logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ధర్మరెడ్డిపల్లిలో కన్నుల పండువగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం గజ్వేల్ గజ్వేల్ నియోజకవర్గం 27 శుక్రవారం మార్చి 2026 సిద్దిపేట జిల్లా : గజ్వేల్ మండలం ధర్మరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగాయి. లోక కళ్యాణం కోసం శ్రీరామచంద్రుడు, సీతాదేవిల వివాహ వేడుకను గ్రామస్తులందరూ కలిసి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో విశేష పూజలు నిర్వహించిన అర్చకులు, శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణం జరుగుతుండగా భక్తులు జయజయధ్వానాలతో పులకించిపోయారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మరియు గ్రామ సర్పంచ్ కాసమొల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం గ్రామ ప్రజల అదృష్టమని, గ్రామం సుభిక్షంగా ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఈ వేడుకను నిర్వహించినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ధర్మరెడ్డిపల్లి గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణలో భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.

3 hrs ago
user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
PITLA KANAKA RAJU PRAJA PILUPU
Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
3 hrs ago

ధర్మరెడ్డిపల్లిలో కన్నుల పండువగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం గజ్వేల్ గజ్వేల్ నియోజకవర్గం 27 శుక్రవారం మార్చి 2026 సిద్దిపేట జిల్లా : గజ్వేల్ మండలం ధర్మరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగాయి. లోక కళ్యాణం కోసం

శ్రీరామచంద్రుడు, సీతాదేవిల వివాహ వేడుకను గ్రామస్తులందరూ కలిసి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో విశేష పూజలు నిర్వహించిన అర్చకులు, శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణం జరుగుతుండగా భక్తులు జయజయధ్వానాలతో పులకించిపోయారు. ఈ సందర్భంగా

ఆలయ అర్చకులు మరియు గ్రామ సర్పంచ్ కాసమొల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం గ్రామ ప్రజల అదృష్టమని, గ్రామం సుభిక్షంగా ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఈ వేడుకను నిర్వహించినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ కళ్యాణ

మహోత్సవానికి ధర్మరెడ్డిపల్లి గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణలో భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.

More news from తెలంగాణ and nearby areas
  • బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో వైభవంగా సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ కొంటెబోయిన నాగలక్ష్మి నరసింహులు ముదిరాజ్ హనుమాన్ దేవాలయ కమిటీ గ్రామ పెద్దల సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణం వేదమంత్రోత్సవాలతో వేద పండితులచే ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రజలందరూ ఆ సీతారామచంద్రుని దర్శనం చేసుకుని స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.
    1
    బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో వైభవంగా సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం 
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ కొంటెబోయిన నాగలక్ష్మి నరసింహులు ముదిరాజ్ హనుమాన్ దేవాలయ కమిటీ గ్రామ పెద్దల సహకారంతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణం వేదమంత్రోత్సవాలతో వేద పండితులచే ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రజలందరూ ఆ సీతారామచంద్రుని దర్శనం చేసుకుని స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.
    user_B Narsimhulu
    B Narsimhulu
    Financial Analyst గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
  • సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం, రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. గ్రామం మొత్తం ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రేణుక రాజా గౌడ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పాలకమండలి సభ్యులు, యువకులు మరియు గ్రామస్తుల సహకారంతో ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా, ఈ రోజు సాయంత్రం పోచమ్మ తల్లి గుడి వద్ద బోనాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
    4
    సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం, రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. గ్రామం మొత్తం ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రేణుక రాజా గౌడ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పాలకమండలి సభ్యులు, యువకులు మరియు గ్రామస్తుల సహకారంతో ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
అదేవిధంగా, ఈ రోజు సాయంత్రం పోచమ్మ తల్లి గుడి వద్ద బోనాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    3 hrs ago
  • ఎన్ హెచ్ 164 ఘట్కేసర్ టు కె పాల్ వెళ్లే రహదారిలో పంటలకు కారు దహనం అయినది.....కార్
    1
    ఎన్ హెచ్ 164 ఘట్కేసర్ టు కె పాల్ వెళ్లే రహదారిలో పంటలకు కారు దహనం అయినది.....కార్
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    6 hrs ago
  • ధర్మానికి ప్రతిరూపం, సత్యానికి నిలువుటద్దం ఆ శ్రీరామచంద్రుడని బీజేపీ రాష్ట్ర ఉపాద్యక్షురాలు, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి కొనియాడారు. సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాకలోని గోకుల్ నగర్ కమ్యూనిటీ హాల్ లోనిర్వహించిన సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజాలు నిర్వహించారు. శ్రీరాముడు నేటి యువతకు ఆదర్శమని ఆమె కొనియాడారు.లోక కళ్యాణం కోసం ఆ విష్ణుమూర్తి స్వయంగా శ్రీరాముడిగా భూలోకానికి వచ్చి ధర్మ రక్షణ కోసం దుష్టశిక్షణ చేశారని వెల్లడించారు.అందులో భాగంగా శ్రీరాముడు హిందువుల దేవుడుగా నిలిచాడని స్పష్టం చేశారు. శ్రీరామ నవమిని పురష్కరించుకొని బండ కార్తీక రెడ్డి ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొన్నది. బందువులు స్థానికులు తరలి రావడంతో కోలాహాలంగా మారింది. ముందుగా సీతారములకు,బండ దంపతులు స్వయంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి వారిని పల్లకి ఎక్కించి కళ్యాణ వేదితకకు తరలించారు. వేద బ్రాహ్మణుల వేదమంత్రాల మద్య సీతారాముల కళ్యాణ మహోత్సవంను కన్నుల పండగలా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండ కార్తీక రెడ్డి, బండ చంద్రారెడ్డి, కొట్టం భూపాల్ రెడ్డి, కొట్టం వినోద, బండ శివా రెడ్డి,బండ జయసుధా, గోకుల నగర్ కమిటీ సభ్యులు , స్థానికులు స్వామివారి భక్తులు తదితరులు పాల్గొన్నారు.
    1
    ధర్మానికి ప్రతిరూపం, సత్యానికి నిలువుటద్దం ఆ శ్రీరామచంద్రుడని బీజేపీ రాష్ట్ర ఉపాద్యక్షురాలు, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి కొనియాడారు. సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాకలోని  గోకుల్ నగర్ కమ్యూనిటీ హాల్ లోనిర్వహించిన సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజాలు నిర్వహించారు. శ్రీరాముడు నేటి యువతకు ఆదర్శమని ఆమె కొనియాడారు.లోక కళ్యాణం కోసం ఆ విష్ణుమూర్తి స్వయంగా శ్రీరాముడిగా భూలోకానికి వచ్చి ధర్మ రక్షణ కోసం దుష్టశిక్షణ చేశారని వెల్లడించారు.అందులో భాగంగా శ్రీరాముడు హిందువుల దేవుడుగా నిలిచాడని స్పష్టం చేశారు. శ్రీరామ నవమిని పురష్కరించుకొని బండ కార్తీక రెడ్డి ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొన్నది. బందువులు స్థానికులు తరలి రావడంతో కోలాహాలంగా మారింది. ముందుగా సీతారములకు,బండ దంపతులు స్వయంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం  స్వామి వారిని  పల్లకి ఎక్కించి కళ్యాణ వేదితకకు తరలించారు. వేద బ్రాహ్మణుల వేదమంత్రాల మద్య సీతారాముల కళ్యాణ మహోత్సవంను కన్నుల పండగలా  నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండ కార్తీక రెడ్డి, బండ చంద్రారెడ్డి, కొట్టం భూపాల్ రెడ్డి, కొట్టం వినోద, బండ శివా రెడ్డి,బండ జయసుధా, గోకుల నగర్ కమిటీ సభ్యులు , స్థానికులు స్వామివారి భక్తులు తదితరులు పాల్గొన్నారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • శివుడి అవతారమంటూ నమ్మబలికి ఘోరం! ... పార్వతివి అంటూ పిలిచి పాశవిక చర్య! ... దేవుడి ముసుగులో కామాంధుడి లీలలు! ... మహారాష్ట్రలో కలకలం రేపిన కీచక పర్వం! ​ భక్తి ముసుగులో బరితెగించాడు. ... తాను సాక్షాత్తు ఆ పరమశివుడి అవతారమంటూ నమ్మబలికాడు. ... మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకుని, అఘాయిత్యాలకు ఒడిగట్టాడు ఓ కేటుగాడు. ... నిత్యం పూజలు, పునస్కారాలంటూ తిరిగే ఆ వ్యక్తి లోపల ఉన్న, కామాంధుడు బయటపడ్డాడు. ... మహారాష్ట్రలో వెలుగుచూసిన ఈ ఘటన, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మహారాష్ట్రలోని వసై ప్రాంతానికి చెందిన రిషికేశ్ వైద్య, తనను తాను దేవుడిగా ప్రచారం చేసుకున్నాడు. ... బాధితురాలికి మాయమాటలు చెప్పి, ఆమె సాక్షాత్తు పార్వతీ దేవి స్వరూపమని, తనకు అత్యంత సన్నిహితురాలని నమ్మించాడు. ... ఆ అమాయక మహిళను నమ్మించి, చివరకు ఆమెకు మత్తుమందు ఇచ్చి, పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ మృగశిర.అంతటితో ఈ కీచకుడి ఆగడాలు ఆగలేదు! ... బాధితురాలికి సంబంధించిన అభ్యంతరకర ఫోటోలు తీసి, ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బ్లాక్ మెయిల్ కు దిగాడు. ... భక్తి పేరుతో నమ్మించి, చివరకు నరకం చూపించాడు.బాధితురాలి ధైర్యంతో పోలీసులను ఆశ్రయించడంతో, ఈ నకిలీ దేవుడి బండారం బయటపడింది. ... మొదట వసైలోని మాణిక్ పూర్ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, ఆ తర్వాత కేసును పూణేలోని మంజరి పోలీసులకు బదిలీ చేశారు. ... ప్రస్తుతం పరారీలో ఉన్న రిషికేశ్ వైద్య కోసం, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ... ఇతడి చేతిలో ఇంకా ఎంతమంది మహిళలు మోసపోయి ఉంటారనే కోణంలో, దర్యాప్తు ముమ్మరం చేశారు.
    1
    శివుడి అవతారమంటూ నమ్మబలికి ఘోరం! ... పార్వతివి అంటూ పిలిచి పాశవిక చర్య! ... దేవుడి ముసుగులో కామాంధుడి లీలలు! ... మహారాష్ట్రలో కలకలం రేపిన కీచక పర్వం!
​
భక్తి ముసుగులో బరితెగించాడు. ... తాను సాక్షాత్తు ఆ పరమశివుడి అవతారమంటూ నమ్మబలికాడు. ... మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకుని, అఘాయిత్యాలకు ఒడిగట్టాడు ఓ కేటుగాడు. ... నిత్యం పూజలు, పునస్కారాలంటూ తిరిగే ఆ వ్యక్తి లోపల ఉన్న, కామాంధుడు బయటపడ్డాడు. ... మహారాష్ట్రలో వెలుగుచూసిన ఈ ఘటన, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
మహారాష్ట్రలోని వసై ప్రాంతానికి చెందిన రిషికేశ్ వైద్య, తనను తాను దేవుడిగా ప్రచారం చేసుకున్నాడు. ... బాధితురాలికి మాయమాటలు చెప్పి, ఆమె సాక్షాత్తు పార్వతీ దేవి స్వరూపమని, తనకు అత్యంత సన్నిహితురాలని నమ్మించాడు. ... ఆ అమాయక మహిళను నమ్మించి, చివరకు ఆమెకు మత్తుమందు ఇచ్చి, పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ మృగశిర.అంతటితో ఈ కీచకుడి ఆగడాలు ఆగలేదు! ... బాధితురాలికి సంబంధించిన అభ్యంతరకర ఫోటోలు తీసి, ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బ్లాక్ మెయిల్ కు దిగాడు. ... భక్తి పేరుతో నమ్మించి, చివరకు నరకం చూపించాడు.బాధితురాలి ధైర్యంతో పోలీసులను ఆశ్రయించడంతో, ఈ నకిలీ దేవుడి బండారం బయటపడింది. ... మొదట వసైలోని మాణిక్ పూర్ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, ఆ తర్వాత కేసును పూణేలోని మంజరి పోలీసులకు బదిలీ చేశారు. ... ప్రస్తుతం పరారీలో ఉన్న రిషికేశ్ వైద్య కోసం, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ... ఇతడి చేతిలో ఇంకా ఎంతమంది మహిళలు మోసపోయి ఉంటారనే కోణంలో, దర్యాప్తు ముమ్మరం చేశారు.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • సంచలనం సృష్టించిన వృద్ధులపై దాడి కేసు ఛేదన4½ తులాల బంగారం రికవరీ, వాహనం స్వాధీనంముసుగు ధరించి దాడి… 48 గంటల్లోనే నిందితుడు అరెస్ట్ ప్రత్యేక బృందాలతో వేగవంతంగా కేసు ఛేదించిన పోలీసులుమెదక్ జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస్ రావు, శంకరంపేట-ఆర్ మండలంలోని జంగరాయి గ్రామంలో వృద్ధ దంపతులపై పట్టపగలు దాడి చేసి దోపిడీకి పాల్పడిన సంచలన కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి సుమారు 4½ తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం… జంగరాయి గ్రామానికి చెందిన తమ్మల నర్సింలు (48) ఫిర్యాదు మేరకు ఈ నెల 25న మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ముఖానికి ముసుగు ధరించి వారి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులు తమ్మల అంజయ్య (85), సావిత్రమ్మ (80)పై ఇనుప రాడ్డుతో దాడి చేసి, వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితుడిని గుర్తించారు. శనివారం (28న) ఉదయం 9 గంటలకు తూప్రాన్ బస్ స్టాప్ వద్ద వరిగే వెంకట నారాయణ (40)ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడు నాగిరెడ్డిపేట మండలం, కామారెడ్డి జిల్లా వాసి కాగా, ప్రస్తుతం తూప్రాన్‌లో నివాసంఉంటున్నాడు. నిందితుడి వద్ద నుంచి 2½ తులాల బంగారు పుస్తెల తాడు, 1½ తులాల గొలుసు, అర్ధ తులం బంగారు ఉంగరం, అలాగే నేరానికి వినియోగించిన TVS XL వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సుమారు 4½ తులాల బంగారం రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.దర్యాప్తులో నిందితుడు అప్పులు తీర్చుకోవడం కోసం సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ దోపిడీకి పాల్పడినట్లు వెల్లడైంది. బాధితులు తనకు పరిచయం ఉన్న బంధువులేనని తెలిసినా, ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గమనించి పథకం ప్రకారం నేరానికి పాల్పడినట్లు పేర్కొన్నారు.జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో అదనపు ఎస్పీ మహేందర్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సూచనలతో రామాయంపేట సీఐ వెంకట్ రాజా గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు కృషి చేసి కేసును ఛేదించాయి. కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించి ప్రశంస పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో ప్రజలు అపరిచితులపై నమ్మకం ఉంచకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.
    1
    సంచలనం సృష్టించిన వృద్ధులపై దాడి కేసు ఛేదన4½ తులాల బంగారం రికవరీ, వాహనం స్వాధీనంముసుగు ధరించి దాడి… 48 గంటల్లోనే నిందితుడు అరెస్ట్
ప్రత్యేక బృందాలతో వేగవంతంగా కేసు ఛేదించిన పోలీసులుమెదక్ జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస్ రావు, శంకరంపేట-ఆర్ మండలంలోని జంగరాయి గ్రామంలో వృద్ధ దంపతులపై పట్టపగలు దాడి చేసి దోపిడీకి పాల్పడిన సంచలన కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి సుమారు 4½ తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం… జంగరాయి గ్రామానికి చెందిన తమ్మల నర్సింలు (48) ఫిర్యాదు మేరకు ఈ నెల 25న మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ముఖానికి ముసుగు ధరించి వారి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులు తమ్మల అంజయ్య (85), సావిత్రమ్మ (80)పై ఇనుప రాడ్డుతో దాడి చేసి, వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితుడిని గుర్తించారు. శనివారం (28న) ఉదయం 9 గంటలకు తూప్రాన్ బస్ స్టాప్ వద్ద వరిగే వెంకట నారాయణ (40)ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడు నాగిరెడ్డిపేట మండలం, కామారెడ్డి జిల్లా వాసి కాగా, ప్రస్తుతం తూప్రాన్‌లో నివాసంఉంటున్నాడు.
నిందితుడి వద్ద నుంచి 2½ తులాల బంగారు పుస్తెల తాడు, 1½ తులాల గొలుసు, అర్ధ తులం బంగారు ఉంగరం, అలాగే నేరానికి వినియోగించిన TVS XL వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సుమారు 4½ తులాల బంగారం రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.దర్యాప్తులో నిందితుడు అప్పులు తీర్చుకోవడం కోసం సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ దోపిడీకి పాల్పడినట్లు వెల్లడైంది. బాధితులు తనకు పరిచయం ఉన్న బంధువులేనని తెలిసినా, ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గమనించి పథకం ప్రకారం నేరానికి పాల్పడినట్లు పేర్కొన్నారు.జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో అదనపు ఎస్పీ మహేందర్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సూచనలతో రామాయంపేట సీఐ వెంకట్ రాజా గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు కృషి చేసి కేసును ఛేదించాయి. కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించి ప్రశంస పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు.
ఇలాంటి ఘటనల నేపథ్యంలో ప్రజలు అపరిచితులపై నమ్మకం ఉంచకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    1 hr ago
  • మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25 న చిన్న శంకరం పేట మండలం జంగారాయి కి చెందిన తుమ్మల అంజయ్య (85), సావిత్రమ్మ (80) దంపతుల ఇంట్లో మధ్యాహ్నం సమయంలో ముసుగు వేసుకుని వాటిలో బైక్ బంపర్ రాడ్ తో దాడి చేసి 4.5 తులాల బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్ళడం జరిగిందని అన్నారు. ఈ కేసులో అదనపు ఎస్పీ మహేందర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా ఈ నెల 28 న ఉదయం తూప్రాన్ బస్ స్టాప్ లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి పట్టుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకొని అతని వద్ద చోరీ చేసిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. నిందితుడు విరిగే వెంకట నారాయణ వృద్ధ దంపతుల మనవరాలి భర్త కావడంతో అతనికి వీరు ఒంటరి గా ఉంటారనే విషయం తెలుసుకుని చేసిన అప్పులను తీర్చేందుకు ఈ దోపిడి చేయడం జరిగిందని అన్నారు. ఈ కేసు చేదన వేగంగా చేసిన తూప్రాన్ డీఎస్పీ, రామాయంపేట సీఐ, ఎస్ఐ, సీసీ ఎస్ కానిస్టేబుల్స్ లను ఆయన అభినందించారు.
    1
    మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25 న చిన్న శంకరం పేట మండలం జంగారాయి కి చెందిన తుమ్మల అంజయ్య (85), సావిత్రమ్మ (80) దంపతుల ఇంట్లో మధ్యాహ్నం సమయంలో ముసుగు వేసుకుని వాటిలో బైక్ బంపర్ రాడ్ తో దాడి చేసి 4.5 తులాల బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్ళడం జరిగిందని అన్నారు. ఈ కేసులో అదనపు ఎస్పీ మహేందర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా ఈ నెల 28 న ఉదయం తూప్రాన్ బస్ స్టాప్ లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి పట్టుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకొని అతని వద్ద చోరీ చేసిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. నిందితుడు విరిగే వెంకట నారాయణ వృద్ధ దంపతుల మనవరాలి భర్త కావడంతో అతనికి వీరు ఒంటరి గా ఉంటారనే విషయం తెలుసుకుని చేసిన అప్పులను తీర్చేందుకు ఈ దోపిడి చేయడం జరిగిందని అన్నారు. ఈ కేసు చేదన వేగంగా చేసిన తూప్రాన్ డీఎస్పీ, రామాయంపేట సీఐ, ఎస్ఐ, సీసీ ఎస్ కానిస్టేబుల్స్ లను ఆయన అభినందించారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    2 hrs ago
  • ధర్మరెడ్డిపల్లిలో కన్నుల పండువగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం గజ్వేల్ గజ్వేల్ నియోజకవర్గం 27 శుక్రవారం మార్చి 2026 సిద్దిపేట జిల్లా : గజ్వేల్ మండలం ధర్మరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగాయి. లోక కళ్యాణం కోసం శ్రీరామచంద్రుడు, సీతాదేవిల వివాహ వేడుకను గ్రామస్తులందరూ కలిసి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో విశేష పూజలు నిర్వహించిన అర్చకులు, శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణం జరుగుతుండగా భక్తులు జయజయధ్వానాలతో పులకించిపోయారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మరియు గ్రామ సర్పంచ్ కాసమొల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం గ్రామ ప్రజల అదృష్టమని, గ్రామం సుభిక్షంగా ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఈ వేడుకను నిర్వహించినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ధర్మరెడ్డిపల్లి గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణలో భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.
    4
    ధర్మరెడ్డిపల్లిలో కన్నుల పండువగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం
గజ్వేల్
గజ్వేల్ నియోజకవర్గం 27 శుక్రవారం మార్చి 2026 
సిద్దిపేట జిల్లా :  గజ్వేల్ మండలం ధర్మరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగాయి. లోక కళ్యాణం కోసం శ్రీరామచంద్రుడు, సీతాదేవిల వివాహ వేడుకను గ్రామస్తులందరూ కలిసి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో విశేష పూజలు నిర్వహించిన అర్చకులు, శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణం జరుగుతుండగా భక్తులు జయజయధ్వానాలతో పులకించిపోయారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మరియు గ్రామ సర్పంచ్ కాసమొల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం గ్రామ ప్రజల అదృష్టమని, గ్రామం సుభిక్షంగా ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఈ వేడుకను నిర్వహించినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ధర్మరెడ్డిపల్లి గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణలో భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.