*ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారపు ప్రత్యేక పూజలు* ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్న... యంబ నరసింహులు యాదాద్రి భువనగిరి జిల్లా, కైలాసపురం కాచారం, శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ,వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆలేరు పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు, యాదాద్రి భువనగిరి జిల్లా సాక్షి దినపత్రిక జిల్లా స్టాపర్ యంబ నరసింహులు కుటుంబ సమేతముగా పాల్గొని అమ్మవారికి చీరే సారే సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి యంబ నరసింహులు దంపతులను శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేసి వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ఉప్పల్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ నాగులూరి అశోక్ సుజాత లోక కళ్యానార్థం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతమును చేసి ప్రసాద పంపిణీ చేసిన అనంతరం పూజా కార్యక్రమాలకు హాజరైన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంబ నరసింహులు కుటుంబ సభ్యులు సతీమణి జగదాంబ, నూతన వధూవరులు యంబ భారతీరాజా రమ్యశ్రీ, వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
*ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారపు ప్రత్యేక పూజలు* ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్న... యంబ నరసింహులు యాదాద్రి భువనగిరి జిల్లా, కైలాసపురం కాచారం, శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ,వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆలేరు పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు, యాదాద్రి భువనగిరి జిల్లా సాక్షి దినపత్రిక జిల్లా స్టాపర్ యంబ నరసింహులు కుటుంబ సమేతముగా పాల్గొని అమ్మవారికి చీరే సారే సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ
సందర్భంగా రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి యంబ నరసింహులు దంపతులను శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేసి వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ఉప్పల్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ నాగులూరి అశోక్ సుజాత లోక కళ్యానార్థం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతమును చేసి ప్రసాద పంపిణీ చేసిన అనంతరం పూజా కార్యక్రమాలకు హాజరైన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంబ నరసింహులు కుటుంబ సభ్యులు సతీమణి జగదాంబ, నూతన వధూవరులు యంబ భారతీరాజా రమ్యశ్రీ, వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మన ఊరు బడిలో సకల సదుపాయాలు కల్పిస్తూ బంగారు బాటలకు కృషి చేస్తుందని ఈ పాటల పేర్కొన్నారు ఆంగ్ల మాధ్యం కాకుండా తెలుగు మాధ్యమంలో విద్యాబోధన చేసుకుంటూ ఉన్నత శిఖరాలన ఎదిగారని తెలిపారు.1
- 👉 రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి నల్గొండ ఆర్ & బి శాఖ మాత్యుల క్యాంప్ కార్యాలయం (ఇందిరా భవన్)లో జిల్లా కలెక్టర్ మరియు అధికారులతో రబీ ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. 👉 యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 👉 అన్ని కొనుగోలు కేంద్రాలకు అవసరమైనన్ని లారీలు అందుబాటులో ఉంచాలని సూచించారు. 👉 రాత్రి, పగలు లైటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. 👉 ఎక్కువగా ధాన్యం వచ్చే గ్రామాలను గుర్తించి ప్రత్యేకంగా విశ్లేషణ చేయాలని సూచించారు. 👉 ఆ గ్రామాలకు అదనపు లారీలు పంపి రవాణా వేగవంతం చేయాలని చెప్పారు. 👉 రోడ్లపై ధాన్యం పేరుకుపోకుండా అవసరమైతే పాఠశాలలు, ఫంక్షన్ హాళ్ల వద్ద తాత్కాలిక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 👉 రైతులు మరియు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు. 👉 నల్గొండ నియోజకవర్గంలో సుమారు 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాబోయే అవకాశం ఉందని అంచనా. ➡️ ధాన్యం సేకరణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సమన్వయంతో పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.1
- Post by Mohammed javeed1
- హుజురాబాద్ లో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ బైక్ ల పంపిణీ లో ప్రోటోకాల్ వివాదం స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రోటోకాల్ పాటించకుండా దివ్యాంగులకు స్కూటీలు, ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసిన అధికారులపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేను ఆహ్వానించకుండా కాంగ్రెస్ నాయకులతో దివ్యాంగులకు బైకులు పంపిణీ చేయడంపై సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ బిఆర్ఎస్ కార్యకర్తల మధ్య పరస్పరం నినాదాలు స్వల్ప ఉద్రిక్తతకు దారి తీశాయి. హుజూరాబాద్ సిటీ సెంట్రల్ హాల్ లో ఒకే సమయంలో రెండు ప్రభుత్వ కార్యక్రమాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక ఫ్లోర్ లో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు అందజేస్తే మరో ఫ్లోర్ లో రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ ముత్తినేని వీరయ్య కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జ్ ప్రణవ్ బాబు స్కూటీ లు పంపిణీ చేశారు. షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆ కార్యక్రమాన్ని ముగించుకొని వికలాంగులకు బైకులు పంపిణీ చేసే కార్యక్రమానికి హాజరయ్యారు. స్థానికంగానే తాను ఉన్నప్పటికీ తనకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని, ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదని అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషా నా, ఎమ్మెల్యే మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేస్తు పద్ధతి మార్చుకోవాలని మందలించారు. జరిగిన పొరపాటును కప్పించుకునేందుకు అధికారులు ప్రయత్నించగా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూడాలని సూచిస్తూ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్యతో కలిసి దివ్యాంగులకు బైకులు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశారు.1
- ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా సంక్షేమ వారోత్సవాల కింద విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక వెలికితీతకే పోటీలు నిర్వహించామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సంక్షేమ వారోత్సవాల కింద తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్ పీఎం శ్రీ విద్యాలయంలో విద్యార్థులకు క్విజ్, డిబేట్, చిత్రలేఖనం తదితర పోటీలు మంగళవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా విద్యార్థుల పాటలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి.. అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారని, జూన్ 12 వ తేదీ వరకు 10 శాఖల ఆద్వర్యంలో వివిధ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటి దాకా చేసిన పనులు వివరిస్తూ.. భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు కార్యక్రమం అమలు చేస్తుందని వెల్లడించారు.ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సంక్షేమ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య పనులు, వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో ఆరుగురు ప్రత్యేక వైద్య నిపుణులతో వైద్య పరీక్షలు, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, అవగాహన కల్పించామని, రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు అమలు, గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశామని, డ్రైవర్లకు కంటి వైద్య పరీక్షలు, ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించామని వివరించారు. సంక్షేమ వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో కిచెన్, స్కూల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించామని పేర్కొన్నారు. టాలెంట్ హంట్ లో భాగంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి.. వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. అన్ని విద్యాలయాలకు కావాల్సిన మరమ్మత్తుల వివరాలు సేకరించి.. ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచిందని, అన్ని విద్యాలయాల్లో కామన్ డైట్ మెనూ అమలు చేస్తుందని వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు తరగతి పుస్తకాలతో పాటు దిన పత్రికలు, కథల పుస్తకాలు చదవాలని సూచించారు. ఆటలు లేదా ఏదైనా ఒక రంగంలో బాగా సాధన చేసి.. రాణించాలని పేర్కొన్నారు. పరిసరాల పై అవగాహన ఉండాలని, సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని సూచించారు. విలువైన సమయం వృథా చేయవద్దని వివరించారు. విద్యార్థులు అందరూ ఏ నేపథ్యం నుంచి వచ్చినా కూడా కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని, మంచి స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా పంచాయతీ అధికారి షరీఫ్ఫుద్దిన్, గురుకులాల డీసీఓ థెరిస్సా, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, సర్పంచ్ సిలివేరి లావణ్య, ప్రిన్సిపాల్ బీ పద్మ తదితరులు పాల్గొన్నారు.2
- ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలను పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తాను ప్రభుత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి బేషజాలకు వెళ్లకుండా అధికారుల కమిటీకి సమస్యలు విన్నవించాలని.. ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.1
- .*ప్రెస్ రిలీజ్* మెదక్ 20 ఏప్రిల్2026 2027 -పూర్తిగా డిజిటల్ జనగణన కలెక్టర్ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్స్ శిక్షణలో సంపూర్ణ అవగాహనతో , జనగణన విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 2027 - డిజిటల్ జనగణన అని *జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్* అన్నారు కౌడిపల్లి మండలంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఎన్యుమరేటర్ సూపర్వైజర్లకు జనగణన-2027 నిర్వహణలో భాగంగా మూడు రోజులపాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్లుకు దిశా నిర్దేశం చేశారు. శిక్షణలో ప్రతి అంశాన్ని అవగాహన కల్పించుకోవాలన్నారు ఈ శిక్షణ మూడు రోజులు పాటు కొనసాగుతుందని ప్రశ్నలు సమాధానాల రూపంలో జనగణన కు సంబంధించివారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ సంబంధిత ఎనిమరేటర్స్ సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు1
- ప్రజలు ప్రాణాల మీద పెట్టుకుని రాకపోకలు... ఉదయం నుంచి రాత్రి వరకు వాహనాల రద్దీ పెరిగినా సిగ్నల్స్ మాత్రం మూగబోయినట్టే పరిస్థితి... ఎవరికి దారి వారిదే అన్నట్టుగా వాహనాలు దూసుకెళ్తుండడంతో ప్రమాదాల భయం పెరుగుతోంది... పాదచారులు రోడ్డు దాటాలంటే గుండెల్లో గుబులు... చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు... ట్రాఫిక్ పోలీసులు లేకపోతే జంక్షన్ మొత్తం గందరగోళంగా మారుతున్న దృశ్యాలు... ఇప్పటికే ప్రమాదాల నిలయంగా పేరున్న ఈ ప్రాంతంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారంటూ ప్రజల ఆగ్రహం... మున్సిపల్ అధికారులు గానీ, ట్రాఫిక్ పోలీస్ అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహారం... వెంటనే సిగ్నల్స్ మరమ్మతు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికుల డిమాండ్... మరెంతమంది ప్రాణాలు పోతే అధికార యంత్రాంగం మేల్కొంటుందో అంటూ ప్రజల ప్రశ్నలు...1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సుభాష్ నగర్ వద్ద రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సుభాష్ నగర్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న ఎక్సెల్ ద్విచక్ర వాహనాన్ని ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో ఇందిరానగర్ కు చెందిన వృద్దుడు అలువాల అంకయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో బైక్ కు ట్రాక్టర్ తగలగా బైక్ కింద పడింది. తృటిలో ఆ బైకిస్ట్ కు ప్రమాదం తప్పింది. ప్రమాద దృశ్యాలు సమీపంలోని సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. అతివేగం అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1