలాలతో అభిషేకం పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం పసుపు కుంకుమలతో అందంగా అలంకరించారు. పట్టు వస్త్రలంకరణ చేసి పుష్పాలంకరణ నిమ్మకాయల హారం అలంకరణ వివిధ రంగుల పుష్పలతో అందంగా అలంకరించారు.పుష్పార్చన కావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు కుంకుమార్చన సహస్రనామార్చిన అనంతరం మంగళహారతి ఇచ్చారు.అమ్మవారికి వివిధ రకాల పండు పూలతో నైవేద్యం సమర్పించారు మంగళ హారతి ఇచ్చారు. ఆలయ ఈవో వీరేశం ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది భక్తులకుమౌలిక స్వరూపాయలు కల్పించారు పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    16 hrs ago
  • హైదరాబాద్: శనివారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ అండ్ టీ నుండి మెట్రో రైలును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించారు. మెట్రో రైలు స్వాధీనంపై సీఎం ప్రతిపాదించిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రస్తుతం 69 కిలోమీటర్ల మెట్రో నిర్మాణం పూర్తయిందని, మెట్రో విస్తరణకు ఉన్న అడ్డంకులను సమీక్షించాలని సీఎం ఆదేశించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మెట్రో విస్తరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు.
    1
    హైదరాబాద్: శనివారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ అండ్ టీ నుండి మెట్రో రైలును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించారు. మెట్రో రైలు స్వాధీనంపై సీఎం ప్రతిపాదించిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రస్తుతం 69 కిలోమీటర్ల మెట్రో నిర్మాణం పూర్తయిందని, మెట్రో విస్తరణకు ఉన్న అడ్డంకులను సమీక్షించాలని సీఎం ఆదేశించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మెట్రో విస్తరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు.
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    4 hrs ago
  • రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం కేటాయిస్తున్న ₹1,100 కోట్లు సరిపోవడం లేదని సిర్పూర్ టి నియోజకవర్గం ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పేర్కొన్నారు. ఈ నిధులు సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులకు కూడా సరిపోవడం లేదన్నారు. గ్రామాల్లో దోమల నివారణకు అవసరమైన బ్లీచింగ్ పౌడర్ వంటి సామగ్రి కొనుగోలు చేయడానికి కూడా నిధులు లేకపోవడంతో ప్రజలు విరాళాలు సేకరించే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మంచిర్యాల ప్రాంతంలో అవసరాల కోసం వ్యాపారుల వద్ద నుంచి అప్పుగా వస్తువులు తెచ్చుకునే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం సమీక్షించి, తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు
    1
    రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం కేటాయిస్తున్న ₹1,100 కోట్లు సరిపోవడం లేదని సిర్పూర్ టి నియోజకవర్గం ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పేర్కొన్నారు. ఈ నిధులు సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులకు కూడా సరిపోవడం లేదన్నారు.
గ్రామాల్లో దోమల నివారణకు అవసరమైన బ్లీచింగ్ పౌడర్ వంటి సామగ్రి కొనుగోలు చేయడానికి కూడా నిధులు లేకపోవడంతో ప్రజలు విరాళాలు సేకరించే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మంచిర్యాల ప్రాంతంలో అవసరాల కోసం వ్యాపారుల వద్ద నుంచి అప్పుగా వస్తువులు తెచ్చుకునే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం సమీక్షించి, తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • Post by Solanke Ravi
    6
    Post by Solanke Ravi
    user_Solanke Ravi
    Solanke Ravi
    Local News Reporter భైంసా, నిర్మల్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.