Shuru
Apke Nagar Ki App…
*ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ.............సిద్దిపేట జిల్లా రెడ్డి జె ఏ సి ఆధ్వర్యంలో ఏప్రిల్ 21 మంగళవారం రోజున సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నా కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ*...... .......*ఈ రోజున అక్కన్న పేట్ మండలం రేగొండ గ్రామ రెడ్డి సంఘ నాయకులను కలిసి కరపత్రం విడుదల చేయడం జరిగింది*..
KHADEER REPORTER
*ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ.............సిద్దిపేట జిల్లా రెడ్డి జె ఏ సి ఆధ్వర్యంలో ఏప్రిల్ 21 మంగళవారం రోజున సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నా కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ*...... .......*ఈ రోజున అక్కన్న పేట్ మండలం రేగొండ గ్రామ రెడ్డి సంఘ నాయకులను కలిసి కరపత్రం విడుదల చేయడం జరిగింది*..
More news from తెలంగాణ and nearby areas
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో శంకర జయంతి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజు అయిన సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, పారాయణాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు నాలుగు రోజులపాటు జరుగనున్నాయి. మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించగా, రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ఆలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు మరియు ఇతర విశిష్ట ధార్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ సాయంకాలం “శంకర విజయము”పై ప్రవచనాలు నిర్వహిస్తున్నారు. మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించనున్నారు. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు.ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.1
- .*ప్రెస్ రిలీజ్* మెదక్ 20 ఏప్రిల్2026 2027 -పూర్తిగా డిజిటల్ జనగణన కలెక్టర్ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్స్ శిక్షణలో సంపూర్ణ అవగాహనతో , జనగణన విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 2027 - డిజిటల్ జనగణన అని *జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్* అన్నారు కౌడిపల్లి మండలంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఎన్యుమరేటర్ సూపర్వైజర్లకు జనగణన-2027 నిర్వహణలో భాగంగా మూడు రోజులపాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్లుకు దిశా నిర్దేశం చేశారు. శిక్షణలో ప్రతి అంశాన్ని అవగాహన కల్పించుకోవాలన్నారు ఈ శిక్షణ మూడు రోజులు పాటు కొనసాగుతుందని ప్రశ్నలు సమాధానాల రూపంలో జనగణన కు సంబంధించివారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ సంబంధిత ఎనిమరేటర్స్ సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు1
- సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో అధ్య శిల మహోత్సవ కార్యక్రమం సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో శిలలపై బీజాక్షరాలు చెక్కే కార్యక్రమాన్ని చేపట్టారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, మున్సిపల్ చైర్ పర్సన్ వనిత ప్రత్యేక పూజలు చేశారు.1
- గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు చాడ నాగిరెడ్డి సోమవారం తన మక్కలను మాదాపూర్ కొనుగోలు కేంద్రానికి తరలించే సమయంలో నష్టం వాటిల్లింది. గునుకుల కొండాపూర్–జంగపల్లి మార్గంలో కంకర రోడ్డు ఉండటంతో జంగపల్లి వద్ద ట్రాక్టర్ తీవ్ర కుదింపులకు గురై, సుమారు 3 క్వింటాళ్ల మక్కలు దాదాపు 100 మీటర్ల మేర రోడ్డుపాలయ్యాయి. రోడ్డు సదుపాయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని మెరుగుపరచాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.1
- జనగాం జిల్లా లింగాల ఘనపూర్ మండలం నవాబ్‌పేటలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు నేరుగా కేంద్రాలకు వచ్చి ధాన్యం విక్రయించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.1
- ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు కి లేఖ రాసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడం ఎంతో అవసరం అని భావించి తెలంగాణ ఉద్యమకారుడిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఈ లేఖ రాస్తున్నా పొన్నం ప్రభాకర్, నారా చంద్రబాబు నాయుడుకు 75వ జన్మదిన శుభాకాంక్షలతో బహిరంగ లేఖ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పూర్తిగా రాజ్యాంగబద్ధం, పార్లమెంట్ ఆమోదంతో జరిగిన ప్రక్రియ రాష్ట్ర విభజనపై వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగువారి మధ్య ద్వేషాలు రగిలిస్తాయి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన భారత్-పాకిస్తాన్ పోలిక వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ భావోద్వేగాలను దెబ్బతీశాయి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విభజన వ్యాఖ్యలే ఈ వివాదాలకు మూలమ్ విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేసే నేతలను కట్టడి చేయాలని చంద్రబాబునాయుడికి విజ్ఞప్తి తేజస్వి సూర్య వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించేందుకు స్పీకర్‌కు లేఖ రాయాలని విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని, ప్రజలు అన్నదమ్ముల్లా ఉంటున్నారని స్పష్టం రెండు రాష్ట్రాలు పోటీగా అభివృద్ధి చెందుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి విభజనను భారత్-పాకిస్తాన్‌తో పోల్చడం పూర్తిగా తప్పుదారి పట్టించే వ్యాఖ్య తెలుగువారంతా ఐక్యంగా, పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని భావిస్తున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీరు సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించారు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆకాంక్ష మీకు తెలియంది కాదు. తొలి-మలి దశ ప్రత్యేక ఉద్యమాలు, వందలాది మంది అమర వీరుల ప్రాణత్యాగాలు ప్రపంచానికి తెలిసిన విషయమే! నీళ్లు, నిధులు, నియమకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ జరిగిన పోరాటాలకు, ఉద్యమాలకు మీరు ప్రత్యక్ష సాక్షి. చుక్క రక్తం నేల చిందొద్దు అన్న నినాదం, నిబద్దతతో మేం అన్ని అణచివేతల్ని ఎదుర్కొన్నాం కష్ట`నష్టాల్ని తట్టుకొని, బాట తప్పకుండా గాంధేయ మార్గంలో శాంతియుత పోరాటాలు చేశాం. ఆనాడు ‘రాష్ట్రాలుగా విడిపోదాం, తెలుగువారిగా కలుసుందాం’ అనుకున్నాం. దశాబ్దాల ప్రజల ఆకాంక్షల మేరకు తల్లి సోనియా గాంధీ సారధ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2014లో రాజ్యాంగబద్దంగా, పార్లమెంట్ వేదికగా అందరి ఆమోదంతో రాష్ట్రం విడిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడి, ఎవరి రాష్ట్రం వాళ్లకి, ఎవరి దారి వారిది అయి పుష్కర కాలం దాటింది. దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల మాదిరిగానే రెండు తెలుగు రాష్ట్రాలు తమదైన మార్గంలో ప్రగతిపథంలో సాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల వలె ఐక్యంగా కలిసి ఉంటున్నాం. తెలంగాణ వారు ఆంధ్రకి.. ఆంధ్రవారు తెలంగాణకి నిత్యం ఎలాంటి అభద్రతా భావం లేకుండా వివిధ పనుల నిమిత్తం వెళ్తుంటారు. ఇరు రాష్ట్రాల మధ్య పెళ్లి సంబంధాలు కూడా జరుగుతుంటాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఇరు రాష్ట్రాలు పోటీపడి అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర విభజనపై వివాదస్పదంగా మాట్లాడటం, అనుచిత వ్యాఖ్యలు చేయడం, అనవసరంగా ద్వేషాలు రగల్చడం ఎవరికీ మంచిది కాదు.1
- డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలైతే సమాజానికి జరిగే ప్రయోజనాలపై మేధావులు పెదవి విప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విజ్ఝప్తి చేశారు. మేధావుల మౌనం సమాజానికి అరిష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ రూపకర్త, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ లో నిర్వహించిన ‘‘మేధావుల సదస్సు’’లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘‘మేధావులకు రాజకీయాలతో పనిలేదు... వ్యక్తులతో పనిలేదు... సమాజంలో తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. మంచి పనులు చేస్తే సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మీపై ఉందన్నారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుపై మేధావి వర్గం మౌనం వహించడం, పక్షపాత ధోరణి అవలంబించడం సరికాదన్నారు. సమాజంలో జరిగే మంచి చెడులపై, పాలకుల నిర్ణయాలపై అంబేద్కర్ నిష్కర్షగా అభిప్రాయాలను చెప్పేవారని గుర్తు చేశారు. జ్ఝానంలో అంబేద్కర్ వారసులైన మీరు అందుకు భిన్నంగా మౌనం వహించడం సమాజానికి ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. ‘‘ఇకనైనా మౌనం వీడండి. తప్పును తప్పుగా చెప్పండి. ఆ బిల్లులతో మహిళలకు, సమాజానికి మంచి జరుగుతుందని భావిస్తే మీడియా, సోషల్ మీడియా, సదస్సులు, సమావేశాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లండి. అంబేద్కర్ కోరుకున్నట్లుగా అట్టడుగునున్న వర్గాలందరికీ ఆర్దిక, సామాజిక సమానత్వం, రాజకీయ స్వేచ్ఛ హక్కులు దక్కేందుకు మీ వంతు సహకారం అందించండి. వాటి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న మోదీ సర్కార్ కు అండగా నిలవాలని చేతులెత్తి విజ్ఝప్తి చేస్తున్నా అని పిలుపునిచ్చారు.4
- *ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి* *జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజావాణిలో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని *జిల్లా కలెక్టర్ ప్రతిమా అధికారులను ఆదేశించారు. సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో *అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య తో కలిసి జిల్లా కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించారు. ఈ సందర్భంగా *(74)* అర్జీలను *కలెక్టర్* స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు కేటాయిస్తూ, ప్రజా సమస్యలపై తగిన చర్యలు తీసుకొని, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ప్రజావాణి నిర్వహించినట్లు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు1
- జనగామ జిల్లా శివునిపల్లిలో హృదయాన్ని హత్తుకునే ఘటన చోటుచేసుకుంది. ఓపెన్ టెన్త్ పరీక్ష రాసేందుకు వచ్చిన తల్లి పరీక్ష హాలులోకి వెళ్లగా, ఆమె పెద్ద కుమారుడు తమ్ముడిని చూసుకున్నాడు. పరీక్ష పూర్తయ్యే వరకు చిన్నారిని ఆడిస్తూ, తల్లికి ధైర్యం చెప్పిన ఆ బాలుడిని స్థానికులు అభినందించారు. చదువుపై ఆసక్తితో చంటి పిల్లలతోనే మహిళలు పరీక్షలకు హాజరవడం విశేషంగా మారింది.1