Shuru
Apke Nagar Ki App…
మానవత్వం మరచిన కఠినత్ముడికి మరణశిక్ష పడాలి.... మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి సిల్క్ టౌన్ లో ఏడేళ్ల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కులవర్ధన్ ను కఠినంగా శిక్షించాలి, అని మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్నారు.అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న కారణంగా బాధిత కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించలేకపోయాను, కానీ వారిని ఫోన్లో పరామర్శించానని, అన్నారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు వెళ్ళనున్నట్లు, ఎమ్మెల్యే మీడియా ముఖంగా తెలిపారు..
SREENIVAS
మానవత్వం మరచిన కఠినత్ముడికి మరణశిక్ష పడాలి.... మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి సిల్క్ టౌన్ లో ఏడేళ్ల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కులవర్ధన్ ను కఠినంగా శిక్షించాలి, అని మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్నారు.అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న కారణంగా బాధిత కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించలేకపోయాను, కానీ వారిని ఫోన్లో పరామర్శించానని, అన్నారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు వెళ్ళనున్నట్లు, ఎమ్మెల్యే మీడియా ముఖంగా తెలిపారు..
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మదనపల్లి సిల్క్ టౌన్ లో ఏడేళ్ల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కులవర్ధన్ ను కఠినంగా శిక్షించాలి, అని మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్నారు.అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న కారణంగా బాధిత కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించలేకపోయాను, కానీ వారిని ఫోన్లో పరామర్శించానని, అన్నారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు వెళ్ళనున్నట్లు, ఎమ్మెల్యే మీడియా ముఖంగా తెలిపారు..1
- Post by MAA PUNGANUR NEWS1
- గన్నవరం విమానాశ్రయం రన్‌వేపై దిగిన ఆ ప్రత్యేక విమానం కేవలం ఒక వ్యక్తిని మాత్రమే మోసుకొని రాలేదు; నవ్యాంధ్ర భవిష్యత్తుకు అవసరమైన ఒక గొప్ప 'దాతృత్వ ఆలోచన'ను, 'అత్యాధునిక సాంకేతికత'ను వెంటబెట్టుకొచ్చింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచం గర్వించే మానవతావాది బిల్ గేట్స్ అమరావతి గడ్డపై అడుగుపెట్టడం ఒక చారిత్రాత్మక ఘట్టం. అమరావతి గడ్డపై అపర కుబేరుడు: ఇది కేవలం పర్యటన కాదు.. ఒక ఆశల వారధి! నేటి సమాజంలో సాయం చేసే చేతిని కూడా అనుమానించే పరిస్థితి. కానీ, తాను సంపాదించిన సంపదలో సింహభాగాన్ని సమాజ శ్రేయస్సు కోసం వెచ్చించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరులకు 'దాతృత్వం' అంటే ఏమిటో నేర్పిన మహోన్నత వ్యక్తి బిల్ గేట్స్. ఆయన గన్నవరం విమానాశ్రయంలో దిగినప్పుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా వెళ్లి ఘన స్వాగతం పలకడం వెనుక ఒక స్పష్టమైన సంకేతం ఉంది. అది—సాంకేతికతతో సామాన్యుడి జీవితాన్ని మార్చాలనే తపన. సంపద పంపిణీ కాదు.. సమస్యల పరిష్కారం బిల్ గేట్స్ పర్యటనను కేవలం ఒక పారిశ్రామికవేత్త పర్యటనగా చూడలేం. ఒక మనిషి తన మేధస్సుతో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగి, మళ్ళీ అదే మేధస్సును పేదరికం, రోగాలు, వ్యవసాయ సంక్షోభాల పరిష్కారానికి ఎలా వాడుతున్నారనేది ఇక్కడ ముఖ్యం. గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఏపీలో సాగుతున్న 'సంజీవని' వంటి ప్రాజెక్టులు వేలమంది ప్రాణాలను, జీవనోపాధిని కాపాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే RTGS కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించనుండటం విశేషం. డేటా ఆధారిత పాలనలో ఏపీ దేశానికే దిక్సూచిగా నిలుస్తోంది. ప్రభుత్వ ఫలాలు నేరుగా లబ్ధిదారుడికి అందుతున్నాయా? సాంకేతికత ద్వారా అవినీతిని ఎలా అరికట్టవచ్చు? విపత్తుల సమయంలో సెకన్ల వ్యవధిలో నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చు? ఈ అంశాలపై గేట్స్ వంటి విజనరీకి చంద్రబాబు నాయుడు ప్రజంటేషన్ ఇవ్వడం రాష్ట్ర ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతుంది. బిల్ గేట్స్ వంటి దిగ్గజాలను ఆంధ్రప్రదేశ్ వైపు చూడలా చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి సామాన్యమైనది కాదు. గత మూడు దశాబ్దాలుగా ఆయనకు గేట్స్ తో ఉన్న సాన్నిహిత్యం వ్యక్తిగతమైనది మాత్రమే కాదు, అది రాష్ట్ర ప్రయోజనాల కోసం నిర్మించుకున్న ఒక బలమైన బంధం. ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులకు చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ అంబాసిడర్ లా కనిపిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ నిర్మాణ సమయం నుండి నేటి అమరావతి వరకు, టెక్నాలజీని సామాన్యుడి ముంగిటకు తేవాలనే ఆయన ప్రయత్నమే గేట్స్ ఫౌండేషన్ ను ఇక్కడికి రప్పించింది. లోకేశ్ తో కూడిన మంత్రుల బృందం గేట్స్ కు స్వాగతం పలకడం ద్వారా ప్రభుత్వం అంతా ఒకే లక్ష్యం—'అభివృద్ధి'—కోసం పనిచేస్తోందని నిరూపించారు. ఈ పర్యటన ద్వారా రాబోయే మార్పులు అపారం: ఉండవల్లిలో డ్రోన్లు, AI (కృత్రిమ మేధ) సాయంతో చేసే వ్యవసాయాన్ని గేట్స్ పరిశీలించడం ద్వారా, భవిష్యత్తులో మన రైతులు ప్రపంచ స్థాయి సాగు పద్ధతులను అందుకోనున్నారు. వైద్యం & విద్య: గేట్స్ ఫౌండేషన్ సహకారంతో స్కూళ్లలో డిజిటల్ విద్య, ఆసుపత్రుల్లో అత్యాధునిక డయాగ్నస్టిక్ సేవలు మరింత విస్తృతం కానున్నాయి. గేట్స్ రాకతో ఇతర అంతర్జాతీయ సంస్థల దృష్టి కూడా అమరావతిపై పడుతుంది. ఇది 'స్వర్ణాంధ్ర విజన్ 2047' దిశగా పడే బలమైన అడుగు. బిల్ గేట్స్ పర్యటన ఒక గంటలో.. రోజులో ముగిసే కార్యక్రమం కాదు, అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దొరికిన ఒక గొప్ప భరోసా. సంపద ఉన్న ప్రతివాడూ సాయం చేయడు, సాయం చేసే మనసున్న ప్రతివాడి దగ్గరా సంపద ఉండదు. ఈ రెండూ పుష్కలంగా ఉన్న గేట్స్, మార్పును ఆకాంక్షించే చంద్రబాబు కలిస్తే—అది సామాన్యుడి పాలిట వరం.2
- చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పంలో ఘనంగా స్మశాన కొల్ల.. కుప్పం పట్టణంలో అంకాళపరమేశ్వరి జాతర మహోత్సవమైన శ్మశాన కొల్ల మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో వెలసిన అంకాళ పరమేశ్వరి అమ్మవారికి శ్మశాన కొల్ల పేరుతో మత్స్యకారులు నిర్వహించే జాతరలో భాగంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పట్టణంలోని శ్మశానంలో అమ్మవారి భారీ ప్రతిరూపాన్ని బంకమన్నుతో ఏర్పాటు చేశారు. అనంతరం కొత్తపేట నుంచి అమ్మవారి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా శ్మశానం వద్దకు తీసుకొచ్చారు. శ్మశానంలో సమాధులు తవ్వి మనిషి అస్థికలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టారు. కొబ్బరికాయలు కొట్టి, కర్పూర హారతులు వెలిగించారు. అమ్మవారి ఉత్సవమూర్తికీ మొక్కులు చెల్లించుకున్నారు. పూజారులు కొరడాలు చేతపట్టి అమ్మవారి ప్రతిమకు సమీపంలో నిలిచారు. పదుల సంఖ్యలో భక్తులు రెండు చేతులూ జోడించి పైకెత్తి, వారి ఎదుట మోకాళ్లమీద వరుసగా బారులు తీరారు. దెబ్బదెబ్బకూ భక్తులు చేస్తున్న అమ్మవారి నామజపంతో పరిసరాలు మార్మోగాయి. అమ్మవారి ప్రతిమ నుంచి మట్టిని తీసుకోవడానికి భక్తులు ఎగబడ్డారు. స్మశాన కోళ్లను వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.1
- మదనపల్లి లో చిన్నారిని దారుణంగా హత్య చేసిన నిందితున్ని ఎన్కౌంటర్ చేయాలి.1
- బద్వేలు: పట్టణ అభివృద్ది సొసైటి సభ్యుల సమావేశంలో అధ్యక్షులు నానబాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బద్వేలు మునిసిపాలిటీ ఏర్పడి 15 సంవత్సరాలు జరిగినా నేటికీ పట్టణం లోగల ప్రజలకు మౌళిక సదుపాయాల పూర్తిగా అందలేదని,శానిటరీ వర్కర్ల సంఖ్య పెంచి పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని,యన్.జి.ఒ కాలనీలో ఉన్న పబ్లిక్ పర్పస్ 96 సెంట్లలో పార్కు,లైబ్రరీ చెన్నంపల్లె వద్ద స్టేడియం ఏర్పాటు చేయాలన్నారు.ఆవాజ్ కమిటి పట్టణ అధ్యక్షులు యస్.ఎ.అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ పట్టణం లోని వీధుల రోడ్లు ఆక్రమణలకు గురవుతున్నాయని, రోడ్లు గుంతలు పడి,డ్రైనేజీలు లేక వాహనదారులు,పాదచారులు అనేక ఇబ్బందులకు, ప్రమాదాలకు గురవుతున్నారని, పట్టణంలో దోమల బెడద ఎక్కువగా ఉన్నందున ప్రజలు టైఫాయిడ్ లాంటి దోమకాటు జ్వరాలతో బాధపడుతున్నారని సంబంధిత అధికారులు వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.ప్రధాన కార్యదర్శి గురుమూర్తి మాట్లాడుతూ బద్వేలు పట్టణంలోని మైన్ రోడ్లలో సాయంత్రం 5 గంటల తర్వాత ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్నదని ప్రజలకు ప్రమాదాలు జరుగకుండా సంబధిత అధికారులు చర్యలు చేపట్టాలని, పట్టణానికి మధ్యలో ఉన్న నాగులచెరువును మధ్యలో బుద్ద విగ్రహావిగ్రహాన్ని ఏర్పాటుచేసి వినోద పర్యాటక చెరువుగా చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సొసైటి గౌరవాధ్యక్షులు కొండపల్లి చిన్న సుబ్బారావు,కోశాధికారి పాలేటి శ్రీనివాసులు రెడ్డి, ఉపాధ్యక్షులు కె.వి సుబ్బారావు, గనుమంతు రాజేష్ కుమార్,షేక్ మాహీర్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాయి సరిత స్కూల్ కరస్పాండెంట్ రాము మరియు బిసి సంఘం నాయకులు వాకారామయ్య మరియు టెలిఫోన్ బాలయ్య మరియు చిన్న కేశం పల్లెమాజీ సర్పంచ్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.1
- అనంతపురం నగరంలో ఈరోజు “సేవ్ ఆర్‌డీటీ” ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తూ భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆర్‌డీటీకి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసనకారులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు నష్టం జరుగుతోందని వారు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. జేఏసీ ప్రతినిధులు తమ సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందజేసి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- కోటప్పకొండ సనాతన ధర్మంలో ఇది పెద్ద పాపం కాదా? 🙏 మహాశివరాత్రి నాడు కోటప్పకొండలో ప్రభుత్వ ఆధ్వర్యంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు!1