*ఆల్బెండజోల్ మాత్రలతో నులిపురుగులను నివారించవచ్చు* "అపరిశుభ్రత వల్లే నులిపురుగులు పిల్లలకు సంక్రమిస్తాయి". జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం. డాక్టర్ ఆర్.చందన్ రెడ్డి, జి.జి.హెచ్. చిన్నపిల్లల వైద్య నిపుణులు. నేటి ఆధునిక సమాజంలో, జీవన విధానంలో ఆహారపు అలవాట్లు కారణంగా చిన్నపిల్లల్లో నులిపురుగుల సమస్య తీవ్రంగా ఉందని, ఇందు నిమిత్తం పీ.హెచ్.పీ. అసోసియేషన్ వారు నిర్మూలన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఆర్. చందన్ రెడ్డి అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సహకారంతో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో బుజబుజ నెల్లూరులోని శేషు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు మంగళవారం జరిగిన అవగాహన సదస్సు మరియు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ నులిపురుగుల నివారణను ఏడాదికి రెండుసార్లు నులిపురుగులు నివారణ చర్యలు చేపడుతుందని, ప్రస్తుత జీవన విధానం, ఆహారపు అలవాట్లు కారణంగా ఒకటి నుంచి 19 ఏళ్ల లోపల పిల్లల్లో నులిపురుగుల సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. ఈ కారణంగా పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పౌష్టికాహార లోపం, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు వంటి సమస్యలు కూడా ఏర్పడడంతో కొందరిలో శారీరక, మానసిక ఎదుగుదల మందకొడిగా ఉంటుందని తెలిపారు. ఒకటి నుండి రెండు సంవత్సరాల లోపు పిల్లలకి సగం మాత్ర మిగతా వారికి పూర్తి మాత్రం నమిలి మింగాలని అన్నారు. కలుషితమైన ఆహారాలు లేదా పానీయాలు తీసుకోవడంవల్ల ఈ నులిపురుగులు సంభవిస్తాయని, వీటిని నిర్మూలించేందుకు ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలని, ఐదేళ్ల లోపు చిన్నారులకు సిరప్, ఐదేళ్లు దాటిన వారికి మాత్ర మధ్యాహ్నం భోజనానంతరం వేయాలి అన్నారు. *ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగులను నులిమేద్దాం* 25 వ డివిజన్ కార్పొరేటర్ బద్దెపూడి నరసింహగిరి మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఇతర వ్యాధులకు మందులు వాడుతున్న వారు ఈ మాత్ర వేసుకోకూడదు అన్నారు. ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే నులిపురుగులు వ్యాపిస్తాయని, కలుషిత ఆహారము, ఈగలు వాలిన తినుబండారాలు, దుమ్ము, ధూళి పడిన ఆహార పదార్థాలు తినడం వల్ల, బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన ద్వారా, కాళ్లకు చెప్పులు లేకుండా మరుగుదొడ్డికి వెళ్లడం ద్వారా, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు వంటివాటిని శుభ్రమైన నీటితో కడగకపోవడం వల్ల వ్యాపిస్తాయని అన్నారు. మలవిసర్జన తర్వాత, భోజనం చేసేముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలని, ఆహార పదార్థాలపై ఎల్లప్పుడూ మూతలు కప్పి ఉంచాలన్నారు. 2017 నుంచి ప్రతి సంవత్సరం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహిస్తున్నారని, దీనిని కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుందన్నారు. యూ పి హెచ్ సి కోఆర్డినేటర్ కొండాపురం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం రోజున డివార్మింగ్ చేయబడని పిల్లలకు ఫిబ్రవరి 24వ తేదీన జరిగే మాప్-అప్ రోజున ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రాముల మాత్రలు వేయడం జరుగుతుందన్నారు. పిల్లలు, కిషోర్ బాలల కడుపులో నులిపురుగులు ఉన్నట్లయితే పోషకాహార లోపం, రక్తహీనత వల్ల నీరసంగా ఉంటారని, శారీరక, మానసిక, ఎదుగుదల లోపాలు కలిగి ఉంటారని అన్నారు. అనంతరం నిర్వాహకులు డాక్టర్ ఆర్. చందన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ షేక్ రసూల్, జనసేన 25వ డివిజన్ అధ్యక్షులు కుడుముల సురేష్ , పి హెచ్ పి నాయకులు శాఖవరపు వేణుగోపాల్, దేవరకొండ శ్రీనివాసులు, ఏఎన్ఎం ఎ.పావని, ఆశ వర్కర్ ఆర్.యశోద, స్కూల్ ఇన్చార్జి బోనబోయిన యశ్వంత్, టిప్పు తదితరులు పాల్గొన్నారు.

- Post by మీ శ్రేయోభిలాషి1
- Post by N సూరి4
- బద్వేలు :న్యాయవాది మల్లారపు దామోదరం వినతి బద్వేలు మండలంలోని అనంతరాజపురం లక్ష్మీ పాలెం గ్రామంలో అపరిశుభ్రత ఎక్కువగా ఉన్నది గ్రామంలో ఉన్న వీధులలో చాలామంది బాత్రూం నీళ్లు రోడ్డుపైకి వదులుతున్నారు. చాలామందికి చెప్పిన వారు వినిపించుకోవడం లేదుఅని అంటున్నారు. గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు వెళ్లాలంటే రోడ్డుపై నుంచి ఉన్న నాలుగు వీధుల లో ఏదో ఒక వీధిలో భక్తులు ఆలయానికి వెళ్తుంటారు. ప్రతిరోజు రోడ్డుపై నీళ్లు పాడుతున్నందున రోడ్డు బంక పట్టి కాలు పెడితే జారిపడే పరిస్థితి ఉన్నది. మరో 10 రోజుల్లో గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఎక్కువ మంది భక్తులు ఈ నాలుగు వీధుల గుండా రాకపోకలు సాగిస్తారు .గ్రామంలో బుచ్చం గారి వీధి, కుమ్మరి వీధి ,యామయ్య గారి వీధి, ఆనుగొంది వారి వీధి ఈ నాలుగు వీధుల్లో నిత్యము రోడ్డుపై నీళ్లు పాడుతుంటాయి సచివాలయ అధికారులకు చెప్పిన పట్టించుకోలేదు అందువలన జిల్లా కలెక్టర్కు ,బద్వేలు ఎంపీడీవోకు, జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారికి, అనంతరాజపురం గ్రామపంచాయతీ కార్యదర్శి వినతి పత్రాలు నా ద్వారా పంపించాను అన్ని అన్నారు.ఈ విషయము జర్నలిస్టు మీ పత్రికలలో వేసి గ్రామంలో అపరిశుభ్రత లేకుండా అధికారులు చర్యలు తీసుకునేలా చూడాలని అనంతరాజపురం వాసి న్యాయవాది మల్లారపు దామోదర్ కోరుతున్నారు.1
- మదనపల్లి లో చిన్నారిని దారుణంగా హత్య చేసిన నిందితున్ని ఎన్కౌంటర్ చేయాలి.1
- గన్నవరం విమానాశ్రయం రన్‌వేపై దిగిన ఆ ప్రత్యేక విమానం కేవలం ఒక వ్యక్తిని మాత్రమే మోసుకొని రాలేదు; నవ్యాంధ్ర భవిష్యత్తుకు అవసరమైన ఒక గొప్ప 'దాతృత్వ ఆలోచన'ను, 'అత్యాధునిక సాంకేతికత'ను వెంటబెట్టుకొచ్చింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచం గర్వించే మానవతావాది బిల్ గేట్స్ అమరావతి గడ్డపై అడుగుపెట్టడం ఒక చారిత్రాత్మక ఘట్టం. అమరావతి గడ్డపై అపర కుబేరుడు: ఇది కేవలం పర్యటన కాదు.. ఒక ఆశల వారధి! నేటి సమాజంలో సాయం చేసే చేతిని కూడా అనుమానించే పరిస్థితి. కానీ, తాను సంపాదించిన సంపదలో సింహభాగాన్ని సమాజ శ్రేయస్సు కోసం వెచ్చించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరులకు 'దాతృత్వం' అంటే ఏమిటో నేర్పిన మహోన్నత వ్యక్తి బిల్ గేట్స్. ఆయన గన్నవరం విమానాశ్రయంలో దిగినప్పుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా వెళ్లి ఘన స్వాగతం పలకడం వెనుక ఒక స్పష్టమైన సంకేతం ఉంది. అది—సాంకేతికతతో సామాన్యుడి జీవితాన్ని మార్చాలనే తపన. సంపద పంపిణీ కాదు.. సమస్యల పరిష్కారం బిల్ గేట్స్ పర్యటనను కేవలం ఒక పారిశ్రామికవేత్త పర్యటనగా చూడలేం. ఒక మనిషి తన మేధస్సుతో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగి, మళ్ళీ అదే మేధస్సును పేదరికం, రోగాలు, వ్యవసాయ సంక్షోభాల పరిష్కారానికి ఎలా వాడుతున్నారనేది ఇక్కడ ముఖ్యం. గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఏపీలో సాగుతున్న 'సంజీవని' వంటి ప్రాజెక్టులు వేలమంది ప్రాణాలను, జీవనోపాధిని కాపాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే RTGS కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించనుండటం విశేషం. డేటా ఆధారిత పాలనలో ఏపీ దేశానికే దిక్సూచిగా నిలుస్తోంది. ప్రభుత్వ ఫలాలు నేరుగా లబ్ధిదారుడికి అందుతున్నాయా? సాంకేతికత ద్వారా అవినీతిని ఎలా అరికట్టవచ్చు? విపత్తుల సమయంలో సెకన్ల వ్యవధిలో నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చు? ఈ అంశాలపై గేట్స్ వంటి విజనరీకి చంద్రబాబు నాయుడు ప్రజంటేషన్ ఇవ్వడం రాష్ట్ర ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతుంది. బిల్ గేట్స్ వంటి దిగ్గజాలను ఆంధ్రప్రదేశ్ వైపు చూడలా చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి సామాన్యమైనది కాదు. గత మూడు దశాబ్దాలుగా ఆయనకు గేట్స్ తో ఉన్న సాన్నిహిత్యం వ్యక్తిగతమైనది మాత్రమే కాదు, అది రాష్ట్ర ప్రయోజనాల కోసం నిర్మించుకున్న ఒక బలమైన బంధం. ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులకు చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ అంబాసిడర్ లా కనిపిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ నిర్మాణ సమయం నుండి నేటి అమరావతి వరకు, టెక్నాలజీని సామాన్యుడి ముంగిటకు తేవాలనే ఆయన ప్రయత్నమే గేట్స్ ఫౌండేషన్ ను ఇక్కడికి రప్పించింది. లోకేశ్ తో కూడిన మంత్రుల బృందం గేట్స్ కు స్వాగతం పలకడం ద్వారా ప్రభుత్వం అంతా ఒకే లక్ష్యం—'అభివృద్ధి'—కోసం పనిచేస్తోందని నిరూపించారు. ఈ పర్యటన ద్వారా రాబోయే మార్పులు అపారం: ఉండవల్లిలో డ్రోన్లు, AI (కృత్రిమ మేధ) సాయంతో చేసే వ్యవసాయాన్ని గేట్స్ పరిశీలించడం ద్వారా, భవిష్యత్తులో మన రైతులు ప్రపంచ స్థాయి సాగు పద్ధతులను అందుకోనున్నారు. వైద్యం & విద్య: గేట్స్ ఫౌండేషన్ సహకారంతో స్కూళ్లలో డిజిటల్ విద్య, ఆసుపత్రుల్లో అత్యాధునిక డయాగ్నస్టిక్ సేవలు మరింత విస్తృతం కానున్నాయి. గేట్స్ రాకతో ఇతర అంతర్జాతీయ సంస్థల దృష్టి కూడా అమరావతిపై పడుతుంది. ఇది 'స్వర్ణాంధ్ర విజన్ 2047' దిశగా పడే బలమైన అడుగు. బిల్ గేట్స్ పర్యటన ఒక గంటలో.. రోజులో ముగిసే కార్యక్రమం కాదు, అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దొరికిన ఒక గొప్ప భరోసా. సంపద ఉన్న ప్రతివాడూ సాయం చేయడు, సాయం చేసే మనసున్న ప్రతివాడి దగ్గరా సంపద ఉండదు. ఈ రెండూ పుష్కలంగా ఉన్న గేట్స్, మార్పును ఆకాంక్షించే చంద్రబాబు కలిస్తే—అది సామాన్యుడి పాలిట వరం.2
- Post by ఉంగరాల కార్తీక్1
- మదనపల్లి సిల్క్ టౌన్ లో ఏడేళ్ల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కులవర్ధన్ ను కఠినంగా శిక్షించాలి, అని మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్నారు.అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న కారణంగా బాధిత కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించలేకపోయాను, కానీ వారిని ఫోన్లో పరామర్శించానని, అన్నారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు వెళ్ళనున్నట్లు, ఎమ్మెల్యే మీడియా ముఖంగా తెలిపారు..1
- కోటప్పకొండ సనాతన ధర్మంలో ఇది పెద్ద పాపం కాదా? 🙏 మహాశివరాత్రి నాడు కోటప్పకొండలో ప్రభుత్వ ఆధ్వర్యంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు!1