అశ్వారావుపేట బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్ అశ్వారావుపేట బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బ్లాక్ మనీ పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని కోట్ల ఆశలు చూపిస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రసాయనాలతో నల్లటి కాగితాలను అసలు కరెన్సీ నోట్లుగా మారుస్తామని నమ్మించి లక్షల రూపాయలు కాజేసిన నిందితుడి బండారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. అంతేకాదు, నకిలీ నోట్ల దందా కోసం వాట్సాప్ గ్రూపుల్లో సెల్ఫీ వీడియోలు విడుదల చేసి తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు… అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టిపాటి ప్రేమ్‌చందు అనే వ్యక్తి బ్లాక్ మనీ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడనే ఫిర్యాదు అందడంతో పోలీసులు విచారణ చేపట్టారు.నిందితుడు మొదట రూ.500 అసలు నోటును ప్రత్యేక రసాయన ద్రావణంలో ముంచి, అదే విధంగా నల్లటి కాగితాలను కూడా అసలు నోట్లుగా మార్చవచ్చని బాధితుడిని నమ్మించాడు. ఈ మాయమాటలను నమ్మిన బాధితుడి నుంచి తొలుత రూ.11 లక్షలు, అనంతరం రసాయనాల కొనుగోలు పేరుతో మరో రూ.2 లక్షలు తీసుకుని మొత్తం రూ.13 లక్షలు కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు వాట్సాప్ గ్రూపుల్లో వీడియోలు విడుదల చేస్తూ, “నకిలీ నోట్లు, బ్లాక్ మనీ మార్పిడి” పేరుతో తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రచారాన్ని నమ్మిన పలువురిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.ఇక నిందితుడిపై గతంలో కూడా నకిలీ కరెన్సీ, మోటార్‌సైకిల్ దొంగతనాలు తదితర కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. బాచుపల్లి, రామచంద్రపురం, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లలో కూడా అతనిపై పలు కేసులు ఉన్నట్లు వెల్లడించారు. పోలీసులు నిందితుడి వద్ద నుంచి రూ.500 నోట్ల పరిమాణంలో కట్ చేసిన 20 వేల బ్లాక్ పేపర్లు,నోట్లుగా మారుస్తామని చెప్పేందుకు ఉపయోగించిన రెండు రసాయన ద్రావణాల సీసాలను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.బ్లాక్ మనీ, నకిలీ నోట్లు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పోలీసులు ప్రజలకు హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. బైట్: ఆర్. సతీష్ కుమార్, డీఎస్పీ, పాల్వంచ.
అశ్వారావుపేట బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్ అశ్వారావుపేట బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బ్లాక్ మనీ పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని కోట్ల ఆశలు చూపిస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రసాయనాలతో నల్లటి కాగితాలను అసలు కరెన్సీ నోట్లుగా మారుస్తామని నమ్మించి లక్షల రూపాయలు కాజేసిన నిందితుడి బండారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. అంతేకాదు, నకిలీ నోట్ల దందా కోసం వాట్సాప్ గ్రూపుల్లో సెల్ఫీ వీడియోలు విడుదల చేసి తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు… అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టిపాటి ప్రేమ్‌చందు అనే వ్యక్తి బ్లాక్ మనీ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడనే
ఫిర్యాదు అందడంతో పోలీసులు విచారణ చేపట్టారు.నిందితుడు మొదట రూ.500 అసలు నోటును ప్రత్యేక రసాయన ద్రావణంలో ముంచి, అదే విధంగా నల్లటి కాగితాలను కూడా అసలు నోట్లుగా మార్చవచ్చని బాధితుడిని నమ్మించాడు. ఈ మాయమాటలను నమ్మిన బాధితుడి నుంచి తొలుత రూ.11 లక్షలు, అనంతరం రసాయనాల కొనుగోలు పేరుతో మరో రూ.2 లక్షలు తీసుకుని మొత్తం రూ.13 లక్షలు కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు వాట్సాప్ గ్రూపుల్లో వీడియోలు విడుదల చేస్తూ, “నకిలీ నోట్లు, బ్లాక్ మనీ మార్పిడి” పేరుతో తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రచారాన్ని నమ్మిన పలువురిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.ఇక నిందితుడిపై గతంలో కూడా నకిలీ కరెన్సీ, మోటార్‌సైకిల్ దొంగతనాలు తదితర కేసులు
నమోదైనట్లు పోలీసులు తెలిపారు. బాచుపల్లి, రామచంద్రపురం, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లలో కూడా అతనిపై పలు కేసులు ఉన్నట్లు వెల్లడించారు. పోలీసులు నిందితుడి వద్ద నుంచి రూ.500 నోట్ల పరిమాణంలో కట్ చేసిన 20 వేల బ్లాక్ పేపర్లు,నోట్లుగా మారుస్తామని చెప్పేందుకు ఉపయోగించిన రెండు రసాయన ద్రావణాల సీసాలను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.బ్లాక్ మనీ, నకిలీ నోట్లు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పోలీసులు ప్రజలకు హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. బైట్: ఆర్. సతీష్ కుమార్, డీఎస్పీ, పాల్వంచ.
- అశ్వారావుపేట బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్ అశ్వారావుపేట బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బ్లాక్ మనీ పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని కోట్ల ఆశలు చూపిస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రసాయనాలతో నల్లటి కాగితాలను అసలు కరెన్సీ నోట్లుగా మారుస్తామని నమ్మించి లక్షల రూపాయలు కాజేసిన నిందితుడి బండారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. అంతేకాదు, నకిలీ నోట్ల దందా కోసం వాట్సాప్ గ్రూపుల్లో సెల్ఫీ వీడియోలు విడుదల చేసి తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు… అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టిపాటి ప్రేమ్‌చందు అనే వ్యక్తి బ్లాక్ మనీ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడనే ఫిర్యాదు అందడంతో పోలీసులు విచారణ చేపట్టారు.నిందితుడు మొదట రూ.500 అసలు నోటును ప్రత్యేక రసాయన ద్రావణంలో ముంచి, అదే విధంగా నల్లటి కాగితాలను కూడా అసలు నోట్లుగా మార్చవచ్చని బాధితుడిని నమ్మించాడు. ఈ మాయమాటలను నమ్మిన బాధితుడి నుంచి తొలుత రూ.11 లక్షలు, అనంతరం రసాయనాల కొనుగోలు పేరుతో మరో రూ.2 లక్షలు తీసుకుని మొత్తం రూ.13 లక్షలు కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు వాట్సాప్ గ్రూపుల్లో వీడియోలు విడుదల చేస్తూ, “నకిలీ నోట్లు, బ్లాక్ మనీ మార్పిడి” పేరుతో తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రచారాన్ని నమ్మిన పలువురిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.ఇక నిందితుడిపై గతంలో కూడా నకిలీ కరెన్సీ, మోటార్‌సైకిల్ దొంగతనాలు తదితర కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. బాచుపల్లి, రామచంద్రపురం, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లలో కూడా అతనిపై పలు కేసులు ఉన్నట్లు వెల్లడించారు. పోలీసులు నిందితుడి వద్ద నుంచి రూ.500 నోట్ల పరిమాణంలో కట్ చేసిన 20 వేల బ్లాక్ పేపర్లు,నోట్లుగా మారుస్తామని చెప్పేందుకు ఉపయోగించిన రెండు రసాయన ద్రావణాల సీసాలను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.బ్లాక్ మనీ, నకిలీ నోట్లు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పోలీసులు ప్రజలకు హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. బైట్: ఆర్. సతీష్ కుమార్, డీఎస్పీ, పాల్వంచ.3
- గీతన్నల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్.. కురవిలో నిర్వహించిన గీతన్నల చైతన్యయాత్ర సభలో కేజికేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రమణ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని, కొత్తగా ఎలాంటి డిమాండ్లు చేయడం లేదన్నారు. గీతన్నల హక్కుల సాధన కోసం పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ నెల 18న ట్యాంక్‌బండ్‌పై సర్ధార్ సర్వాయిపాపన్న గౌడ్ విగ్రహాన్ని ప్రభుత్వం ఆవిష్కరించాలని, లేకుంటే గౌడబిడ్డలే స్వయంగా విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కేజికేఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులు, గౌడ సంఘాల ప్రతినిధులు, యువజన నాయకులు పాల్గొన్నారు.1
- పాఠశాల సమస్యలు పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి ఉద్యమం చేస్తామని పీడీఎస్‌యూ హెచ్చరిక తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించడం లేదని ఆరోపిస్తూ పీడీఎస్‌యూ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం, పాఠశాల సమస్యల పరిష్కారం కోరుతూ మండల విద్యాశాఖ అధికారి రాంబాబుకు వినతిపత్రం అందజేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి ఉద్యమాలు చేపడతామని పీడీఎస్‌యూ హెచ్చరించింది4
- ఒక ధైర్యవంతురాలైన అమ్మాయి రాహుల్ గాంధీ బండారం బయటపెట్టింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జంతర్ మంతర్ వరకు వెళ్లి తన గళం వినిపించగలిగిన ఆయన, ఇప్పుడు అక్కడ అధికారంలో ఉండి కూడా విద్యార్థులకు అండగా నిలబడటానికి ఝార్ఖండ్‌కు ఎందుకు రావడం లేదు?1
- హైదరాబాద్‌లో భారీగా మసాలా పదార్థాల ఆహార కల్తీ గుట్టురట్టు హెచ్-ఫాస్ట్ (H-FAST), జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు 13 సంస్థల్లో తనిఖీలు నిర్వహించి 25 వేల కిలోల మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు. మసాలా దినుసుల్లో సింథటిక్ రంగులు, ఇండస్ట్రియల్ డైలు, టాల్కమ్ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ కలిపి రంగు, మెరుపు, బరువు పెంచినట్లు అధికారులు గుర్తించారు. ఇవి క్యాన్సర్‌తో పాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గత 140 రోజుల్లో హెచ్-ఫాస్ట్ 659 తనిఖీలు నిర్వహించి 202 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. దాదాపు 2.46 లక్షల కిలోల అనుమానిత కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో మసాలా దినుసులు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, మాంసం, పనీర్, పాల ఉత్పత్తులు, పండ్లు, ఊరగాయలు, టీ పొడి, తాగునీరు ఉన్నాయి.1
- వృద్ధ దంపతుల ఇంట్లో పనిమనిషిగా పని చేస్తు 90 గ్రాముల బంగారం కొట్టేసిన కిలాడి... వృద్ధ దంపతుల ఇంట్లో పనిమనిషిగా పని చేస్తు 90 గ్రాముల బంగారం కొట్టేసిన కిలాడి... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం కాకతీయ నగర్ లో నివసిస్తున్న వృధా దంపతుల ఇంట్లో పనిమనిషిగా చేరింది వేమూరి శిబారాణి ఆలియాస్ సీత.. ఈమె స్వస్థలం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం టేకులగూడెం స్వగ్రామం.. ఇంట్లో పని చేస్తూనే వృద్ధ దంపతులకు చెందిన బంగారు ఆభరణాలపై ఈమె కన్ను పడింది.. జూన్ 7వ తేదీన ఇంటి యజమాని నిద్రిస్తున్న సమయంలో చాకచక్యంగా బీరువా తాళాలు తెరిచింది అందులో ఉన్న ఆభరణాలు తన స్వగ్రామానికి తీసుకువెళ్లి భర్తకు అప్పగించింది. అనంతరం అందులో ఉన్న ఒక బంగారు చైను ఇల్లందులోని ఒక ప్రైవేట్ బ్యాంకులో తనకా పెట్టి వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చుకున్నారు. వృద్ధ దంపతుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఆమె కదలికలపై నిఘా ఉంచారు . మిగిలిన బంగారాన్ని ఖమ్మంలో విక్రయించాలని పథకం వేశారు ఇల్లందు పట్టణం నుంచి ఖమ్మం వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉండగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వీరి ప్రవర్తన పై అనుమానం వచ్చి విచారించగా వీరి వద్ద ఉన్న బంగారం విషయం బయటపడింది.. అనంతరం 10 రకాల బంగారు ఆభరణాలు మొత్తం 90 గ్రాములవి స్వాధీనం చేసుకుని నిందితురాలని అదుపులో తీసుకొని రిమాండ్ కు తరలించారు1
- బాధితుల కథనం ప్రకారం, ఫిర్యాదు స్వీకరించాల్సిన స్థానంలో ఎస్ఐ తన ఛాంబర్‌లోకి పిలిచి తమను, తమ *ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన అంగన్‌వాడీ టీచర్లతో ఎస్ఐ దురుసు ప్రవర్తన..? స్పృహ కోల్పోయిన టీచర్.* మహబూబాబాద్, ఆగస్టు 4 (షురూ న్యూస్): మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని దొనకొండ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ టీచర్ ఆవుల మంజుల, హెల్పర్ వెంకటలక్ష్మి తమను వేధిస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు దంతాలపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, అక్కడ ఎస్ఐ రవికుమార్ తమతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. బాధితుల కథనం ప్రకారం, ఫిర్యాదు స్వీకరించాల్సిన స్థానంలో ఎస్ఐ తన ఛాంబర్‌లోకి పిలిచి తమను, తమ భర్తలను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు "తొక్కి చంపుతాం" అంటూ బెదిరించారని పేర్కొన్నారు. మహిళలమనే కనీస గౌరవం కూడా ఇవ్వకుండా అవమానకరంగా ప్రవర్తించారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన అంగన్‌వాడీ టీచర్ ఆవుల మంజుల పోలీస్ స్టేషన్‌లోనే స్పృహ కోల్పోయి కిందపడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పాటు తొర్రూరు సీఐ గణేష్‌కు కూడా పిటిషన్ అందజేశారు. తమను అవమానించిన ఎస్ఐపై వెంటనే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని, లేదంటే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. *గమనిక:* ఈ కథనం బాధితులు చేసిన ఆరోపణల ఆధారంగా రూపొందించబడింది. ఘటనపై పోలీసుల అధికారిక స్పందన రావాల్సి ఉంది. *— నిమ్మనగంటి అనిల్ బాబు* *షురూ న్యూస్*1