జంగారాయిలో వృద్ద దంపతులపై దాడి చేసి దొంగలించిన దొంగను అరెస్టు రిమాండ్ బంగారం రికవరీ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడి సంచలనం సృష్టించిన వృద్ధులపై దాడి కేసు ఛేదన4½ తులాల బంగారం రికవరీ, వాహనం స్వాధీనంముసుగు ధరించి దాడి… 48 గంటల్లోనే నిందితుడు అరెస్ట్ ప్రత్యేక బృందాలతో వేగవంతంగా కేసు ఛేదించిన పోలీసులుమెదక్ జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస్ రావు, శంకరంపేట-ఆర్ మండలంలోని జంగరాయి గ్రామంలో వృద్ధ దంపతులపై పట్టపగలు దాడి చేసి దోపిడీకి పాల్పడిన సంచలన కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి సుమారు 4½ తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం… జంగరాయి గ్రామానికి చెందిన తమ్మల నర్సింలు (48) ఫిర్యాదు మేరకు ఈ నెల 25న మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ముఖానికి ముసుగు ధరించి వారి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులు తమ్మల అంజయ్య (85), సావిత్రమ్మ (80)పై ఇనుప రాడ్డుతో దాడి చేసి, వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితుడిని గుర్తించారు. శనివారం (28న) ఉదయం 9 గంటలకు తూప్రాన్ బస్ స్టాప్ వద్ద వరిగే వెంకట నారాయణ (40)ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడు నాగిరెడ్డిపేట మండలం, కామారెడ్డి జిల్లా వాసి కాగా, ప్రస్తుతం తూప్రాన్‌లో నివాసంఉంటున్నాడు. నిందితుడి వద్ద నుంచి 2½ తులాల బంగారు పుస్తెల తాడు, 1½ తులాల గొలుసు, అర్ధ తులం బంగారు ఉంగరం, అలాగే నేరానికి వినియోగించిన TVS XL వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సుమారు 4½ తులాల బంగారం రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.దర్యాప్తులో నిందితుడు అప్పులు తీర్చుకోవడం కోసం సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ దోపిడీకి పాల్పడినట్లు వెల్లడైంది. బాధితులు తనకు పరిచయం ఉన్న బంధువులేనని తెలిసినా, ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గమనించి పథకం ప్రకారం నేరానికి పాల్పడినట్లు పేర్కొన్నారు.జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో అదనపు ఎస్పీ మహేందర్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సూచనలతో రామాయంపేట సీఐ వెంకట్ రాజా గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు కృషి చేసి కేసును ఛేదించాయి. కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించి ప్రశంస పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో ప్రజలు అపరిచితులపై నమ్మకం ఉంచకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.

- మెదక్ పట్టణంలోని కోదండ రామాలయం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రథాన్ని పూలతో అందంగా అలంకరించి అందులో ప్రతిష్టించి సీతారాముల ఉత్సవమూర్తులను అందులో ప్రతిష్టించి పురవీధుల గుండా రథయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బండ నరేందర్, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.1
- రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్ల పై పెండింగ్ పనులు పూర్తి చేయాలి --జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ రోడ్ల పై పెండింగ్ పనులు పూర్తి చేసి రోడ్డు ప్రమాదాలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో రోడ్ సేఫ్టీ, మత్తు పదార్థాల నిర్మూలనపై సమావేశ నిర్వహించారు . . ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్క వాహనదారుడు సకాలంలో క్షేమంగా ఇంటికి చేరాలన్నారు. రోడ్ల పై పెండింగ్ లో ఉన్న సి సి కెమెరాలు సిగ్నల్స్ విద్యుత్ దీపాలు సైన్ బోర్డులు, గుంతలు పూడ్చి పెండింగ్ పనులు లేకుండా చూడాలన్నారు. విద్యాసంస్థల్లో, కళాశాలలో రోడ్డు భద్రత నియమాల గూర్చి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ద్విచక్ర వాహనదారులకు జరుగుతున్నందున వాహన దారులు నియమాలు పాటించడం, హెల్మెట్ ధరించడం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం, రోడ్ల పై ఉన్న వివిధ సిగ్నల్, మార్కింగ్ గురించి తెలుసుకొని జాగ్రత్తగా ప్రయాణం చేయాలని సూచించారు. మత్తు పదార్థాలపై నిఘా పెంచాలన్నారు. మత్తుకు అలవాటు పడి యువకులు భవిష్యత్తు కోల్పోకుండా చూడాలన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలు నివారించవచ్చని, విద్యాలయాల్లో,మెడికల్ షాపుల్లో, పరిశ్రమలలో నిరతరం మత్తు పదార్థాలపై నిఘా పెట్టామన్నారు. మత్తు తో జీవితాలు చిత్తు అయిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్,జిల్లా వైద్య అధికారి శ్రీరామ్, డి ఎస్పీ లు, మున్సిపల్ కమిషనర్లు,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- పత్రిక ప్రకటన. తేది:28.03.2026. కామారెడ్డి జిల్లా శనివారం. .. *యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్* .. మద్నూర్ మండలం పరిధిలోని శివారులో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించి, గ్రౌండింగ్ నిర్మాణ తీరు పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా కొనసాగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే, విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కలిగిన ఉత్తమ విద్యా వాతావరణాన్ని కల్పించేలా స్కూల్ నిర్మాణం చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ................ కలెక్టర్ వెంట ee సోషల్ వెల్ఫేర్ అధికారి అశోక్, డీఈఓ రాజు, mro, mpdo, సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు ఈ తనిఖీలో పాల్గొన్నారు.1
- బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో వైభవంగా సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ కొంటెబోయిన నాగలక్ష్మి నరసింహులు ముదిరాజ్ హనుమాన్ దేవాలయ కమిటీ గ్రామ పెద్దల సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణం వేదమంత్రోత్సవాలతో వేద పండితులచే ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రజలందరూ ఆ సీతారామచంద్రుని దర్శనం చేసుకుని స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.1
- సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం, రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. గ్రామం మొత్తం ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రేణుక రాజా గౌడ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పాలకమండలి సభ్యులు, యువకులు మరియు గ్రామస్తుల సహకారంతో ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా, ఈ రోజు సాయంత్రం పోచమ్మ తల్లి గుడి వద్ద బోనాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.4
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన జిల్లా యంత్రాంగానికి ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం సాఫల్యానికి కృషి చేసిన ఆలయ ఉద్యోగులు, వేద పండితులు, అర్చకులు మరియు ఇతర సిబ్బందికి ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.1
- నిజామాబాద్ హమాల్వాడిలో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా శుక్రవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. శోభాయాత్రలో DJ వినియోగానికి అనుమతి లేదంటూ పోలీసులు వాహనాన్ని అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న అర్బన్ MLA ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అక్కడికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన MLA.. స్వయంగా DJ వాహనం స్టీరింగ్ పట్టి ముందుకు నడిపించడం చర్చనీయాంశమైంది.1
- సంచలనం సృష్టించిన వృద్ధులపై దాడి కేసు ఛేదన4½ తులాల బంగారం రికవరీ, వాహనం స్వాధీనంముసుగు ధరించి దాడి… 48 గంటల్లోనే నిందితుడు అరెస్ట్ ప్రత్యేక బృందాలతో వేగవంతంగా కేసు ఛేదించిన పోలీసులుమెదక్ జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస్ రావు, శంకరంపేట-ఆర్ మండలంలోని జంగరాయి గ్రామంలో వృద్ధ దంపతులపై పట్టపగలు దాడి చేసి దోపిడీకి పాల్పడిన సంచలన కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి సుమారు 4½ తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం… జంగరాయి గ్రామానికి చెందిన తమ్మల నర్సింలు (48) ఫిర్యాదు మేరకు ఈ నెల 25న మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ముఖానికి ముసుగు ధరించి వారి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులు తమ్మల అంజయ్య (85), సావిత్రమ్మ (80)పై ఇనుప రాడ్డుతో దాడి చేసి, వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితుడిని గుర్తించారు. శనివారం (28న) ఉదయం 9 గంటలకు తూప్రాన్ బస్ స్టాప్ వద్ద వరిగే వెంకట నారాయణ (40)ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడు నాగిరెడ్డిపేట మండలం, కామారెడ్డి జిల్లా వాసి కాగా, ప్రస్తుతం తూప్రాన్‌లో నివాసంఉంటున్నాడు. నిందితుడి వద్ద నుంచి 2½ తులాల బంగారు పుస్తెల తాడు, 1½ తులాల గొలుసు, అర్ధ తులం బంగారు ఉంగరం, అలాగే నేరానికి వినియోగించిన TVS XL వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సుమారు 4½ తులాల బంగారం రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.దర్యాప్తులో నిందితుడు అప్పులు తీర్చుకోవడం కోసం సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ దోపిడీకి పాల్పడినట్లు వెల్లడైంది. బాధితులు తనకు పరిచయం ఉన్న బంధువులేనని తెలిసినా, ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గమనించి పథకం ప్రకారం నేరానికి పాల్పడినట్లు పేర్కొన్నారు.జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో అదనపు ఎస్పీ మహేందర్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సూచనలతో రామాయంపేట సీఐ వెంకట్ రాజా గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు కృషి చేసి కేసును ఛేదించాయి. కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించి ప్రశంస పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో ప్రజలు అపరిచితులపై నమ్మకం ఉంచకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.1