సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం, రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. గ్రామం మొత్తం ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం, రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. గ్రామం మొత్తం ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రేణుక రాజా గౌడ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పాలకమండలి సభ్యులు, యువకులు మరియు గ్రామస్తుల సహకారంతో ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా, ఈ రోజు సాయంత్రం పోచమ్మ తల్లి గుడి వద్ద బోనాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం, రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. గ్రామం మొత్తం ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం, రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. గ్రామం మొత్తం ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రేణుక రాజా గౌడ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పాలకమండలి సభ్యులు, యువకులు మరియు గ్రామస్తుల సహకారంతో ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా, ఈ రోజు సాయంత్రం పోచమ్మ తల్లి గుడి వద్ద బోనాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
- సంచలనం సృష్టించిన వృద్ధులపై దాడి కేసు ఛేదన4½ తులాల బంగారం రికవరీ, వాహనం స్వాధీనంముసుగు ధరించి దాడి… 48 గంటల్లోనే నిందితుడు అరెస్ట్ ప్రత్యేక బృందాలతో వేగవంతంగా కేసు ఛేదించిన పోలీసులుమెదక్ జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస్ రావు, శంకరంపేట-ఆర్ మండలంలోని జంగరాయి గ్రామంలో వృద్ధ దంపతులపై పట్టపగలు దాడి చేసి దోపిడీకి పాల్పడిన సంచలన కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి సుమారు 4½ తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం… జంగరాయి గ్రామానికి చెందిన తమ్మల నర్సింలు (48) ఫిర్యాదు మేరకు ఈ నెల 25న మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ముఖానికి ముసుగు ధరించి వారి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులు తమ్మల అంజయ్య (85), సావిత్రమ్మ (80)పై ఇనుప రాడ్డుతో దాడి చేసి, వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితుడిని గుర్తించారు. శనివారం (28న) ఉదయం 9 గంటలకు తూప్రాన్ బస్ స్టాప్ వద్ద వరిగే వెంకట నారాయణ (40)ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడు నాగిరెడ్డిపేట మండలం, కామారెడ్డి జిల్లా వాసి కాగా, ప్రస్తుతం తూప్రాన్‌లో నివాసంఉంటున్నాడు. నిందితుడి వద్ద నుంచి 2½ తులాల బంగారు పుస్తెల తాడు, 1½ తులాల గొలుసు, అర్ధ తులం బంగారు ఉంగరం, అలాగే నేరానికి వినియోగించిన TVS XL వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సుమారు 4½ తులాల బంగారం రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.దర్యాప్తులో నిందితుడు అప్పులు తీర్చుకోవడం కోసం సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ దోపిడీకి పాల్పడినట్లు వెల్లడైంది. బాధితులు తనకు పరిచయం ఉన్న బంధువులేనని తెలిసినా, ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గమనించి పథకం ప్రకారం నేరానికి పాల్పడినట్లు పేర్కొన్నారు.జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో అదనపు ఎస్పీ మహేందర్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సూచనలతో రామాయంపేట సీఐ వెంకట్ రాజా గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు కృషి చేసి కేసును ఛేదించాయి. కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించి ప్రశంస పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో ప్రజలు అపరిచితులపై నమ్మకం ఉంచకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.1
- చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం: ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన కారు.. వరంగల్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు దుర్మరణం! చిత్తూరు/వరంగల్: ఏపీలోని చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద తిరుపతి - బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అసలేం జరిగిందంటే.. వరంగల్ ప్రాంతానికి చెందిన శ్రీధర్ రావు, ఆయన భార్య లక్ష్మి, మరియు వీరి నాలుగేళ్ల కుమార్తె ఆద్విక వీరు తిరుమల శ్రీవారి దర్శనం కోసం బెంగళూరు నుండి కారులో బయలుదేరారు. పలమనేరు నుండి చిత్తూరు వైపు వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు శేషాపురం సర్వీస్ రోడ్డు వద్ద ఆగి ఉండగా.. వెనుక నుండి అతివేగంగా వచ్చిన వీరి కారు బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే, కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న శ్రీధర్ రావు, లక్ష్మి, ఆద్వికలు తీవ్ర గాయాలపాలై స్పాట్‌లోనే మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.వరంగల్‌కు చెందిన ఒకే కుటుంబం ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి JTV నైన్ News.1
- Post by Ali ammu1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 27 ప్రజా తెలంగాణ న్యూస్/ . జగదేవపూర్ మండల్ తీగుల్ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా రామాలయం వద్ద పురోహితులు వేణుగోపాల శర్మ ఫణీంద్ర శర్మ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణానికి వీక్షించేందుకు గ్రామ ప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్నారు ఉదయం ఎదుర్కొల్లు గ్రామ శివాలయం నుండి ఊరేగింపుగా స్వామిని కోలాటాల ఆటలతో భజనలతో రామాలయం కు చేరుకొని అభిషేకాలు. అష్టోత్తర నామాలు తర్వత స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది తీర్థప్రసాదములు, అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకు ప్రజలకు ఆలయ నిర్వాహకులు భజన భక్తులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో త్రిగుల రామమూర్తి శర్మ గోపీనాథ్ శర్మ, మురళీ శర్మ, నాగసితరం శర్మ,వేదవ్యాస్ శర్మ,కొండపోచమ్మ దేవాలయ చైర్మెన్ కప్పర అనుగీత హరిప్రసాద్ రావు మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రకాశ్ రావు గోటూరు మోహన రెడ్డి టేకులపల్లి నరసింహ రెడ్డి , పెద్ది శ్రీనివాస్, కొన్యాల తిరుపతి రెడ్డి, బాల్ రెడ్డి , నేతి అనంతం నేతి శంకర్, గోతురి అంజి రెడ్డి, సంపత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కయ్యం కర్నాకరూ రెడ్డి, గోటూరు కమలాకర్ రెడ్డి, ఉద్దేమరు బాలరాజు అవుసుల మహేష్, గిరిధర్ రావు, సుర గౌరయ్య, గ్రామ పెద్దలు గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు4
- కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలోకి వస్తానంటే స్వాగతిస్తామని ఎమ్మెల్సీ ఎల్. రమణ తెలిపారు. జగిత్యాల లో విలేకరుల సమావేశంలో రమణ మాట్లాడుతు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని తెలిపారు. గౌరవం ఉన్న చోటే నాయకులు ఉంటారని చెప్పారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న జీవన్ రెడ్డి లాంటి వారు బీఆర్ఎస్ పార్టీ లోకి వస్తే తగిన గౌరవం కల్పిస్తామన్నారు. హైకమాండే సుప్రీం అని, క్రమశిక్షణతో పనిచేస్తానని తెలిపారు. పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటామని, పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ గౌరవం దక్కుతుందని చెప్పారు. ప్రజల సేవ కోసం పార్టీ వేదికగా ఉంటుందన్నారు. కుటుంబ సంబంధాలు కాదు.. కేవలం కమిట్మెంట్ ఆధారంగానే గుర్తింపు ఉంటుందని తెలిపారు.1
- పత్రిక ప్రకటన. తేది:28.03.2026. కామారెడ్డి జిల్లా శనివారం. .. *యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్* .. మద్నూర్ మండలం పరిధిలోని శివారులో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించి, గ్రౌండింగ్ నిర్మాణ తీరు పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా కొనసాగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే, విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కలిగిన ఉత్తమ విద్యా వాతావరణాన్ని కల్పించేలా స్కూల్ నిర్మాణం చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ................ కలెక్టర్ వెంట ee సోషల్ వెల్ఫేర్ అధికారి అశోక్, డీఈఓ రాజు, mro, mpdo, సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు ఈ తనిఖీలో పాల్గొన్నారు.1
- "బెట్టింగ్ మహమ్మారికి దూరంగా ఉండండి", క్రీడా స్ఫూర్తితో ఆటను ఆస్వాదించండి.1
- నేడు నర్సాపూర్ చిల్డ్రన్ పార్కులో ఎమ్మార్పీఎస్ కరపత్రలు విడుదల మార్చ్.30.2026 నాడు చలో ఇందిరాపార్క్ నిరాహార దీక్షను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు జమునగాళ్ల కుమార్ అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న నాయకత్వంలో నిర్వహించే నిరాహార దీక్షను విజయవంతం చేయాలని కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయహస్తం పథకం దళిత కుటుంబానికి 12 లక్షలు ఆర్థిక సాయం అందించాలి అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల సాగు భూమిని కేటాయించాలి జీవో 58, 59 ప్రకారం లావన్ పట్టాలకు పట్టాలు కల్పించాలని కార్పొరేట్ విద్యా సంస్థలలో 25% ఉచిత విద్యను కచ్చితంగా అమలు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ నిధులు కార్పొరేషన్ శాఖకు 15000 కోట్లు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి పారిశుద్ధ కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి 20వేల కనీస వేతనం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాము,ఈ కార్యక్రమంలో MSf కన్వీనర్ మశివానోళ్ల నాగరాజు, mrps నర్సాపూర్ మండలం ఉపాధ్యక్షులు ఎర్ర విద్య సాగర్, నరేష్ mrps నాయకులు పాల్గొన్నారు.జమునగల కుమార్ MRPS నర్సాపూర్ మండల అధ్యక్షులు....1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 27 ప్రజా తెలంగాణ న్యూస్/ శ్రీగిరిపల్లి గ్రామంలో ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి నర్సయ్యకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో భక్తిశ్రద్ధలతో శ్రీరామ నవమి కార్యక్రమాలు కొనసాగాయి. అలాగే రహదారిపై ప్రయాణించే వారికి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షిమి రెడ్డి, కుమార్, రాజు, కాంగ్రెస్ నాయకులు గ్రామ పెద్దలు, సంఘ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.4