logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ సర్పంచులపై వివక్ష: మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య మండిపాటు ​​కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ సర్పంచులపై వివక్ష: మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య మండిపాటు ​నకిరేకల్: నియోజకవర్గంలోని స్థానిక శాసనసభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచుల పట్ల తీవ్ర వివక్ష చూపుతోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య గారు ఆరోపించారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు.​నిధుల నిలిపివేత గ్రామాల్లో ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ సర్పంచులకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించడం లేదని, గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను నిలిపివేస్తూ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని లింగయ్య గారు విమర్శించారు. ​అధికారులపై ఒత్తిడి చేస్తూ పంచాయతీ రాజ్ కార్యదర్శులు, ఎంపీడీవోలు మరియు ఇతర అధికారులపై స్థానిక కాంగ్రెస్ శాసనసభ్యులు ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ సర్పంచులు ఉన్న గ్రామాల్లో ఎంబీ (MB) రికార్డింగ్ కాకుండా, పనులు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. గతంలో వలె ​పాత పద్ధతులే పునరావృతం 2014 నుండి 19 వరకు ఉన్న అరాచక పాలన మళ్లీకనిపిస్తోందని, గతంలో తాము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయల నిధులతో చేపట్టిన పనులను కూడా ప్రస్తుత ప్రభుత్వం క్యాన్సిల్ మరొక దగ్గర శిలాఫలకాలు వేసి అటువంటి పనులను చేయాలని చూడ్డం దురదృష్టకరమని పేర్కొన్నారు. దీనివల్ల ​అభివృద్ధి కుంటుపడుతోంది ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కక్షపూరిత నిర్ణయాల వల్ల గ్రామాలు అభివృద్ధికి దూరమవుతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ​"సర్పంచులు ఎంతో ఆశతో గ్రామ సేవ కోసం ఎన్నికయ్యారు. కానీ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే వారిని పనిచేయనివ్వకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం. నిధులు రాకుండా చేయడం, అధికారులతో బెదిరించడం వంటి చర్యలను మానుకోవాలి." ​బీఆర్ఎస్ సర్పంచులకు పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వ వివక్షపై అవసరమైతే పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ నకిరేకల్ కుప్పల ప్రదీప్ రెడ్డి నకిరేకల్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ మండల పార్టీ అధ్యక్షులు నవీన్ రావు మారం వెంకటరెడ్డి గ్రామాల సర్పంచులు కొండేటి సైదిరెడ్డి వీరు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు ​

3 hrs ago
user_INDIAN
INDIAN
Local News Reporter కేతేపల్లి, నల్గొండ, తెలంగాణ•
3 hrs ago

కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ సర్పంచులపై వివక్ష: మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య మండిపాటు ​​కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ సర్పంచులపై వివక్ష: మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య మండిపాటు ​నకిరేకల్: నియోజకవర్గంలోని స్థానిక శాసనసభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచుల పట్ల తీవ్ర వివక్ష చూపుతోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య గారు ఆరోపించారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు.​నిధుల నిలిపివేత గ్రామాల్లో ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ సర్పంచులకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించడం లేదని, గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను నిలిపివేస్తూ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని లింగయ్య గారు విమర్శించారు. ​అధికారులపై ఒత్తిడి చేస్తూ పంచాయతీ రాజ్ కార్యదర్శులు, ఎంపీడీవోలు మరియు ఇతర అధికారులపై స్థానిక కాంగ్రెస్ శాసనసభ్యులు ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ సర్పంచులు ఉన్న గ్రామాల్లో ఎంబీ (MB) రికార్డింగ్ కాకుండా, పనులు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. గతంలో వలె ​పాత పద్ధతులే పునరావృతం 2014 నుండి 19 వరకు ఉన్న అరాచక పాలన మళ్లీకనిపిస్తోందని, గతంలో తాము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయల నిధులతో చేపట్టిన పనులను కూడా ప్రస్తుత ప్రభుత్వం క్యాన్సిల్ మరొక దగ్గర శిలాఫలకాలు వేసి అటువంటి పనులను చేయాలని చూడ్డం దురదృష్టకరమని పేర్కొన్నారు. దీనివల్ల ​అభివృద్ధి కుంటుపడుతోంది ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కక్షపూరిత నిర్ణయాల వల్ల గ్రామాలు అభివృద్ధికి దూరమవుతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ​"సర్పంచులు ఎంతో ఆశతో గ్రామ సేవ కోసం ఎన్నికయ్యారు. కానీ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే వారిని పనిచేయనివ్వకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం. నిధులు రాకుండా చేయడం, అధికారులతో బెదిరించడం వంటి చర్యలను మానుకోవాలి." ​బీఆర్ఎస్ సర్పంచులకు పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వ వివక్షపై అవసరమైతే పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ నకిరేకల్ కుప్పల ప్రదీప్ రెడ్డి నకిరేకల్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ మండల పార్టీ అధ్యక్షులు నవీన్ రావు మారం వెంకటరెడ్డి గ్రామాల సర్పంచులు కొండేటి సైదిరెడ్డి వీరు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు ​

More news from తెలంగాణ and nearby areas
  • ములుగు జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో ఇచ్చిన తీర్పులు సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని జిల్లా జడ్జి సూర్య చంద్రకళ తెలిపారు. ఈ సందర్భంగా 4 బెంచ్‌ల ద్వారా మొత్తం 1,117 కేసులను పరిష్కరించారు. పలు కేసుల్లో రూ.1.15 కోట్ల నష్టపరిహారం ఇప్పించారు. దీర్ఘకాలిక వివాదాలను రాజీ ద్వారా పరిష్కరించుకుంటే సమయం, డబ్బు ఆదా అవుతాయని జడ్జి సూచించారు.
    1
    ములుగు జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో ఇచ్చిన తీర్పులు సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని జిల్లా జడ్జి సూర్య చంద్రకళ తెలిపారు. ఈ సందర్భంగా 4 బెంచ్‌ల ద్వారా మొత్తం 1,117 కేసులను పరిష్కరించారు. పలు కేసుల్లో రూ.1.15 కోట్ల నష్టపరిహారం ఇప్పించారు. దీర్ఘకాలిక వివాదాలను రాజీ ద్వారా పరిష్కరించుకుంటే సమయం, డబ్బు ఆదా అవుతాయని జడ్జి సూచించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు అధికారులు ముఖ్య సూచనలు చేశారు. భవన నిర్మాణ కార్మిక శాఖ ద్వారా లభించే క్లెయిమ్ డబ్బుల విషయంలో కార్మికులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎవరికైనా క్లెయిమ్ డబ్బులు రావాల్సి ఉంటే, వారు తప్పనిసరిగా స్వయంగా సమీపంలోని లేబర్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు పేర్కొంటూ, కొంతమంది బ్రోకర్లు క్లెయిమ్ డబ్బులు ఇప్పిస్తామని చెప్పి కార్మికులను మోసం చేసే అవకాశం ఉందని తెలిపారు. “మేము చేస్తేనే డబ్బులు వస్తాయి”, “అధికారులకు డబ్బులు ఇవ్వాలి” వంటి అబద్ధపు మాటలను నమ్మవద్దని స్పష్టం చేశారు. ఇలాంటి బ్రోకర్ల మాటలకు మోసపడి డబ్బులు కోల్పోవద్దని హెచ్చరించారు. అదేవిధంగా, కొన్ని సందర్భాల్లో కార్మికులకు రావాల్సిన డబ్బులను వారి అకౌంట్లలో వేసుకుని, కొంత మాత్రమే ఇవ్వడం జరుగుతుందని సమాచారం ఉందని అధికారులు తెలిపారు. ఇలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా బ్రోకర్లు లేదా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తే, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అలాగే అవినీతి నిరోధక శాఖ హెల్ప్‌లైన్ 1064 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.
    1
    నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు అధికారులు ముఖ్య సూచనలు చేశారు. భవన నిర్మాణ కార్మిక శాఖ ద్వారా లభించే క్లెయిమ్ డబ్బుల విషయంలో కార్మికులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎవరికైనా క్లెయిమ్ డబ్బులు రావాల్సి ఉంటే, వారు తప్పనిసరిగా స్వయంగా సమీపంలోని లేబర్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
ఈ సందర్భంగా అధికారులు పేర్కొంటూ, కొంతమంది బ్రోకర్లు క్లెయిమ్ డబ్బులు ఇప్పిస్తామని చెప్పి కార్మికులను మోసం చేసే అవకాశం ఉందని తెలిపారు. “మేము చేస్తేనే డబ్బులు వస్తాయి”, “అధికారులకు డబ్బులు ఇవ్వాలి” వంటి అబద్ధపు మాటలను నమ్మవద్దని స్పష్టం చేశారు. ఇలాంటి బ్రోకర్ల మాటలకు మోసపడి డబ్బులు కోల్పోవద్దని హెచ్చరించారు.
అదేవిధంగా, కొన్ని సందర్భాల్లో కార్మికులకు రావాల్సిన డబ్బులను వారి అకౌంట్లలో వేసుకుని, కొంత మాత్రమే ఇవ్వడం జరుగుతుందని సమాచారం ఉందని అధికారులు తెలిపారు. ఇలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎవరైనా బ్రోకర్లు లేదా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తే, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అలాగే అవినీతి నిరోధక శాఖ హెల్ప్‌లైన్ 1064 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    14 hrs ago
  • శివుడి అవతారమంటూ నమ్మబలికి ఘోరం! ... పార్వతివి అంటూ పిలిచి పాశవిక చర్య! ... దేవుడి ముసుగులో కామాంధుడి లీలలు! ... మహారాష్ట్రలో కలకలం రేపిన కీచక పర్వం! ​ భక్తి ముసుగులో బరితెగించాడు. ... తాను సాక్షాత్తు ఆ పరమశివుడి అవతారమంటూ నమ్మబలికాడు. ... మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకుని, అఘాయిత్యాలకు ఒడిగట్టాడు ఓ కేటుగాడు. ... నిత్యం పూజలు, పునస్కారాలంటూ తిరిగే ఆ వ్యక్తి లోపల ఉన్న, కామాంధుడు బయటపడ్డాడు. ... మహారాష్ట్రలో వెలుగుచూసిన ఈ ఘటన, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మహారాష్ట్రలోని వసై ప్రాంతానికి చెందిన రిషికేశ్ వైద్య, తనను తాను దేవుడిగా ప్రచారం చేసుకున్నాడు. ... బాధితురాలికి మాయమాటలు చెప్పి, ఆమె సాక్షాత్తు పార్వతీ దేవి స్వరూపమని, తనకు అత్యంత సన్నిహితురాలని నమ్మించాడు. ... ఆ అమాయక మహిళను నమ్మించి, చివరకు ఆమెకు మత్తుమందు ఇచ్చి, పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ మృగశిర.అంతటితో ఈ కీచకుడి ఆగడాలు ఆగలేదు! ... బాధితురాలికి సంబంధించిన అభ్యంతరకర ఫోటోలు తీసి, ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బ్లాక్ మెయిల్ కు దిగాడు. ... భక్తి పేరుతో నమ్మించి, చివరకు నరకం చూపించాడు.బాధితురాలి ధైర్యంతో పోలీసులను ఆశ్రయించడంతో, ఈ నకిలీ దేవుడి బండారం బయటపడింది. ... మొదట వసైలోని మాణిక్ పూర్ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, ఆ తర్వాత కేసును పూణేలోని మంజరి పోలీసులకు బదిలీ చేశారు. ... ప్రస్తుతం పరారీలో ఉన్న రిషికేశ్ వైద్య కోసం, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ... ఇతడి చేతిలో ఇంకా ఎంతమంది మహిళలు మోసపోయి ఉంటారనే కోణంలో, దర్యాప్తు ముమ్మరం చేశారు.
    1
    శివుడి అవతారమంటూ నమ్మబలికి ఘోరం! ... పార్వతివి అంటూ పిలిచి పాశవిక చర్య! ... దేవుడి ముసుగులో కామాంధుడి లీలలు! ... మహారాష్ట్రలో కలకలం రేపిన కీచక పర్వం!
​
భక్తి ముసుగులో బరితెగించాడు. ... తాను సాక్షాత్తు ఆ పరమశివుడి అవతారమంటూ నమ్మబలికాడు. ... మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకుని, అఘాయిత్యాలకు ఒడిగట్టాడు ఓ కేటుగాడు. ... నిత్యం పూజలు, పునస్కారాలంటూ తిరిగే ఆ వ్యక్తి లోపల ఉన్న, కామాంధుడు బయటపడ్డాడు. ... మహారాష్ట్రలో వెలుగుచూసిన ఈ ఘటన, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
మహారాష్ట్రలోని వసై ప్రాంతానికి చెందిన రిషికేశ్ వైద్య, తనను తాను దేవుడిగా ప్రచారం చేసుకున్నాడు. ... బాధితురాలికి మాయమాటలు చెప్పి, ఆమె సాక్షాత్తు పార్వతీ దేవి స్వరూపమని, తనకు అత్యంత సన్నిహితురాలని నమ్మించాడు. ... ఆ అమాయక మహిళను నమ్మించి, చివరకు ఆమెకు మత్తుమందు ఇచ్చి, పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ మృగశిర.అంతటితో ఈ కీచకుడి ఆగడాలు ఆగలేదు! ... బాధితురాలికి సంబంధించిన అభ్యంతరకర ఫోటోలు తీసి, ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బ్లాక్ మెయిల్ కు దిగాడు. ... భక్తి పేరుతో నమ్మించి, చివరకు నరకం చూపించాడు.బాధితురాలి ధైర్యంతో పోలీసులను ఆశ్రయించడంతో, ఈ నకిలీ దేవుడి బండారం బయటపడింది. ... మొదట వసైలోని మాణిక్ పూర్ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, ఆ తర్వాత కేసును పూణేలోని మంజరి పోలీసులకు బదిలీ చేశారు. ... ప్రస్తుతం పరారీలో ఉన్న రిషికేశ్ వైద్య కోసం, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ... ఇతడి చేతిలో ఇంకా ఎంతమంది మహిళలు మోసపోయి ఉంటారనే కోణంలో, దర్యాప్తు ముమ్మరం చేశారు.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఆర్చ్ 28 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ పట్టణంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమ్యూనికేషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో, జగిత్యాల జిల్లాలో యూట్యూబర్ వైష్ణవి హత్యకు కారణమైన భర్త హరిబాబుకు కఠిన శిక్ష విధించాలని సిద్దిపేట జిల్లా అధ్యక్షులు షమీం శనివారం డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కోరారు. తల్లిదండ్రుల బాధ్యతలను కూడా ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు రజియా బేగం, ఆపరేషన్ ఆఫీసర్ దాసరి విమల, స్వరూప, షబానా, మసియుద్దిన్, బాబా, అజ్ హర్. తదితరులు పాల్గొన్నారు.
    4
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఆర్చ్ 28 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ పట్టణంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమ్యూనికేషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో, జగిత్యాల జిల్లాలో యూట్యూబర్ వైష్ణవి హత్యకు కారణమైన భర్త హరిబాబుకు కఠిన శిక్ష విధించాలని సిద్దిపేట జిల్లా అధ్యక్షులు షమీం శనివారం డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కోరారు. తల్లిదండ్రుల బాధ్యతలను కూడా ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో  సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు  రజియా బేగం, ఆపరేషన్ ఆఫీసర్ దాసరి విమల, స్వరూప, షబానా, మసియుద్దిన్, బాబా, అజ్ హర్. తదితరులు పాల్గొన్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
  • प्यार में रोड़ा बन रही मां की हत्या, बेटी ने बॉयफ्रेंड संग घर में ही दफनाई लाश; एक साल बाद खुला राज हैदराबाद के जवाहरनगर में पिछले करीब एक साल से लापता 40 वर्षीय महिला का कंकाल उसके बेडरूम में मिला। पुलिस ने बुधवार को इस गुत्थी को सुलझाते हुए महिला की छोटी बेटी और उसके प्रेमी को गिरफ्तार कर लिया है। इन दोनों पर आरोप है कि इन्होंने न केवल महिला की हत्या की, बल्कि राज छुपाने के लिए लाश को घर के अंदर ही दफनाकर ऊपर से कंक्रीट की पक्की फर्श बनवा दी। मृतका की पहचान अंजू दासारी के रूप में हुई है, जो घरों में साफ-सफाई का काम (हाउस मेड) करती थीं। वह अपनी दो बेटियों (20 और 17 वर्ष) के साथ रहती थीं। लगभग एक साल तक किसी को कानों-कान खबर नहीं हुई कि जिस कमरे में वे सो रहे हैं, उसी के नीचे उनकी मां की लाश दफन है। क्या है पूरा मामला? इस पूरे मामले की शुरुआत 17 अक्टूबर 2025 को हुई, जब अंजू की बड़ी बेटी रोशनी कुमारी ने पुलिस में अपनी मां की गुमशुदगी की रिपोर्ट दर्ज कराई। रोशनी ने पुलिस को बताया कि उसकी मां 12 मई 2025 को काम पर जाने के लिए घर से निकली थी, लेकिन वापस नहीं लौटी। शुरुआत में पुलिस ने इसे एक सामान्य गुमशुदगी का मामला मानकर जांच शुरू की, लेकिन लंबे समय तक कोई सुराग हाथ नहीं लगा।
    1
    प्यार में रोड़ा बन रही मां की हत्या, बेटी ने बॉयफ्रेंड संग घर में ही दफनाई लाश; एक साल बाद खुला राज
हैदराबाद के जवाहरनगर में पिछले करीब एक साल से लापता 40 वर्षीय महिला का कंकाल उसके बेडरूम में मिला। पुलिस ने बुधवार को इस गुत्थी को सुलझाते हुए महिला की छोटी बेटी और उसके प्रेमी को गिरफ्तार कर लिया है। इन दोनों पर आरोप है कि इन्होंने न केवल महिला की हत्या की, बल्कि राज छुपाने के लिए लाश को घर के अंदर ही दफनाकर ऊपर से कंक्रीट की पक्की फर्श बनवा दी।
मृतका की पहचान अंजू दासारी के रूप में हुई है, जो घरों में साफ-सफाई का काम (हाउस मेड) करती थीं। वह अपनी दो बेटियों (20 और 17 वर्ष) के साथ रहती थीं। लगभग एक साल तक किसी को कानों-कान खबर नहीं हुई कि जिस कमरे में वे सो रहे हैं, उसी के नीचे उनकी मां की लाश दफन है।
क्या है पूरा मामला?
इस पूरे मामले की शुरुआत 17 अक्टूबर 2025 को हुई, जब अंजू की बड़ी बेटी रोशनी कुमारी ने पुलिस में अपनी मां की गुमशुदगी की रिपोर्ट दर्ज कराई। रोशनी ने पुलिस को बताया कि उसकी मां 12 मई 2025 को काम पर जाने के लिए घर से निकली थी, लेकिन वापस नहीं लौटी। शुरुआत में पुलिस ने इसे एक सामान्य गुमशुदगी का मामला मानकर जांच शुरू की, लेकिन लंबे समय तक कोई सुराग हाथ नहीं लगा।
    user_बशीर शेख
    बशीर शेख
    Secunderabad, Hyderabad•
    3 hrs ago
  • బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో వైభవంగా సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ కొంటెబోయిన నాగలక్ష్మి నరసింహులు ముదిరాజ్ హనుమాన్ దేవాలయ కమిటీ గ్రామ పెద్దల సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణం వేదమంత్రోత్సవాలతో వేద పండితులచే ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రజలందరూ ఆ సీతారామచంద్రుని దర్శనం చేసుకుని స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.
    1
    బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో వైభవంగా సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం 
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ కొంటెబోయిన నాగలక్ష్మి నరసింహులు ముదిరాజ్ హనుమాన్ దేవాలయ కమిటీ గ్రామ పెద్దల సహకారంతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణం వేదమంత్రోత్సవాలతో వేద పండితులచే ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రజలందరూ ఆ సీతారామచంద్రుని దర్శనం చేసుకుని స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.
    user_B Narsimhulu
    B Narsimhulu
    Financial Analyst గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    6 hrs ago
  • నకిరేకల్‌ నియోజకవర్గo:- శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు అన్నీ కూడా గతంలో కేసీఆర్ హయాంలో మంజూరైన పనులేనని ఆరోపించారు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులు ఏవీ లేవని, “గుండు సున్నా” అని వ్యాఖ్యానించారు. ప్రజలకు మభ్యపెట్టే విధంగా పాత పనులను కొత్తగా చూపిస్తూ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ఆయన సూచించారు.
    1
    నకిరేకల్‌ నియోజకవర్గo:-
శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు అన్నీ కూడా గతంలో కేసీఆర్ హయాంలో మంజూరైన పనులేనని ఆరోపించారు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులు ఏవీ లేవని, “గుండు సున్నా” అని వ్యాఖ్యానించారు.
ప్రజలకు మభ్యపెట్టే విధంగా పాత పనులను కొత్తగా చూపిస్తూ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ఆయన సూచించారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    2 hrs ago
  • ములుగు జిల్లా కేంద్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ దివాకర సమీక్ష నిర్వహించారు. సివిల్ సప్లై అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశమై కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా మిల్లింగ్, చెల్లింపుల సమస్యలను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారం కోరారు. అనంతరం అసోసియేషన్ రూపొందించిన డైరీని ఆవిష్కరించారు.
    1
    ములుగు జిల్లా కేంద్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ దివాకర సమీక్ష నిర్వహించారు. సివిల్ సప్లై అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశమై కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా మిల్లింగ్, చెల్లింపుల సమస్యలను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారం కోరారు. అనంతరం అసోసియేషన్ రూపొందించిన డైరీని ఆవిష్కరించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం: ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన కారు.. వరంగల్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు దుర్మరణం! ​ చిత్తూరు/వరంగల్: ఏపీలోని చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద తిరుపతి - బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ​అసలేం జరిగిందంటే.. వరంగల్ ప్రాంతానికి చెందిన శ్రీధర్ రావు, ఆయన భార్య లక్ష్మి, మరియు వీరి నాలుగేళ్ల కుమార్తె ఆద్విక వీరు తిరుమల శ్రీవారి దర్శనం కోసం బెంగళూరు నుండి కారులో బయలుదేరారు. పలమనేరు నుండి చిత్తూరు వైపు వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు శేషాపురం సర్వీస్ రోడ్డు వద్ద ఆగి ఉండగా.. వెనుక నుండి అతివేగంగా వచ్చిన వీరి కారు బస్సును బలంగా ఢీకొట్టింది. ​ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే, కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న శ్రీధర్ రావు, లక్ష్మి, ఆద్వికలు తీవ్ర గాయాలపాలై స్పాట్‌లోనే మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.​వరంగల్‌కు చెందిన ఒకే కుటుంబం ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి JTV నైన్ News.
    1
    చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం: ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన కారు.. వరంగల్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు దుర్మరణం!
​
చిత్తూరు/వరంగల్: ఏపీలోని చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద తిరుపతి - బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
​అసలేం జరిగిందంటే..
వరంగల్ ప్రాంతానికి చెందిన శ్రీధర్ రావు, ఆయన భార్య లక్ష్మి, మరియు వీరి నాలుగేళ్ల కుమార్తె ఆద్విక  వీరు తిరుమల శ్రీవారి దర్శనం కోసం బెంగళూరు నుండి కారులో బయలుదేరారు. పలమనేరు నుండి చిత్తూరు వైపు వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు శేషాపురం సర్వీస్ రోడ్డు వద్ద ఆగి ఉండగా.. వెనుక నుండి అతివేగంగా వచ్చిన వీరి కారు బస్సును బలంగా ఢీకొట్టింది.
​ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే, కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న శ్రీధర్ రావు, లక్ష్మి, ఆద్వికలు తీవ్ర గాయాలపాలై స్పాట్‌లోనే మృతి చెందారు.  గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు  ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.​వరంగల్‌కు చెందిన ఒకే కుటుంబం ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి JTV నైన్ News.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.