Shuru
Apke Nagar Ki App…
నల్గొండ రామాలయంలో ఘనంగా స్వామివారి రథోత్సవం.. హాజరైన మేయర్ దంపతులు *నల్లగొండ పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామ నవమి వేడుకలలో భాగంగా ఈరోజు రాత్రి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు* *నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గార్లు దేవాలయంలో సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు* *రథోత్సవం దేవాలయం నుంచి రామగిరి మీదుగా పట్టణంలోని పలు పురవీధులకుండా కొనసాగింది* *ఈరోజు రథోత్సవాన్ని తిలకించడానికి పట్టణ ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు*
Journalist pk
నల్గొండ రామాలయంలో ఘనంగా స్వామివారి రథోత్సవం.. హాజరైన మేయర్ దంపతులు *నల్లగొండ పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామ నవమి వేడుకలలో భాగంగా ఈరోజు రాత్రి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు* *నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గార్లు దేవాలయంలో సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు* *రథోత్సవం దేవాలయం నుంచి రామగిరి మీదుగా పట్టణంలోని పలు పురవీధులకుండా కొనసాగింది* *ఈరోజు రథోత్సవాన్ని తిలకించడానికి పట్టణ ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు*
More news from తెలంగాణ and nearby areas
- వరంగల్ జిల్లా: వర్ధన్నపేట నియోజకవర్గంలో మండల, డివిజన్ అధ్యక్ష పదవుల కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు అయూబ్ మహమ్మద్ హాజరై అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజాసేవకు నిబద్ధత కలిగిన నాయకత్వాన్ని ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- Ramzan Ki Raat Bana Khooni Manzar: Mohammed Salman Murder Case Ka Tez Khulasa Hyderabad Murder Case Solved: Chandrayangutta Police Arrest 4 Accused 👉 Puri khabar ke liye video dekhein: 👇 Facebook link #Hashtags: #Hyderabad #Chandrayangutta #HyderabadMurder #BreakingNews #CrimeNews #TelanganaPolice #HyderabadCityPolice #JusticeForSalman #Falaknuma #RamzanIncident #TelanganaDGP #CPHydCity #revanth_anumula #TelanganaCMO #TelanganaCOPs1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 29 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిఆర్ఎస్ నేతలు దేవి రవీందర్, బెండ మధు మీడియా సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్, చేర్యాల, జనగామ ప్రాంతాల్లో 15 నుంచి 17 గంటల విద్యుత్ ఇస్తుంటే.. గజ్వేల్‌లో మాత్రం 14 గంటలకే పరిమితం చేయడం అన్యాయమని మండిపడ్డారు. ఎండాకాలంలో సాగుకు విద్యుత్, నీరు అత్యవసరమని, వెంటనే 18 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే రైతులతో కలిసి ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.2
- రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపల్ పరిధిలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన బినోద్ జేనా (55) పట్టాలపై నడుస్తుండగా రైలు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించగా, ఈఎంటి రామచంద్రయ్య, పైలెట్ రమేష్ యాదవ్ వేగంగా స్పందించి షాద్‌నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.3
- *గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం సర్వసభ్య సమావేశం* * శరవేగంగా శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణం పనులు * వాసవి మాత కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలి - మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి * దాదాపు 10 కోట్ల రూపాయల తో ఆలయ నిర్మాణం గజ్వేల్, 29 ఆదివారం మార్చ్ 2026 సిద్దిపేట : జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆర్యవైశ్య భవన్ వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ పనులను పరిశీలించిన అనంతరం వైశ్య భవనంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ సీ సంతోష్ మాట్లాడుతూ, ఆర్యవైశ్య కుల దైవం జగన్మాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కరుణాకటాక్షాలతో అందరూ బాగుండాలని కోరుకుంటూ, గత ప్రభుత్వం కేటాయించిన వైశ్య భవన్ స్థలంలో ఆర్యవైశ్యుల దాతల సహకారంతో, దాదాపు పది కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని త్వరలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇచ్చేవారు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు, ఈ కార్యక్రమంలో కొమురవేల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, 2వ వార్డ్ కౌన్సిలర్ గోలి మమత సంతోష్, ఏ ఏం సి డైరెక్టర్ మహంకాళి శ్రీనివాస్, ఉప్పల శ్రీనివాస్, కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు సిద్ది బిక్షపతి, అత్తెల్లి శ్రీనివాస్, కైలాస ప్రభాకర్, మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్, ఎర్రం శ్రీనివాస్, తోట బిక్షపతి, ములుగు రంగయ్య, గుడాల రాధాకృష్ణ, ఉప్పల కృష్ణమూర్తి, అత్తెల్లి నాగేంద్రం, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం నాయకులు, మహిళా మణులు, చిన్నారులు యువకులు తదితరులు పాల్గొన్నారు.4
- సిద్దిపేట జిల్లా జిల్లా గజ్వేల్ పట్టణంలోని బస్ స్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్వీ జ్యూవెల్లరీ వన్ గ్రామ్ గోల్డ్ షోరూమ్‌ను ఖమ్మంపల్లి సర్పంచ్ కరుణాకరన్ రెడ్డి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆయన తొలి విక్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్వేత కరుణాకరన్ రెడ్డి, మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, సామాన్య ప్రజలు అసలు బంగారాన్ని కొనలేని పరిస్థితి నెలకొందని, ఇలాంటి తరుణంలో గజ్వేల్ ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన వన్ గ్రామ్ గోల్డ్ నగలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. మహిళలకు నచ్చే విధంగా, లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా అనేక రకాల డిజైన్లు ఈ షాపులో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా పెళ్లికూతురు అలంకరణకు అవసరమైన నగలు, మహిళలు, యువతీ యువకులు వివిధ శుభకార్యాలకు ధరించే ప్రత్యేక ఆభరణాలు ఇక్కడ లభిస్తాయన్నారు. గజ్వేల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నాణ్యతతో కూడిన వన్ గ్రామ్ గోల్డ్ నగలు ఇక్కడ సరసమైన ధరలకే లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షాపు యాజమాన్యం , నిర్వాహకులు, స్థానిక నాయకులు, మహిళలు, మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- వరంగల్ జిల్లా: వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. అగ్గిపెట్టె విషయంలో తలెత్తిన వివాదం దాడికి దారితీసి, సినిమా స్టైల్లో పరస్పరం కొట్టుకున్న ఘటన సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఘటనపై మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1
- కాకునూరు గ్రామంలోని VO1, VO2 కేంద్రాల్లో ఉల్లాస్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షలకు VOA రమేష్, ప్రధానోపాధ్యాయులు రవికుమార్ హాజరై పర్యవేక్షించారు. కార్యక్రమంలో VOలు, OBలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. మహిళల అక్షరాస్యత పెంపు లక్ష్యంగా నిర్వహించిన ఈ పరీక్షలు వారికి చదువు మీద ఆసక్తి పెంచుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం సజావుగా కొనసాగింది.1
- గజ్వేల్‌లో ‘ఎస్వీ జ్యూవెల్లరీ’ వన్ గ్రామ్ గోల్డ్ షాపు ప్రారంభం గజ్వేల్, 29 ఆదివారం మార్చి 2026 సిద్దిపేట జిల్లా : గజ్వేల్ పట్టణంలోని నూతన మోడల్ బస్ స్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఎస్వీ జ్యూవెల్లరీ’ వన్ గ్రామ్ గోల్డ్ షోరూమ్‌ను ఖమ్మంపల్లి సర్పంచ్ కరుణాకరన్ రెడ్డి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆయన తొలి విక్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కరుణాకరన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, సామాన్య ప్రజలు అసలు బంగారాన్ని కొనలేని పరిస్థితి నెలకొందని, ఇలాంటి తరుణంలో గజ్వేల్ ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన వన్ గ్రామ్ గోల్డ్ నగలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. మహిళలకు నచ్చే విధంగా, లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా అనేక రకాల డిజైన్లు ఈ షాపులో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా పెళ్లికూతురు అలంకరణకు అవసరమైన నగలు, మహిళలు, యువతీ యువకులు వివిధ శుభకార్యాలకు ధరించే ప్రత్యేక ఆభరణాలు ఇక్కడ లభిస్తాయన్నారు. గజ్వేల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నాణ్యతతో కూడిన వన్ గ్రామ్ గోల్డ్ నగలు ఇక్కడ సరసమైన ధరలకే లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షాపు యాజమాన్యం , నిర్వాహకులు, స్థానిక నాయకులు, మహిళలు, మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.4