logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిందే.. అఖిల భారత యువజన సమాఖ్య గార్ల మండల మహాసభలో సిపిఐ తొరూరు మండల కార్యదర్శి బందు మహేందర్. జిల్లా ప్రధాన కార్యదర్శి జలగం ప్రవీణ్.. తొర్రూరు మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 26... అఖిలభారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ తొర్రూర్ మండల మహాసభ లయన్స్ భవనంలో బూర్గు వీరేశం అధ్యక్షతన జరిగింది ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన *అఖిలభారత యువజన సమాఖ్య సిపిఐ తొరూరు మండల కార్యదర్శి బందు మహేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జలగం ప్రవీణ్ మాట్లాడుతూ* మోడీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశాడని విభజన హామీ చట్టంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతవరకు నాణ్యత లేదని దాత వేస్తున్నారని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే మహబూబాబాద్ జిల్లా ప్రజలకు సుమారు 20వేల మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు దున్నపోతు మీద వర్షం పడ్డట్టే బిజెపి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి రాష్ట్ర హక్కులను ఢిల్లీలో అడగడంలో పూర్తిగా విఫలమయ్యారని రానున్న కాలంలో అఖిలభారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం ఉధృతం బయ్యారం ఉక్కు పరిశ్రమ ఉద్యమం చేస్తామన్నారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆగస్టు 27న అఖిలభారత యువజన సమైక్య జిల్లా మహాసభ మహబుబాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతుందని ఈ మహాసభకు గార్ల మండలం నుంచి యువతీ యువకులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం తొర్రూర్ మండల ఏఐవైఎఫ్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బూర్గు వీరేష్ ,పెరబోయిన క్రాంతికుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..మొత్తం 9 మందితో కమిటీ వేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షులు గణపురం లక్ష్మణ్, పేరబోయిన కిరణ్ కుమార్, తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి కోటగిరి యాకాంతం శివప్రసాద్, పత్తి శివ, ఎడెల్లి మురళి, లోకేష్, బానోత్ రమేష్ ఉదయ్,రాంబాబు, వేణు,శ్రీకాంత్,అనిల్,రమేష్ తదితరులు పాల్గొన్నారు...

12 hrs ago
user_జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
Doctor తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
12 hrs ago
9b8365da-abb1-420f-9dd6-5d51d5160a14

బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిందే.. అఖిల భారత యువజన సమాఖ్య గార్ల మండల మహాసభలో సిపిఐ తొరూరు మండల కార్యదర్శి బందు మహేందర్. జిల్లా ప్రధాన కార్యదర్శి జలగం ప్రవీణ్.. తొర్రూరు మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 26... అఖిలభారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ తొర్రూర్ మండల మహాసభ లయన్స్ భవనంలో బూర్గు వీరేశం అధ్యక్షతన జరిగింది ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన *అఖిలభారత యువజన సమాఖ్య సిపిఐ తొరూరు మండల కార్యదర్శి బందు మహేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జలగం ప్రవీణ్ మాట్లాడుతూ* మోడీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశాడని విభజన హామీ చట్టంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతవరకు నాణ్యత లేదని దాత వేస్తున్నారని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే మహబూబాబాద్ జిల్లా ప్రజలకు సుమారు 20వేల మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు దున్నపోతు మీద వర్షం పడ్డట్టే బిజెపి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి రాష్ట్ర హక్కులను ఢిల్లీలో అడగడంలో పూర్తిగా విఫలమయ్యారని రానున్న కాలంలో అఖిలభారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం ఉధృతం బయ్యారం ఉక్కు పరిశ్రమ ఉద్యమం చేస్తామన్నారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆగస్టు 27న అఖిలభారత యువజన సమైక్య జిల్లా మహాసభ మహబుబాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతుందని ఈ మహాసభకు గార్ల మండలం నుంచి యువతీ యువకులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం తొర్రూర్ మండల ఏఐవైఎఫ్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బూర్గు వీరేష్ ,పెరబోయిన క్రాంతికుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..మొత్తం 9 మందితో కమిటీ వేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షులు గణపురం లక్ష్మణ్, పేరబోయిన కిరణ్ కుమార్, తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి కోటగిరి యాకాంతం శివప్రసాద్, పత్తి శివ, ఎడెల్లి మురళి, లోకేష్, బానోత్ రమేష్ ఉదయ్,రాంబాబు, వేణు,శ్రీకాంత్,అనిల్,రమేష్ తదితరులు పాల్గొన్నారు...

More news from తెలంగాణ and nearby areas
  • ఎమ్మెల్యే రామచందర్ నాయక్‌పై అసత్య ప్రచారం మానుకోవాలి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా నాయకులు చిర్ర సతీష్ గౌడ్.. నరసింహుల పేట మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 26... కొంతమంది కావాలనే డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచందర్ నాయక్ ను అవమానపరిచే విధంగా సోషల్ మీడియాలో ఇష్టారీతిన అసత్య ప్రచారం చేస్తూ అగౌరవపరుస్తున్నారని నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా నాయకులు చిర్ర సతీష్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే రామచందర్ నాయక్ పై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కొందరు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే రామచందర్ నాయక్ కు ఇసుక ట్రాక్టర్లు లేవని, ఎలాంటి వ్యాపారాలు నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆధారాలు లేని ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. గతంలో అక్రమ వ్యాపారాలు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడింది ఎవరు? ప్రజలకు అన్నీ తెలుసని, గత చరిత్రను ఒకసారి ప్రజల ముందు ఉంచితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చిర్ర సతీష్ గౌడ్ అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను మానుకుని, ఆధారాలతో మాట్లాడాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్న నాయకుడిపై అసత్య ప్రచారం చేయడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇకనైనా వ్యక్తిగత విమర్శలు, నిరాధార ఆరోపణలు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు మానుకోవాలని చిర్ర సతీష్ గౌడ్ హెచ్చరించారు. రాజకీయ విమర్శలు ఉంటే ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై నిర్మాణాత్మకంగా మాట్లాడాలని, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే ప్రచారానికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
    1
    ఎమ్మెల్యే రామచందర్ నాయక్‌పై అసత్య ప్రచారం మానుకోవాలి
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా నాయకులు చిర్ర సతీష్ గౌడ్.. 
నరసింహుల పేట మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 26... 
కొంతమంది కావాలనే డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచందర్ నాయక్ ను అవమానపరిచే విధంగా సోషల్ మీడియాలో ఇష్టారీతిన అసత్య ప్రచారం చేస్తూ అగౌరవపరుస్తున్నారని నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా నాయకులు చిర్ర సతీష్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే రామచందర్ నాయక్ పై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కొందరు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే రామచందర్ నాయక్ కు ఇసుక ట్రాక్టర్లు లేవని, ఎలాంటి వ్యాపారాలు నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆధారాలు లేని ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. గతంలో అక్రమ వ్యాపారాలు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడింది ఎవరు? ప్రజలకు అన్నీ తెలుసని, గత చరిత్రను ఒకసారి ప్రజల ముందు ఉంచితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చిర్ర సతీష్ గౌడ్ అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను మానుకుని, ఆధారాలతో మాట్లాడాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్న నాయకుడిపై అసత్య ప్రచారం చేయడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇకనైనా వ్యక్తిగత విమర్శలు, నిరాధార ఆరోపణలు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు మానుకోవాలని చిర్ర సతీష్ గౌడ్ హెచ్చరించారు. రాజకీయ విమర్శలు ఉంటే ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై నిర్మాణాత్మకంగా మాట్లాడాలని, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే ప్రచారానికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
    user_జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    Doctor తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • మా కూతురు వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం..? కొండా మురళీ స్పష్టం భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం కొండా మురళీ కీలక వ్యాఖ్యలు చేశారు.మా కూతురు వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామన్నారు.మా కూతురు వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడే వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయనని అన్నారు.
    1
    మా కూతురు వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం..? కొండా మురళీ స్పష్టం
భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం కొండా మురళీ కీలక వ్యాఖ్యలు చేశారు.మా కూతురు వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామన్నారు.మా కూతురు వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడే వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయనని అన్నారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    11 hrs ago
  • కమలాపూర్‌లో కొండచిలువ కలకలం.. సురక్షితంగా పట్టుకున్న అటవీశాఖ అధికారులు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో వ్యవసాయ పొలంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమై కలకలం రేపింది. పొలంలో కొండచిలువ సంచరిస్తుండటాన్ని గమనించిన రైతులు భయాందోళనకు గురై వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండచిలువను పట్టుకునేందుకు జాగ్రత్తగా చర్యలు చేపట్టి, ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం కొండచిలువను జూ పార్క్‌కు తరలించారు. వ్యవసాయ పొలాల్లో కొండచిలువ కనిపించడంతో రైతులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే అటవీశాఖ అధికారులు సకాలంలో స్పందించి కొండచిలువను పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా ప్రమాదం జరగలేదు.
    2
    కమలాపూర్‌లో కొండచిలువ కలకలం.. సురక్షితంగా పట్టుకున్న అటవీశాఖ అధికారులు
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో వ్యవసాయ పొలంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమై కలకలం రేపింది. పొలంలో కొండచిలువ సంచరిస్తుండటాన్ని గమనించిన రైతులు భయాందోళనకు గురై వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండచిలువను పట్టుకునేందుకు జాగ్రత్తగా చర్యలు చేపట్టి, ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం కొండచిలువను జూ పార్క్‌కు తరలించారు.
వ్యవసాయ పొలాల్లో కొండచిలువ కనిపించడంతో రైతులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే అటవీశాఖ అధికారులు సకాలంలో స్పందించి కొండచిలువను పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా ప్రమాదం జరగలేదు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    13 hrs ago
  • మాజీ మంత్రి కాసు మాతృమూర్తి శేషమ్మకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నివాళులు హైదరాబాద్ (ఆగస్టు 26): మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మాతృమూర్తి కాసు శేషమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ​మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దివంగత కాసు వెంగళరెడ్డి సతీమణి, మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి తల్లి, వైఎస్సార్‌సీపీ నేత కాసు మహేష్ రెడ్డి నాయనమ్మ అయిన కాసు శేషమ్మ ఇటీవల కన్నుమూశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జేఆర్సీ (JRC) కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం నిర్వహించిన శేషమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హాజరయ్యారు. ​అక్కడ ఏర్పాటు చేసిన శేషమ్మ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాసు వెంకట కృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డిలతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మరియు ప్రముఖులు పాల్గొన్నారు.
    3
    మాజీ మంత్రి కాసు మాతృమూర్తి శేషమ్మకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నివాళులు


హైదరాబాద్ (ఆగస్టు 26):
మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మాతృమూర్తి కాసు శేషమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.
​మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దివంగత కాసు వెంగళరెడ్డి సతీమణి, మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి తల్లి, వైఎస్సార్‌సీపీ నేత కాసు మహేష్ రెడ్డి నాయనమ్మ అయిన కాసు శేషమ్మ ఇటీవల కన్నుమూశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జేఆర్సీ (JRC) కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం నిర్వహించిన శేషమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హాజరయ్యారు.
​అక్కడ ఏర్పాటు చేసిన శేషమ్మ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాసు వెంకట కృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డిలతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మరియు ప్రముఖులు పాల్గొన్నారు.
    user_ఆడెపు రాంకిషన్
    ఆడెపు రాంకిషన్
    Content Creator (YouTuber) వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    14 hrs ago
  • రూప్లా తండా గుడుంబా స్తావరాలపై నర్సింహులపేట పోలీస్ ల దాడులు.. మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్ర శివారు రుప్లా తండాలోని గుడుంబా స్తావరాలపై పోలీస్ లు విస్తృత దాడులు నిర్వహించారు.. అక్రమంగా నిల్వ ఉంచిన 700 లీటర్ల బెల్లం పానకం ను ద్వoసం చేయడం తో పాటు 17 లీటర్ల నాటుసారను సీజ్ చేశారు.. అనంతరం నర్సిoహుల పేట ఎస్ ఐ వెంకన్న మాట్లాడుతూ అక్రమ వ్యాపారాలు, దందా లు చేస్తే చట్ట పర చర్యలు ఉంటాయని హెచ్చరించారు
    1
    రూప్లా తండా గుడుంబా స్తావరాలపై నర్సింహులపేట పోలీస్ ల దాడులు..
మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్ర శివారు రుప్లా తండాలోని గుడుంబా స్తావరాలపై పోలీస్ లు విస్తృత దాడులు నిర్వహించారు.. అక్రమంగా నిల్వ ఉంచిన 700 లీటర్ల బెల్లం పానకం ను ద్వoసం చేయడం తో పాటు 17 లీటర్ల నాటుసారను సీజ్ చేశారు.. అనంతరం నర్సిoహుల పేట ఎస్ ఐ వెంకన్న మాట్లాడుతూ అక్రమ వ్యాపారాలు, దందా లు చేస్తే చట్ట పర చర్యలు ఉంటాయని హెచ్చరించారు
    user_కిరణ్ చెల్లమల్ల
    కిరణ్ చెల్లమల్ల
    మరిపెడ, మహబూబాబాద్, తెలంగాణ•
    10 hrs ago
  • నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. దాహంగా ఉందని నీళ్లు అడిగిన బాధితుడిపై ఎస్సై మూత్ర విసర్జన చేశాడని మహేందర్ ఆరోపించాడు. ఈ ఘటనపై బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. నాగర్‌కర్నూల్ సీఐ అశోక్ రెడ్డికి డీఎస్పీ ఈ విచారణ బాధ్యతలను అప్పగించారు.
    1
    నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి.
నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. దాహంగా ఉందని నీళ్లు అడిగిన బాధితుడిపై ఎస్సై మూత్ర విసర్జన చేశాడని మహేందర్ ఆరోపించాడు. ఈ ఘటనపై బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. నాగర్‌కర్నూల్ సీఐ అశోక్ రెడ్డికి డీఎస్పీ ఈ విచారణ బాధ్యతలను అప్పగించారు.
    user_Reporter Gaddam Kiran
    Reporter Gaddam Kiran
    ఖాజీపేట, హనుమకొండ, తెలంగాణ•
    7 hrs ago
  • పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకవర్గం: నార్కెట్‌పల్లి మండలం చౌడంపల్లి గ్రామానికి చెందిన చెరుకుపల్లి మారయ్య గారి కుమారుడి వివాహ వేడుకకు నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే నార్కెట్‌పల్లి పట్టణానికి చెందిన జక్కంపూడి సత్యనారాయణ గారి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నార్కెట్‌పల్లి పట్టణానికి చెందిన బైరగొని రవి గౌడ్ గారి కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వివాహ బంధంతో ఒక్కటైన నూతన వధూవరులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని చిరుమర్తి లింగయ్య గారు ఆకాంక్షించారు.
    4
    పలు వివాహ  వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నకిరేకల్ నియోజకవర్గం: నార్కెట్‌పల్లి మండలం చౌడంపల్లి గ్రామానికి చెందిన చెరుకుపల్లి మారయ్య గారి కుమారుడి వివాహ వేడుకకు నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అలాగే నార్కెట్‌పల్లి పట్టణానికి చెందిన జక్కంపూడి సత్యనారాయణ గారి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా నార్కెట్‌పల్లి పట్టణానికి చెందిన బైరగొని రవి గౌడ్ గారి కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా వివాహ బంధంతో ఒక్కటైన నూతన వధూవరులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని చిరుమర్తి లింగయ్య గారు ఆకాంక్షించారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    8 hrs ago
  • మల్యాల గ్రామ సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన. సమస్యలు పరిష్కరించని ఎడల పోరాటాలు ఉదృతం చేస్తాం. స్థానిక సమస్యలపై నిరసన సిపిఎం మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామంలో విద్యుత్ దీపాలు వెలుగులు లేకపోవడంతో స్థానిక ప్రజలతో కలిసి స్థానిక వీధుల్లో సిపిఎం మండల పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది తక్షణమే గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రజలకు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల ప్రజలతో మమేకమై స్థానిక పోరాటాలు నిర్వహిస్తామని మండల అధికారులను హెచ్చరించారు.
    1
    మల్యాల గ్రామ సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన. 
సమస్యలు పరిష్కరించని ఎడల పోరాటాలు ఉదృతం చేస్తాం. 
స్థానిక సమస్యలపై నిరసన సిపిఎం 
మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామంలో విద్యుత్ దీపాలు వెలుగులు లేకపోవడంతో స్థానిక ప్రజలతో కలిసి స్థానిక వీధుల్లో సిపిఎం మండల పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది తక్షణమే గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రజలకు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల ప్రజలతో మమేకమై స్థానిక పోరాటాలు నిర్వహిస్తామని మండల అధికారులను హెచ్చరించారు.
    user_జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    Doctor తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.