లక్ష్మీ నరసింహ స్వామి జాతర బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి:లక్ష్మీ నరసింహ స్వామి జాతర బ్రహ్మోత్సవాలు విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులకు సూచించారు. బుధవారం రేగొండ మండలం కొడవటంచలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్‌లతో కలిసి పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 18 నుంచి పునఃప్రతిష్ఠ 26 నుంచి జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,ఈ నెల 18 నుంచి 21 వరకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 వరకు జాతర బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయని వెల్లడించారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. ఈ నెల 21న త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి, శాసనసభ స్పీకర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితర వీఐపీలు స్వామివారి దర్శనార్థం కొడవటంచకు రానున్నట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సుమారు రూ.12 కోట్ల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణం చేపట్టినందున భక్తులకు త్రాగునీరు, మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు జాతర సందర్భంగా తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేయాలని, చుట్టుపక్కల జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపాలని సూచించారు. ఆలయ ఆవరణలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసర పరిస్థితుల కోసం అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని తెలిపారు. అగ్నిమాపక వాహనాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రహదారుల శుభ్రత, పార్కింగ్ సదుపాయాలు కొడవటంచకు వచ్చే ప్రధాన రహదారుల ఇరువైపుల పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు తొలగించాలని సూచించారు. వీఐపీలు ఇతర ప్రైవేట్ వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను గుర్తించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రతిరోజూ అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు జాతర రోజుల్లో ప్రతిరోజూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.అలాగే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అధికారులు అంకితభావంతో పనిచేయాలి కలెక్టర్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, విగ్రహ పునఃప్రతిష్ఠ జాతర బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయం కీలకమని, ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ బందోబస్తు ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ, జాతర పునఃప్రతిష్ఠ కార్యక్రమాలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీఐపీల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేయనున్నట్లు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖ తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం మేళతాళాలతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ పునర్నిర్మించిన ఆలయం వద్ద గుమ్మడికాయ కొట్టి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీ నరసింహ స్వామి జాతర బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి:లక్ష్మీ నరసింహ స్వామి జాతర బ్రహ్మోత్సవాలు విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులకు సూచించారు. బుధవారం రేగొండ మండలం కొడవటంచలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్‌లతో కలిసి పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 18 నుంచి పునఃప్రతిష్ఠ 26 నుంచి జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,ఈ నెల 18 నుంచి 21 వరకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 వరకు జాతర బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయని వెల్లడించారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. ఈ నెల 21న త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి, శాసనసభ స్పీకర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితర వీఐపీలు స్వామివారి దర్శనార్థం కొడవటంచకు రానున్నట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సుమారు రూ.12 కోట్ల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణం చేపట్టినందున భక్తులకు త్రాగునీరు, మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు జాతర సందర్భంగా తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేయాలని, చుట్టుపక్కల జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపాలని సూచించారు. ఆలయ ఆవరణలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు
చేయడంతో పాటు అత్యవసర పరిస్థితుల కోసం అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని తెలిపారు. అగ్నిమాపక వాహనాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రహదారుల శుభ్రత, పార్కింగ్ సదుపాయాలు కొడవటంచకు వచ్చే ప్రధాన రహదారుల ఇరువైపుల పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు తొలగించాలని సూచించారు. వీఐపీలు ఇతర ప్రైవేట్ వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను గుర్తించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రతిరోజూ అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు జాతర రోజుల్లో ప్రతిరోజూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.అలాగే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అధికారులు అంకితభావంతో పనిచేయాలి కలెక్టర్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, విగ్రహ పునఃప్రతిష్ఠ జాతర బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయం కీలకమని, ఎలాంటి
సమస్యలు తలెత్తినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ బందోబస్తు ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ, జాతర పునఃప్రతిష్ఠ కార్యక్రమాలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీఐపీల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేయనున్నట్లు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖ తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం మేళతాళాలతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ పునర్నిర్మించిన ఆలయం వద్ద గుమ్మడికాయ కొట్టి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- కలెక్టరేట్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) మ్యాపింగ్‌పై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. 2025 ఓటర్ జాబితాను 2002 ఎస్.ఐ.ఆర్‌తో మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రోజుకు కనీసం 50 మ్యాపింగ్‌లు పూర్తి చేసి, వారం రోజుల్లో ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు.1
- మోకుదెబ్బ రమేష్ గౌడ్ పిలుపు... తొలి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్పోర్తి తో రాజకీయంగా ఎదగాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ అన్నారు.నర్సంపేట పట్టణం లోని కంఠ మహేశ్వరుని ఆలయం ఆవరణలో వరంగల్ జిల్లాలో ఇటీవల నూతనం గా కౌన్సిలర్ లుగా ఎన్నికైన వేముల సంధ్య- సాంబయ్య గౌడ్, జూలూరి రోజా రాణి, దొమ్మటి రమ్య-సంతోష్ గౌడ్ లకు గౌడ కులస్తులకు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదె బ్బ వరంగల్ జిల్లాకమిటీ,నర్సం పేట జిడబ్ల్యూఎస్, నర్సంపేట పట్టణ గౌడ సంఘాల నాయకులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, మద్దెల శ్రీనివాస్ గౌడ్,గండి లింగయ్య గౌడ్, మాచర్ల ఐలుమల్లు గౌడ్, గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్, గోడిశాల సదానందం గౌడ్, మద్దెల సాంబయ్య గౌడ్ అధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరి గింది. ఈ సంధర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ మూడు దశబ్దాల క్రితమే సామాన్య గీత కార్మికుల కుటుంబంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 12 కోటలను జయించి గోల్కొండ కోట పరిపాలన చేసిన చక్రవర్తిగా పేరు గదించడం జరిగిందన్నారు.ఈ రోజు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగిన రాజకీయంగా వెనుకబడి పోతున్నామన్నారు.గౌడ కులస్తులు ఐక్యతగా ఉండి అభివృద్ధి చెందా లని రమేష్ గౌడ్ తెలిపారు.అనంతరం నూతన గౌడ కౌన్సిలర్ కు శాలువ, షీల్డ్, పూలమాలతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు గిరాగాని సాంబయ్య గౌడ్, కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్, తాళ్లపెల్లి చంద్ర మౌళి గౌడ్,జూలూరి మనీష్ గౌడ్, కల్లెపు వెంకట్ నారాయణ గౌడ్, మర్ద గణేష్ గౌడ్, జనగాం మల్లికార్జున్ గౌడ్, నాంపల్లి వెంకటేశ్వర్లు గౌడ్,వేముల ఐలు సమ్మయ్య గౌడ్,నాగేల్లి సారంగం గౌడ్, గండి నర్సయ్య గౌడ్,నాతి సదానందం గౌడ్, గాదెగోని బాబు గౌడ్,కక్కేర్ల అశోక్ గౌడ్, తాళ్లపెల్లి కృష్ణ గౌడ్, ఊడ్గుల శ్రీనివాస్ గౌడ్, గండి రాము గౌడ్, బూర వేణు గౌడ్, వేముల కృష్ణ గౌడ్,తాబేటీ లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.2
- మంగళవారం రోజు అర్ధరాత్రి నాయుడు పంపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదంలో కారు నుజులు అయింది కారు వెనుక ముందు నెంబర్ ప్లేట్ లేకపోవడం గమనార్హం3
- వర్ధన్నపేట | వరంగల్ జిల్లా: ప్రజలిచ్చిన తీర్పును కాదని, ఎక్స్ అఫీషియో ఓటుతో అడ్డదారిలో వర్ధన్నపేట మున్సిపాలిటీని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆరోపించారు. భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకల సందర్భంగా వర్ధన్నపేటలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో స్థానిక ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజుపై ఆరూరి రమేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అభివృద్ధిపై మాట్లాడే దమ్ము లేక అడ్డగోలు ప్రచారాలు చేస్తూ డైవర్షన్ డ్రామాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. వర్ధన్నపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేసిన ఘనత పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా వర్ధన్నపేటలో “తట్టెడు మట్టి కూడా తీయలేదని” ఎద్దేవా చేశారు. సబ్జెక్ట్ మాట్లాడడం చేతకాక వ్యక్తిగత దూషణలకు దిగుతున్న కేఆర్ నాగరాజు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని నైతికంగా మాట్లాడాలని హితవు పలికారు. ఇసుక మాఫియా నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి వరంగల్‌లో కోట్ల విలువైన గెస్ట్ హౌస్ కొనుగోలు చేశారని ఆరోపిస్తూ, అలాంటి వ్యక్తికి తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కులాలు, మతాలు, సంప్రదాయాలను గౌరవించని ఎమ్మెల్యే ఇకపై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వర్ధన్నపేట అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు సహకరిస్తామని, అయితే వ్యక్తిగత దూషణలు మరియు డైవర్షన్ రాజకీయాలకు దిగితే గట్టిగా ఎదుర్కుంటామని ఆరూరి రమేష్ స్పష్టం చేశారు.1
- మహారాష్ట్ర | సాతారా జిల్లా: సాతారా జిల్లాలోని దేరే గ్రామానికి చెందిన భారత సైనికుడు ప్రమోద్ పరశురాం జాధవ్ విధి నిర్వహణలో అమరుడయ్యారు. ఆయన మృతి వార్త గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది. హృదయాన్ని కలిచివేసే దృశ్యంలో… కేవలం 8 గంటల క్రితం జన్మించిన తమ నవజాత కుమార్తెతో కలిసి, ప్రసవం అనంతరం స్ట్రెచర్‌పైనే ఉన్న ఆయన భార్య, తన వీర భర్తకు చివరి వీడ్కోలు పలికారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రేకెత్తించింది. సరిహద్దుల్లో దేశ శాంతి కోసం ప్రాణాలర్పించే జవానుల త్యాగానికి ఇది మరో ఉదాహరణ. వ్యక్తిగత ఆనందాలను పక్కనపెట్టి, కుటుంబాన్ని వదిలి, దేశ భద్రతకే తొలి ప్రాధాన్యం ఇచ్చే మన సైనికుల ధైర్యానికి ఈ ఘటన నిదర్శనం. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ… “ఇది ప్రేమకథ కాదు – త్యాగగాథ. మనందరి శాంతికోసం తమ జీవితాలనే అర్పిస్తున్న జవానుల్ని మనం స్మరించుకోవాలి” అన్నారు. భారత సైన్యం మన గర్వం. మన రక్షణ కవచం. వీర అమర జవాన్ జాధవ్‌కు శతకోటి వందనాలు. వారి కుటుంబానికి దేశమంతా సెల్యూట్. 🙏🇮🇳1
- వరంగల్ : వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఐదేళ్లుగా ఇన్ సర్వీస్ విద్యార్థులకు పేపర్లు లీక్ అవుతున్నట్లు సిఐడి గుర్తించింది. తాజా విద్యా సంవత్సరంలో వరంగల్ అగ్రికల్చర్ కాలేజీకి చెందిన జూ.అసిస్టెంట్ కార్తీక్ ఫోన్ ద్వారా ఫొటోలు తీసి, విద్యార్థిని జ్యోతి ద్వారా ఈ చైన్ సిస్టమ్ నడిపించినట్లు తేలింది. ఈ లీకేజీ నెట్వర్క్ వరంగల్ నుంచి జగిత్యాల, అశ్వరావుపేట, రాజేంద్రనగర్ సహా పలు జిల్లాలకు విస్తరించడంతో లోతైన విచారణ కొనసాగుతోంది.1
- కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం పరిధిలో ఉన్న తుర్ఖాసినగర్ రైల్వే గేట్ వద్ద నిత్యం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రం అయిన కరీంనగర్ నుండి జగిత్యాల జిల్లా కేంద్రం వరకు వెళ్లే ప్రధాన మార్గంలో ఈ రైల్వే గేట్ ఉండటంతో ప్రతిరోజూ రైళ్లు రాకపోకల సమయంలో గేటు మూసివేయడంతో వందలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా జగిత్యాల నుండి కరీంనగర్‌కు అత్యవసర వైద్యం కోసం రోగులను తరలిస్తున్న అంబులెన్సులు కూడా ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుండటంతో ప్రాణాపాయం ఏర్పడుతున్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వాహనదారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.1
- ఫిబ్రవరి 19న చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని హిందూ వాహిని ఆధ్వర్యంలో వరంగల్ కాజీపేట హనుమకొండలో భారీ శోభాయాత్ర, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈసారి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు బుధవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రముఖ సూర్య ప్రకాష్ రెడ్డి, వరంగల్ సంయోజాక్ చత్రపతి శివాజీ, రామ్ శర్మ, ప్రవీణ్ దాదా, సాగర్ పాల్గొన్నారు.1