logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సీతారాముల కళ్యాణం కమనీయం కౌడిపల్లి గ్రామంలో శ్రీ సీతారాములవారి కళ్యాణం వైభవంగా కనులపండుగా . కౌడిపల్లి మరియు చుటుప్రకల గ్రామ ప్రజలు మమేకమై శ్రీరాముడిని జై శ్రీరామ్ అంటూ డోలలు ఆనంద పరవశులై ఆటలు ఆడుతూ. ఆ అయ్యవారిని హనుమాన్ ఆలయం నుండి రామాలయంలో గల కళ్యాణమండపంనాకు తీసుకొనివచ్చి. ఆ సీతారాములవారి కళ్యాణం కార్యక్రమం కౌడిపల్లి సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ మరియు జనగణనీయంగా నిర్వహించినారు.

23 hrs ago
user_Vishwanath Goud
Vishwanath Goud
Grocer కౌడిపల్లి, మెదక్, తెలంగాణ•
23 hrs ago

సీతారాముల కళ్యాణం కమనీయం కౌడిపల్లి గ్రామంలో శ్రీ సీతారాములవారి కళ్యాణం వైభవంగా కనులపండుగా . కౌడిపల్లి మరియు చుటుప్రకల గ్రామ ప్రజలు మమేకమై శ్రీరాముడిని జై శ్రీరామ్ అంటూ డోలలు ఆనంద పరవశులై ఆటలు ఆడుతూ. ఆ అయ్యవారిని హనుమాన్ ఆలయం నుండి రామాలయంలో గల కళ్యాణమండపంనాకు తీసుకొనివచ్చి. ఆ సీతారాములవారి కళ్యాణం కార్యక్రమం కౌడిపల్లి సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ మరియు జనగణనీయంగా నిర్వహించినారు.

More news from తెలంగాణ and nearby areas
  • కౌడిపల్లి గ్రామంలో శ్రీ సీతారాములవారి కళ్యాణం వైభవంగా కనులపండుగా . కౌడిపల్లి మరియు చుటుప్రకల గ్రామ ప్రజలు మమేకమై శ్రీరాముడిని జై శ్రీరామ్ అంటూ డోలలు ఆనంద పరవశులై ఆటలు ఆడుతూ. ఆ అయ్యవారిని హనుమాన్ ఆలయం నుండి రామాలయంలో గల కళ్యాణమండపంనాకు తీసుకొనివచ్చి. ఆ సీతారాములవారి కళ్యాణం కార్యక్రమం కౌడిపల్లి సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ మరియు జనగణనీయంగా నిర్వహించినారు.
    2
    కౌడిపల్లి గ్రామంలో శ్రీ సీతారాములవారి కళ్యాణం వైభవంగా కనులపండుగా .
కౌడిపల్లి మరియు చుటుప్రకల గ్రామ ప్రజలు మమేకమై శ్రీరాముడిని జై శ్రీరామ్ అంటూ డోలలు ఆనంద పరవశులై ఆటలు ఆడుతూ. 
ఆ అయ్యవారిని హనుమాన్ ఆలయం నుండి రామాలయంలో గల కళ్యాణమండపంనాకు తీసుకొనివచ్చి.
ఆ సీతారాములవారి కళ్యాణం  కార్యక్రమం కౌడిపల్లి సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ మరియు  జనగణనీయంగా నిర్వహించినారు.
    user_Vishwanath Goud
    Vishwanath Goud
    Grocer కౌడిపల్లి, మెదక్, తెలంగాణ•
    23 hrs ago
  • మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25 న చిన్న శంకరం పేట మండలం జంగారాయి కి చెందిన తుమ్మల అంజయ్య (85), సావిత్రమ్మ (80) దంపతుల ఇంట్లో మధ్యాహ్నం సమయంలో ముసుగు వేసుకుని వాటిలో బైక్ బంపర్ రాడ్ తో దాడి చేసి 4.5 తులాల బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్ళడం జరిగిందని అన్నారు. ఈ కేసులో అదనపు ఎస్పీ మహేందర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా ఈ నెల 28 న ఉదయం తూప్రాన్ బస్ స్టాప్ లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి పట్టుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకొని అతని వద్ద చోరీ చేసిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. నిందితుడు విరిగే వెంకట నారాయణ వృద్ధ దంపతుల మనవరాలి భర్త కావడంతో అతనికి వీరు ఒంటరి గా ఉంటారనే విషయం తెలుసుకుని చేసిన అప్పులను తీర్చేందుకు ఈ దోపిడి చేయడం జరిగిందని అన్నారు. ఈ కేసు చేదన వేగంగా చేసిన తూప్రాన్ డీఎస్పీ, రామాయంపేట సీఐ, ఎస్ఐ, సీసీ ఎస్ కానిస్టేబుల్స్ లను ఆయన అభినందించారు.
    1
    మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25 న చిన్న శంకరం పేట మండలం జంగారాయి కి చెందిన తుమ్మల అంజయ్య (85), సావిత్రమ్మ (80) దంపతుల ఇంట్లో మధ్యాహ్నం సమయంలో ముసుగు వేసుకుని వాటిలో బైక్ బంపర్ రాడ్ తో దాడి చేసి 4.5 తులాల బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్ళడం జరిగిందని అన్నారు. ఈ కేసులో అదనపు ఎస్పీ మహేందర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా ఈ నెల 28 న ఉదయం తూప్రాన్ బస్ స్టాప్ లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి పట్టుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకొని అతని వద్ద చోరీ చేసిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. నిందితుడు విరిగే వెంకట నారాయణ వృద్ధ దంపతుల మనవరాలి భర్త కావడంతో అతనికి వీరు ఒంటరి గా ఉంటారనే విషయం తెలుసుకుని చేసిన అప్పులను తీర్చేందుకు ఈ దోపిడి చేయడం జరిగిందని అన్నారు. ఈ కేసు చేదన వేగంగా చేసిన తూప్రాన్ డీఎస్పీ, రామాయంపేట సీఐ, ఎస్ఐ, సీసీ ఎస్ కానిస్టేబుల్స్ లను ఆయన అభినందించారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    21 min ago
  • నేడు నర్సాపూర్ చిల్డ్రన్ పార్కులో ఎమ్మార్పీఎస్ కరపత్రలు విడుదల మార్చ్.30.2026 నాడు చలో ఇందిరాపార్క్ నిరాహార దీక్షను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు జమునగాళ్ల కుమార్ అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న నాయకత్వంలో నిర్వహించే నిరాహార దీక్షను విజయవంతం చేయాలని కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయహస్తం పథకం దళిత కుటుంబానికి 12 లక్షలు ఆర్థిక సాయం అందించాలి అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల సాగు భూమిని కేటాయించాలి జీవో 58, 59 ప్రకారం లావన్ పట్టాలకు పట్టాలు కల్పించాలని కార్పొరేట్ విద్యా సంస్థలలో 25% ఉచిత విద్యను కచ్చితంగా అమలు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ నిధులు కార్పొరేషన్ శాఖకు 15000 కోట్లు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి పారిశుద్ధ కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి 20వేల కనీస వేతనం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాము,ఈ కార్యక్రమంలో MSf కన్వీనర్ మశివానోళ్ల నాగరాజు, mrps నర్సాపూర్ మండలం ఉపాధ్యక్షులు ఎర్ర విద్య సాగర్, నరేష్ mrps నాయకులు పాల్గొన్నారు.జమునగల కుమార్ MRPS నర్సాపూర్ మండల అధ్యక్షులు....
    1
    నేడు నర్సాపూర్ చిల్డ్రన్ పార్కులో ఎమ్మార్పీఎస్ కరపత్రలు విడుదల  మార్చ్.30.2026 నాడు చలో ఇందిరాపార్క్ నిరాహార దీక్షను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు జమునగాళ్ల కుమార్ అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న నాయకత్వంలో నిర్వహించే నిరాహార దీక్షను విజయవంతం చేయాలని కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయహస్తం పథకం దళిత కుటుంబానికి 12 లక్షలు ఆర్థిక సాయం అందించాలి అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల సాగు భూమిని కేటాయించాలి జీవో 58, 59 ప్రకారం లావన్ పట్టాలకు పట్టాలు కల్పించాలని కార్పొరేట్ విద్యా సంస్థలలో 25% ఉచిత విద్యను కచ్చితంగా అమలు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ నిధులు కార్పొరేషన్ శాఖకు 15000 కోట్లు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి పారిశుద్ధ కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి  20వేల కనీస వేతనం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాము,ఈ కార్యక్రమంలో MSf కన్వీనర్ మశివానోళ్ల నాగరాజు, mrps నర్సాపూర్ మండలం ఉపాధ్యక్షులు ఎర్ర విద్య సాగర్, నరేష్ mrps నాయకులు పాల్గొన్నారు.జమునగల కుమార్
MRPS నర్సాపూర్ మండల అధ్యక్షులు....
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • సదాశివపేటలో శ్రీరామనవమి వేడుకలలో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
    1
    సదాశివపేటలో శ్రీరామనవమి వేడుకలలో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    23 hrs ago
  • వైభవంగా సీతారాముల కళ్యాణం హైదరాబాద్‌లోని RL నగరంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ వేడుకను భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో వీక్షించారు. ఉప్పల్, ఖైరతాబాద్ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.
    1
    వైభవంగా సీతారాముల కళ్యాణం
హైదరాబాద్‌లోని RL నగరంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ వేడుకను భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో వీక్షించారు. ఉప్పల్, ఖైరతాబాద్ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.
    user_Telangana news
    Telangana news
    మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    23 hrs ago
  • సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం, రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. గ్రామం మొత్తం ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రేణుక రాజా గౌడ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పాలకమండలి సభ్యులు, యువకులు మరియు గ్రామస్తుల సహకారంతో ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా, ఈ రోజు సాయంత్రం పోచమ్మ తల్లి గుడి వద్ద బోనాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
    4
    సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం, రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. గ్రామం మొత్తం ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రేణుక రాజా గౌడ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పాలకమండలి సభ్యులు, యువకులు మరియు గ్రామస్తుల సహకారంతో ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
అదేవిధంగా, ఈ రోజు సాయంత్రం పోచమ్మ తల్లి గుడి వద్ద బోనాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
  • ధర్మానికి ప్రతిరూపం, సత్యానికి నిలువుటద్దం ఆ శ్రీరామచంద్రుడని బీజేపీ రాష్ట్ర ఉపాద్యక్షురాలు, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి కొనియాడారు. సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాకలోని గోకుల్ నగర్ కమ్యూనిటీ హాల్ లోనిర్వహించిన సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజాలు నిర్వహించారు. శ్రీరాముడు నేటి యువతకు ఆదర్శమని ఆమె కొనియాడారు.లోక కళ్యాణం కోసం ఆ విష్ణుమూర్తి స్వయంగా శ్రీరాముడిగా భూలోకానికి వచ్చి ధర్మ రక్షణ కోసం దుష్టశిక్షణ చేశారని వెల్లడించారు.అందులో భాగంగా శ్రీరాముడు హిందువుల దేవుడుగా నిలిచాడని స్పష్టం చేశారు. శ్రీరామ నవమిని పురష్కరించుకొని బండ కార్తీక రెడ్డి ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొన్నది. బందువులు స్థానికులు తరలి రావడంతో కోలాహాలంగా మారింది. ముందుగా సీతారములకు,బండ దంపతులు స్వయంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి వారిని పల్లకి ఎక్కించి కళ్యాణ వేదితకకు తరలించారు. వేద బ్రాహ్మణుల వేదమంత్రాల మద్య సీతారాముల కళ్యాణ మహోత్సవంను కన్నుల పండగలా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండ కార్తీక రెడ్డి, బండ చంద్రారెడ్డి, కొట్టం భూపాల్ రెడ్డి, కొట్టం వినోద, బండ శివా రెడ్డి,బండ జయసుధా, గోకుల నగర్ కమిటీ సభ్యులు , స్థానికులు స్వామివారి భక్తులు తదితరులు పాల్గొన్నారు.
    1
    ధర్మానికి ప్రతిరూపం, సత్యానికి నిలువుటద్దం ఆ శ్రీరామచంద్రుడని బీజేపీ రాష్ట్ర ఉపాద్యక్షురాలు, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి కొనియాడారు. సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాకలోని  గోకుల్ నగర్ కమ్యూనిటీ హాల్ లోనిర్వహించిన సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజాలు నిర్వహించారు. శ్రీరాముడు నేటి యువతకు ఆదర్శమని ఆమె కొనియాడారు.లోక కళ్యాణం కోసం ఆ విష్ణుమూర్తి స్వయంగా శ్రీరాముడిగా భూలోకానికి వచ్చి ధర్మ రక్షణ కోసం దుష్టశిక్షణ చేశారని వెల్లడించారు.అందులో భాగంగా శ్రీరాముడు హిందువుల దేవుడుగా నిలిచాడని స్పష్టం చేశారు. శ్రీరామ నవమిని పురష్కరించుకొని బండ కార్తీక రెడ్డి ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొన్నది. బందువులు స్థానికులు తరలి రావడంతో కోలాహాలంగా మారింది. ముందుగా సీతారములకు,బండ దంపతులు స్వయంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం  స్వామి వారిని  పల్లకి ఎక్కించి కళ్యాణ వేదితకకు తరలించారు. వేద బ్రాహ్మణుల వేదమంత్రాల మద్య సీతారాముల కళ్యాణ మహోత్సవంను కన్నుల పండగలా  నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండ కార్తీక రెడ్డి, బండ చంద్రారెడ్డి, కొట్టం భూపాల్ రెడ్డి, కొట్టం వినోద, బండ శివా రెడ్డి,బండ జయసుధా, గోకుల నగర్ కమిటీ సభ్యులు , స్థానికులు స్వామివారి భక్తులు తదితరులు పాల్గొన్నారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    21 hrs ago
  • ధర్మరెడ్డిపల్లిలో కన్నుల పండువగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం గజ్వేల్ గజ్వేల్ నియోజకవర్గం 27 శుక్రవారం మార్చి 2026 సిద్దిపేట జిల్లా : గజ్వేల్ మండలం ధర్మరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగాయి. లోక కళ్యాణం కోసం శ్రీరామచంద్రుడు, సీతాదేవిల వివాహ వేడుకను గ్రామస్తులందరూ కలిసి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో విశేష పూజలు నిర్వహించిన అర్చకులు, శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణం జరుగుతుండగా భక్తులు జయజయధ్వానాలతో పులకించిపోయారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మరియు గ్రామ సర్పంచ్ కాసమొల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం గ్రామ ప్రజల అదృష్టమని, గ్రామం సుభిక్షంగా ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఈ వేడుకను నిర్వహించినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ధర్మరెడ్డిపల్లి గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణలో భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.
    4
    ధర్మరెడ్డిపల్లిలో కన్నుల పండువగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం
గజ్వేల్
గజ్వేల్ నియోజకవర్గం 27 శుక్రవారం మార్చి 2026 
సిద్దిపేట జిల్లా :  గజ్వేల్ మండలం ధర్మరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగాయి. లోక కళ్యాణం కోసం శ్రీరామచంద్రుడు, సీతాదేవిల వివాహ వేడుకను గ్రామస్తులందరూ కలిసి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో విశేష పూజలు నిర్వహించిన అర్చకులు, శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణం జరుగుతుండగా భక్తులు జయజయధ్వానాలతో పులకించిపోయారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మరియు గ్రామ సర్పంచ్ కాసమొల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం గ్రామ ప్రజల అదృష్టమని, గ్రామం సుభిక్షంగా ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఈ వేడుకను నిర్వహించినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ధర్మరెడ్డిపల్లి గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణలో భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.