logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం: ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన కారు.. వరంగల్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు దుర్మరణం! చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం: ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన కారు.. వరంగల్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు దుర్మరణం! ​ చిత్తూరు/వరంగల్: ఏపీలోని చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద తిరుపతి - బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ​అసలేం జరిగిందంటే.. వరంగల్ ప్రాంతానికి చెందిన శ్రీధర్ రావు, ఆయన భార్య లక్ష్మి, మరియు వీరి నాలుగేళ్ల కుమార్తె ఆద్విక వీరు తిరుమల శ్రీవారి దర్శనం కోసం బెంగళూరు నుండి కారులో బయలుదేరారు. పలమనేరు నుండి చిత్తూరు వైపు వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు శేషాపురం సర్వీస్ రోడ్డు వద్ద ఆగి ఉండగా.. వెనుక నుండి అతివేగంగా వచ్చిన వీరి కారు బస్సును బలంగా ఢీకొట్టింది. ​ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే, కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న శ్రీధర్ రావు, లక్ష్మి, ఆద్వికలు తీవ్ర గాయాలపాలై స్పాట్‌లోనే మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.​వరంగల్‌కు చెందిన ఒకే కుటుంబం ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి JTV నైన్ News.

2 hrs ago
user_Jtv9 News Network
Jtv9 News Network
బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
2 hrs ago

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం: ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన కారు.. వరంగల్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు దుర్మరణం! చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం: ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన కారు.. వరంగల్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు దుర్మరణం! ​ చిత్తూరు/వరంగల్: ఏపీలోని చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద తిరుపతి - బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ​అసలేం జరిగిందంటే.. వరంగల్ ప్రాంతానికి చెందిన శ్రీధర్ రావు, ఆయన భార్య లక్ష్మి, మరియు వీరి నాలుగేళ్ల కుమార్తె ఆద్విక వీరు తిరుమల శ్రీవారి దర్శనం కోసం బెంగళూరు నుండి కారులో బయలుదేరారు. పలమనేరు నుండి చిత్తూరు వైపు వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు శేషాపురం సర్వీస్ రోడ్డు వద్ద ఆగి ఉండగా.. వెనుక నుండి అతివేగంగా వచ్చిన వీరి కారు బస్సును బలంగా ఢీకొట్టింది. ​ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే, కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న శ్రీధర్ రావు, లక్ష్మి, ఆద్వికలు తీవ్ర గాయాలపాలై స్పాట్‌లోనే మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.​వరంగల్‌కు చెందిన ఒకే కుటుంబం ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి JTV నైన్ News.

More news from తెలంగాణ and nearby areas
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 27 ప్రజా తెలంగాణ న్యూస్/ శ్రీగిరిపల్లి గ్రామంలో ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి నర్సయ్యకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో భక్తిశ్రద్ధలతో శ్రీరామ నవమి కార్యక్రమాలు కొనసాగాయి. అలాగే రహదారిపై ప్రయాణించే వారికి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షిమి రెడ్డి, కుమార్, రాజు, కాంగ్రెస్ నాయకులు గ్రామ పెద్దలు, సంఘ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
    4
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 27 ప్రజా తెలంగాణ న్యూస్/
శ్రీగిరిపల్లి గ్రామంలో ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి నర్సయ్యకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో భక్తిశ్రద్ధలతో శ్రీరామ నవమి కార్యక్రమాలు కొనసాగాయి.
అలాగే రహదారిపై ప్రయాణించే వారికి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షిమి రెడ్డి, కుమార్, రాజు, కాంగ్రెస్ నాయకులు గ్రామ పెద్దలు, సంఘ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    21 hrs ago
  • ధర్మరెడ్డిపల్లిలో కన్నుల పండువగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం గజ్వేల్ గజ్వేల్ నియోజకవర్గం 27 శుక్రవారం మార్చి 2026 సిద్దిపేట జిల్లా : గజ్వేల్ మండలం ధర్మరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగాయి. లోక కళ్యాణం కోసం శ్రీరామచంద్రుడు, సీతాదేవిల వివాహ వేడుకను గ్రామస్తులందరూ కలిసి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో విశేష పూజలు నిర్వహించిన అర్చకులు, శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణం జరుగుతుండగా భక్తులు జయజయధ్వానాలతో పులకించిపోయారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మరియు గ్రామ సర్పంచ్ కాసమొల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం గ్రామ ప్రజల అదృష్టమని, గ్రామం సుభిక్షంగా ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఈ వేడుకను నిర్వహించినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ధర్మరెడ్డిపల్లి గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణలో భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.
    4
    ధర్మరెడ్డిపల్లిలో కన్నుల పండువగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం
గజ్వేల్
గజ్వేల్ నియోజకవర్గం 27 శుక్రవారం మార్చి 2026 
సిద్దిపేట జిల్లా :  గజ్వేల్ మండలం ధర్మరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగాయి. లోక కళ్యాణం కోసం శ్రీరామచంద్రుడు, సీతాదేవిల వివాహ వేడుకను గ్రామస్తులందరూ కలిసి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో విశేష పూజలు నిర్వహించిన అర్చకులు, శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణం జరుగుతుండగా భక్తులు జయజయధ్వానాలతో పులకించిపోయారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మరియు గ్రామ సర్పంచ్ కాసమొల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం గ్రామ ప్రజల అదృష్టమని, గ్రామం సుభిక్షంగా ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఈ వేడుకను నిర్వహించినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ధర్మరెడ్డిపల్లి గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణలో భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
  • సదాశివపేటలో శ్రీరామనవమి వేడుకలలో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
    1
    సదాశివపేటలో శ్రీరామనవమి వేడుకలలో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    23 hrs ago
  • వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ ప్రాంతాలలో ఖరీదైన సెల్ఫోన్ లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను వికారాబాద్ జిల్లా సిసిఎస్ పోలీసులు చాకచకంగా పట్టుకున్నారు. జిల్లాలో సెల్ఫోన్ దొంగతనం నివారించడానికి ఎస్పీ స్నేహ మెహర ఆదేశాల మేరకు Stomach ఇన్స్పెక్టర్ బలవంతురాయ్ వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దయఎత్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ అంశాల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా నిందితుల కదలికలను గుర్తించి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించి రవి అలియాస్ గౌరీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిధి బొమ్రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లాలో రద్దీ ప్రాంతాలలో దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. రద్దీప్ ప్రదేశాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖరీదైన మొబైల్ ఫోన్లో జాగ్రత్తగా ఉంచుకోవాలని సిసిఎస్ ఇన్స్పెక్టర్ బలవంతరాయి హెచ్చరించారు.
    1
    వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ ప్రాంతాలలో ఖరీదైన సెల్ఫోన్ లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను వికారాబాద్ జిల్లా సిసిఎస్ పోలీసులు చాకచకంగా పట్టుకున్నారు. జిల్లాలో సెల్ఫోన్ దొంగతనం నివారించడానికి ఎస్పీ స్నేహ మెహర ఆదేశాల మేరకు Stomach ఇన్స్పెక్టర్ బలవంతురాయ్ వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దయఎత్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ అంశాల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా నిందితుల కదలికలను గుర్తించి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించి రవి అలియాస్ గౌరీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిధి బొమ్రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లాలో రద్దీ ప్రాంతాలలో దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. రద్దీప్ ప్రదేశాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖరీదైన మొబైల్ ఫోన్లో జాగ్రత్తగా ఉంచుకోవాలని సిసిఎస్ ఇన్స్పెక్టర్ బలవంతరాయి హెచ్చరించారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    22 hrs ago
  • కౌడిపల్లి గ్రామంలో శ్రీ సీతారాములవారి కళ్యాణం వైభవంగా కనులపండుగా . కౌడిపల్లి మరియు చుటుప్రకల గ్రామ ప్రజలు మమేకమై శ్రీరాముడిని జై శ్రీరామ్ అంటూ డోలలు ఆనంద పరవశులై ఆటలు ఆడుతూ. ఆ అయ్యవారిని హనుమాన్ ఆలయం నుండి రామాలయంలో గల కళ్యాణమండపంనాకు తీసుకొనివచ్చి. ఆ సీతారాములవారి కళ్యాణం కార్యక్రమం కౌడిపల్లి సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ మరియు జనగణనీయంగా నిర్వహించినారు.
    2
    కౌడిపల్లి గ్రామంలో శ్రీ సీతారాములవారి కళ్యాణం వైభవంగా కనులపండుగా .
కౌడిపల్లి మరియు చుటుప్రకల గ్రామ ప్రజలు మమేకమై శ్రీరాముడిని జై శ్రీరామ్ అంటూ డోలలు ఆనంద పరవశులై ఆటలు ఆడుతూ. 
ఆ అయ్యవారిని హనుమాన్ ఆలయం నుండి రామాలయంలో గల కళ్యాణమండపంనాకు తీసుకొనివచ్చి.
ఆ సీతారాములవారి కళ్యాణం  కార్యక్రమం కౌడిపల్లి సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ మరియు  జనగణనీయంగా నిర్వహించినారు.
    user_Vishwanath Goud
    Vishwanath Goud
    Grocer కౌడిపల్లి, మెదక్, తెలంగాణ•
    23 hrs ago
  • మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25 న చిన్న శంకరం పేట మండలం జంగారాయి కి చెందిన తుమ్మల అంజయ్య (85), సావిత్రమ్మ (80) దంపతుల ఇంట్లో మధ్యాహ్నం సమయంలో ముసుగు వేసుకుని వాటిలో బైక్ బంపర్ రాడ్ తో దాడి చేసి 4.5 తులాల బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్ళడం జరిగిందని అన్నారు. ఈ కేసులో అదనపు ఎస్పీ మహేందర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా ఈ నెల 28 న ఉదయం తూప్రాన్ బస్ స్టాప్ లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి పట్టుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకొని అతని వద్ద చోరీ చేసిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. నిందితుడు విరిగే వెంకట నారాయణ వృద్ధ దంపతుల మనవరాలి భర్త కావడంతో అతనికి వీరు ఒంటరి గా ఉంటారనే విషయం తెలుసుకుని చేసిన అప్పులను తీర్చేందుకు ఈ దోపిడి చేయడం జరిగిందని అన్నారు. ఈ కేసు చేదన వేగంగా చేసిన తూప్రాన్ డీఎస్పీ, రామాయంపేట సీఐ, ఎస్ఐ, సీసీ ఎస్ కానిస్టేబుల్స్ లను ఆయన అభినందించారు.
    1
    మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25 న చిన్న శంకరం పేట మండలం జంగారాయి కి చెందిన తుమ్మల అంజయ్య (85), సావిత్రమ్మ (80) దంపతుల ఇంట్లో మధ్యాహ్నం సమయంలో ముసుగు వేసుకుని వాటిలో బైక్ బంపర్ రాడ్ తో దాడి చేసి 4.5 తులాల బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్ళడం జరిగిందని అన్నారు. ఈ కేసులో అదనపు ఎస్పీ మహేందర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా ఈ నెల 28 న ఉదయం తూప్రాన్ బస్ స్టాప్ లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి పట్టుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకొని అతని వద్ద చోరీ చేసిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. నిందితుడు విరిగే వెంకట నారాయణ వృద్ధ దంపతుల మనవరాలి భర్త కావడంతో అతనికి వీరు ఒంటరి గా ఉంటారనే విషయం తెలుసుకుని చేసిన అప్పులను తీర్చేందుకు ఈ దోపిడి చేయడం జరిగిందని అన్నారు. ఈ కేసు చేదన వేగంగా చేసిన తూప్రాన్ డీఎస్పీ, రామాయంపేట సీఐ, ఎస్ఐ, సీసీ ఎస్ కానిస్టేబుల్స్ లను ఆయన అభినందించారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    18 min ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 27 ప్రజా తెలంగాణ న్యూస్ / యాదగిరి గుట్ట భువనగిరి జిల్లా తూర్పు గూడెం రాజరాజేశ్వరి ఆలయంలో సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ అర్చకులు సుధాగాని సూర్యం శ్రీవాణి,ఐ వీ ఎఫ్ రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్,భక్తి రత్న అవార్డు గ్రహీత డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు, సీతారాముల కళ్యాణం కనుల పండుగ నిర్వహించిన కార్యక్రమానికి సహకరించినప్పుడు ప్రతి ఒక్కరికి స్వామివారి కరుణాకటాక్షాలు ఉండాలని తెలిపారు, ఈ కార్యక్రమంలో నరేందర్ గౌడ్ మంజుల, చంద్రమౌళి, సుమలత,శ్యామల,గోపికృష్ణ లావణ్య కుటుంబ సభ్యులు,భువనగిరి భక్త బృందం,పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు
    4
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 27 ప్రజా తెలంగాణ న్యూస్ /
యాదగిరి గుట్ట భువనగిరి జిల్లా తూర్పు గూడెం రాజరాజేశ్వరి ఆలయంలో సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ అర్చకులు సుధాగాని సూర్యం శ్రీవాణి,ఐ వీ ఎఫ్ రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్,భక్తి రత్న అవార్డు గ్రహీత డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు, సీతారాముల కళ్యాణం కనుల పండుగ నిర్వహించిన కార్యక్రమానికి సహకరించినప్పుడు ప్రతి ఒక్కరికి స్వామివారి కరుణాకటాక్షాలు ఉండాలని తెలిపారు, ఈ కార్యక్రమంలో నరేందర్ గౌడ్ మంజుల, చంద్రమౌళి, సుమలత,శ్యామల,గోపికృష్ణ లావణ్య కుటుంబ సభ్యులు,భువనగిరి భక్త బృందం,పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    21 hrs ago
  • నేడు నర్సాపూర్ చిల్డ్రన్ పార్కులో ఎమ్మార్పీఎస్ కరపత్రలు విడుదల మార్చ్.30.2026 నాడు చలో ఇందిరాపార్క్ నిరాహార దీక్షను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు జమునగాళ్ల కుమార్ అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న నాయకత్వంలో నిర్వహించే నిరాహార దీక్షను విజయవంతం చేయాలని కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయహస్తం పథకం దళిత కుటుంబానికి 12 లక్షలు ఆర్థిక సాయం అందించాలి అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల సాగు భూమిని కేటాయించాలి జీవో 58, 59 ప్రకారం లావన్ పట్టాలకు పట్టాలు కల్పించాలని కార్పొరేట్ విద్యా సంస్థలలో 25% ఉచిత విద్యను కచ్చితంగా అమలు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ నిధులు కార్పొరేషన్ శాఖకు 15000 కోట్లు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి పారిశుద్ధ కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి 20వేల కనీస వేతనం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాము,ఈ కార్యక్రమంలో MSf కన్వీనర్ మశివానోళ్ల నాగరాజు, mrps నర్సాపూర్ మండలం ఉపాధ్యక్షులు ఎర్ర విద్య సాగర్, నరేష్ mrps నాయకులు పాల్గొన్నారు.జమునగల కుమార్ MRPS నర్సాపూర్ మండల అధ్యక్షులు....
    1
    నేడు నర్సాపూర్ చిల్డ్రన్ పార్కులో ఎమ్మార్పీఎస్ కరపత్రలు విడుదల  మార్చ్.30.2026 నాడు చలో ఇందిరాపార్క్ నిరాహార దీక్షను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు జమునగాళ్ల కుమార్ అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న నాయకత్వంలో నిర్వహించే నిరాహార దీక్షను విజయవంతం చేయాలని కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయహస్తం పథకం దళిత కుటుంబానికి 12 లక్షలు ఆర్థిక సాయం అందించాలి అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల సాగు భూమిని కేటాయించాలి జీవో 58, 59 ప్రకారం లావన్ పట్టాలకు పట్టాలు కల్పించాలని కార్పొరేట్ విద్యా సంస్థలలో 25% ఉచిత విద్యను కచ్చితంగా అమలు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ నిధులు కార్పొరేషన్ శాఖకు 15000 కోట్లు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి పారిశుద్ధ కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి  20వేల కనీస వేతనం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాము,ఈ కార్యక్రమంలో MSf కన్వీనర్ మశివానోళ్ల నాగరాజు, mrps నర్సాపూర్ మండలం ఉపాధ్యక్షులు ఎర్ర విద్య సాగర్, నరేష్ mrps నాయకులు పాల్గొన్నారు.జమునగల కుమార్
MRPS నర్సాపూర్ మండల అధ్యక్షులు....
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • నల్గొండ: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ లోని కతాల్ గూడలో రహదారి పక్కన ఉన్న బారీ వృక్షం వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. నల్గొండ నుంచి దేవరకొండ మార్గంలో నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తున్న ఈ ప్రాంతంలో చెట్టు కూలితే భారీ నష్టం జరిగే అవకాశాలున్నాయి. ఏదైనా ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రహదారి పక్కన ఉన్న ఎండిన చెట్టును తొలగించాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.
    1
    నల్గొండ: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ లోని కతాల్ గూడలో రహదారి పక్కన ఉన్న బారీ వృక్షం వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. నల్గొండ నుంచి దేవరకొండ మార్గంలో నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తున్న ఈ ప్రాంతంలో చెట్టు కూలితే భారీ నష్టం జరిగే అవకాశాలున్నాయి. ఏదైనా ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రహదారి పక్కన ఉన్న ఎండిన చెట్టును తొలగించాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.