Shuru
Apke Nagar Ki App…
కొత్తూరు:రైలు ప్రమాదంలో ఒడిశా వ్యక్తికి తీవ్ర గాయాలు కొత్తూరులో రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపల్ పరిధిలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన బినోద్ జేనా (55) పట్టాలపై నడుస్తుండగా రైలు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించగా, ఈఎంటి రామచంద్రయ్య, పైలెట్ రమేష్ యాదవ్ వేగంగా స్పందించి షాద్‌నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
S M S R R
కొత్తూరు:రైలు ప్రమాదంలో ఒడిశా వ్యక్తికి తీవ్ర గాయాలు కొత్తూరులో రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపల్ పరిధిలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన బినోద్ జేనా (55) పట్టాలపై నడుస్తుండగా రైలు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించగా, ఈఎంటి రామచంద్రయ్య, పైలెట్ రమేష్ యాదవ్ వేగంగా స్పందించి షాద్‌నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
More news from తెలంగాణ and nearby areas
- గజ్వేల్‌లో ‘ఎస్వీ జ్యూవెల్లరీ’ వన్ గ్రామ్ గోల్డ్ షాపు ప్రారంభం గజ్వేల్, 29 ఆదివారం మార్చి 2026 సిద్దిపేట జిల్లా : గజ్వేల్ పట్టణంలోని నూతన మోడల్ బస్ స్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఎస్వీ జ్యూవెల్లరీ’ వన్ గ్రామ్ గోల్డ్ షోరూమ్‌ను ఖమ్మంపల్లి సర్పంచ్ కరుణాకరన్ రెడ్డి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆయన తొలి విక్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కరుణాకరన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, సామాన్య ప్రజలు అసలు బంగారాన్ని కొనలేని పరిస్థితి నెలకొందని, ఇలాంటి తరుణంలో గజ్వేల్ ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన వన్ గ్రామ్ గోల్డ్ నగలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. మహిళలకు నచ్చే విధంగా, లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా అనేక రకాల డిజైన్లు ఈ షాపులో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా పెళ్లికూతురు అలంకరణకు అవసరమైన నగలు, మహిళలు, యువతీ యువకులు వివిధ శుభకార్యాలకు ధరించే ప్రత్యేక ఆభరణాలు ఇక్కడ లభిస్తాయన్నారు. గజ్వేల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నాణ్యతతో కూడిన వన్ గ్రామ్ గోల్డ్ నగలు ఇక్కడ సరసమైన ధరలకే లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షాపు యాజమాన్యం , నిర్వాహకులు, స్థానిక నాయకులు, మహిళలు, మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.4
- Post by Tagore1
- *నల్లగొండ పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామ నవమి వేడుకలలో భాగంగా ఈరోజు రాత్రి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు* *నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గార్లు దేవాలయంలో సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు* *రథోత్సవం దేవాలయం నుంచి రామగిరి మీదుగా పట్టణంలోని పలు పురవీధులకుండా కొనసాగింది* *ఈరోజు రథోత్సవాన్ని తిలకించడానికి పట్టణ ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు*1
- నల్గొండ జిల్లాలోని నకరికల్లు మండల పరిధిలోని పాలెం గ్రామానికి చెందిన మాజీ సైనికుడు బెల్లి జనార్ధన్ అకాల మరణాన్ని దిగమింగుతూ ఆ కుటుంబాన్ని పరామర్శించి, ఆత్మస్థైర్యం నింపి కుటుంబానికి వెన్నుదండూగా ఉంటామని నల్గొండ జిల్లా మాజీ సైనికులు తెలిపారు...3
- తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం గరుడ గంగా నది తీరాన స్వయంభుగా వెలసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాతా ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున ఆలయ పూజారి పార్థివ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి మంజీరా నదిజలాలతో అభిషేకం పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం పసుపు కుంకుమలతో అందంగా అలంకరించారు. పట్టు వస్త్రలంకరణ చేసి పుష్పాలంకరణ నిమ్మకాయల హారం అలంకరణ వివిధ రంగుల పుష్పలతో అందంగా అలంకరించారు.పుష్పార్చన కావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు కుంకుమార్చన సహస్రనామార్చిన అనంతరం మంగళహారతి ఇచ్చారు.అమ్మవారికి వివిధ రకాల పండు పూలతో నైవేద్యం సమర్పించారు మంగళ హారతి ఇచ్చారు. ఆలయ ఈవో వీరేశం ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది భక్తులకుమౌలిక స్వరూపాయలు కల్పించారు పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.1
- “మీ ఇంటికి-మీ డాక్టర్” ప్రాజెక్టులో భాగంగా అంబులెన్స్ వాహనాన్ని (సంచార వాహనం) జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ప్రారంభించారు. ఆర్ఇసి లిమిటెడ్ సిఎస్ఆర్ సహకారంతో రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో “మీ ఇంటికి-మీ డాక్టర్” ప్రాజెక్టు నంద్యాల జిల్లాలో ఈరోజు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా చేతుల మీదుగా ప్రారంభమైంది. రూ. 1.20 కోట్ల వ్యయంతో 3 సంవత్సరాల పాటు అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా మొబైల్ మెడికల్ యూనిట్లు గ్రామాలకే వెళ్లి ఉచిత వైద్య సేవలు, మందులు అందిస్తాయి. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరియు అంటువ్యాధులతో బాధపడుతున్నవారు ప్రధాన లబ్ధిదారులు. ప్రతి రోజు సుమారు 100 మందికి, నెలకు వేలాది మందికి వైద్య సేవలు అందించబడతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలు బలోపేతం కావడంతో పాటు మొత్తం 3 సంవత్సరాల్లో సుమారు 6 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ దస్తగిరి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు ఉస్మాన్ భాష, మూర్తితో పాటు సభ్యులు వసుంధర, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- నల్లగొండ బ్రేకింగ్: ... నల్గొండ m.దుప్పలపల్లి రోడ్‌లో ప్రతిష్టాత్మకంగా *ది నేచర్ సిటీ* వెంచర్ ప్రారంభం... జబర్దస్త్ తారల సందడితో కార్యక్రమం హోరెత్తింది... బుల్లెట్ భాస్కర్, ఫైమా, పొట్టి నరేష్‌తో పాటు సినీ యాంకర్లు పాల్గొని ఆకట్టుకున్నారు... FM గ్రూప్, విశిష్ట గ్రూప్, ఇండికా అసోసియేట్స్ ఆధ్వర్యంలో వెంచర్ ప్రారంభం... DTCP అనుమతులు పొందిన ప్రాజెక్ట్‌గా నిర్వాహకులు వెల్లడి... మోడ్రన్ సదుపాయాలతో ప్లాట్ల అభివృద్ధి చేస్తామని నిర్వాహకుల హామీ... *మొహమ్మద్ షామీర్ ఉద్దీన్* మేనేజింగ్ పార్ట్నర్‌గా కార్యక్రమానికి నాయకత్వం భారీ సంఖ్యలో స్థానికులు, పెట్టుబడిదారులు హాజరై ఆసక్తి వ్యక్తం... నల్గొండ కార్పొరేషన్ మారినప్పటి నుండి పట్టణం లో రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపు… ది నేచర్ సిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా నిర్వాహకుల లక్ష్యం... సింగర్స్ లతో పాటల హోరు జోరుగా ప్రారంభించిన *ది నేచర్ సిటీ* వెంచర్... ఈ కార్యక్రమంలో గుమ్ముల మోహన్ రెడ్డి, బండారు ప్రసాద్,వంగూరి లక్ష్మయ్య, అనిల్ రెడ్డి, మండలి వెంకట్ రెడ్డి, చిన్నాల జానయ్య, రాజ్ లింగం, మొహమ్మద్ మాలిక్ అహ్మద్, రఫీఖ్,హ్యూమన్ రైట్స్ ఆక్టివ్ మెంబర్ మొహమ్మద్ అలీ,తదితర ప్రముఖులు పాల్గొన్నారు...1
- కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సీతాయిపల్లిలో వృద్ధురాలు రుక్మవ్వ(73)ను హత్యకు గురైంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. ఆదివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న సమయంలో ఆమె రెండో కోడలు కోటవ్వ తలపై బండతో కొట్టింది. దీంతో రుక్మవ్వ అక్కడికక్కడే చనిపోయింది. ఆమె మెడలోని బంగారం, చెవి కమ్మలను కోడలు ఎత్తుకెళ్లింది. మృతురాలు కుమార్తె కిష్టవ్వ ఫిర్యాదు మేరకు ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.1
- _ఈనెల 31వ తేదీన ఎమ్మిగనూరు చేనేతల కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరుగనున్నది. ఆ సమావేశంలో మన సొసైటీని ఆప్కోలో విలీనం చేయాలని ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనందరికీ, ముఖ్యంగా ఎమ్మిగనూరుకు, ఎమ్మిగనూరు చేనేతలకు, పితామహుడైన పద్మశ్రీ మాచాని సోమప్ప స్థాపించిన ఈ కో-ఆపరేటివ్ సొసైటీని కాపాడుకోవడం అనే బాధ్యత ఉంది.ఆయనకు గుర్తుగా ఉన్న ఈ సొసైటీని ఆప్కోలో విలీనం కాకుండా ఉంచేందుకు, ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాను. ప్రజాసంఘాలు, ప్రజలు, అందరూ పార్టీలకతీతంగా ముందుకు వచ్చి, సొసైటీని కాపాడడానికి ప్రయత్నించాలి._31వ తేదీ సర్వసభ్య సమావేశంలో, ఆప్కోలో విలీనానికి సంబంధించి ఉద్దేశపూర్వక కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ, ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలని, మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నాను.ఎప్పటికీ మాచాని సోమప్ప ని మర్చిపోకుండా, ఆయన స్థాపించిన సొసైటీని ఆయనకు గుర్తుగా ఉండే విధంగా నిర్వహించడం మనందరి బాధ్యత. అందరూ 31వ తేదీన సర్వసభ్య సమావేశంలో ఆప్కోలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ వివర్స్ కాలనీ మైదానం సొసైటీ ఎదురుగా జరగబోయే కార్యకంలో పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.1