Shuru
Apke Nagar Ki App…
రేణికుంట టోల్ ప్లాజా వద్ద ధర్నా నిర్వహించిన గ్రామస్తులు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద ధర్నా నిర్వహించిన గుండ్లపల్లి గ్రామస్తులు వారం రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగి ఇద్దరు యువకులు మరణించారు. దానికి సంబంధించి స్టేజ్ వద్ద డివైడర్,బారిగేడ్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు చెప్పిన కుడా టోల్ ప్లాజా వారు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ధర్నా నిర్వహించారు.రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడి ధర్నాను వీరమింప చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
రేణికుంట టోల్ ప్లాజా వద్ద ధర్నా నిర్వహించిన గ్రామస్తులు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద ధర్నా నిర్వహించిన గుండ్లపల్లి గ్రామస్తులు వారం రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగి ఇద్దరు యువకులు మరణించారు. దానికి సంబంధించి స్టేజ్ వద్ద డివైడర్,బారిగేడ్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు చెప్పిన కుడా టోల్ ప్లాజా వారు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ధర్నా నిర్వహించారు.రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడి ధర్నాను వీరమింప చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద ధర్నా నిర్వహించిన గుండ్లపల్లి గ్రామస్తులు వారం రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగి ఇద్దరు యువకులు మరణించారు. దానికి సంబంధించి స్టేజ్ వద్ద డివైడర్,బారిగేడ్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు చెప్పిన కుడా టోల్ ప్లాజా వారు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ధర్నా నిర్వహించారు.రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడి ధర్నాను వీరమింప చేశారు.1
- అసెంబ్లీ కమిటీ హాల్‌లో మానేర్ రివర్ ఫ్రంట్ పై కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ లో మానేరు రివర్ ఫ్రంట్ పనుల పురోగతి, పెండింగ్ నిధులు ప్రాజెక్టు పూర్తికి తీసుకోవాల్సిన చర్యలపై అసెంబ్లీ కమిటీ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టును వేగవంతం చేయాలని అధికారులకు మంత్రులు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులతో క్షేత్రస్థాయి నివేదికలపై ఆరా తీశారు. త్వరలో మానేరు రివర్స్ ఫ్రంట్ పై మంత్రులు క్షేత్ర స్థాయిలో పర్యటన చేయాలని నిర్ణయించారు. భూ సేకరణ, అంచనా వ్యయం, నీటిపారుదల, పర్యాటక శాఖ కు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.3
- కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు అమలు చేశారని బండి సంజయ్ అన్నారు. శనివారం తంగళ్ళపల్లి మండలం వెంక రెడ్డి పల్లి గ్రామంలో నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ఆయన మీడియాతో మాట్లాడారు.1
- జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ఎండల తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. ఆదివారం మ.2.30 గంటలకు జన్నారంతో పాటు పలు గ్రామాలలో 41 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. ఇది గత సంవత్సరం కంటే మూడు డిగ్రీలు ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు అలాగే దండేపల్లిలో 39, లక్షెట్టిపేటలో 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజల ఇళ్లకే పరిమితం కాగా, ప్రధాన, గ్రామీణ రోడ్లు జన సంచారం లేక బోసిపోయాయి. మధ్యాహ్నం వేళ ప్రజలు బయటికి రావద్దని, వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు.1
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా శాసనసభ, శాసనమండలి సభ్యుల కోసం లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్ - 2026 ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన క్రీడల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఉత్సాహంగా పాల్గొన్నారు. నిత్యం ప్రజల సమస్యల పరిష్కారంలో గడిపే బొజ్జు పటేల్ క్రీడా మైదానంలో తనదైన శైలిలో ఆటలు ఆడి అందరినీ ఆశ్చర్యపరిచారు.1
- కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సీతాయిపల్లిలో వృద్ధురాలు రుక్మవ్వ(73)ను హత్యకు గురైంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. ఆదివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న సమయంలో ఆమె రెండో కోడలు కోటవ్వ తలపై బండతో కొట్టింది. దీంతో రుక్మవ్వ అక్కడికక్కడే చనిపోయింది. ఆమె మెడలోని బంగారం, చెవి కమ్మలను కోడలు ఎత్తుకెళ్లింది. మృతురాలు కుమార్తె కిష్టవ్వ ఫిర్యాదు మేరకు ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.1
- *గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం సర్వసభ్య సమావేశం* * శరవేగంగా శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణం పనులు * వాసవి మాత కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలి - మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి * దాదాపు 10 కోట్ల రూపాయల తో ఆలయ నిర్మాణం గజ్వేల్, 29 ఆదివారం మార్చ్ 2026 సిద్దిపేట : జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆర్యవైశ్య భవన్ వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ పనులను పరిశీలించిన అనంతరం వైశ్య భవనంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ సీ సంతోష్ మాట్లాడుతూ, ఆర్యవైశ్య కుల దైవం జగన్మాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కరుణాకటాక్షాలతో అందరూ బాగుండాలని కోరుకుంటూ, గత ప్రభుత్వం కేటాయించిన వైశ్య భవన్ స్థలంలో ఆర్యవైశ్యుల దాతల సహకారంతో, దాదాపు పది కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని త్వరలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇచ్చేవారు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు, ఈ కార్యక్రమంలో కొమురవేల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, 2వ వార్డ్ కౌన్సిలర్ గోలి మమత సంతోష్, ఏ ఏం సి డైరెక్టర్ మహంకాళి శ్రీనివాస్, ఉప్పల శ్రీనివాస్, కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు సిద్ది బిక్షపతి, అత్తెల్లి శ్రీనివాస్, కైలాస ప్రభాకర్, మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్, ఎర్రం శ్రీనివాస్, తోట బిక్షపతి, ములుగు రంగయ్య, గుడాల రాధాకృష్ణ, ఉప్పల కృష్ణమూర్తి, అత్తెల్లి నాగేంద్రం, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం నాయకులు, మహిళా మణులు, చిన్నారులు యువకులు తదితరులు పాల్గొన్నారు.4
- కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీమంత్రి జీవన్ రెడ్డి ఇంకా ఏ పార్టీలో చేరాలనేది నిర్ణయించుకోలేదని స్పష్టం చేశారు. ఏ పార్టీలో చేరేది స్పష్టత ఇవ్వని జీవన్ రెడ్డి, బిఆర్ఎస్ బిజెపి నేతలు పరోక్షంగా ఆహ్వానం పలికారని తెలిపారు. స్వంతంగా పార్టీ పెట్టే ఆలోచన లేదన్నారు. కొంతకాలం తటస్థంగా ఉండి ప్రజా సమస్యలపై పోరాడేందుకు సిద్దమయ్యారు. కాంగ్రెస్ లో అనగదొక్కబడుతున్న తనలాంటి వారిని సమీకరించేందకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ లో ఏదో ఒక పార్టీలో చేరనున్న జీవన్ రెడ్డి తో మా ప్రతినిధి విజేందర్ రెడ్డి ఫేస్ టూ ఫేస్.1