logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వర్షాల కోసం కప్పతల్లి ఆటలు.. కప్పలకు పెళ్లి చేసి చెరువులో వదిలిన రైతులు ములుగు: పొలాల్లో నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా సరైన వర్షాలు కురవక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ములుగు జిల్లా లక్నవరం చెరువులో నీటిమట్టం తక్కువగా ఉండటంతో ఆయకట్టు రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వర్షాలు కురవాలని వరుణుడిని ప్రసన్నం చేసుకునేందుకు రైతులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన ‘కప్పతల్లి ఆటలు’ నిర్వహించారు. ఇందులో భాగంగా రెండు కప్పలను పట్టుకొచ్చి పసుపు, కుంకుమతో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేశారు. అనంతరం కప్ప వరుడు, వధువులను డప్పు చప్పుళ్లతో గ్రామ వీధుల్లో ఊరేగించారు. తర్వాత సమీపంలోని చెరువుకు తీసుకెళ్లి కప్పలను నీటిలో వదిలారు. కప్పలు తడిస్తే మేఘాలు కరిగి వర్షాలు కురుస్తాయని తమ పూర్వీకుల నుంచి వస్తున్న నమ్మకమని గ్రామస్థులు తెలిపారు. వరుణ దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించి పంటలను కాపాడాలని రైతులు వేడుకున్నారు.

1 hr ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
1 hr ago

వర్షాల కోసం కప్పతల్లి ఆటలు.. కప్పలకు పెళ్లి చేసి చెరువులో వదిలిన రైతులు ములుగు: పొలాల్లో నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా సరైన వర్షాలు కురవక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ములుగు జిల్లా లక్నవరం చెరువులో నీటిమట్టం తక్కువగా ఉండటంతో ఆయకట్టు రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వర్షాలు కురవాలని వరుణుడిని ప్రసన్నం చేసుకునేందుకు రైతులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన ‘కప్పతల్లి ఆటలు’ నిర్వహించారు. ఇందులో భాగంగా రెండు కప్పలను పట్టుకొచ్చి పసుపు, కుంకుమతో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేశారు. అనంతరం కప్ప వరుడు, వధువులను డప్పు చప్పుళ్లతో గ్రామ వీధుల్లో ఊరేగించారు. తర్వాత సమీపంలోని చెరువుకు తీసుకెళ్లి కప్పలను నీటిలో వదిలారు. కప్పలు తడిస్తే మేఘాలు కరిగి వర్షాలు కురుస్తాయని తమ పూర్వీకుల నుంచి వస్తున్న నమ్మకమని గ్రామస్థులు తెలిపారు. వరుణ దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించి పంటలను కాపాడాలని రైతులు వేడుకున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో ముద్రించాలి: తహసీల్దార్‌కు బీజేపీ వినతి హసన్‌పర్తి: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా జారీ చేయనున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాన్ని తప్పనిసరిగా ముద్రించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. హసన్‌పర్తి మండల బీజేపీ అధ్యక్షుడు మారం తిరుపతి ఆధ్వర్యంలో, బీజేపీ రాష్ట్ర నాయకులు, 66వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ​ఈ సందర్భంగా గురుమూర్తి శివకుమార్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ప్రతి నెలా ఉచితంగా 5 కిలోల బియ్యం అందిస్తున్నప్పటికీ, రేషన్ కార్డులపై కేవలం ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి చిత్రాలను మాత్రమే ముద్రించి, ప్రధాని మోదీ ఫోటోను విస్మరించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని గుర్తిస్తూ ప్రధాని చిత్రాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు. ​కోట్లాది రూపాయల ప్రజాధనంతో స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ చేపడుతున్నందున, ప్రభుత్వాలు మారినప్పుడల్లా కార్డులపై ఫోటోలు మారుస్తూ నిధులు వృథా చేయవద్దని ఆయన సూచించారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. ​ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మారపల్లి రామచంద్రారెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకుడు పెద్ది మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పిట్టల కుమారస్వామి, నాయకులు చల్లగొండ ప్రభాకర్ రెడ్డి, గంట సత్యం, దాసరి రాజు, చకిలం రాజేశ్వరరావు, తాళ్ల శ్యామ్, పెద్దమ్మ నాగరాజు, పెద్దమ్మ శ్రీనివాస్, దాది మధుసూదన్, శీలం బిక్షపతి, దాట్ల సునీల్, ఇమ్మడి కరుణాకర్, కందుకూరి శ్రీకాంత్, మట్టెడ సుమన్, చల్పూరి శంకర్, కోయడ రాజు, ఆర్మీ శ్రీనివాస్, శ్రావణపల్లి రవీంద్ర చారి, కడుపికొండ పట్టాభి, ప్రవీణ్ రెడ్డి, రవీందర్ గౌడ్, సురేష్ గౌడ్, తిప్పన్నా, రవీందర్, కుంబర్కర్ సాయి తదితరులు పాల్గొన్నారు.
    1
    స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో ముద్రించాలి: తహసీల్దార్‌కు బీజేపీ వినతి
హసన్‌పర్తి:
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా జారీ చేయనున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాన్ని తప్పనిసరిగా ముద్రించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. హసన్‌పర్తి మండల బీజేపీ అధ్యక్షుడు మారం తిరుపతి ఆధ్వర్యంలో, బీజేపీ రాష్ట్ర నాయకులు, 66వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
​ఈ సందర్భంగా గురుమూర్తి శివకుమార్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ప్రతి నెలా ఉచితంగా 5 కిలోల బియ్యం అందిస్తున్నప్పటికీ, రేషన్ కార్డులపై కేవలం ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి చిత్రాలను మాత్రమే ముద్రించి, ప్రధాని మోదీ ఫోటోను విస్మరించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని గుర్తిస్తూ ప్రధాని చిత్రాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు.
​కోట్లాది రూపాయల ప్రజాధనంతో స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ చేపడుతున్నందున, ప్రభుత్వాలు మారినప్పుడల్లా కార్డులపై ఫోటోలు మారుస్తూ నిధులు వృథా చేయవద్దని ఆయన సూచించారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు.
​ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మారపల్లి రామచంద్రారెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకుడు పెద్ది మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పిట్టల కుమారస్వామి, నాయకులు చల్లగొండ ప్రభాకర్ రెడ్డి, గంట సత్యం, దాసరి రాజు, చకిలం రాజేశ్వరరావు, తాళ్ల శ్యామ్, పెద్దమ్మ నాగరాజు, పెద్దమ్మ శ్రీనివాస్, దాది మధుసూదన్, శీలం బిక్షపతి, దాట్ల సునీల్, ఇమ్మడి కరుణాకర్, కందుకూరి శ్రీకాంత్, మట్టెడ సుమన్, చల్పూరి శంకర్, కోయడ రాజు, ఆర్మీ శ్రీనివాస్, శ్రావణపల్లి రవీంద్ర చారి, కడుపికొండ పట్టాభి, ప్రవీణ్ రెడ్డి, రవీందర్ గౌడ్, సురేష్ గౌడ్, తిప్పన్నా, రవీందర్, కుంబర్కర్ సాయి తదితరులు పాల్గొన్నారు.
    user_ఆడెపు రాంకిషన్
    ఆడెపు రాంకిషన్
    Content Creator (YouTuber) వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    8 hrs ago
  • జనగామ బస్టాండ్లో దొంగల హల్చల్ : ప్రయాణికుడి డబ్బు మాయం జిల్లా కేంద్రమైన జనగామ బస్టాండ్లో రద్దీని ఆసరాగా చేసుకుని ఓ ప్రయాణికుడి వద్ద 20 వేల 6 వందల నగదు అపహరణకు గురైంది. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని లింగాల ఘణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన ఆంజనేయులు జనగామ నుంచి పాలకుర్తి వెళ్లే బస్సు ఎక్కే సమయంలో ఈ సంఘటన జరిగినట్లు బాధితుడు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేసిన ఫలితం లేకపోవడంతో పాటు బస్టాండ్లోని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    జనగామ బస్టాండ్లో దొంగల హల్చల్ : ప్రయాణికుడి డబ్బు మాయం
జిల్లా కేంద్రమైన జనగామ బస్టాండ్లో రద్దీని ఆసరాగా చేసుకుని ఓ ప్రయాణికుడి వద్ద 20 వేల 6 వందల నగదు అపహరణకు గురైంది. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని లింగాల ఘణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన ఆంజనేయులు జనగామ నుంచి పాలకుర్తి వెళ్లే బస్సు ఎక్కే సమయంలో ఈ సంఘటన జరిగినట్లు బాధితుడు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేసిన ఫలితం లేకపోవడంతో పాటు బస్టాండ్లోని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    10 hrs ago
  • తెలంగాణ ఆర్టీసీ బస్సు లో 80 మంది మహిళలు ఇద్దరే పురుషులు కండక్టర్ వీడియో వైరల్ *బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్* మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు. #తెలంగాణా
    1
    తెలంగాణ ఆర్టీసీ  బస్సు లో 80 మంది మహిళలు ఇద్దరే పురుషులు కండక్టర్ వీడియో వైరల్ 
*బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్*
మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.
#తెలంగాణా
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    22 hrs ago
  • గ్రామాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం - 4 కోట్ల 46 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు - వ్యవసాయ మార్కెట్ యార్డుల అభివృద్ధికి 3 కోట్ల 11 లక్షల రూపాయలు - పంచాయతీరాజ్,స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా,స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. బుధవారం తాడ్వాయి,ఏటూరునాగారం మండలాల్లో 4 కోట్ల 46 లక్షల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.తాడ్వాయి వ్యవసాయ మార్కెట్ యార్డులో 83 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.అనంతరం సీఆర్‌ఆర్–ప్లెయిన్‌ 2025–26 నిధులతో ఏటూరునాగారం మండలం శివాపూర్ గ్రామంలో 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డు, సీసీ డ్రైన్లను ప్రారంభించారు. శివాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోగుపల్లిలో 55 లక్షల రూపాయలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.అనంతరం ఏటూరునాగారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ నిధులు 2 కోట్ల 28 లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంల్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ..మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రహదారులు, మురుగునీటి కాలువల నిర్మాణంతోపాటు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వసతుల కల్పనకు అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్,మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి,జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ రఘు,స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    1
    గ్రామాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం
- 4 కోట్ల 46 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
- వ్యవసాయ మార్కెట్ యార్డుల అభివృద్ధికి 3 కోట్ల 11 లక్షల రూపాయలు
- పంచాయతీరాజ్,స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క
గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా,స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
బుధవారం తాడ్వాయి,ఏటూరునాగారం మండలాల్లో 4 కోట్ల 46 లక్షల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి  సీతక్క ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.తాడ్వాయి వ్యవసాయ మార్కెట్ యార్డులో 83 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.అనంతరం సీఆర్‌ఆర్–ప్లెయిన్‌ 2025–26 నిధులతో ఏటూరునాగారం మండలం శివాపూర్ గ్రామంలో 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డు, సీసీ డ్రైన్లను ప్రారంభించారు. శివాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోగుపల్లిలో 55 లక్షల రూపాయలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.అనంతరం ఏటూరునాగారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ నిధులు 2 కోట్ల 28 లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంల్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ..మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రహదారులు, మురుగునీటి కాలువల నిర్మాణంతోపాటు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వసతుల కల్పనకు అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్,మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి,జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ రఘు,స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    user_A.SHANKAR
    A.SHANKAR
    ములుగు, ములుగు, తెలంగాణ•
    1 hr ago
  • సీఎం రేవంత్‌తో కలిసి కాసు శేషమ్మకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నివాళి హైదరాబాద్ లో మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి తల్లి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కాసు వెంగళరెడ్డి సతీమణి కాసు శేషమ్మ ఇటీవల మరణించగా, బుధవారం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసు శేషమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు.
    1
    సీఎం రేవంత్‌తో కలిసి కాసు శేషమ్మకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నివాళి
హైదరాబాద్ లో మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి తల్లి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కాసు వెంగళరెడ్డి సతీమణి కాసు శేషమ్మ ఇటీవల మరణించగా, బుధవారం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాసు శేషమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • 4 కాళ్లు.. 4 చేతులతో శిశువు జననం, వైరల్ అవుతున్న వీడియో మధ్యప్రదేశ్‌లోని లవ్‌ఖుష్‌నగర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళకు 4 కాళ్లు, 4 చేతులతో మగశిశువు జన్మించాడు. అదనపు అవయవాలు శిశువు ఛాతీకి అనుసంధానమై ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వాటి బ్లడ్ సర్క్యులేషన్, ఎముకల అనుసంధానంపై పరీక్షలు నిర్వహించిన తర్వాత తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. జన్యుపరమైన కారణాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం శిశువును ఎయిర్ అంబులెన్స్‌లో జబల్‌పూర్‌కు తరలించారు.
    1
    4 కాళ్లు.. 4 చేతులతో శిశువు జననం, వైరల్ అవుతున్న వీడియో
మధ్యప్రదేశ్‌లోని లవ్‌ఖుష్‌నగర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళకు 4 కాళ్లు, 4 చేతులతో మగశిశువు జన్మించాడు. అదనపు అవయవాలు శిశువు ఛాతీకి అనుసంధానమై ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
వాటి బ్లడ్ సర్క్యులేషన్, ఎముకల అనుసంధానంపై పరీక్షలు నిర్వహించిన తర్వాత తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. జన్యుపరమైన కారణాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం శిశువును ఎయిర్ అంబులెన్స్‌లో జబల్‌పూర్‌కు తరలించారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    10 hrs ago
  • ఓనం వేడుకల్లో ఘనంగా అయ్యప్ప స్వామికి మహా పడిపూజ కార్యక్రమం MLG: గోవిందరావుపేటలోని శ్రీ హరిహర అయ్యప్ప స్వామి క్షేత్రంలో బుధవారం ఓనం పండుగ సందర్భంగా స్వామివారికి శుభయాత్ర, కోనేరులో చక్రస్నానం, అభిషేకం, మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు డింగరి రంగాచార్యుల ఆధ్వర్యంలో ధూపాటి సమ్మక్క–అంతయ్య కుటుంబ సభ్యులు కార్యక్రమాలు నిర్వహించారు. చైర్మన్ డాక్టర్ పీఎంకే గాంధీ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
    1
    ఓనం వేడుకల్లో ఘనంగా అయ్యప్ప స్వామికి మహా పడిపూజ కార్యక్రమం
MLG: గోవిందరావుపేటలోని శ్రీ హరిహర అయ్యప్ప స్వామి క్షేత్రంలో బుధవారం ఓనం పండుగ సందర్భంగా స్వామివారికి శుభయాత్ర, కోనేరులో చక్రస్నానం, అభిషేకం, మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు డింగరి రంగాచార్యుల ఆధ్వర్యంలో ధూపాటి సమ్మక్క–అంతయ్య కుటుంబ సభ్యులు కార్యక్రమాలు నిర్వహించారు. చైర్మన్ డాక్టర్ పీఎంకే గాంధీ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
    user_MAHI
    MAHI
    ములుగు, ములుగు, తెలంగాణ•
    1 hr ago
  • ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (ఫ్రెష్ బస్) ఆరుగురు మృతి, 20 మందికి గాయాలు బ్రేకింగ్ న్యూస్: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (ఫ్రెష్ బస్).. ఆరుగురు మృతి, 20 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా కోదాడ మండలం ద్వారకుంట వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ కోసం గాలిస్తున్న సూర్యాపేట జిల్లా పోలీసులు.
    1
    ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (ఫ్రెష్ బస్) ఆరుగురు మృతి, 20 మందికి గాయాలు
బ్రేకింగ్ న్యూస్: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (ఫ్రెష్ బస్).. ఆరుగురు మృతి, 20 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా కోదాడ మండలం ద్వారకుంట వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ కోసం గాలిస్తున్న సూర్యాపేట జిల్లా పోలీసులు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    10 hrs ago
  • కురవి మండలం నేరెడ శివారులో అనుమానాస్పదంగా ఉరివేసుకొని రైతు మృతి.. అనుమానాస్పదంగా రైతు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ శివారులో చోటు చేసుకుంది.. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు నేరెడ గ్రామానికి చెందిన మొగిలి రామ చంద్రయ్య (65) కి తన పొలం పక్కన మరో రైతు తో పొలం బాట విషయం లో పంచాయితీ జరుగుతుంది.. ఈ నేపథ్యంలో లో ఈ తెల్లవారు జామున రామ చంద్రయ్య తన పొలం వద్ద చెట్టుకు ఊరువేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ లు బాధిత కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి హత్యానా.. ఆత్మహత్య నా అనే కోణం లో దర్యాప్తు ప్రారంభించారు
    3
    కురవి మండలం నేరెడ శివారులో అనుమానాస్పదంగా ఉరివేసుకొని రైతు మృతి..
అనుమానాస్పదంగా రైతు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ శివారులో చోటు చేసుకుంది.. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు నేరెడ గ్రామానికి చెందిన మొగిలి రామ చంద్రయ్య (65) కి తన పొలం పక్కన మరో రైతు తో పొలం బాట విషయం లో పంచాయితీ జరుగుతుంది.. ఈ నేపథ్యంలో లో ఈ తెల్లవారు జామున రామ చంద్రయ్య తన పొలం వద్ద చెట్టుకు ఊరువేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ లు బాధిత కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి హత్యానా.. ఆత్మహత్య నా అనే కోణం లో దర్యాప్తు ప్రారంభించారు
    user_కిరణ్ చెల్లమల్ల
    కిరణ్ చెల్లమల్ల
    మరిపెడ, మహబూబాబాద్, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.