Shuru
Apke Nagar Ki App…
గంజాయి మత్తులో యువకుల హల్చల్ – వరంగల్‌లో వైరల్ వీడియో.. వరంగల్ జిల్లా: వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. అగ్గిపెట్టె విషయంలో తలెత్తిన వివాదం దాడికి దారితీసి, సినిమా స్టైల్లో పరస్పరం కొట్టుకున్న ఘటన సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఘటనపై మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
M D Azizuddin
గంజాయి మత్తులో యువకుల హల్చల్ – వరంగల్‌లో వైరల్ వీడియో.. వరంగల్ జిల్లా: వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. అగ్గిపెట్టె విషయంలో తలెత్తిన వివాదం దాడికి దారితీసి, సినిమా స్టైల్లో పరస్పరం కొట్టుకున్న ఘటన సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఘటనపై మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
More news from తెలంగాణ and nearby areas
- జనగాం జిల్లా:అసెంబ్లీలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బీఆర్ఎస్ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థుల ఆరోపణలకు ఒక్కొక్కటిగా కౌంటర్ ఇస్తూ తనదైన శైలిలో స్పందించారు. కడియం శ్రీహరి తమకు తండ్రి సమానమని, ఆయన మార్గదర్శకత్వంలోనే ముందుకు సాగుతున్నామని తెలిపారు. గత పదేళ్ల పాలనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఆ కాలంలోని కార్యకలాపాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రస్తుతం ప్రజాపాలన కొనసాగుతోందని పేర్కొన్నారు.1
- తోపన గడ్డ తండ ప్రజలు వన బోజనం కార్యక్రమం. జరిగింది. ఇందులోభాగంగా పలువురు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం లో గుగులోత్ జయరాం. భానోత్ సాగర్. రమేష్. ప్రసాద్. మాజీ వార్డు మెంబర్ బాలు. పర్సు. రాములు. వీర స్వామి. మాజీ సర్పంచ్ ఈర్య. హట్టి. బంగరు. హరి చంద్. ఆకు బాయ్. మరియు శారద మాజీ వార్డు మెంబర్. చిట్టి. గమ్మక. ఉమ. దేవులి. సునిత. ఈ దేవులి. సునిత. తదితరులు పా లోనడం జరిగింది.1
- భూకబ్జాల వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ధరణి పోర్టల్‌ను అడ్డంగా పెట్టుకొని బిఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే మురళి నాయక్ సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తిన ఆయన, వెంటనే హౌస్ కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. BRS ప్రభుత్వంలో సామాన్యులకు .. ధరణి వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకొని బీఆర్ఎస్ నేతలు భూములను తమ పేర్లకు మార్చుకున్నారని మురళి నాయక్ ఆరోపించారు. దీనివల్ల అసలైన భూ యజమానులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం తగ్గించేలా ఉందని వెంటనే బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.1
- అసెంబ్లీ కమిటీ హాల్‌లో మానేర్ రివర్ ఫ్రంట్ పై కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ లో మానేరు రివర్ ఫ్రంట్ పనుల పురోగతి, పెండింగ్ నిధులు ప్రాజెక్టు పూర్తికి తీసుకోవాల్సిన చర్యలపై అసెంబ్లీ కమిటీ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టును వేగవంతం చేయాలని అధికారులకు మంత్రులు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులతో క్షేత్రస్థాయి నివేదికలపై ఆరా తీశారు. త్వరలో మానేరు రివర్స్ ఫ్రంట్ పై మంత్రులు క్షేత్ర స్థాయిలో పర్యటన చేయాలని నిర్ణయించారు. భూ సేకరణ, అంచనా వ్యయం, నీటిపారుదల, పర్యాటక శాఖ కు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.3
- ఈ నెల 30వ తేదీన సోమవారం ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి - గిరివాణి (గిరిజన దర్బార్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఐటీడీఏ ఏటూరు నాగారం లో నిర్వహించే గిరివాణి (గిరిజన దర్బార్) కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈనెల 30వ తేదీన కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని గిరిజనులు, గిరిజనేతరులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని తమ అర్జీలను సమర్పించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.2
- నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపల్ పరిధిలోని నిమ్మకాయ మార్కెట్ యార్డులో స్థానికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహాధర్నా 17వ రోజుకు చేరుకుంది. ఈ మహాధర్నా అధ్యక్షుడు వంటెపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న నేతృత్వంలో కార్మికులు నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ ధీరాజ్, వి సైదులు, బి రమేష్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, జి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డులో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని, వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.3
- Post by Tagore1
- వరంగల్ జిల్లా: వర్ధన్నపేట నియోజకవర్గంలో మండల, డివిజన్ అధ్యక్ష పదవుల కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు అయూబ్ మహమ్మద్ హాజరై అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజాసేవకు నిబద్ధత కలిగిన నాయకత్వాన్ని ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1