యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీలో మద్యం విక్రయాల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. పట్టణంలోని కొన్ని వైన్ షాపులు రాత్రి వేళల్లో నిబంధనలను ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా అమ్మకాలు కొనసాగిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, భువనగిరి రోడ్డులోని పూలే విగ్రహం సమీపంలోని భవాని వైన్స్ వద్ద ఆదివారం రాత్రి 10:30 గంటలు దాటిన తర్వాత కూడా మద్యం విక్రయాలు జరుగుతూనే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో జరుగుతున్న ఈ అమ్మకాలను గమనించిన స్థానికులు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ అమ్మకాల దృశ్యాలు వైరల్ అవుతున్నప్పటికీ, సంబంధిత అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే మోత్కూర్ పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో బెల్ట్ షాపులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గ్రామాల్లో, కాలనీల్లో అక్రమంగా సాగుతున్న మద్యం విక్రయాలను అరికట్టాల్సిన అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైన్ షాపులే సమయ నిబంధనలను పక్కనపెట్టి రాత్రి వేళల్లో విక్రయాలు కొనసాగించడం ప్రజలకు మరింత తలనొప్పిగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్ షాపుల కంటే వైన్ షాపులే అర్ధరాత్రి దాటాక విక్రయాలు సాగిస్తుంటే, అక్రమ బెల్ట్ షాపులను ఎలా నియంత్రిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మద్యం విక్రయాల వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ అధికారులపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, అధికారులు ఈ అక్రమాలకు పూర్తిగా సహకరిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉదయం 9:30 గంటలకే షాపులు తెరిచి, రాత్రి 10:30 నుంచి 11 గంటల వరకు విక్రయాలు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మద్యం దుకాణాల విషయంలో అధికారులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, మోత్కూరులో జరుగుతున్న ఈ మద్యం విక్రయాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, వైరల్ అయిన ఫోటోలు, వీడియోల ఆధారంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు గట్టిగా కోరుతున్నారు.

- హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో NEET పరీక్షా కేంద్రం తెలియక కంగారు పడుతున్న ఒక విద్యార్థినికి ఓయూ ఇన్‌స్పెక్టర్ మహేష్ కుమార్ గౌడ్ మానవత్వంతో సహాయం చేశారు. ఇన్‌స్పెక్టర్ తన వాహనంలో ఆ విద్యార్థినిని ఎక్కించుకుని, సరిగ్గా సమయానికి పరీక్షా కేంద్రం లోపలికి చేర్చి పంపించారు.1
- ఆదివారం జనగామ జిల్లాలో జరిగిన నీట్ పరీక్షకు హాజరైన అశ్విని అనే విద్యార్థిని, జనగామ పట్టణంలోని ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్‌కు పొరపాటున చేరుకుంది. అయితే, ఆమెకు కేటాయించిన అసలు పరీక్షా కేంద్రం పెంబర్తి గ్రామంలోని ఒక కళాశాలలో ఉంది. హాల్ టికెట్ పరిశీలించిన విధుల్లో ఉన్న పోలీసులు, ఆమె తప్పుడు సెంటర్‌కు వచ్చినట్లు గుర్తించి తెలియజేశారు. ఈ విషయం తెలిసి తీవ్ర కంగారుతో కన్నీటిపర్యంతమైన విద్యార్థినిని చూసి, పోలీసులు వెంటనే స్పందించి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా విద్యార్థినిని వెంటనే పోలీస్ వాహనంలో అసలు సెంటర్‌కు తరలించాలని ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో, సదరు విద్యార్థినిని అధికారిక పోలీస్ వాహనంలో ఎక్కించుకొని, జనగామ పట్టణం నుండి పెంబర్తిలోని నీట్ పరీక్షా కేంద్రానికి సైరన్ మోగిస్తూ మెరుపు వేగంతో వెళ్లి, పరీక్ష ప్రారంభానికి 9 నిమిషాల ముందే చేర్చారు. పోలీసుల ఈ వేగవంతమైన, మానవతా దృక్పథంతో కూడిన చర్యకు వారు ప్రజలచే శభాష్ అనిపించుకోగా, విద్యార్థినితో పాటు పలువురు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.1
- తెలంగాణ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క, అలాగే ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శనివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకోవడం తన అదృష్టమని మంత్రి సీతక్క ఈ సందర్భంగా తెలిపారు. కొండపైకి చేరుకున్న మంత్రి సీతక్కకు కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు పూల మొక్కను ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ చైర్మన్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే ఐలయ్య గర్భాలయంలోని స్వయంభూమూర్తులను దర్శించుకుని, ఆలయ అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే ప్రధానాలయ ముఖమంటపంలోని ఉత్సవ మూర్తులను దర్శించుకుని ప్రత్యేక సువర్ణ పుష్పార్చనలో పాల్గొన్నారు. వేద పండితులు, ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం చేయగా, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి స్వామి వారి లడ్డు ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డీఈవో నవీన్ కుమార్, సూపర్డెంట్ రాజన్ బాబు, ఆలయ ప్రధానార్చకులు సురేంద్రచార్యులు, ఉప ప్రధాన అర్చకులు లక్ష్మణాచార్యులు, అర్చకులు మురళి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, ఎస్పీఎఫ్ ఆర్‌ఐ శేషగిరిరావు, ఆర్డీవో కృష్ణారెడ్డి, తహసిల్దార్ గణేష్ నాయక్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, మహిళా నాయకురాలు బండ్రు శోభారాణి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిలర్లు ముక్కెర్ల మల్లేష్, బూడిద మధు, నాయకులు గౌలికర్ రాజేష్, సుధాకర్, భిక్షపతి, గుండ్లపల్లి రాము, అజయ్ తదితరులు పాల్గొన్నారు.1
- అమెరికాలోని డల్లాస్ నగరంలోని ప్రిస్కోలో నూతనంగా ఏర్పాటు చేసిన PMJ జ్యువెలరీ షోరూమ్‌ను తెలంగాణ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, PMJ జ్యువెలరీ సంస్థ నాణ్యత, విశ్వసనీయతతో ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. భారతీయ వ్యాపార సంస్థలు విదేశాల్లో విస్తరిస్తూ ప్రపంచవ్యాప్తంగా తమ ముద్ర వేయడం గర్వకారణమని ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఎన్నారైలు, వ్యాపారవేత్తలు పాల్గొని షోరూమ్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.1
- సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌లో ఆదివారం వాసవి క్లబ్, వాసవి యూత్ క్లబ్, వాసవి వనిత క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో "డాన్ టూ డస్క్" పేరుతో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ సీనియర్ నాయకులు రేణుకుంట శ్రీనివాస్, గంప కృష్ణమూర్తి, చింత రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, "మానవ సేవే మాధవ సేవ" అనే లక్ష్యంతో వాసవి క్లబ్ నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. లక్షకు పైగా సభ్యత్వం కలిగిన వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని వారు తెలిపారు. గజ్వేల్ ప్రాంతంలో జోన్ చైర్మన్ జె. శేఖర్ నాయకత్వంలో విశేష సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని నాయకులు కొనియాడారు. అనంతరం నాచారం దేవస్థానం డైరెక్టర్, వాసవి క్లబ్ జోన్ చైర్మన్ జగ్గయ్యగారి శేఖర్ మాట్లాడుతూ, సేవకు ప్రతిరూపంగా వాసవి క్లబ్ నిలుస్తోందని అన్నారు. "డాన్ టూ డస్క్" కార్యక్రమంలో భాగంగా గోశాలలో గోమాతలకు పూజలు నిర్వహించి దాణా సమర్పించడం, మొక్కలు నాటడం, రక్తదాతల పేర్లు నమోదు చేయడం, కస్తూరిబా బాలికల పాఠశాలలో మెడికల్ కిట్లు పంపిణీ చేయడం, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం వంటి కార్యక్రమాలు చేపట్టామని ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృత స్థాయిలో నిర్వహిస్తామని జగ్గయ్యగారి శేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మరియాల శ్రీనివాస్, సిద్ది రామచంద్రం, ఉప్పల కృష్ణమూర్తి, కాశీనాథ్, గంగిశెట్టి ఉమేష్, గంగ రమేష్, కైలాస ప్రశాంత్, నితీష్, రామారం రమేష్, విక్రాంత్, గందే సంతోష్, సిరిపురం సత్యనారాయణ, తెరాల రాజు, వాసవి వనిత క్లబ్ సభ్యులు జగ్గయ్యగారి లత, సరిత, చంద్రకళతో పాటు వాసవి క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.4
- ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు శ్రీ ఫణీంద్ర ఆదేశాల మేరకు, ఉప్పల్ గిరిజన మోర్చా అధ్యక్షులు బానోత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉప్పల్ గాంధీ బొమ్మ పక్కన ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణపై నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించబడింది. ఈ దీక్షను బీజేపీ ఉప్పల్ డివిజన్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి, తాడూరి శ్రీనివాస్ అన్న, ధర్మారెడ్డి జి, బిజెపి ఓబీసీ మోర్చా గీత సెల్ రాష్ట్ర మాజీ కన్వీనర్ పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్, మహేష్ జి, విఠల్జి, శైలేష్ రెడ్డి, శ్రీధర్ గుప్తా తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.2
- హైదరాబాద్‌లోని అత్తాపూర్ వద్ద, పిలర్ నంబర్ 213 సమీపంలో జరిగిన ఒక రోడ్ రేజ్ ఘటన కలకలం రేపింది. ఒక కారు డ్రైవర్ రాంగ్ సైడ్‌లో తన వాహనాన్ని నడుపుతూ, అనంతరం జరిగిన వాగ్వాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాంగ్ సైడ్ డ్రైవింగ్, రోడ్ రేజ్ వంటి సంఘటనలు నగర రహదారులపై ప్రయాణికుల భద్రతకు పెను ముప్పుగా మారుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.1
- కరీంనగర్-హైదరాబాద్ మార్గంలో ప్రయాణిస్తున్న కరీంనగర్-2 డిపోకు చెందిన ఓ ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులో తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అప్రమత్తమైన డ్రైవర్ తక్షణమే బస్సును నిలిపివేయగా, డ్రైవర్, కండక్టర్లు కలిసి అందులో ఉన్న 37 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటికి దించారు. ప్రయాణికులను దించిన అనంతరం మంటలు బస్సు మొత్తం వ్యాపించి, అది పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.1