logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మాజీ మంత్రి కాసు మాతృమూర్తి శేషమ్మకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నివాళులు హైదరాబాద్ (ఆగస్టు 26): మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మాతృమూర్తి కాసు శేషమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ​మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దివంగత కాసు వెంగళరెడ్డి సతీమణి, మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి తల్లి, వైఎస్సార్‌సీపీ నేత కాసు మహేష్ రెడ్డి నాయనమ్మ అయిన కాసు శేషమ్మ ఇటీవల కన్నుమూశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జేఆర్సీ (JRC) కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం నిర్వహించిన శేషమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హాజరయ్యారు. ​అక్కడ ఏర్పాటు చేసిన శేషమ్మ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాసు వెంకట కృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డిలతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మరియు ప్రముఖులు పాల్గొన్నారు.

13 hrs ago
user_ఆడెపు రాంకిషన్
ఆడెపు రాంకిషన్
Content Creator (YouTuber) వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
13 hrs ago
f0cc41da-dd6c-44c8-89af-9e9ef3e79cf1

మాజీ మంత్రి కాసు మాతృమూర్తి శేషమ్మకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నివాళులు హైదరాబాద్ (ఆగస్టు 26): మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మాతృమూర్తి కాసు శేషమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ​మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దివంగత కాసు వెంగళరెడ్డి సతీమణి,

మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి తల్లి, వైఎస్సార్‌సీపీ నేత కాసు మహేష్ రెడ్డి నాయనమ్మ అయిన కాసు శేషమ్మ ఇటీవల కన్నుమూశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జేఆర్సీ (JRC) కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం నిర్వహించిన శేషమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి

efeb552d-55fa-42a6-8589-797a60caaa52

కేఆర్ నాగరాజు హాజరయ్యారు. ​అక్కడ ఏర్పాటు చేసిన శేషమ్మ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాసు వెంకట కృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డిలతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మరియు ప్రముఖులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కమలాపూర్‌లో కొండచిలువ కలకలం.. సురక్షితంగా పట్టుకున్న అటవీశాఖ అధికారులు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో వ్యవసాయ పొలంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమై కలకలం రేపింది. పొలంలో కొండచిలువ సంచరిస్తుండటాన్ని గమనించిన రైతులు భయాందోళనకు గురై వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండచిలువను పట్టుకునేందుకు జాగ్రత్తగా చర్యలు చేపట్టి, ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం కొండచిలువను జూ పార్క్‌కు తరలించారు. వ్యవసాయ పొలాల్లో కొండచిలువ కనిపించడంతో రైతులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే అటవీశాఖ అధికారులు సకాలంలో స్పందించి కొండచిలువను పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా ప్రమాదం జరగలేదు.
    2
    కమలాపూర్‌లో కొండచిలువ కలకలం.. సురక్షితంగా పట్టుకున్న అటవీశాఖ అధికారులు
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో వ్యవసాయ పొలంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమై కలకలం రేపింది. పొలంలో కొండచిలువ సంచరిస్తుండటాన్ని గమనించిన రైతులు భయాందోళనకు గురై వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండచిలువను పట్టుకునేందుకు జాగ్రత్తగా చర్యలు చేపట్టి, ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం కొండచిలువను జూ పార్క్‌కు తరలించారు.
వ్యవసాయ పొలాల్లో కొండచిలువ కనిపించడంతో రైతులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే అటవీశాఖ అధికారులు సకాలంలో స్పందించి కొండచిలువను పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా ప్రమాదం జరగలేదు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    13 hrs ago
  • మాజీ మంత్రి కాసు మాతృమూర్తి శేషమ్మకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నివాళులు హైదరాబాద్ (ఆగస్టు 26): మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మాతృమూర్తి కాసు శేషమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ​మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దివంగత కాసు వెంగళరెడ్డి సతీమణి, మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి తల్లి, వైఎస్సార్‌సీపీ నేత కాసు మహేష్ రెడ్డి నాయనమ్మ అయిన కాసు శేషమ్మ ఇటీవల కన్నుమూశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జేఆర్సీ (JRC) కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం నిర్వహించిన శేషమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హాజరయ్యారు. ​అక్కడ ఏర్పాటు చేసిన శేషమ్మ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాసు వెంకట కృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డిలతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మరియు ప్రముఖులు పాల్గొన్నారు.
    3
    మాజీ మంత్రి కాసు మాతృమూర్తి శేషమ్మకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నివాళులు


హైదరాబాద్ (ఆగస్టు 26):
మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మాతృమూర్తి కాసు శేషమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.
​మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దివంగత కాసు వెంగళరెడ్డి సతీమణి, మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి తల్లి, వైఎస్సార్‌సీపీ నేత కాసు మహేష్ రెడ్డి నాయనమ్మ అయిన కాసు శేషమ్మ ఇటీవల కన్నుమూశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జేఆర్సీ (JRC) కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం నిర్వహించిన శేషమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హాజరయ్యారు.
​అక్కడ ఏర్పాటు చేసిన శేషమ్మ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాసు వెంకట కృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డిలతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మరియు ప్రముఖులు పాల్గొన్నారు.
    user_ఆడెపు రాంకిషన్
    ఆడెపు రాంకిషన్
    Content Creator (YouTuber) వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    13 hrs ago
  • నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. దాహంగా ఉందని నీళ్లు అడిగిన బాధితుడిపై ఎస్సై మూత్ర విసర్జన చేశాడని మహేందర్ ఆరోపించాడు. ఈ ఘటనపై బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. నాగర్‌కర్నూల్ సీఐ అశోక్ రెడ్డికి డీఎస్పీ ఈ విచారణ బాధ్యతలను అప్పగించారు.
    1
    నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి.
నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. దాహంగా ఉందని నీళ్లు అడిగిన బాధితుడిపై ఎస్సై మూత్ర విసర్జన చేశాడని మహేందర్ ఆరోపించాడు. ఈ ఘటనపై బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. నాగర్‌కర్నూల్ సీఐ అశోక్ రెడ్డికి డీఎస్పీ ఈ విచారణ బాధ్యతలను అప్పగించారు.
    user_Reporter Gaddam Kiran
    Reporter Gaddam Kiran
    ఖాజీపేట, హనుమకొండ, తెలంగాణ•
    7 hrs ago
  • ఎమ్మెల్యే రామచందర్ నాయక్‌పై అసత్య ప్రచారం మానుకోవాలి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా నాయకులు చిర్ర సతీష్ గౌడ్.. నరసింహుల పేట మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 26... కొంతమంది కావాలనే డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచందర్ నాయక్ ను అవమానపరిచే విధంగా సోషల్ మీడియాలో ఇష్టారీతిన అసత్య ప్రచారం చేస్తూ అగౌరవపరుస్తున్నారని నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా నాయకులు చిర్ర సతీష్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే రామచందర్ నాయక్ పై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కొందరు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే రామచందర్ నాయక్ కు ఇసుక ట్రాక్టర్లు లేవని, ఎలాంటి వ్యాపారాలు నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆధారాలు లేని ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. గతంలో అక్రమ వ్యాపారాలు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడింది ఎవరు? ప్రజలకు అన్నీ తెలుసని, గత చరిత్రను ఒకసారి ప్రజల ముందు ఉంచితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చిర్ర సతీష్ గౌడ్ అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను మానుకుని, ఆధారాలతో మాట్లాడాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్న నాయకుడిపై అసత్య ప్రచారం చేయడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇకనైనా వ్యక్తిగత విమర్శలు, నిరాధార ఆరోపణలు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు మానుకోవాలని చిర్ర సతీష్ గౌడ్ హెచ్చరించారు. రాజకీయ విమర్శలు ఉంటే ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై నిర్మాణాత్మకంగా మాట్లాడాలని, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే ప్రచారానికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
    1
    ఎమ్మెల్యే రామచందర్ నాయక్‌పై అసత్య ప్రచారం మానుకోవాలి
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా నాయకులు చిర్ర సతీష్ గౌడ్.. 
నరసింహుల పేట మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 26... 
కొంతమంది కావాలనే డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచందర్ నాయక్ ను అవమానపరిచే విధంగా సోషల్ మీడియాలో ఇష్టారీతిన అసత్య ప్రచారం చేస్తూ అగౌరవపరుస్తున్నారని నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా నాయకులు చిర్ర సతీష్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే రామచందర్ నాయక్ పై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కొందరు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే రామచందర్ నాయక్ కు ఇసుక ట్రాక్టర్లు లేవని, ఎలాంటి వ్యాపారాలు నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆధారాలు లేని ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. గతంలో అక్రమ వ్యాపారాలు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడింది ఎవరు? ప్రజలకు అన్నీ తెలుసని, గత చరిత్రను ఒకసారి ప్రజల ముందు ఉంచితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చిర్ర సతీష్ గౌడ్ అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను మానుకుని, ఆధారాలతో మాట్లాడాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్న నాయకుడిపై అసత్య ప్రచారం చేయడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇకనైనా వ్యక్తిగత విమర్శలు, నిరాధార ఆరోపణలు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు మానుకోవాలని చిర్ర సతీష్ గౌడ్ హెచ్చరించారు. రాజకీయ విమర్శలు ఉంటే ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై నిర్మాణాత్మకంగా మాట్లాడాలని, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే ప్రచారానికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
    user_జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    Doctor తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • మా కూతురు వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం..? కొండా మురళీ స్పష్టం భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం కొండా మురళీ కీలక వ్యాఖ్యలు చేశారు.మా కూతురు వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామన్నారు.మా కూతురు వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడే వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయనని అన్నారు.
    1
    మా కూతురు వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం..? కొండా మురళీ స్పష్టం
భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం కొండా మురళీ కీలక వ్యాఖ్యలు చేశారు.మా కూతురు వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామన్నారు.మా కూతురు వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడే వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయనని అన్నారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    11 hrs ago
  • జనగామ స్టేషన్ మీదుగా జేసీబీ లను రవాణా చేస్తున్న క్యారియర్ రైలు జేసీబీ వాహనాలను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పెద్ద ఎత్తున రవాణా చేయడానికి ఉపయోగించే ప్రత్యేక రైలు ఆటోమొబైల్ క్యారియర్ రైలు(న్యూ మాడిఫైడ్ గూడ్స్) కాజీపేట జంక్షన్ మీదుగా వస్తూ జిల్లా కేంద్రమైన జనగామ రైల్వే స్టేషన్ లో ఆగడంతో వివిధ రైళ్ల కోసం వేచి ఉన్న ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు.బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రజా రవాణా రైళ్ల కోసం జనగామ స్టేషన్ వద్ద క్రాసింగ్ ఇవ్వడంతో ఈ గూడ్స్ ను నిలిపివేసినట్లు రైల్వే సిబ్బంది వివరించారు.ఆటోమొబైల్ కొరియర్ ట్రైన్ గా పిలువబడే ఈ గూడ్స్ రైలు కు 33 రేక్స్ ఉండగా ఒక రేక్స్ లో మూడు జెసిబి వాహనాలతో మొత్తంగా దాదాపు ఒక వంద జేసీబీ వాహనాలను సరఫరా చేసే ఈ రైలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని మౌలాలి స్టేషన్ వరకు తీసుకువెళ్ళి అన్ లోడ్ చేయనున్నట్లు రైల్వే సిబ్బంది వెల్లడించారు.
    1
    జనగామ స్టేషన్ మీదుగా జేసీబీ లను రవాణా చేస్తున్న క్యారియర్ రైలు
జేసీబీ వాహనాలను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పెద్ద ఎత్తున రవాణా చేయడానికి ఉపయోగించే ప్రత్యేక రైలు ఆటోమొబైల్ క్యారియర్ రైలు(న్యూ మాడిఫైడ్ గూడ్స్) కాజీపేట జంక్షన్ మీదుగా వస్తూ జిల్లా కేంద్రమైన జనగామ రైల్వే స్టేషన్ లో ఆగడంతో వివిధ రైళ్ల కోసం వేచి ఉన్న ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు.బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రజా రవాణా రైళ్ల కోసం జనగామ స్టేషన్ వద్ద క్రాసింగ్ ఇవ్వడంతో ఈ గూడ్స్ ను నిలిపివేసినట్లు రైల్వే సిబ్బంది వివరించారు.ఆటోమొబైల్ కొరియర్ ట్రైన్ గా పిలువబడే ఈ గూడ్స్ రైలు కు 33 రేక్స్ ఉండగా ఒక రేక్స్ లో మూడు జెసిబి వాహనాలతో మొత్తంగా దాదాపు ఒక వంద జేసీబీ వాహనాలను సరఫరా చేసే ఈ రైలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని మౌలాలి స్టేషన్ వరకు తీసుకువెళ్ళి అన్ లోడ్ చేయనున్నట్లు రైల్వే సిబ్బంది వెల్లడించారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    13 hrs ago
  • రూప్లా తండా గుడుంబా స్తావరాలపై నర్సింహులపేట పోలీస్ ల దాడులు.. మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్ర శివారు రుప్లా తండాలోని గుడుంబా స్తావరాలపై పోలీస్ లు విస్తృత దాడులు నిర్వహించారు.. అక్రమంగా నిల్వ ఉంచిన 700 లీటర్ల బెల్లం పానకం ను ద్వoసం చేయడం తో పాటు 17 లీటర్ల నాటుసారను సీజ్ చేశారు.. అనంతరం నర్సిoహుల పేట ఎస్ ఐ వెంకన్న మాట్లాడుతూ అక్రమ వ్యాపారాలు, దందా లు చేస్తే చట్ట పర చర్యలు ఉంటాయని హెచ్చరించారు
    1
    రూప్లా తండా గుడుంబా స్తావరాలపై నర్సింహులపేట పోలీస్ ల దాడులు..
మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్ర శివారు రుప్లా తండాలోని గుడుంబా స్తావరాలపై పోలీస్ లు విస్తృత దాడులు నిర్వహించారు.. అక్రమంగా నిల్వ ఉంచిన 700 లీటర్ల బెల్లం పానకం ను ద్వoసం చేయడం తో పాటు 17 లీటర్ల నాటుసారను సీజ్ చేశారు.. అనంతరం నర్సిoహుల పేట ఎస్ ఐ వెంకన్న మాట్లాడుతూ అక్రమ వ్యాపారాలు, దందా లు చేస్తే చట్ట పర చర్యలు ఉంటాయని హెచ్చరించారు
    user_కిరణ్ చెల్లమల్ల
    కిరణ్ చెల్లమల్ల
    మరిపెడ, మహబూబాబాద్, తెలంగాణ•
    10 hrs ago
  • వర్షాల కోసం కప్పతల్లి ఆటలు.. కప్పలకు పెళ్లి చేసి చెరువులో వదిలిన రైతులు ములుగు: పొలాల్లో నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా సరైన వర్షాలు కురవక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ములుగు జిల్లా లక్నవరం చెరువులో నీటిమట్టం తక్కువగా ఉండటంతో ఆయకట్టు రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వర్షాలు కురవాలని వరుణుడిని ప్రసన్నం చేసుకునేందుకు రైతులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన ‘కప్పతల్లి ఆటలు’ నిర్వహించారు. ఇందులో భాగంగా రెండు కప్పలను పట్టుకొచ్చి పసుపు, కుంకుమతో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేశారు. అనంతరం కప్ప వరుడు, వధువులను డప్పు చప్పుళ్లతో గ్రామ వీధుల్లో ఊరేగించారు. తర్వాత సమీపంలోని చెరువుకు తీసుకెళ్లి కప్పలను నీటిలో వదిలారు. కప్పలు తడిస్తే మేఘాలు కరిగి వర్షాలు కురుస్తాయని తమ పూర్వీకుల నుంచి వస్తున్న నమ్మకమని గ్రామస్థులు తెలిపారు. వరుణ దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించి పంటలను కాపాడాలని రైతులు వేడుకున్నారు.
    1
    వర్షాల కోసం కప్పతల్లి ఆటలు.. కప్పలకు పెళ్లి చేసి చెరువులో వదిలిన రైతులు
ములుగు: పొలాల్లో నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా సరైన వర్షాలు కురవక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ములుగు జిల్లా లక్నవరం చెరువులో నీటిమట్టం తక్కువగా ఉండటంతో ఆయకట్టు రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
వర్షాలు కురవాలని వరుణుడిని ప్రసన్నం చేసుకునేందుకు రైతులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన ‘కప్పతల్లి ఆటలు’ నిర్వహించారు. ఇందులో భాగంగా రెండు కప్పలను పట్టుకొచ్చి పసుపు, కుంకుమతో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేశారు. అనంతరం కప్ప వరుడు, వధువులను డప్పు చప్పుళ్లతో గ్రామ వీధుల్లో ఊరేగించారు.
తర్వాత సమీపంలోని చెరువుకు తీసుకెళ్లి కప్పలను నీటిలో వదిలారు. కప్పలు తడిస్తే మేఘాలు కరిగి వర్షాలు కురుస్తాయని తమ పూర్వీకుల నుంచి వస్తున్న నమ్మకమని గ్రామస్థులు తెలిపారు. వరుణ దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించి పంటలను కాపాడాలని రైతులు వేడుకున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.