రవీంద్రభారతిలో గద్దర్ వేషధారణలో ఆకట్టుకున్న ఎమ్మెల్యే నాగరాజు రవీంద్రభారతిలో గద్దర్ వేషధారణలో ఆకట్టుకున్న ఎమ్మెల్యే నాగరాజు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న “1st Edition of Telangana Legislators’ Sports and Cultural Meet-2026” కార్యక్రమంలో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు గద్దర్ వేషధారణలో పాల్గొని అందరిని ఆకట్టుకున్నారు..ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గద్దర్ వేషధారణలో ఆయన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన ప్రదర్శనతో అక్కడున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమల్లు, శాసనసభ స్పీకర్ గడ్డంప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, ప్రేక్షకులను ఉత్సాహపరిచారు...ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సాహిత్య వారసత్వాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
రవీంద్రభారతిలో గద్దర్ వేషధారణలో ఆకట్టుకున్న ఎమ్మెల్యే నాగరాజు రవీంద్రభారతిలో గద్దర్ వేషధారణలో ఆకట్టుకున్న ఎమ్మెల్యే నాగరాజు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న “1st Edition of Telangana Legislators’ Sports and Cultural Meet-2026” కార్యక్రమంలో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు గద్దర్ వేషధారణలో పాల్గొని అందరిని ఆకట్టుకున్నారు..ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గద్దర్ వేషధారణలో ఆయన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన ప్రదర్శనతో అక్కడున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమల్లు, శాసనసభ స్పీకర్ గడ్డంప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, ప్రేక్షకులను ఉత్సాహపరిచారు...ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సాహిత్య వారసత్వాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
- కాకునూరు గ్రామంలోని VO1, VO2 కేంద్రాల్లో ఉల్లాస్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షలకు VOA రమేష్, ప్రధానోపాధ్యాయులు రవికుమార్ హాజరై పర్యవేక్షించారు. కార్యక్రమంలో VOలు, OBలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. మహిళల అక్షరాస్యత పెంపు లక్ష్యంగా నిర్వహించిన ఈ పరీక్షలు వారికి చదువు మీద ఆసక్తి పెంచుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం సజావుగా కొనసాగింది.1
- సిద్దిపేట జిల్లా జిల్లా గజ్వేల్ పట్టణంలోని బస్ స్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్వీ జ్యూవెల్లరీ వన్ గ్రామ్ గోల్డ్ షోరూమ్‌ను ఖమ్మంపల్లి సర్పంచ్ కరుణాకరన్ రెడ్డి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆయన తొలి విక్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్వేత కరుణాకరన్ రెడ్డి, మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, సామాన్య ప్రజలు అసలు బంగారాన్ని కొనలేని పరిస్థితి నెలకొందని, ఇలాంటి తరుణంలో గజ్వేల్ ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన వన్ గ్రామ్ గోల్డ్ నగలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. మహిళలకు నచ్చే విధంగా, లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా అనేక రకాల డిజైన్లు ఈ షాపులో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా పెళ్లికూతురు అలంకరణకు అవసరమైన నగలు, మహిళలు, యువతీ యువకులు వివిధ శుభకార్యాలకు ధరించే ప్రత్యేక ఆభరణాలు ఇక్కడ లభిస్తాయన్నారు. గజ్వేల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నాణ్యతతో కూడిన వన్ గ్రామ్ గోల్డ్ నగలు ఇక్కడ సరసమైన ధరలకే లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షాపు యాజమాన్యం , నిర్వాహకులు, స్థానిక నాయకులు, మహిళలు, మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- సంగారెడ్డి న్యూస్: భవాని గుడి నుండి తాళ్లపల్లి రోడ్ దుర్గమ్మ గుడి ముందు చాలా పురాతనమైన బావి ఉన్నది రోడ్డు నుండి బావి చాలా ప్రమాదకరంగా వాహనాలు రాత్రి సమయంలో అదుపుతప్పితే బావిలోకి పడిపోవడం ఖాయం ఇటువంటి ప్రమాదకరమైన బావికి కనీసం ఫెన్సింగ్ గాని భారీగాడు గాని ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరం సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ గారు దీనిపైన వెంటనే స్పందించాలి మరియు మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా చర్య తీసుకోవాలని మనవి🙏1
- గజ్వేల్‌లో ‘ఎస్వీ జ్యూవెల్లరీ’ వన్ గ్రామ్ గోల్డ్ షాపు ప్రారంభం గజ్వేల్, 29 ఆదివారం మార్చి 2026 సిద్దిపేట జిల్లా : గజ్వేల్ పట్టణంలోని నూతన మోడల్ బస్ స్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఎస్వీ జ్యూవెల్లరీ’ వన్ గ్రామ్ గోల్డ్ షోరూమ్‌ను ఖమ్మంపల్లి సర్పంచ్ కరుణాకరన్ రెడ్డి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆయన తొలి విక్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కరుణాకరన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, సామాన్య ప్రజలు అసలు బంగారాన్ని కొనలేని పరిస్థితి నెలకొందని, ఇలాంటి తరుణంలో గజ్వేల్ ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన వన్ గ్రామ్ గోల్డ్ నగలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. మహిళలకు నచ్చే విధంగా, లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా అనేక రకాల డిజైన్లు ఈ షాపులో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా పెళ్లికూతురు అలంకరణకు అవసరమైన నగలు, మహిళలు, యువతీ యువకులు వివిధ శుభకార్యాలకు ధరించే ప్రత్యేక ఆభరణాలు ఇక్కడ లభిస్తాయన్నారు. గజ్వేల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నాణ్యతతో కూడిన వన్ గ్రామ్ గోల్డ్ నగలు ఇక్కడ సరసమైన ధరలకే లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షాపు యాజమాన్యం , నిర్వాహకులు, స్థానిక నాయకులు, మహిళలు, మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.4
- ఆదివారం రోజున కౌడిపల్లి సర్పంచ్ ఆధ్వర్యంలో. శ్రీ సీతారాములవారి పల్లకి సేవలను నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలు అందరూ కలిసి శ్రీ సీతారాములవారి పల్లకినీ గ్రామంలో ఆటపాటలతో, వివిధ రకాల వేషధారణలతో శ్రీరామ భజన చేస్తూ కనుల పండుగగ నిర్వహించినరూ. ఇలాంటి వేడుకలను నిర్వహించినందుకు గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ కు అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ గారు, ఉపసర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్ గారు, వాడు సభ్యులు మబ్బులు ,మురళి, దేవేందర్ ,రమేష్, మరియు గ్రామ పెద్దలు చంద్రం , మల్లేష్ ,దుర్గయ్య గౌడ్ ,టీ మల్లేష్, శ్రీనివాస్ గుప్తా, ఉడుత కృష్ణ తదితరులు పాల్గొన్నారు.4
- *నల్లగొండ పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామ నవమి వేడుకలలో భాగంగా ఈరోజు రాత్రి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు* *నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గార్లు దేవాలయంలో సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు* *రథోత్సవం దేవాలయం నుంచి రామగిరి మీదుగా పట్టణంలోని పలు పురవీధులకుండా కొనసాగింది* *ఈరోజు రథోత్సవాన్ని తిలకించడానికి పట్టణ ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు*1
- నల్గొండ జిల్లాలోని నకరికల్లు మండల పరిధిలోని పాలెం గ్రామానికి చెందిన మాజీ సైనికుడు బెల్లి జనార్ధన్ అకాల మరణాన్ని దిగమింగుతూ ఆ కుటుంబాన్ని పరామర్శించి, ఆత్మస్థైర్యం నింపి కుటుంబానికి వెన్నుదండూగా ఉంటామని నల్గొండ జిల్లా మాజీ సైనికులు తెలిపారు...3
- కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సీతాయిపల్లిలో వృద్ధురాలు రుక్మవ్వ(73)ను హత్యకు గురైంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. ఆదివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న సమయంలో ఆమె రెండో కోడలు కోటవ్వ తలపై బండతో కొట్టింది. దీంతో రుక్మవ్వ అక్కడికక్కడే చనిపోయింది. ఆమె మెడలోని బంగారం, చెవి కమ్మలను కోడలు ఎత్తుకెళ్లింది. మృతురాలు కుమార్తె కిష్టవ్వ ఫిర్యాదు మేరకు ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.1
- కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరును నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరును నిరసిస్తూ హుజురాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల వీధి రౌడీ లా కౌశిక్ రెడ్డి వ్యవహరించారని ఆరోపిస్తు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఫోటోతో ఉన్న ప్లెక్సీ ని చెప్పుతో కొడుతు నిరసన తెలిపారు. హుజురాబాద్ జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఎమ్మెల్యే అనే సోయి మరిచిపోయి విచక్షణరహితంగా ప్రవర్తిస్తున్న కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి కి వ్యతిరేకం గా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే పై తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని లేనిచో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కడియం శ్రీహరి పట్ల అనుచితంగా ప్రవర్తించిన కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. లేనిచో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.1