*శాతవాహన ఫార్మసీ కళాశాలలో అనిమల్ హౌస్ (జంతు శాల) ప్రారంభోత్సవము ఫార్మసీ ప్రయోగాల కలల ప్రాజెక్ట్ - ఆచార్య ఉమేశ్ కరీంనగర్ లోని మానేరు డామ్ పక్కన శాతవాహన ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ వారోత్సవాల సందర్భంగా "యానిమల్ హౌస్" ఉపకులపతి ఆచార్య యు ఉమేష్ కుమార్ ప్రారంభోత్సవం చేస్తూ ఈ జంతు ప్రయోగశాల, జంతువులకు ఆశ్రయం కల్పించి వాటిని సంరక్షించడానికి, ఫ్రీ క్లినికల్ రీసెర్చ్ చేయడానికి, విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తూ, కొత్త ఔషధ ఆవిష్కరణలలో భద్రత, సమర్ధతను నిర్ధారించడానికి బి ఫార్మసీ, ఎం ఫార్మసీలలో కొత్త ఆవిష్కరణలను చేయడానికి కొత్త పరిశోధనలను చేసి అంతర్జాతీయ స్థాయిలో సదస్సులలో పాల్గొనడానికి అధ్యాపకులకు ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ జంతు శాల ద్వారా ఏదైనా కొత్త ఔషధాన్ని కనుగొనినప్పుడు మనుషులలో ఉపయోగించడానికి ముందు దాని భద్రతను జంతువులలో పరీక్షించి నిర్వహించడానికి విద్యార్థులకు ఔషధ నిర్వహణ జీవ సంబంధమైన యంత్రాంగాల విషయాలను నేర్చుకోవడానికి వీలు కల్పిస్తుందన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ మాట్లాడుతూ పరిశోధనలో భాగంగా ఫార్మకాలజీకి ఈ జంతు శాల వెన్నెముక వంటిదని జీవ వ్యవస్థలో మనం వేసుకునే మందులు ఎలా తయారు చేయబడతాయి ఎలా పంపిణీ చేయబడతాయి అవి మానవ శరీరంపై ఏ రకంగా పనిచేస్తాయో తెలియజేయడానికి ముందుగా జంతువులపై ప్రయోగాలు చేసిన తర్వాత ప్రచారంలోకి వస్తాయని, ఈ జంతుశాల వల్ల ఫార్మసీ పరిశోధనలలో మరింత ముందుకు వెళ్లడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.శ్రీశైలం, సీడీసీ డీన్ డా. జాఫర్, డా. శ్రీవాణి, డా. నజీముద్దీన్ మున్వర్, అధ్యాపకులు డా. క్రాంతి, డా. అనిల్ డా.భాగ్యలక్ష్మి, డాక్టర్ శ్రీవిద్య, డా. అశ్విని, డా. అర్చన, బోధనేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
*శాతవాహన ఫార్మసీ కళాశాలలో అనిమల్ హౌస్ (జంతు శాల) ప్రారంభోత్సవము ఫార్మసీ ప్రయోగాల కలల ప్రాజెక్ట్ - ఆచార్య ఉమేశ్ కరీంనగర్ లోని మానేరు డామ్ పక్కన శాతవాహన ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ వారోత్సవాల సందర్భంగా "యానిమల్ హౌస్" ఉపకులపతి ఆచార్య యు ఉమేష్ కుమార్ ప్రారంభోత్సవం చేస్తూ ఈ జంతు ప్రయోగశాల, జంతువులకు ఆశ్రయం కల్పించి వాటిని సంరక్షించడానికి, ఫ్రీ క్లినికల్ రీసెర్చ్ చేయడానికి, విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తూ, కొత్త ఔషధ ఆవిష్కరణలలో భద్రత, సమర్ధతను నిర్ధారించడానికి బి ఫార్మసీ, ఎం ఫార్మసీలలో కొత్త ఆవిష్కరణలను చేయడానికి కొత్త పరిశోధనలను చేసి అంతర్జాతీయ స్థాయిలో సదస్సులలో పాల్గొనడానికి అధ్యాపకులకు ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ జంతు శాల ద్వారా ఏదైనా కొత్త ఔషధాన్ని కనుగొనినప్పుడు మనుషులలో ఉపయోగించడానికి ముందు దాని భద్రతను జంతువులలో
పరీక్షించి నిర్వహించడానికి విద్యార్థులకు ఔషధ నిర్వహణ జీవ సంబంధమైన యంత్రాంగాల విషయాలను నేర్చుకోవడానికి వీలు కల్పిస్తుందన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ మాట్లాడుతూ పరిశోధనలో భాగంగా ఫార్మకాలజీకి ఈ జంతు శాల వెన్నెముక వంటిదని జీవ వ్యవస్థలో మనం వేసుకునే మందులు ఎలా తయారు చేయబడతాయి ఎలా పంపిణీ చేయబడతాయి అవి మానవ శరీరంపై ఏ రకంగా పనిచేస్తాయో తెలియజేయడానికి ముందుగా జంతువులపై ప్రయోగాలు చేసిన తర్వాత ప్రచారంలోకి వస్తాయని, ఈ జంతుశాల వల్ల ఫార్మసీ పరిశోధనలలో మరింత ముందుకు వెళ్లడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.శ్రీశైలం, సీడీసీ డీన్ డా. జాఫర్, డా. శ్రీవాణి, డా. నజీముద్దీన్ మున్వర్, అధ్యాపకులు డా. క్రాంతి, డా. అనిల్ డా.భాగ్యలక్ష్మి, డాక్టర్ శ్రీవిద్య, డా. అశ్విని, డా. అర్చన, బోధనేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
- మహాశక్తి ఆలయం లోని అమ్మవార్ల సాక్షిగా మైనర్ బాలికకు నా కొడుక్కి ఎలాంటి సంభంధం లేదని ప్రమాణం చేయగలవా బండి సంజయ్ అని సవాల్ విసిరారు కరీంనగర్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మెన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోనీ తెలంగాణ చౌక్ లో.. బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరత్ ను పొక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బారాసా శ్రేణులతో కలసి వారు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. సంజయ్ డౌన్ డౌన్ అంటూ..నినదించారు. కళ్ళు మూసుకొని ఉన్న మోడీ, నోటికి వేలు అడ్డం ఉంచి మౌనంగా ఉన్న రాహుల్ గాంధీ, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి లు ఉన్న ప్లకార్డులను వారు ప్రదర్శించారు. ఈ సందర్బంగా అనిల్ మాట్లాడుతూ... మైనర్ బాలిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సహాయం చేస్తున్నట్లు అనిపిస్తుందనీ వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం అన్నారు. కేంద్ర మంత్రి పదవికి, ఇటు ఎంపీ కి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలని బండి సంజయ్ కి సవాల్ విసిరారు. అదేవిధంగా బండి సాయి భగీరత్ ను వెంటనే పొక్సో కేసులో అరెస్ట్ చేయాలనీ లేని పక్షంలో.. మైనర్ బాలికకు న్యాయం జరిగేంతవరకు బారసా పార్టీ పోరాడుతుందని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో పొన్నం అనిల్ తో పాటు..మీర్ షౌకత్ అలీ , నారదాసు వసంత రావు , బొంకూరి మోహన్ , అన్వేష్ , రవి నాయక్ , సైఫ్ , నయీం , సతీష్ , దినేష్ , రవి గౌడ్, గోడిషాల పావని గౌడ్, బత్తిని కీర్తి లతా గౌడ్ , రుద్ర రాధ , అజంతా , హిమబిందు, శ్రీలత , రాజమణి , రేణుక , అరుణ పలువురు బారసా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.3
- చుక్కల పల్లె గ్రామానికి తరలిస్తుండగా షార్ట్ సర్క్యూట్‌తో గడ్డి కట్టలు దగ్ధం... గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామం నుంచి చొక్కాలపల్లి గ్రామానికి ట్రాక్టర్ ద్వారా గడ్డి కట్టలు తరలిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. డైరీ ఫామ్ చెందిన గడ్డి కట్టలు ట్రాక్టర్‌లో తీసుకెళ్తున్న సమయంలో రహదారిపై ఉన్న లూజ్ విద్యుత్ వైర్లకు తగలడంతో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ట్రాక్టర్‌లో ఉన్న గడ్డి కట్టలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు 150 గడ్డి కట్టలు కాలిబూడిదైనట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ అప్పటికే భారీ నష్టం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనతో రైతు రాజేశంకు నష్టం వాటిల్లినట్లు గ్రామస్తులు తెలిపారు. లూజ్ విద్యుత్ వైర్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయని, అధికారులు వెంటనే చర్యలు తీసుకుని వాటిని సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు.1
- కరీంనగర్ లో శ్రీశైలం మూలిక వైద్యం...దీర్ఘకాల వ్యాధులకు ఆయుర్వేదిక్ ట్రీట్ మెంట్ సర్వరోగ నివారిణిగా ఆయుర్వేదిక్ మందులు పనిచేస్తాయని శ్రీశైలం మూలిక వైద్యం నిర్వాహకులు ఎం.కే నిఖిల్ తెలిపారు. కరీంనగర్ తిరుమలనగర్ లోని వాసవి ఎలైట్ అపార్ట్మెంట్ లో శ్రీశైల మూలిక వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో ఆయుర్వేద వైద్యులు ఎంకే నిఖిల్, క్యాంప్ ఆర్గనైజర్ నాగేంద్ర కుమార్ పాల్గొని ఆయుర్వేద వైద్యం గురించి వివరించారు. మోకాళ్ళ నొప్పులకు, కీళ్ల నొప్పులకు, వాతం, నడుము నొప్పి తలనొప్పి, సయాటికా, స్పాండిలైటీస్, గ్యాస్ ట్రబుల్, షుగర్, స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు దీర్ఘకాల వ్యాధులకు మందులు పంపిణీ చేశారు. మూలికల యొక్క గుణం ఏ రోజుకు ఆ రోజు రక్తాన్ని శుద్ధి చేస్తాయని తెలిపారు. ఆయుర్వేద మందులతో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆహారంలో ఒక భాగమని స్పష్టం చేశారు. ప్రతి నెల 11వ తేదీన కరీంనగర్లో శిబిరం ఉంటుందని తెలిపారు. అన్ని రకాల వ్యాధులకు తక్కువ ధరలో మందులు ఇచ్చి నయం చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.4
- కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మీరు మీ కొడుకుపైన విచారణ చేయమని మీరే కోరాల్సింది. *బండి సంజయ్ తప్పు చేశాడు..* *జయం న్యూస్ మీడియా యూట్యూబ్* *కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మీరు మీ కొడుకుపైన విచారణ చేయమని మీరే కోరాల్సింది..* కుట్ర చేస్తున్నారు అని అనడం కంటే ఆ అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా అనేది మీరు నిరూపించుకోవాలి కొంతమంది మున్నూరు కాపు నాయకులు ఎదో కుట్ర చేస్తున్నారు అంటున్నారు కానీ బాధితురాలు కూడా మున్నూరు కాపు వర్గానికి చెందిన అమ్మాయే వేరే పార్టీ నాయకుడు అని మీ పట్ల వివక్ష ఉండదు, అదేవిదంగా కేంద్ర మంత్రి అని విచారణ పక్క దారి పట్టే అవకాశం లేదు – మంత్రి పొన్నం ప్రభాకర్1
- విద్యా, గ్రామాభివృద్ధి పనులకు మానకొండూరు ఎమ్మెల్యే శ్రీకారం మానకొండూరు ఎమ్మెల్యే, ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం బెజ్జంకి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. విద్యా వారోత్సవాల సందర్భంగా బెజ్జంకి కేజీబీవీలో రూ.60 లక్షల నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల భవనానికి ఎమ్మెల్యే భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. పేద, బడుగు వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. అనంతరం లక్ష్మీపూర్ గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించడంతో పాటు, ప్రభుత్వ హైస్కూల్‌లో రూ.6 లక్షలతో నిర్మించిన వంటగదిని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమాల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలివేరి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంఈఓ మహతి లక్ష్మి, ప్రిన్సిపాల్ శ్వేత, రావుల నరసయ్య, ఐలేని శ్రీనివాస్ రెడ్డి, బైర సంతోష్, రొడ్డ మల్లేశం, ఎర్రల రాజు, బోయిని ప్రశాంత్, నర్సింగం, మధుసూదన్ రెడ్డి, లక్ష్మీపూర్ సర్పంచ్ ముక్కిస కవిత, ఉపసర్పంచ్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.5
- వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ హనుమాన్ జయంతి, వేసవి సెలవుల నేపథ్యంలో భారీగా తరలివచ్చిన భక్తులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. వేసవి సెలవులు, హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వేములవాడకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. వేములవాడకు వచ్చి స్వామివారిని దర్శించుకున్న అనంతరం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లడం భక్తులలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ. అలాగే తెలంగాణలో ఏ శుభకార్యం, పండుగ జరిగినా ముందుగా వేములవాడ కు వచ్చి స్వామి వారిని దర్శించుకోవడం భక్తుల విశ్వాసంగా కొనసాగుతోంది.సోమవారం ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు సుమారు 58,867 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించడం, కోడె మొక్కులు చెల్లించడం, రుద్రాభిషేకం, అన్నపూజ, చండీ హోమం, నిత్య కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం, లింగార్చనలు తదితర ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో రమాదేవి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, క్యూ లైన్లు, విశ్రాంతి ఏర్పాట్లు, ఫ్యాన్లు తదితర సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆలయ సిబ్బంది, భద్రతా సిబ్బంది సమన్వయంతో భక్తుల దర్శనాలు సాఫీగా కొనసాగుతున్నాయి.1
- కొండగట్టు అంజన్న సేవలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అంజన్న సేవలో పాల్గొన్నారు.మంత్రి ఆలయానికి చేరుకోగానే ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు.ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి మంత్రిని శాలువాతో సత్కరించి స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్ దినేష్, జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, స్థానిక సీఐ నీలం రవి, సర్పంచ్ ఆదిరెడ్డి, ఏఈఓ గుండి హరిహర్నాథ్, సూపరింటెండెంట్ సునీల్, చంద్రశేఖర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా, దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.1
- బండి సంజయ్ కుమారుడిపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కక్షపూరితంగా వ్యవహరించడం లేదు మంత్రి పొన్నం ప్రభాకర్* * బండి సంజయ్ కుమారుడిపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కక్షపూరితంగా వ్యవహరించడం లేదు కేంద్ర మంత్రి గా మీరే స్వయంగా మీ కుమారుడి పై వచ్చిన ఆరోపణలను విచారణ చేయాలని కోరాల్సింది మీ మీద కుట్ర చేస్తున్నారని , సానుభూతి పొందే ప్రయత్నం ఆపాలి అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా..? అమ్మాయితో బాబు తిరిగిన మాట వాస్తవమా కాదా వాటిని నిరూపించుకునే ప్రయత్నం చేయాలి.. ముందు మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి పొరపాటు జరిగినా మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి చట్టం తన పని తాను చేసుకునే విధంగా ఉండాలని కోరుకుంటున్నా ఎవరి పట్ల తెలంగాణ ప్రభుత్వానికి వివక్ష లేదు.. తెలంగాణ బిడ్డలను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డలకు విశ్వాసం కలిగిస్తున్న.. ఇలాంటి చర్యల్లో బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది మున్నూరు కాపు సంఘ నాయకులు వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.. ఆ అమ్మాయి కూడా మున్నూరు కాపు వార్తనికి చెందిన అమ్మాయి అని తెల్సింది.. ఇందులో ఎవరు ఎవరిని బ్లేమ్ చేయడానికి వాడడం లేదు ముఖ్యమంత్రి డిజిపితో మాట్లాడి విచారణకు ఆదేశించారు మహిళా డీసీపీ అధికారి తో విచారణ జరుగుతుంది.. దోషులు ఎంతటి వారైనా చట్టం ముందు తప్పించుకోలేరు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని స్వయంగా ముఖ్యమంత్రి డీజీపీ ను ఆదేశించారు.. రాజకీయ ఒత్తిడి జరిగి విచారణలో ఎలాంటి మార్పులు ఉండవు అటువంటి సంఘటనలు జరిగి ఉంటే దోషి మీద కఠిన చర్యలు తీసుకోవడం లో వెనకడుగు వేసే ప్రసక్తి లేదు ఈ అంశంలో బీసీ ల అంశం తెరమీదకు తేవడం సరికాదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచారణకు అడ్డుకుంటే ప్రజాస్వామ్యం గౌరవించదు ఇలాంటి సంఘటనలు జరిగినపుడు మన వ్యక్తిత్వానికి ఇబ్బంది అయినప్పుడు ఒక అడుగు ముందుకు వేసి మనమే విచారణకు ఆదేశించాలి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరిగి దోషులు కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నా.1