బాధితుల కథనం ప్రకారం, ఫిర్యాదు స్వీకరించాల్సిన స్థానంలో ఎస్ఐ తన ఛాంబర్‌లోకి పిలిచి తమను, తమ *ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన అంగన్‌వాడీ టీచర్లతో ఎస్ఐ దురుసు ప్రవర్తన..? స్పృహ కోల్పోయిన టీచర్.* మహబూబాబాద్, ఆగస్టు 4 (షురూ న్యూస్): మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని దొనకొండ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ టీచర్ ఆవుల మంజుల, హెల్పర్ వెంకటలక్ష్మి తమను వేధిస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు దంతాలపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, అక్కడ ఎస్ఐ రవికుమార్ తమతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. బాధితుల కథనం ప్రకారం, ఫిర్యాదు స్వీకరించాల్సిన స్థానంలో ఎస్ఐ తన ఛాంబర్‌లోకి పిలిచి తమను, తమ భర్తలను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు "తొక్కి చంపుతాం" అంటూ బెదిరించారని పేర్కొన్నారు. మహిళలమనే కనీస గౌరవం కూడా ఇవ్వకుండా అవమానకరంగా ప్రవర్తించారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన అంగన్‌వాడీ టీచర్ ఆవుల మంజుల పోలీస్ స్టేషన్‌లోనే స్పృహ కోల్పోయి కిందపడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పాటు తొర్రూరు సీఐ గణేష్‌కు కూడా పిటిషన్ అందజేశారు. తమను అవమానించిన ఎస్ఐపై వెంటనే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని, లేదంటే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. *గమనిక:* ఈ కథనం బాధితులు చేసిన ఆరోపణల ఆధారంగా రూపొందించబడింది. ఘటనపై పోలీసుల అధికారిక స్పందన రావాల్సి ఉంది. *— నిమ్మనగంటి అనిల్ బాబు* *షురూ న్యూస్*
బాధితుల కథనం ప్రకారం, ఫిర్యాదు స్వీకరించాల్సిన స్థానంలో ఎస్ఐ తన ఛాంబర్‌లోకి పిలిచి తమను, తమ *ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన అంగన్‌వాడీ టీచర్లతో ఎస్ఐ దురుసు ప్రవర్తన..? స్పృహ కోల్పోయిన టీచర్.* మహబూబాబాద్, ఆగస్టు 4 (షురూ న్యూస్): మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని దొనకొండ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ టీచర్ ఆవుల మంజుల, హెల్పర్ వెంకటలక్ష్మి తమను వేధిస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు దంతాలపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, అక్కడ ఎస్ఐ రవికుమార్ తమతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. బాధితుల కథనం ప్రకారం, ఫిర్యాదు స్వీకరించాల్సిన స్థానంలో ఎస్ఐ తన ఛాంబర్‌లోకి పిలిచి తమను, తమ భర్తలను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు "తొక్కి చంపుతాం" అంటూ బెదిరించారని పేర్కొన్నారు. మహిళలమనే కనీస గౌరవం కూడా ఇవ్వకుండా అవమానకరంగా ప్రవర్తించారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన అంగన్‌వాడీ టీచర్ ఆవుల మంజుల పోలీస్ స్టేషన్‌లోనే స్పృహ కోల్పోయి కిందపడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పాటు తొర్రూరు సీఐ గణేష్‌కు కూడా పిటిషన్ అందజేశారు. తమను అవమానించిన ఎస్ఐపై వెంటనే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని, లేదంటే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. *గమనిక:* ఈ కథనం బాధితులు చేసిన ఆరోపణల ఆధారంగా రూపొందించబడింది. ఘటనపై పోలీసుల అధికారిక స్పందన రావాల్సి ఉంది. *— నిమ్మనగంటి అనిల్ బాబు* *షురూ న్యూస్*
- అశ్వారావుపేట బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్ అశ్వారావుపేట బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బ్లాక్ మనీ పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని కోట్ల ఆశలు చూపిస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రసాయనాలతో నల్లటి కాగితాలను అసలు కరెన్సీ నోట్లుగా మారుస్తామని నమ్మించి లక్షల రూపాయలు కాజేసిన నిందితుడి బండారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. అంతేకాదు, నకిలీ నోట్ల దందా కోసం వాట్సాప్ గ్రూపుల్లో సెల్ఫీ వీడియోలు విడుదల చేసి తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు… అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టిపాటి ప్రేమ్‌చందు అనే వ్యక్తి బ్లాక్ మనీ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడనే ఫిర్యాదు అందడంతో పోలీసులు విచారణ చేపట్టారు.నిందితుడు మొదట రూ.500 అసలు నోటును ప్రత్యేక రసాయన ద్రావణంలో ముంచి, అదే విధంగా నల్లటి కాగితాలను కూడా అసలు నోట్లుగా మార్చవచ్చని బాధితుడిని నమ్మించాడు. ఈ మాయమాటలను నమ్మిన బాధితుడి నుంచి తొలుత రూ.11 లక్షలు, అనంతరం రసాయనాల కొనుగోలు పేరుతో మరో రూ.2 లక్షలు తీసుకుని మొత్తం రూ.13 లక్షలు కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు వాట్సాప్ గ్రూపుల్లో వీడియోలు విడుదల చేస్తూ, “నకిలీ నోట్లు, బ్లాక్ మనీ మార్పిడి” పేరుతో తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రచారాన్ని నమ్మిన పలువురిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.ఇక నిందితుడిపై గతంలో కూడా నకిలీ కరెన్సీ, మోటార్‌సైకిల్ దొంగతనాలు తదితర కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. బాచుపల్లి, రామచంద్రపురం, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లలో కూడా అతనిపై పలు కేసులు ఉన్నట్లు వెల్లడించారు. పోలీసులు నిందితుడి వద్ద నుంచి రూ.500 నోట్ల పరిమాణంలో కట్ చేసిన 20 వేల బ్లాక్ పేపర్లు,నోట్లుగా మారుస్తామని చెప్పేందుకు ఉపయోగించిన రెండు రసాయన ద్రావణాల సీసాలను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.బ్లాక్ మనీ, నకిలీ నోట్లు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పోలీసులు ప్రజలకు హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. బైట్: ఆర్. సతీష్ కుమార్, డీఎస్పీ, పాల్వంచ.3
- పాఠశాల సమస్యలు పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి ఉద్యమం చేస్తామని పీడీఎస్‌యూ హెచ్చరిక తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించడం లేదని ఆరోపిస్తూ పీడీఎస్‌యూ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం, పాఠశాల సమస్యల పరిష్కారం కోరుతూ మండల విద్యాశాఖ అధికారి రాంబాబుకు వినతిపత్రం అందజేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి ఉద్యమాలు చేపడతామని పీడీఎస్‌యూ హెచ్చరించింది4
- గీతన్నల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్.. కురవిలో నిర్వహించిన గీతన్నల చైతన్యయాత్ర సభలో కేజికేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రమణ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని, కొత్తగా ఎలాంటి డిమాండ్లు చేయడం లేదన్నారు. గీతన్నల హక్కుల సాధన కోసం పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ నెల 18న ట్యాంక్‌బండ్‌పై సర్ధార్ సర్వాయిపాపన్న గౌడ్ విగ్రహాన్ని ప్రభుత్వం ఆవిష్కరించాలని, లేకుంటే గౌడబిడ్డలే స్వయంగా విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కేజికేఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులు, గౌడ సంఘాల ప్రతినిధులు, యువజన నాయకులు పాల్గొన్నారు.1
- నేలకొండపల్లిలో అర్ధరాత్రి సుమారు గంటకు పైగా భారీ వర్షం.. రైతుల హర్షం! నేలకొండపల్లి మండలంలో అర్ధరాత్రి సుమారు గంటకు పైగా భారీ వర్షం కురిసింది. మండల పరిధిలోని పైనంపల్లి, కొత్త కొత్తూరు, అనంతనగర్, నేలకొండపల్లి, చెరువు మాదారం, తిరుమలాపురం తదితర గ్రామాల్లో వర్షపాతం నమోదైంది. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షంతో పంటలకు మేలు జరుగుతుందని భావించిన ప్రాంతీయ రైతన్నలు తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు.1
- ఒక ధైర్యవంతురాలైన అమ్మాయి రాహుల్ గాంధీ బండారం బయటపెట్టింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జంతర్ మంతర్ వరకు వెళ్లి తన గళం వినిపించగలిగిన ఆయన, ఇప్పుడు అక్కడ అధికారంలో ఉండి కూడా విద్యార్థులకు అండగా నిలబడటానికి ఝార్ఖండ్‌కు ఎందుకు రావడం లేదు?1
- రైతులకు సాగునీరు, 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని సీపీఎం పార్టీ డిమాండ్. *రెండోరోజు సిపిఎం పోరుబాట* *రైతులకు సాగునీరు, 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని సీపీఎం డిమాండ్* *నిద్ర వ్యవస్థలో విద్యుత్ అధికారులు* *ప్రతి కుంటలోకి సాగునీరు విడుదల చేయాలని ఘనపూర్ స్టేషన్ నియోజకవర్గం MLA కడియం శ్రీహరి కి విజ్ఞప్తి... చిల్పూర్ మండలం జనగామ జిల్లా ఆగస్టు 04... రైతులకు సాగునీరు, 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ *భారత కమ్యూనిస్టు పార్టీ [మార్క్సిస్టు] CPM చిల్పూర్ మండల కమిటీ* ఆధ్వర్యంలో *ఆగస్టు 1 నుండి 30 వరకు* మండలంలోని రైతుల వ్యవసాయ భూముల వద్ద *"పోరుబాట"* కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రెండోరోజు రోజు *చిల్పూర్,వెంకటాద్రిపేట, వెంకటేశ్వర్లపల్లి* గ్రామాల్లో రైతులను కలిసి విద్యుత్ సమస్యలపై సర్వే చేసినం. చాలా చోట్ల ప్రాణాలకు తెగించే పరిస్థితులు కనిపించాయి. *గ్రామాల వారీగా సమస్యలు:* *1. చిల్పూర్:* - చిల్పూర్ ఉరి నుండి SC కాలనీకి పోయే రోడ్డు పక్కన బోరు దగ్గర అతి కిందికి .వైర్లు ఉగకుండా కర్రతో కట్టిన పరిస్థితి ఉన్నది బత్తిని రాజయ్య వ్యవసాయ బావి దగ్గర విద్యుత్ వైర్లు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయి. - ఇలాంటి సమస్యలు గ్రామంలో ఇంకా చాలా ఉన్నాయని రైతులు తెలిపారు. *2. వెంకటాద్రిపేట:* - *పుల్యాల రాజిరెడ్డి బావిదగ్గర భూమికి మూడు పిట్ల ఎత్తులోనే ఉన్నాయి * 4 సంవత్సరాలుగా బావుల వద్ద చాలా ఇబ్బంది పడుతున్నాను. లైన్ మెన్ గణేష్ గారికి మరియు AE లకు మోరపెట్టుకున్న పట్టించుకునే పరిస్థితి లేదు. గొర్రెలు మేకలు మేపడం కోసం వచ్చి విద్యుత్ షాక్ గురైగాయాలు ఐనవి కేసీరెడ్డి సత్యవర్ధన్ రెడ్డి, శీవరాత్రి సమయ్య, బొక్కల మల్లయ్య గార్ల భూములలో 12-13 అడుగుల ఎత్తులోనే వైర్లు వేలాడుతున్నాయి. *3. వెంకటేశ్వర్లపల్లి :* గ్రామంలో లూజ్ లైన్ లు ఉన్నాయి అని రైతులు తెలిపారు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు ఇంత అవస్థలు పడుతున్నారు. *రైతులకు విజ్ఞప్తి ఈ క్రింది దాని ప్రకారం తప్పకుండ మనము ఉండాలి* *వ్యవసాయ బావులకు కొత్త కరెంట్ కనెక్షన్* విషయంలో 2026 ఫిబ్రవరి నుండి తెలంగాణ ప్రభుత్వం కొత్త రూల్స్ తీస్కొచ్చింది. ఇది రైతులకు చాలా ఉపశమనం ✊ *1. రైతు DD చెల్లించిన తర్వాత విద్యుత్ శాఖ వారు ఉచితంగా ఇచ్చేది ఏంటి?* కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం *రైతు దగ్గర నుండి ఎక్స్ట్రా డబ్బులు తీస్కోకూడదు* b950 విద్యుత్ శాఖ వారే చేయాల్సినవి: 1. *సర్వీస్ లైన్* - 1 KM లోపు ఉన్నట్లయితే లైన్ ఎక్స్టెన్షన్ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది 2. *స్తంభాలు / పోల్స్* - గతంలో 3 పోల్స్ కంటే ఎక్కువైతే ₹45,000 వరకు వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ సిస్టం రద్దు 3. *ట్రాన్స్‌ఫార్మర్* - కొత్త కనెక్షన్ల కోసం ప్రభుత్వం 75,686 కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు కూడా పెట్టింది. కాబట్టి TC ఖర్చు కూడా ప్రభుత్వానిదే 4. *24 గంటల ఉచిత కరెంట్* - 23 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు ఉచితంగా 24X7 కరెంట్ ఇస్తున్నారు b9503b4f5a6ed99ff3ee *2. రైతు ఏమి ఖర్చు పెట్టుకోవాలి?* ఇప్పుడు *లెక్కల ప్రకారం కాకుండా Load ఆధారంగా* ఛార్జీలు ఉన్నాయి 3b4f *రైతు చెల్లించాల్సింది:* - *Service Line Charges: ₹1,000 per kW* లేదా దాని భాగానికి - *ఉదాహరణ:* 5 HP మోటార్ = 3.7 kW. అంటే ₹1,000 x 4kW = ₹4,000 DD చెల్లించాలి. - *ORC - Operation and Maintenance Charges లేవు* b9503b4f *రైతు చెల్లించకూడనివి:* - స్తంభాల ఖర్చు - వైర్ల ఖర్చు - ట్రాన్స్‌ఫార్మర్ ఖర్చు - 1KM లోపు లైన్ ఎక్స్టెన్షన్ ఖర్చు *3. ముఖ్యమైన పాయింట్లు రైతుల కోసం* **అంశం** **పాత సిస్టం** **కొత్త సిస్టం 2026** **ఛార్జీ** దూరం ఆధారంగా Estimate. ₹45,000 వరకు Load ఆధారంగా. ₹1000/KW **3 పోల్స్** 3 దాటితే రైతు డబ్బు కట్టాలి ఉచితం **ORC** వసూలు చేసేవారు లేదు **కరెంట్** కొన్ని గంటలు 24 గంటలు ఉచితం 3b4fb950f3ee *ఎక్కడ అప్లై చేయాలి:* TSNPDCL / TSSPDCL ఆఫీసుల్లో *ఫిర్యాదుల కోసం:* 1912 టోల్ ఫ్రీ నెంబర్ d99f5a6e ఈ కార్యక్రమంలో *సీపీఎం పార్టీ బృందం* మండల కమీటి సభ్యులు పోలు సంపత్,ఊరడి బుచ్చి రాజ్ , తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. డిమాండ్.. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సాగునీరు, 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి. లేకుంటే సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం ఉంటుంది.1
- బాధితుల కథనం ప్రకారం, ఫిర్యాదు స్వీకరించాల్సిన స్థానంలో ఎస్ఐ తన ఛాంబర్‌లోకి పిలిచి తమను, తమ *ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన అంగన్‌వాడీ టీచర్లతో ఎస్ఐ దురుసు ప్రవర్తన..? స్పృహ కోల్పోయిన టీచర్.* మహబూబాబాద్, ఆగస్టు 4 (షురూ న్యూస్): మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని దొనకొండ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ టీచర్ ఆవుల మంజుల, హెల్పర్ వెంకటలక్ష్మి తమను వేధిస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు దంతాలపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, అక్కడ ఎస్ఐ రవికుమార్ తమతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. బాధితుల కథనం ప్రకారం, ఫిర్యాదు స్వీకరించాల్సిన స్థానంలో ఎస్ఐ తన ఛాంబర్‌లోకి పిలిచి తమను, తమ భర్తలను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు "తొక్కి చంపుతాం" అంటూ బెదిరించారని పేర్కొన్నారు. మహిళలమనే కనీస గౌరవం కూడా ఇవ్వకుండా అవమానకరంగా ప్రవర్తించారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన అంగన్‌వాడీ టీచర్ ఆవుల మంజుల పోలీస్ స్టేషన్‌లోనే స్పృహ కోల్పోయి కిందపడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పాటు తొర్రూరు సీఐ గణేష్‌కు కూడా పిటిషన్ అందజేశారు. తమను అవమానించిన ఎస్ఐపై వెంటనే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని, లేదంటే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. *గమనిక:* ఈ కథనం బాధితులు చేసిన ఆరోపణల ఆధారంగా రూపొందించబడింది. ఘటనపై పోలీసుల అధికారిక స్పందన రావాల్సి ఉంది. *— నిమ్మనగంటి అనిల్ బాబు* *షురూ న్యూస్*1