logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

భవిష్యత్ తరాల కోసం విస్తృతంగా మొక్కలు నాటాలి.. నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి నల్లగొండ: భవిష్యత్తు తరాల కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి కాపాడాలని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం జరిగిన వన మహోత్సవంలో మేయర్ పాల్గొని విద్యార్థినీలతో కలిసి కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మొక్క నాటి పెద్ద వృక్షంగా ఎదిగే వరకు కృషి చేయాలన్నారు. కార్పొరేషన్ ను గ్రీన్ సిటీగా మార్చేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని అన్నారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలన్నారు. కమిషనర్ బి.వంశీకృష్ణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. నగరంలో పచ్చదనం పెంచేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ మహమ్మద్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, 14వ డివిజన్ కార్పొరేటర్ బొజ్జ శంకర్, 16వ డివిజన్ కార్పొరేటర్ పెరిక స్వాతి, డిప్యూటీ ఈఈ పి. అశోక్ కుమార్, ఏఈ వి. దిలీప్ భార్గవ, అసీం బాబా,శానిటరీ సూపర్‌వైజర్ గడ్డం శ్రీనివాస్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ రెడ్డి, హరితహారం సిబ్బంది, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

12 hrs ago
user_Journalist pk
Journalist pk
Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
12 hrs ago
a155cc78-35c7-4342-95c6-267e0c5c7974

భవిష్యత్ తరాల కోసం విస్తృతంగా మొక్కలు నాటాలి.. నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి నల్లగొండ: భవిష్యత్తు తరాల కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి కాపాడాలని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం జరిగిన వన మహోత్సవంలో మేయర్ పాల్గొని విద్యార్థినీలతో కలిసి కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మొక్క నాటి పెద్ద వృక్షంగా ఎదిగే వరకు కృషి చేయాలన్నారు. కార్పొరేషన్ ను గ్రీన్ సిటీగా మార్చేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని అన్నారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలన్నారు. కమిషనర్ బి.వంశీకృష్ణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. నగరంలో పచ్చదనం పెంచేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ మహమ్మద్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, 14వ డివిజన్ కార్పొరేటర్ బొజ్జ శంకర్, 16వ డివిజన్ కార్పొరేటర్ పెరిక స్వాతి, డిప్యూటీ ఈఈ పి. అశోక్ కుమార్, ఏఈ వి. దిలీప్ భార్గవ, అసీం బాబా,శానిటరీ సూపర్‌వైజర్ గడ్డం శ్రీనివాస్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ రెడ్డి, హరితహారం సిబ్బంది, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

More news from Nalgonda and nearby areas
  • స్వచ్ఛ్ మిర్యాలగూడ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు రూపొందించిన ‘స్వచ్ఛ మిర్యాలగూడ' యాప్ లోగోను ఆయన ఆవిష్కరించారు.రాష్ట్రంలోనే తొలిసారిగా మిర్యాలగూడ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులకు ఆన్‌లైన్ ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని సెప్టెంబర్ 1నుంచి పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయనున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజ రెడ్డి మాట్లాడుతూ..కార్మికుల గైర్హాజరును అరికట్టేందుకు,రోజూ ఉదయాన్నే ఆన్‌లైన్ ద్వారా హాజరు సేకరించనున్నట్లు తెలిపారు.అలాగే,ప్రజలు తమ పరిధిలోని పారిశుధ్య సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు యాప్‌ను వినియోగించుకోవాలన్నారు.అందులో ఫిర్యాదు చేయగానే టికెట్ జనరేట్ అయి సమస్య వెంటనే పరిష్కారమవుతుందని వివరించారు.మరో నెలలో ఈ యాప్ పూర్తిస్థాయిలో మనుగడలోకి వస్తుందన్నారు.
    1
    స్వచ్ఛ్ మిర్యాలగూడ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
నల్గొండ జిల్లా మిర్యాలగూడ  మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు రూపొందించిన ‘స్వచ్ఛ మిర్యాలగూడ' యాప్ లోగోను ఆయన ఆవిష్కరించారు.రాష్ట్రంలోనే తొలిసారిగా మిర్యాలగూడ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులకు ఆన్‌లైన్ ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని సెప్టెంబర్ 1నుంచి పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయనున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజ రెడ్డి మాట్లాడుతూ..కార్మికుల గైర్హాజరును అరికట్టేందుకు,రోజూ ఉదయాన్నే ఆన్‌లైన్ ద్వారా హాజరు సేకరించనున్నట్లు తెలిపారు.అలాగే,ప్రజలు తమ పరిధిలోని పారిశుధ్య సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు యాప్‌ను వినియోగించుకోవాలన్నారు.అందులో ఫిర్యాదు చేయగానే టికెట్ జనరేట్ అయి సమస్య వెంటనే పరిష్కారమవుతుందని వివరించారు.మరో నెలలో ఈ యాప్ పూర్తిస్థాయిలో మనుగడలోకి వస్తుందన్నారు.
    user_T Shankar Public News Reporter
    T Shankar Public News Reporter
    రిపోర్టర్ Kanagal, Nalgonda•
    12 hrs ago
  • **విద్యార్థులలో విద్య సామర్థ్యాలను పెంపొందించాలి*** *- ఆ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలి.. *- నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్. *- నల్గొండ జిల్లా కేంద్రంలోని కంచనపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్.. *- విద్యార్థులతో సరదాగా ముచ్చటించిన కలెక్టర్. విద్యార్థులలో కనీస విద్య సామర్థ్యాలు పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం అయన నల్గొండ జిల్లా, నల్గొండ మండలం, కంచనపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ వేశారు. అనంతరం విద్యార్థుల విద్యాసామర్ధ్యాలను పరిశీలించారు. ప్రతి విద్యార్థికి చదవడం ,రాయడంతో పాటు, తెలుగు ,ఇంగ్లీష్ లలో పదాలకు అర్థాలు తెలిసే విధంగా నేర్పించాలని, ప్రాథమిక స్థాయిలో కనీస విద్యా సామర్ధ్యాలు పెంపొందినప్పుడే పై తరగతులకు వెళ్లిన సందర్భంలో విషయం సులభంగా అర్థమవుతుందని, ఈ విషయంపై ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. అలాగే కొత్త పదాలకు అర్థాలతో పాటు, చదవడం, రాయడం ప్రాక్టీస్ చేయించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ యూనిఫామ్స్ గురించి అడిగారు. అందరికీ యూనిఫామ్ అందించడం జరుగుతుందని, యూనిఫాం వచ్చినవారు సరైన విధంగా ఉన్నది సరిచూసుకోవాలని, అవసరమైతే పాఠశాలలోనే ఆల్టరేషన్ చేయించేందుకు టైలర్లను పాఠశాలకు పిలిపించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాల పరిసరాలను, తరగతి గదులను పరిశీలించారు. స్థానిక సర్పంచ్ మహేశ్వరి తో మాట్లాడుతూ విద్యార్థుల విద్యా సామర్ధ్యాల పెంపుదలకు స తరచు పాఠశాలను సందర్శించి వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    2
    **విద్యార్థులలో  విద్య సామర్థ్యాలను
పెంపొందించాలి***
*- ఆ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలి..
*- నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్.
*- నల్గొండ జిల్లా కేంద్రంలోని కంచనపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్..

*- విద్యార్థులతో సరదాగా ముచ్చటించిన కలెక్టర్.
విద్యార్థులలో  కనీస విద్య సామర్థ్యాలు పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం అయన నల్గొండ జిల్లా, నల్గొండ మండలం, కంచనపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ వేశారు. అనంతరం  విద్యార్థుల విద్యాసామర్ధ్యాలను పరిశీలించారు.  ప్రతి విద్యార్థికి చదవడం ,రాయడంతో పాటు, తెలుగు ,ఇంగ్లీష్ లలో  పదాలకు అర్థాలు తెలిసే విధంగా నేర్పించాలని,  ప్రాథమిక స్థాయిలో కనీస విద్యా సామర్ధ్యాలు పెంపొందినప్పుడే పై తరగతులకు వెళ్లిన సందర్భంలో విషయం సులభంగా అర్థమవుతుందని, ఈ విషయంపై ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. అలాగే కొత్త పదాలకు అర్థాలతో పాటు, చదవడం, రాయడం ప్రాక్టీస్ చేయించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ యూనిఫామ్స్ గురించి అడిగారు. అందరికీ యూనిఫామ్ అందించడం జరుగుతుందని, యూనిఫాం వచ్చినవారు సరైన విధంగా ఉన్నది సరిచూసుకోవాలని, అవసరమైతే పాఠశాలలోనే ఆల్టరేషన్ చేయించేందుకు టైలర్లను పాఠశాలకు పిలిపించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాల పరిసరాలను, తరగతి గదులను పరిశీలించారు. స్థానిక సర్పంచ్ మహేశ్వరి తో మాట్లాడుతూ విద్యార్థుల విద్యా సామర్ధ్యాల పెంపుదలకు స  తరచు పాఠశాలను సందర్శించి వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. ఈ  కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    user_YADLA VENUDHAR
    YADLA VENUDHAR
    Suryapet, Telangana•
    9 hrs ago
  • యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి మంగళవారం రూ.18,92,299 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో అధికంగా ప్రసాద విక్రయాల ద్వారా రూ.6,70,860, కార్ పార్కింగ్తో రూ.3 లక్షలు, VIP దర్శనాలతో రూ.1,87,200, బ్రేక్ దర్శనాలతో రూ.1,08,300, ప్రధాన బుకింగ్ తో రూ.1,49,854, వ్రతాలతో రూ.1,10,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.
    1
    యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి
వారి నిత్య ఆదాయ వివరాలు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి మంగళవారం రూ.18,92,299 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో అధికంగా ప్రసాద విక్రయాల ద్వారా రూ.6,70,860, కార్ పార్కింగ్తో రూ.3 లక్షలు, VIP దర్శనాలతో రూ.1,87,200, బ్రేక్ దర్శనాలతో రూ.1,08,300, ప్రధాన బుకింగ్ తో రూ.1,49,854, వ్రతాలతో రూ.1,10,000, తదితర విభాగాల నుంచి ఆదాయం
వచ్చిందన్నారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    11 hrs ago
  • హరితహారం మొక్కలతో ఆహ్లాదకరమైన ప్రయాణం.................. గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామపురం నుంచి చాకిరాల వరకు రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు నేడు పెద్దవిగా పెరిగాయి. పచ్చదనంతో కళకళలాడుతున్న ఈ చెట్లు ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఎండలో ప్రయాణించే వారికి నీడనిస్తూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తున్నాయి. మొక్కల సంరక్షణతో మరింత పచ్చదనం పెరగాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    హరితహారం మొక్కలతో ఆహ్లాదకరమైన ప్రయాణం..................
గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామపురం నుంచి చాకిరాల వరకు రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు నేడు పెద్దవిగా పెరిగాయి. పచ్చదనంతో కళకళలాడుతున్న ఈ చెట్లు ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఎండలో ప్రయాణించే వారికి నీడనిస్తూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తున్నాయి. మొక్కల సంరక్షణతో మరింత పచ్చదనం పెరగాలని స్థానికులు కోరుతున్నారు.
    user_K. UPENDER
    K. UPENDER
    Farmer నాదిగూడెం, సూర్యాపేట, తెలంగాణ•
    22 hrs ago
  • అధికారుల నిర్లక్ష్యంతో పది లక్షల రూపాయల ప్రజాధనం వృధా... జిల్లా కేంద్రమైన జనగామలోని 18 వ వార్డులో సీడీఎంఏ నిధుల కింద చేపట్టిన మురుగు కాలువ నిర్మాణ పనుల్లో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని స్థానిక కౌన్సిలర్ గంపగోని సుగుణాకర్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సరైన లెవలింగ్ లేకుండా రోడ్డు కంటే దాదాపు రెండు ఫీట్ల ఎత్తులో కాలువ నిర్మాణం చేపట్టడం వల్ల స్థానిక ఇళ్ల నుంచి నీరు బయటకు పోకపోగా మోరీ నీరే ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఏర్పడిందన్నారు.పనులు ప్రారంభమైన నాటి నుంచే స్థానిక సమస్యపై ఏఈ,డీఈలకు ఫొటోలు తీసి పంపి హెచ్చరించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా పనులు కొనసాగించారని,ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంజనీరింగ్ అధికారుల అనాలోచిత వైఖరి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బాధ్యులైన కమిషనర్, డీఈలపై జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.
    1
    అధికారుల నిర్లక్ష్యంతో పది లక్షల రూపాయల ప్రజాధనం వృధా...
జిల్లా కేంద్రమైన జనగామలోని 18 వ వార్డులో సీడీఎంఏ నిధుల కింద చేపట్టిన మురుగు కాలువ నిర్మాణ పనుల్లో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని స్థానిక కౌన్సిలర్ గంపగోని సుగుణాకర్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సరైన లెవలింగ్ లేకుండా రోడ్డు కంటే దాదాపు రెండు ఫీట్ల ఎత్తులో కాలువ నిర్మాణం చేపట్టడం వల్ల స్థానిక ఇళ్ల నుంచి నీరు బయటకు పోకపోగా మోరీ నీరే ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఏర్పడిందన్నారు.పనులు ప్రారంభమైన నాటి నుంచే స్థానిక సమస్యపై ఏఈ,డీఈలకు ఫొటోలు తీసి పంపి హెచ్చరించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా పనులు కొనసాగించారని,ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంజనీరింగ్ అధికారుల అనాలోచిత వైఖరి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బాధ్యులైన కమిషనర్, డీఈలపై జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    13 hrs ago
  • అయితే ఆగస్టు 24న సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్‌లతో సమావేశం నిర్వహించ
    1
    అయితే ఆగస్టు 24న సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్‌లతో సమావేశం నిర్వహించ
    user_@ANUNEWS143
    @ANUNEWS143
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    1 hr ago
  • మేడ్చల్‌లో గంజాయి మత్తులో యువకుల వీరంగం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్‌ని ఆపి గంజాయి కావాలంటూ రచ్చ చేసిన 10 మంది యువకులు గంజాయి నా వద్ద లేదనడంతో ఆగ్రహానికి గురై మత్తులో డ్రైవర్ ఆకాష్‌పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి గంజాయి యువకుల దాడిలో కార్ డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి విరిగిన వైనం దాడి ఘటనలో దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్‌కి పరిగెత్తిన డ్రైవర్ తరుముకుంటూ వెళ్లి డ్రైవర్ ఇంటి ఆవరణలో కట్టెలతో విచక్షణారహితంగా దాడి
    1
    మేడ్చల్‌లో గంజాయి మత్తులో యువకుల వీరంగం

సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం

రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్‌ని ఆపి గంజాయి కావాలంటూ రచ్చ చేసిన 10 మంది యువకులు

గంజాయి నా వద్ద లేదనడంతో ఆగ్రహానికి గురై మత్తులో డ్రైవర్ ఆకాష్‌పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి

గంజాయి యువకుల దాడిలో కార్ డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి విరిగిన వైనం

దాడి ఘటనలో దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్‌కి పరిగెత్తిన డ్రైవర్

తరుముకుంటూ వెళ్లి డ్రైవర్ ఇంటి ఆవరణలో కట్టెలతో విచక్షణారహితంగా దాడి
    user_@ANUNEWS143
    @ANUNEWS143
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    1 hr ago
  • పరువు కోసం.. కుమార్తెను ప్రియుడితో చంపించిన కసాయి తండ్రి హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారులో మహిళ మృతదేహం లభ్యమైన కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మృతురాలు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మానసను ఆమె ప్రియుడు వినోద్‌కుమార్‌ హత్య చేసినట్లు వెల్లడైంది. ఈ కేసులో వినోద్‌ను విచారించగా మానస తండ్రి రాజేశం ఆదేశాలతో హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇదివరకే రెండుసార్లు వివాహం జరిగి విడాకులు తీసుకున్న మానస, వినోద్‌తో ప్రేమలో పడింది. తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని వినోద్ మానస తండ్రి రాజేశంకు చెప్పాడు. కుటుంబ పరువు తీస్తోందని, కూతురిని చంపేయాలని రాజేశం చెప్పడంతో, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
    1
    పరువు కోసం.. కుమార్తెను ప్రియుడితో చంపించిన కసాయి తండ్రి
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారులో మహిళ మృతదేహం లభ్యమైన కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మృతురాలు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మానసను ఆమె ప్రియుడు వినోద్‌కుమార్‌ హత్య చేసినట్లు వెల్లడైంది. ఈ కేసులో వినోద్‌ను విచారించగా మానస తండ్రి రాజేశం ఆదేశాలతో హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇదివరకే రెండుసార్లు వివాహం జరిగి విడాకులు తీసుకున్న మానస, వినోద్‌తో ప్రేమలో పడింది. తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని వినోద్ మానస తండ్రి రాజేశంకు చెప్పాడు. కుటుంబ పరువు తీస్తోందని, కూతురిని చంపేయాలని రాజేశం చెప్పడంతో, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.