Shuru
Apke Nagar Ki App…
కౌడిపల్లి గ్రామంలో శ్రీ సీతారాముల పల్లకి సేవ ఆదివారం రోజున ఆదివారం రోజున కౌడిపల్లి సర్పంచ్ ఆధ్వర్యంలో. శ్రీ సీతారాములవారి పల్లకి సేవలను నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలు అందరూ కలిసి శ్రీ సీతారాములవారి పల్లకినీ గ్రామంలో ఆటపాటలతో, వివిధ రకాల వేషధారణలతో శ్రీరామ భజన చేస్తూ కనుల పండుగగ నిర్వహించినరూ. ఇలాంటి వేడుకలను నిర్వహించినందుకు గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ కు అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ గారు, ఉపసర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్ గారు, వాడు సభ్యులు మబ్బులు ,మురళి, దేవేందర్ ,రమేష్, మరియు గ్రామ పెద్దలు చంద్రం , మల్లేష్ ,దుర్గయ్య గౌడ్ ,టీ మల్లేష్, శ్రీనివాస్ గుప్తా, ఉడుత కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Vishwanath Goud
కౌడిపల్లి గ్రామంలో శ్రీ సీతారాముల పల్లకి సేవ ఆదివారం రోజున ఆదివారం రోజున కౌడిపల్లి సర్పంచ్ ఆధ్వర్యంలో. శ్రీ సీతారాములవారి పల్లకి సేవలను నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలు అందరూ కలిసి శ్రీ సీతారాములవారి పల్లకినీ గ్రామంలో ఆటపాటలతో, వివిధ రకాల వేషధారణలతో శ్రీరామ భజన చేస్తూ కనుల పండుగగ నిర్వహించినరూ. ఇలాంటి వేడుకలను నిర్వహించినందుకు గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ కు అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ గారు, ఉపసర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్ గారు, వాడు సభ్యులు మబ్బులు ,మురళి, దేవేందర్ ,రమేష్, మరియు గ్రామ పెద్దలు చంద్రం , మల్లేష్ ,దుర్గయ్య గౌడ్ ,టీ మల్లేష్, శ్రీనివాస్ గుప్తా, ఉడుత కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- రవీంద్రభారతిలో గద్దర్ వేషధారణలో ఆకట్టుకున్న ఎమ్మెల్యే నాగరాజు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న “1st Edition of Telangana Legislators’ Sports and Cultural Meet-2026” కార్యక్రమంలో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు గద్దర్ వేషధారణలో పాల్గొని అందరిని ఆకట్టుకున్నారు..ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గద్దర్ వేషధారణలో ఆయన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన ప్రదర్శనతో అక్కడున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమల్లు, శాసనసభ స్పీకర్ గడ్డంప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, ప్రేక్షకులను ఉత్సాహపరిచారు...ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సాహిత్య వారసత్వాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో భక్తులు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని రాజన్నకు ప్రీతిపాత్రమైన కోడిమొక్కులను చెల్లించుకున్నారు.1
- Post by Tagore1
- రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపల్ పరిధిలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన బినోద్ జేనా (55) పట్టాలపై నడుస్తుండగా రైలు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించగా, ఈఎంటి రామచంద్రయ్య, పైలెట్ రమేష్ యాదవ్ వేగంగా స్పందించి షాద్‌నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.3
- కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరును నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరును నిరసిస్తూ హుజురాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల వీధి రౌడీ లా కౌశిక్ రెడ్డి వ్యవహరించారని ఆరోపిస్తు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఫోటోతో ఉన్న ప్లెక్సీ ని చెప్పుతో కొడుతు నిరసన తెలిపారు. హుజురాబాద్ జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఎమ్మెల్యే అనే సోయి మరిచిపోయి విచక్షణరహితంగా ప్రవర్తిస్తున్న కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి కి వ్యతిరేకం గా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే పై తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని లేనిచో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కడియం శ్రీహరి పట్ల అనుచితంగా ప్రవర్తించిన కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. లేనిచో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.1
- Post by Solanke Ravi8
- కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని ఆదివారం అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా మహిళల అక్షరాస్యత కోసం పరీక్షలు నిర్వహించారు. ఉల్లాస్ కార్యక్రమం కింద నిర్వహించిన ఈ పరీక్షల్లో మండలంలోని వివిధ గ్రామాల నుంచి 800 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జనవరి నుంచి శిక్షణ పొందిన మహిళలు ప్రాథమిక చదువు, లెక్కలు వంటి నైపుణ్యాలను అభ్యసించారు. ఈ కార్యక్రమాన్ని డీఆర్డీఓ విజయ లక్ష్మి పరిశీలించారు. మహిళల కృషిని అభినందించారు.1
- డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్: (TVK) అధినేత విజయ్ సంచలన నిర్ణయం! వేదికపై భావోద్వేగానికి లోనైన శబరినాథన్.. విజయ్ మార్క్ పాలిటిక్స్! చెన్నై: తమిళ రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన వద్ద వ్యక్తిగత కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్కు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు.పార్టీ అభ్యర్థుల ప్రకటన సందర్భంగా విజయ్ ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. తన తండ్రి డ్రైవర్‌గా ఉన్నా, శబరినాథన్ కష్టాన్ని మరియు పార్టీ పట్ల అతని నిబద్ధతను గుర్తించి విజయ్ ఈ అవకాశం కల్పించారు. శబరినాథన్ విరుగంపాక్కం నియోజకవర్గం నుంచి TVK అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. వేదికపై కన్నీళ్లు.. తమను నమ్మి విజయ్ టికెట్ ప్రకటించిన వెంటనే శబరినాథన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వేదికపైనే విజయ్‌ను కౌగిలించుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఒక సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తికి, అదీ తన డ్రైవర్ కుమారుడికి రాజకీయాల్లో ఇంత పెద్ద అవకాశం ఇవ్వడం పట్ల అక్కడి వారందరూ హర్షం వ్యక్తం చేశారు. "కష్టపడి పనిచేసే సామాన్యులకు కూడా చట్టసభల్లో చోటు ఉండాలనే విజయ్ ఆశయానికి ఇది నిదర్శనం."శబరినాథన్ గతంలో విజయ్ అభిమాన సంఘాల కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనేవారు.ప్రస్తుతం ఆయన TVK పార్టీలోని ఐటీ వింగ్ (IT Wing) బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే శబరినాథన్‌కు స్థానికంగా మంచి పేరు ఉంది. సామాన్యులకు ప్రాధాన్యత ఇస్తూ విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మార్పు తమిళ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో భక్తులు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకుని రాజన్నకు ప్రీతిపాత్రమైన కోడెమొక్కులను చెల్లించుకున్నారు.1