Breaking భద్రాద్రి కొత్తగూడెం .....భద్రాచలం వద్ద గోదావరి నది రెండో బ్రిడ్జి పనులు పరిశీలించిన మంత్రి తుమ్మల ...మంత్రి తుమ్మల కామెంట్స్ ........భద్రాచలం రామాలయం దర్శనానికి వచ్చే భక్తులు సౌకర్యం కోసం రెండో బ్రిడ్జి నిర్మాణం .....2015 లో గోదావరి పుష్కరాల సందర్భంగా వచ్చిన లక్షలాది మంది భక్తులకు ఒకే బ్రిడ్జి వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు .....అమరావతి టూ జగధల్ పూర్ జాతీయ రహదారి భద్రాచలం మీదుగా ప్లాన్ చేసి రెండో బ్రిడ్జి నిర్మాణం .....బ్రిడ్జి అప్రోచ్ వరద కోతకు గుర్వకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం ....ఈ నెలలో గోదావరి రెండో బ్రిడ్జి పై రాకపోకలు .....వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అందుబాటులోకి రెండో బ్రిడ్జి .....గత ప్రభుత్వంలో బ్రిడ్జి నిర్మాణం పనులు నత్త నడకన సాగాయి .....ఏపీ చత్తీస్ గడ్ ఒడిషా వయా భద్రాచలం వెళ్ళే ప్రయాణీకులకు రెండో బ్రిడ్జి ఎంతో సౌకర్యంగా మారుతుంది.
Breaking భద్రాద్రి కొత్తగూడెం .....భద్రాచలం వద్ద గోదావరి నది రెండో బ్రిడ్జి పనులు పరిశీలించిన మంత్రి తుమ్మల ...మంత్రి తుమ్మల కామెంట్స్ ........భద్రాచలం రామాలయం దర్శనానికి వచ్చే భక్తులు సౌకర్యం కోసం రెండో బ్రిడ్జి నిర్మాణం .....2015 లో గోదావరి పుష్కరాల సందర్భంగా వచ్చిన లక్షలాది మంది
భక్తులకు ఒకే బ్రిడ్జి వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు .....అమరావతి టూ జగధల్ పూర్ జాతీయ రహదారి భద్రాచలం మీదుగా ప్లాన్ చేసి రెండో బ్రిడ్జి నిర్మాణం .....బ్రిడ్జి అప్రోచ్ వరద కోతకు గుర్వకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం ....ఈ నెలలో గోదావరి రెండో బ్రిడ్జి పై రాకపోకలు .....వచ్చే
ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అందుబాటులోకి రెండో బ్రిడ్జి .....గత ప్రభుత్వంలో బ్రిడ్జి నిర్మాణం పనులు నత్త నడకన సాగాయి .....ఏపీ చత్తీస్ గడ్ ఒడిషా వయా భద్రాచలం వెళ్ళే ప్రయాణీకులకు రెండో బ్రిడ్జి ఎంతో సౌకర్యంగా మారుతుంది.
- అశ్వారావుపేట బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్ అశ్వారావుపేట బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బ్లాక్ మనీ పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని కోట్ల ఆశలు చూపిస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రసాయనాలతో నల్లటి కాగితాలను అసలు కరెన్సీ నోట్లుగా మారుస్తామని నమ్మించి లక్షల రూపాయలు కాజేసిన నిందితుడి బండారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. అంతేకాదు, నకిలీ నోట్ల దందా కోసం వాట్సాప్ గ్రూపుల్లో సెల్ఫీ వీడియోలు విడుదల చేసి తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు… అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టిపాటి ప్రేమ్‌చందు అనే వ్యక్తి బ్లాక్ మనీ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడనే ఫిర్యాదు అందడంతో పోలీసులు విచారణ చేపట్టారు.నిందితుడు మొదట రూ.500 అసలు నోటును ప్రత్యేక రసాయన ద్రావణంలో ముంచి, అదే విధంగా నల్లటి కాగితాలను కూడా అసలు నోట్లుగా మార్చవచ్చని బాధితుడిని నమ్మించాడు. ఈ మాయమాటలను నమ్మిన బాధితుడి నుంచి తొలుత రూ.11 లక్షలు, అనంతరం రసాయనాల కొనుగోలు పేరుతో మరో రూ.2 లక్షలు తీసుకుని మొత్తం రూ.13 లక్షలు కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు వాట్సాప్ గ్రూపుల్లో వీడియోలు విడుదల చేస్తూ, “నకిలీ నోట్లు, బ్లాక్ మనీ మార్పిడి” పేరుతో తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రచారాన్ని నమ్మిన పలువురిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.ఇక నిందితుడిపై గతంలో కూడా నకిలీ కరెన్సీ, మోటార్‌సైకిల్ దొంగతనాలు తదితర కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. బాచుపల్లి, రామచంద్రపురం, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లలో కూడా అతనిపై పలు కేసులు ఉన్నట్లు వెల్లడించారు. పోలీసులు నిందితుడి వద్ద నుంచి రూ.500 నోట్ల పరిమాణంలో కట్ చేసిన 20 వేల బ్లాక్ పేపర్లు,నోట్లుగా మారుస్తామని చెప్పేందుకు ఉపయోగించిన రెండు రసాయన ద్రావణాల సీసాలను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.బ్లాక్ మనీ, నకిలీ నోట్లు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పోలీసులు ప్రజలకు హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. బైట్: ఆర్. సతీష్ కుమార్, డీఎస్పీ, పాల్వంచ.3
- హైదరాబాద్‌లో భారీగా మసాలా పదార్థాల ఆహార కల్తీ గుట్టురట్టు హెచ్-ఫాస్ట్ (H-FAST), జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు 13 సంస్థల్లో తనిఖీలు నిర్వహించి 25 వేల కిలోల మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు. మసాలా దినుసుల్లో సింథటిక్ రంగులు, ఇండస్ట్రియల్ డైలు, టాల్కమ్ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ కలిపి రంగు, మెరుపు, బరువు పెంచినట్లు అధికారులు గుర్తించారు. ఇవి క్యాన్సర్‌తో పాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గత 140 రోజుల్లో హెచ్-ఫాస్ట్ 659 తనిఖీలు నిర్వహించి 202 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. దాదాపు 2.46 లక్షల కిలోల అనుమానిత కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో మసాలా దినుసులు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, మాంసం, పనీర్, పాల ఉత్పత్తులు, పండ్లు, ఊరగాయలు, టీ పొడి, తాగునీరు ఉన్నాయి.1
- ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై పూర్తిస్థాయిలో మొదలైన రాకపోకలు రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ఖమ్మం -దేవరపల్లి మధ్య 165 కి.మీ మేర నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ హైవే పై రాకపోకలు పూర్తిస్థాయిలో మొదలయ్యాయి.ఇప్పటికే వైరా మండలం వద్ద ఎగ్జిట్ ఎంట్రీ నుంచి వాహనాలను అనుమతిస్తుండగా తాజాగా ప్రారంభ స్థానమైన ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద నుంచి రాకపోకలకు అనుమతించారు. ఈ రహదారి నిర్మాణంతో ఏపీ వెళ్లే వారికి సుమారు 100 కి.మీ. కలిసి రానుంది.1
- పక్షవాతంతో బాధపడుతున్న నా తండ్రి చికిత్స కోసం, అలాగే నా కుటుంబ పోషణ కోసం చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం. మీ ఆదరణ, ఆశీర్వాదమే నాకు పెద్ద బలం. ధన్యవాదాలు." పక్షవాతంతో బాధపడుతున్న నా తండ్రి చికిత్స కోసం, అలాగే నా కుటుంబ పోషణ కోసం చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం. మీ ఆదరణ, ఆశీర్వాదమే నాకు పెద్ద బలం. ధన్యవాదాలు."1