Shuru
Apke Nagar Ki App…
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గన్ను సంతోష్ రెడ్డి అనారోగ్యంతో కరీంనగర్ అపోలో ఆసుపత్రిలో చేరగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు, యాజమాన్యానికి సూచించారు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గన్ను సంతోష్ రెడ్డి అనారోగ్యంతో కరీంనగర్ అపోలో ఆసుపత్రిలో చేరగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు, యాజమాన్యానికి సూచించారు
More news from తెలంగాణ and nearby areas
- కరీంనగర్ జిల్లా హైదరాబాద్ ప్రధాన రహదారి అలుగునూరు బ్రిడ్జిపై మారుతి 800 కారులో మంటలు తగలబడుతున్న కారు భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కు కలిగింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది1
- Post by Ravi Poreddy1
- సొంత గ్రామాలకు వెళ్తున్న ప్రజలు జన్నారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు సొంత ఊర్లకు బయలుదేరి వెళుతున్నారు. సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో శనివారం ఉదయం జన్నారం బస్టాండు ప్రయాణికులతో రద్దీగా మారింది. దాదాపు పది రోజులపాటు సెలవులు రావడంతో వారు తమ సొంత గ్రామాలకు బయలుదేరారు. అయితే సరిపడా బస్సులు లేకపోవడంతో వారు ఇబ్బందులు జరుపుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాలకు అదనపు బస్సులు నడపాలని ప్రజలు కోరారు.1
- మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన పుల్లకండం మేఘన రాణి, కడియాల భావన చిన్ననాటి నుంచి సన్నిహిత స్నేహితులు. పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు కలిసే చదువుకున్న వీరు, ఎంఎస్ చదువుల కోసం మూడు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లారు. ఇటీవల చదువులు పూర్తిచేసుకున్న అనంతరం కాలిఫోర్నియాలో విహారయాత్రకు వెళ్లిన సమయంలో కారు అదుపుతప్పి లోయలో పడటంతో ఇద్దరూ మృతి చెందారు. 14 రోజుల తర్వాత వారి పార్ధివ దేహాలు స్వగ్రామాలకు చేరగా, ముల్కనూర్‌లో ఒకే చోట అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషాద ఘటన అందరినీ కంటతడి పెట్టించింది.1
- గజ్వేల్ మున్సిపల్‌లో బిజెపి జెండా ఎగరవేస్తాం – బైరి శంకర్ 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 10 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని అన్ని 20 వార్డుల్లో బిజెపి జెండాను గర్వంగా ఎగరవేస్తామని బిజెపి జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రజా వ్యతిరేక విధానాలతో అధికార పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, రానున్న ఎన్నికల్లో గజ్వేల్ మున్సిపాలిటీలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ప్రతి వార్డులో బలమైన కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా బిజెపి పనిచేస్తోందని అన్నారు. గజ్వేల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని, మౌలిక వసతులు, తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం వంటి అంశాల్లో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని బైరి శంకర్ హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ విజయానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.బైరి శంకర్ ముదిరాజ్, ఎల్లు రామ్ రెడ్డి, గడిపల్లి భాస్కర్, కప్పర ప్రసాద్ రావు, దేవులపల్లి మనోహర్ యాదవ్, శ్రీను, ఏల్కంటి సురేష్, చెప్యాల వెంకట్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్, రామచంద్ర చారి, కమ్మరి, నాయిని సందీప్ కుమార్, మడుగురి నరసింహ ముదిరాజ్, బారు అరవింద్,నాగు ముదిరాజ్, బింగి లక్ష్మీనారాయణ, మంద వెంకట్,దయాకర్ రెడ్డి, పోకల ప్రభాకర్, రామచంద్ర రెడ్డి,నిరంజన్ రెడ్డి,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు1
- కరాటే పోటీలు ప్రారంభించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి.. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో జరిగిన కరాటే పోటీలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. పిల్లలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, ఆటలు, ధ్యానం వంటివి వారి మేధస్సును మెరుగుపరుస్తాయని ఆయన అన్నారు. పాఠశాల నుండి వచ్చిన తర్వాత పిల్లలకు సమయం కేటాయించి, సెల్ ఫోన్లకు అలవాటు పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని ఆయన సూచించారు.1
- శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శ్రీ హరి రావు గారు1
- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో వివేకానంద సేవాసమితి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ, వివేకానంద జయంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కొడిమ్యాలలోని వివిధ పాఠశాలల విద్యార్థులు అందంగా, సంక్రాంతి పండుగ ముగ్గులు వేసి తమ ప్రతిభను చాటారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు జనవరి 12న జరిగే వివేకానంద జయంతి రోజున ప్రధమ, ద్వితీయ ,తృతీయ బహుమతులను పాల్గొన్న వారి అందరికీ కన్సోలేసన్ బహుమతులు అందజేస్తామని వివేకానంద సేవా సమితి సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షులు ఏనుగు ఆదిరెడ్డి, ముగ్గుల పోటీ న్యాయ నిర్నేతలుగా మహిళా సంఘం అధ్యక్షులు సంద పద్మ, అంగన్వాడి టీచర్ బోయిని సుజాత, వివేకానంద సేవ సమితి అధ్యక్షులు కంచర్ల గంగాచారి ,సభ్యులు మంచాల శ్రీనివాస్, నాంపల్లి రామచంద్రం, బొమ్మ సురేష్, గ్రామస్తులు, యువకులు, మహిళలు ,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.2