Shuru
Apke Nagar Ki App…
వేములవాడ లో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో భక్తులు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకుని రాజన్నకు ప్రీతిపాత్రమైన కోడెమొక్కులను చెల్లించుకున్నారు.
Satheesh gangu
వేములవాడ లో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో భక్తులు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకుని రాజన్నకు ప్రీతిపాత్రమైన కోడెమొక్కులను చెల్లించుకున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ లో కూరగాయలు కోసే పనిలో ఉన్న కామాటి శ్రీనివాస్ మద్యం మత్తులో చిన్నారులపై దాడికి పాల్పడ్డాడు. విద్యార్థులను చీపురితో కొట్టాడు. నిత్యం మద్యం మత్తులో వేధింపులకు గురి చేస్తున్నాడని విద్యార్థులు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. మద్యం మత్తులో హాస్టల్ కు వచ్చే కామాటి శ్రీనివాస్ విద్యార్థులు రాత్రి పడుకునే సమయంలో చీపురుతో కొడుతున్న విజువల్స్ రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలాంటి ఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయని విద్యార్థులు తెలిపారు. తాళ్ళధర్మారం నుంచి డిప్యూటేషన్‌పై జగిత్యాలకు వచ్చిన కామాటి శ్రీనివాస్, గత నాలుగు నెలలుగా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నాడని అధికారులకు పిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పలుమార్లు హాస్టల్ వార్డెన్ మధుసూదన్ మందలించిన శ్రీనివాస్ లో మార్పు రాలేదని తెలిపారు. చివరకు ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్‌కుమార్‌కు పిర్యాదు చేశారు. దీంతో రాజ్ కుమార్ సీరియస్ గా స్పందిస్తు విచారణ జరిపి శ్రీనివాస్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.3
- కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం వడ్డేపల్లికి చెందని కుంటోళ్ల సాయిలు(50) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, తల్లి అనారోగ్యం, నిరుద్యోగ సమస్యలతో మనస్తాపం చెందిన ఆయన, శనివారం సాయంత్రం ఇంట్లో విషగుళికలు మింగాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుని కుమారుడు మహేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI శివకుమార్ చెప్పారు.1
- రోడ్డు మధ్యలో గ్యాప్ రావడంతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ముల్కలగూడా రోడ్డులో మధ్యలోని సిమెంటు రోడ్డుకు గ్యాప్ రావడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల సౌకర్యార్థం నిర్మించిన రోడ్డు మధ్యలో గ్యాప్ రావడంతో వాహనాలు అదుపుతప్పి ప్రజలు పడిపోతున్నారు. దీంతో అంబులెన్స్ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మధ్యలో ఏర్పడిన గ్యాప్ ను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.1
- ఆదివారం రోజున కౌడిపల్లి సర్పంచ్ ఆధ్వర్యంలో. శ్రీ సీతారాములవారి పల్లకి సేవలను నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలు అందరూ కలిసి శ్రీ సీతారాములవారి పల్లకినీ గ్రామంలో ఆటపాటలతో, వివిధ రకాల వేషధారణలతో శ్రీరామ భజన చేస్తూ కనుల పండుగగ నిర్వహించినరూ. ఇలాంటి వేడుకలను నిర్వహించినందుకు గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ కు అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ గారు, ఉపసర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్ గారు, వాడు సభ్యులు మబ్బులు ,మురళి, దేవేందర్ ,రమేష్, మరియు గ్రామ పెద్దలు చంద్రం , మల్లేష్ ,దుర్గయ్య గౌడ్ ,టీ మల్లేష్, శ్రీనివాస్ గుప్తా, ఉడుత కృష్ణ తదితరులు పాల్గొన్నారు.4
- Post by Tagore1
- వరంగల్ జిల్లా:సోషల్ మీడియా వచ్చిన తరువాత మేలు కంటే కీడు ఎక్కువగా జరుగుతోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. అసెంబ్లీలో సోమవారం మాట్లాడిన ఆయన, ఇటీవల రవీంద్రభారతిలో గద్దర్ వేషధారణలో పాల్గొన్న తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోందని పేర్కొన్నారు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెరుగుతున్నాయని, ఇటువంటి చర్యలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో డీసీపీ, సీపీగా పనిచేసిన అనుభవంతో చట్టం ప్రకారం వ్యవహరించాలని పోలీసు అధికారులకు సూచించినట్లు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టానని, ప్రజా సమస్యల పరిష్కారం మరియు వర్ధన్నపేట సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.1
- కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఇద్దరు గొర్రెల కాపర్లు ప్రమాదవశాత్తు తెలుగులో పడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.1
- కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరును నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరును నిరసిస్తూ హుజురాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల వీధి రౌడీ లా కౌశిక్ రెడ్డి వ్యవహరించారని ఆరోపిస్తు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఫోటోతో ఉన్న ప్లెక్సీ ని చెప్పుతో కొడుతు నిరసన తెలిపారు. హుజురాబాద్ జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఎమ్మెల్యే అనే సోయి మరిచిపోయి విచక్షణరహితంగా ప్రవర్తిస్తున్న కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి కి వ్యతిరేకం గా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే పై తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని లేనిచో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కడియం శ్రీహరి పట్ల అనుచితంగా ప్రవర్తించిన కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. లేనిచో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.1
- హన్మకొండ జిల్లా కేంద్రంలో నక్కలగుట్ట విద్యుత్ కార్యాలయంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో టీజీ ఆర్టిజన్ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ రెడ్డి ఆర్టిజన్లపై యాజమాన్యాలు వివక్ష చూపుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏప్రిల్ 7న ఎన్పీడీసీఎల్ ముందు మహాధర్నా నిర్వహిస్తామని, ఏప్రిల్ 8 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.1