పట్టణ కాంగ్రెస్ నేత కటకం రఘురాం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు.వంశీకృష్ణ అచ్చంపేట, జనవరి 11(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కటకం రఘురాం గారి మాతృమూర్తి ఇటీవల అకాలంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం రఘురాం గారి నివాసానికి వెళ్లిన డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ పరామర్శ కార్యక్రమంలో, సీనియర్ న్యాయవాది,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, రాజేందర్, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ రామనాథం, రెండో వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల లాలు యాదవ్ పాల్గొన్నారు. వీరితో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై రఘురాం కుటుంబాన్ని ఓదార్చారు. మరణం కుటుంబానికి తీరని లోటని పేర్కొన్న నాయకులు, ఈ దుఃఖ సమయంలో పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.
పట్టణ కాంగ్రెస్ నేత కటకం రఘురాం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు.వంశీకృష్ణ అచ్చంపేట, జనవరి 11(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కటకం రఘురాం గారి మాతృమూర్తి ఇటీవల అకాలంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం రఘురాం గారి నివాసానికి వెళ్లిన డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ పరామర్శ కార్యక్రమంలో, సీనియర్ న్యాయవాది,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, రాజేందర్, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ రామనాథం, రెండో వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల లాలు యాదవ్ పాల్గొన్నారు. వీరితో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై రఘురాం కుటుంబాన్ని ఓదార్చారు. మరణం కుటుంబానికి తీరని లోటని పేర్కొన్న నాయకులు, ఈ దుఃఖ సమయంలో పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.
- కాలుష్య పరిశ్రమలను తొలగించాలని కోరుతూ దోమడుగు గ్రామస్తులు నిరసన1
- గజ్వెల్ సిద్దిపేట జిల్లా జనవరి 11 ఐ 3 న్యూస్ /* సిద్దిపేట జిల్లాకు అన్యాయం చేసే ఆలోచనను వెంటనే విరమించుకోవాలి: దేవి రవీందర్ సిద్దిపేట జిల్లా పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమతో, కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని మాజీ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ దేవి రవీందర్ ఆరోపించారు. జిల్లాల కుదింపు పేరుతో సిద్దిపేట జిల్లాకు అన్యాయం చేయాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మానుకోవాలని ఆయన హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన మాట్లాడుతూ, జిల్లాల కుదింపు పేరుతో సిద్దిపేట జిల్లాను దెబ్బతీయాలని చూడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో చిన్న రాష్ట్రాల ద్వారా అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఆధారంగా 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా పరిపాలనా సౌలభ్యం కోసం అప్పట్లో పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా విభజించి ప్రజలకు పరిపాలనను మరింత సులభతరం చేశారని తెలిపారు. ఇలాంటి చారిత్రక నిర్ణయాన్ని విస్మరించి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 33 జిల్లాలను కుదించాలనే ఆలోచన చేయడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ నిండు శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల కుదింపు ఆలోచనలో ఉందని చెప్పడం ఆందోళన కలిగించిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకుని ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా ఆలోచించాలని సూచించారు. లేనియెడల, గతంలో తెలంగాణ సాధన కోసం సిద్దిపేట జిల్లా ఎలా ఉద్యమాలకు నాంది పలికిందో, అదే విధంగా ఈరోజు కూడా జిల్లాల గుర్తింపును కాపాడుకునే వరకు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, మాజీ కౌన్సిలర్లు శివకుమార్, చందు, అలాగే వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.1
- కడప జిల్లాలో అన్నదమ్ముల దాడిలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. కలసపాడు మండలం రామాపురంకి చెందిన నలుగురు అన్నదమ్ములు. చిన్న గురవయ్య, నడిపి గురయ్యకు డబ్బుల విషయంలో విబేదాలు ఉండగా ఆదివారం దీనిపై మాట్లాడుకుందామని గోపవరం వద్దగల సత్య టౌన్షిప్ వద్ద కలిశారు. గొడవ పెద్దదై దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో చిన్న గురవయ్య మృతి చెందగా పెద్ద గురవయ్య కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బద్వేల్ ఆసుపత్రికి తరలించారు.1
- కర్నూలు జిల్లా... ఆలూరు నియోజకవర్గం... నేడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆలూరులో వడ్డెర కులస్తులు అంగరంగ వైభయంగా జరుపుకున్నారు... పురవీధుల్లో వడ్డే ఓబన్న చిత్రపటం ఊరేగింపుగా చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాల ఏసి ఘనంగా నివాళులర్పించారు... ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి నాయకులు గుమ్మనూరు కమలమ్మ, గుమ్మనూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన తొలి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యానికి వెన్నుముకల ఆయన నిలిచారన్నారు.. ఆయన చేసిన అలుపెరుగని పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నారాయణ అన్నారు...4
- ములుగు జిల్లా మేడారంకు నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఐదుగురు మంత్రులు రానున్నారు. సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుని, మహా జాతర–2026 ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు. ఇదే నెల 18 సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా మేడారం రానుండగా, 19న ఆధునీకరించిన మాస్టర్ ప్లాన్‌ను ప్రారంభించి సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించనున్నారు. మేడారం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి.1
- గుంటూరు నగర వనం లో మిత్రుల సందడి1
- బనకచర్ల ప్రాజెక్టుకు పేరు మార్చడం కాంగ్రెస్ తెలివి తక్కువ తనానికి నిదర్శనం.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలంగాణలో తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం ప్రజల్ని పరిపాలిస్తుందని మాజీమంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులు పనులు పూర్తి చేయలేక లేనిపోని ఆ పనిని వేస్తోందని ధ్వజమెత్తారు. బనకచర్ల ప్రాజెక్టు పేరు మార్చి పనులు చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వం వెంటనే వైఖరి మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్పే సమయం వస్తుందని తెలిపారు.1
- సంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో రేపు విడుదల చేయనున్న తుది జాబితా1
- బద్వేలు: అన్నదమ్ముల మధ్య గొడవ.. ఒకరు మృతి.! కడప జిల్లా గోపవరం మండలం నెల్లూరు రోడ్డులోని సత్య టౌన్షిప్ వద్ద గాయాలతో ఇద్దరు వ్యక్తులు పడి ఉన్నారు. ఇరువురి తలలపై తీవ్ర గాయాలై ఉన్నాయి. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరోవ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్కు తరలించినట్లు సమాచారం. వారు ఇద్దరూ కలసపాడు మండలం ఎగువ రామాపురానికి చెందిన అన్నదమ్ములుగా స్థానికులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలతోనే ఇరువురు దాడికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.2