Shuru
Apke Nagar Ki App…
వర్ధన్నపేటలో కాంగ్రెస్ మండల అధ్యక్ష పదవుల దరఖాస్తుల స్వీకరణ వరంగల్ జిల్లా: వర్ధన్నపేట నియోజకవర్గంలో మండల, డివిజన్ అధ్యక్ష పదవుల కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు అయూబ్ మహమ్మద్ హాజరై అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజాసేవకు నిబద్ధత కలిగిన నాయకత్వాన్ని ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
M D Azizuddin
వర్ధన్నపేటలో కాంగ్రెస్ మండల అధ్యక్ష పదవుల దరఖాస్తుల స్వీకరణ వరంగల్ జిల్లా: వర్ధన్నపేట నియోజకవర్గంలో మండల, డివిజన్ అధ్యక్ష పదవుల కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు అయూబ్ మహమ్మద్ హాజరై అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజాసేవకు నిబద్ధత కలిగిన నాయకత్వాన్ని ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీమంత్రి జీవన్ రెడ్డి ఇంకా ఏ పార్టీలో చేరాలనేది నిర్ణయించుకోలేదని స్పష్టం చేశారు. ఏ పార్టీలో చేరేది స్పష్టత ఇవ్వని జీవన్ రెడ్డి, బిఆర్ఎస్ బిజెపి నేతలు పరోక్షంగా ఆహ్వానం పలికారని తెలిపారు. స్వంతంగా పార్టీ పెట్టే ఆలోచన లేదన్నారు. కొంతకాలం తటస్థంగా ఉండి ప్రజా సమస్యలపై పోరాడేందుకు సిద్దమయ్యారు. కాంగ్రెస్ లో అనగదొక్కబడుతున్న తనలాంటి వారిని సమీకరించేందకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ లో ఏదో ఒక పార్టీలో చేరనున్న జీవన్ రెడ్డి తో మా ప్రతినిధి విజేందర్ రెడ్డి ఫేస్ టూ ఫేస్.1
- నకిరేకల్ నియోజకవర్గo:- ఈ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి కంటే రాజకీయ ప్రతీకారాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా వ్యవహరించడం మంచిది కాదని హెచ్చరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పారదర్శకంగా పనిచేయాలని, ప్రజలతో కలిసిమెలిసి నడుచుకోవాలని ఆయన సూచించారు.1
- కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ సర్పంచులపై వివక్ష: మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య మండిపాటు నకిరేకల్: నియోజకవర్గంలోని స్థానిక శాసనసభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచుల పట్ల తీవ్ర వివక్ష చూపుతోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య గారు ఆరోపించారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు.నిధుల నిలిపివేత గ్రామాల్లో ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ సర్పంచులకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించడం లేదని, గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను నిలిపివేస్తూ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని లింగయ్య గారు విమర్శించారు. అధికారులపై ఒత్తిడి చేస్తూ పంచాయతీ రాజ్ కార్యదర్శులు, ఎంపీడీవోలు మరియు ఇతర అధికారులపై స్థానిక కాంగ్రెస్ శాసనసభ్యులు ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ సర్పంచులు ఉన్న గ్రామాల్లో ఎంబీ (MB) రికార్డింగ్ కాకుండా, పనులు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. గతంలో వలె పాత పద్ధతులే పునరావృతం 2014 నుండి 19 వరకు ఉన్న అరాచక పాలన మళ్లీకనిపిస్తోందని, గతంలో తాము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయల నిధులతో చేపట్టిన పనులను కూడా ప్రస్తుత ప్రభుత్వం క్యాన్సిల్ మరొక దగ్గర శిలాఫలకాలు వేసి అటువంటి పనులను చేయాలని చూడ్డం దురదృష్టకరమని పేర్కొన్నారు. దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతోంది ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కక్షపూరిత నిర్ణయాల వల్ల గ్రామాలు అభివృద్ధికి దూరమవుతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "సర్పంచులు ఎంతో ఆశతో గ్రామ సేవ కోసం ఎన్నికయ్యారు. కానీ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే వారిని పనిచేయనివ్వకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం. నిధులు రాకుండా చేయడం, అధికారులతో బెదిరించడం వంటి చర్యలను మానుకోవాలి." బీఆర్ఎస్ సర్పంచులకు పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వ వివక్షపై అవసరమైతే పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ నకిరేకల్ కుప్పల ప్రదీప్ రెడ్డి నకిరేకల్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ మండల పార్టీ అధ్యక్షులు నవీన్ రావు మారం వెంకటరెడ్డి గ్రామాల సర్పంచులు కొండేటి సైదిరెడ్డి వీరు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు 1
- Post by Tagore1
- నల్గొండ జిల్లాలోని నకరికల్లు మండల పరిధిలోని పాలెం గ్రామానికి చెందిన మాజీ సైనికుడు బెల్లి జనార్ధన్ అకాల మరణాన్ని దిగమింగుతూ ఆ కుటుంబాన్ని పరామర్శించి, ఆత్మస్థైర్యం నింపి కుటుంబానికి వెన్నుదండూగా ఉంటామని నల్గొండ జిల్లా మాజీ సైనికులు తెలిపారు...3
- నల్లగొండ బ్రేకింగ్: ... నల్గొండ m.దుప్పలపల్లి రోడ్‌లో ప్రతిష్టాత్మకంగా *ది నేచర్ సిటీ* వెంచర్ ప్రారంభం... జబర్దస్త్ తారల సందడితో కార్యక్రమం హోరెత్తింది... బుల్లెట్ భాస్కర్, ఫైమా, పొట్టి నరేష్‌తో పాటు సినీ యాంకర్లు పాల్గొని ఆకట్టుకున్నారు... FM గ్రూప్, విశిష్ట గ్రూప్, ఇండికా అసోసియేట్స్ ఆధ్వర్యంలో వెంచర్ ప్రారంభం... DTCP అనుమతులు పొందిన ప్రాజెక్ట్‌గా నిర్వాహకులు వెల్లడి... మోడ్రన్ సదుపాయాలతో ప్లాట్ల అభివృద్ధి చేస్తామని నిర్వాహకుల హామీ... *మొహమ్మద్ షామీర్ ఉద్దీన్* మేనేజింగ్ పార్ట్నర్‌గా కార్యక్రమానికి నాయకత్వం భారీ సంఖ్యలో స్థానికులు, పెట్టుబడిదారులు హాజరై ఆసక్తి వ్యక్తం... నల్గొండ కార్పొరేషన్ మారినప్పటి నుండి పట్టణం లో రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపు… ది నేచర్ సిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా నిర్వాహకుల లక్ష్యం... సింగర్స్ లతో పాటల హోరు జోరుగా ప్రారంభించిన *ది నేచర్ సిటీ* వెంచర్... ఈ కార్యక్రమంలో గుమ్ముల మోహన్ రెడ్డి, బండారు ప్రసాద్,వంగూరి లక్ష్మయ్య, అనిల్ రెడ్డి, మండలి వెంకట్ రెడ్డి, చిన్నాల జానయ్య, రాజ్ లింగం, మొహమ్మద్ మాలిక్ అహ్మద్, రఫీఖ్,హ్యూమన్ రైట్స్ ఆక్టివ్ మెంబర్ మొహమ్మద్ అలీ,తదితర ప్రముఖులు పాల్గొన్నారు...1
- వరంగల్ జిల్లా: వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. అగ్గిపెట్టె విషయంలో తలెత్తిన వివాదం దాడికి దారితీసి, సినిమా స్టైల్లో పరస్పరం కొట్టుకున్న ఘటన సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఘటనపై మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం చెరువులో మునిగి ఇద్దరు గొర్ల కాపర్లు మృతి చెందారు. ధర్మారం గ్రామానికి చెందిన మూడుగె లక్ష్మీరాజం, కుమ్మం మొండయ్య, గొర్రెలకు నీరు తాగించేందుకు చెరువులోకి తీసుకెళ్లారు. ఈక్రమంలో లోపలికి వెళ్లి గోర్లను బయటకు పంపించే క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో మునిగారు. స్థానికులు అప్రమత్తమై వెలికితీసేలోగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు మృతదేహాలను బయటికి తీసి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.1
- నకిరేకల్ నియోజకవర్గo:- శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు అన్నీ కూడా గతంలో కేసీఆర్ హయాంలో మంజూరైన పనులేనని ఆరోపించారు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులు ఏవీ లేవని, “గుండు సున్నా” అని వ్యాఖ్యానించారు. ప్రజలకు మభ్యపెట్టే విధంగా పాత పనులను కొత్తగా చూపిస్తూ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ఆయన సూచించారు.1