వరుణయాగ ఏర్పాట్లను పరిశీలించిన గౌరవ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లోకకళ్యాణార్థం, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పిస్తూ మూడు రోజులపాటు నిర్వహించనున్న వరుణయాగం ఏర్పాట్లను ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 30వ తేదీ గురువారం నుంచి ఆగస్టు 1వ తేదీ శనివారం వరకు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సత్వర సద్యఃసువృష్టి (సకాల వర్షప్రాప్తి) కోసం ఋశ్యశృంగ ప్రతిష్ఠ, వరుణయాగం, వరుణ పర్జన్య జపానుష్ఠానాలు, హవనాలు, శ్రీ భీమేశ్వర స్వామివారికి సంతత ధారాభిషేకం నిర్వహించనున్నారు.జూలై 30వ తేదీ గురువారం ఉదయం స్వస్తి పుణ్యాహవాచనం, ఋత్విగ్వరణం, ఋశ్యశృంగ ప్రతిష్ఠ, వరుణ జపాలు, సంతత ధారాభిషేకం, వరుణయాగ హోమం, జపానుష్ఠానాలు నిర్వహించబడనున్నాయి. అదేవిధంగా దేవస్థానం పరివార, అనుబంధ ఆలయాల్లో మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు, విరాటపర్వ పారాయణాలు, ప్రవచన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే వరుణయాగ మహోత్సవాలకు హాజరయ్యే భక్తులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, అధికారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశించారు.అనంతరం శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి మండపంలో వేద పండితులు, ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో రమాదేవి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని కోడెలకు పచ్చిగడ్డి, కోతులకు అరటిపండ్లు తినిపించారు. రానున్న మూడు రోజులపాటు నిర్వహించనున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో నవీన్ కుమార్, ఏఈఓలు జయకుమారి, నాగుల మహేష్, లక్ష్మణరావు, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, నరేందర్, పెరిక శ్రీనివాస్, శివసాయి సీనియర్ అసిస్టెంట్ వంశీ మోహన్ శర్మ నక్క తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
వరుణయాగ ఏర్పాట్లను పరిశీలించిన గౌరవ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లోకకళ్యాణార్థం, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పిస్తూ మూడు రోజులపాటు నిర్వహించనున్న వరుణయాగం ఏర్పాట్లను ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 30వ తేదీ గురువారం నుంచి ఆగస్టు 1వ తేదీ శనివారం వరకు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సత్వర సద్యఃసువృష్టి (సకాల వర్షప్రాప్తి) కోసం ఋశ్యశృంగ ప్రతిష్ఠ, వరుణయాగం, వరుణ పర్జన్య జపానుష్ఠానాలు, హవనాలు, శ్రీ భీమేశ్వర స్వామివారికి సంతత ధారాభిషేకం నిర్వహించనున్నారు.జూలై 30వ తేదీ గురువారం ఉదయం స్వస్తి పుణ్యాహవాచనం, ఋత్విగ్వరణం, ఋశ్యశృంగ ప్రతిష్ఠ, వరుణ జపాలు, సంతత ధారాభిషేకం, వరుణయాగ హోమం, జపానుష్ఠానాలు నిర్వహించబడనున్నాయి. అదేవిధంగా దేవస్థానం పరివార, అనుబంధ ఆలయాల్లో మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు, విరాటపర్వ పారాయణాలు, ప్రవచన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే వరుణయాగ మహోత్సవాలకు హాజరయ్యే భక్తులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, అధికారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశించారు.అనంతరం శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి మండపంలో వేద పండితులు, ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో రమాదేవి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని కోడెలకు పచ్చిగడ్డి, కోతులకు అరటిపండ్లు తినిపించారు. రానున్న మూడు రోజులపాటు నిర్వహించనున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో నవీన్ కుమార్, ఏఈఓలు జయకుమారి, నాగుల మహేష్, లక్ష్మణరావు, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, నరేందర్, పెరిక శ్రీనివాస్, శివసాయి సీనియర్ అసిస్టెంట్ వంశీ మోహన్ శర్మ నక్క తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
- వరుణయాగ ఏర్పాట్లను పరిశీలించిన గౌరవ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లోకకళ్యాణార్థం, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పిస్తూ మూడు రోజులపాటు నిర్వహించనున్న వరుణయాగం ఏర్పాట్లను ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 30వ తేదీ గురువారం నుంచి ఆగస్టు 1వ తేదీ శనివారం వరకు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సత్వర సద్యఃసువృష్టి (సకాల వర్షప్రాప్తి) కోసం ఋశ్యశృంగ ప్రతిష్ఠ, వరుణయాగం, వరుణ పర్జన్య జపానుష్ఠానాలు, హవనాలు, శ్రీ భీమేశ్వర స్వామివారికి సంతత ధారాభిషేకం నిర్వహించనున్నారు.జూలై 30వ తేదీ గురువారం ఉదయం స్వస్తి పుణ్యాహవాచనం, ఋత్విగ్వరణం, ఋశ్యశృంగ ప్రతిష్ఠ, వరుణ జపాలు, సంతత ధారాభిషేకం, వరుణయాగ హోమం, జపానుష్ఠానాలు నిర్వహించబడనున్నాయి. అదేవిధంగా దేవస్థానం పరివార, అనుబంధ ఆలయాల్లో మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు, విరాటపర్వ పారాయణాలు, ప్రవచన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే వరుణయాగ మహోత్సవాలకు హాజరయ్యే భక్తులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, అధికారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశించారు.అనంతరం శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి మండపంలో వేద పండితులు, ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో రమాదేవి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని కోడెలకు పచ్చిగడ్డి, కోతులకు అరటిపండ్లు తినిపించారు. రానున్న మూడు రోజులపాటు నిర్వహించనున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో నవీన్ కుమార్, ఏఈఓలు జయకుమారి, నాగుల మహేష్, లక్ష్మణరావు, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, నరేందర్, పెరిక శ్రీనివాస్, శివసాయి సీనియర్ అసిస్టెంట్ వంశీ మోహన్ శర్మ నక్క తిరుపతి తదితరులు పాల్గొన్నారు.1
- వర్షంలో సైతం కొనసాగుతున్న బెజ్జంకి బంద్ ఇథనాల్ ఫ్యాక్టరీలను మూసివేయాలని డిమాండ్ వర్షంలోనూ వెనక్కి తగ్గని అఖిలపక్షం.. బెజ్జంకి బంద్ కొనసాగింపు బెజ్జంకి మండలంలో ప్రతిపాదిత ఇథనాల్ ఫ్యాక్టరీల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అఖిలపక్షం చేపట్టిన బంద్ మంగళవారం వర్షం కురుస్తున్నప్పటికీ ఉధృతంగా కొనసాగింది. తిమ్మాయపల్లి, నర్సింహులపల్లి పరిసర ప్రాంతాల్లో ఇథనాల్ పరిశ్రమలు ఏర్పాటైతే పర్యావరణ కాలుష్యం పెరగడంతో పాటు భూగర్భ జలాలు, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసిన నాయకులు, ప్రజలు ఫ్యాక్టరీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బంద్‌కు ప్రజలు, రైతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున మద్దతు తెలపడంతో మండల వ్యాప్తంగా దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు తిరుపతి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ప్రశాంత వాతావరణంలో బంద్ కొనసాగగా, ఇథనాల్ ఫ్యాక్టరీల అనుమతులు రద్దు అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు.4
- భగత్‌నగర్ సంచలన ఇంటి డెకాయిటీ కేసును ఛేదించిన కరీంనగర్ పోలీసులు బాధితుడి సొంత అల్లుడు, మనుమడే ప్రధాన సూత్రధారులు – మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితుల అరెస్ట్ రూ.2.09 లక్షల నగదు, 43.67 గ్రాముల బంగారం, 64.98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో ఇటీవల జరిగిన సంచలన ఇంటి డెకాయిటీ కేసును కరీంనగర్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.2,09,000 నగదు, 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు, 64.98 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలు భగత్‌నగర్‌కు చెందిన ఎం.డి. అజ్మత్ అలీ నివాసంలో అర్ధరాత్రి సమయంలో దుండగులు డమ్మీ పిస్టళ్లు, కత్తులతో చొరబడి కుటుంబ సభ్యులను బెదిరించి, వారి చేతులు, కాళ్లు కట్టేసి ఇంట్లోని నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలం, నిందితులు పారిపోయిన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితులు దోపిడీ అనంతరం దొంగిలించిన ద్విచక్ర వాహనాలపై హుజురాబాద్ వైపు వెళ్లి, పెద్ద పాపయ్యపల్లి సమీపంలో వాటిని వదిలివెళ్లినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన వారని పోలీసులు నిర్ధారించారు. యూపీలో ప్రత్యేక బృందాల గాలింపు – ముగ్గురు అరెస్ట్ దర్యాప్తులో భాగంగా కరీంనగర్ పోలీసుల ప్రత్యేక బృందాలు మీరట్‌కు వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న ముగ్గురు నిందితులను జూలై 29న అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితులు 1. సల్మాన్ @ భూరే @ యాదవ్ (22), ఫల వ్యాపారి, మీరట్ - స్వాధీనం: రూ.84,000 నగదు, 11.95 గ్రాముల బంగారం. 2. సల్మాన్ @ విమాన్ (22), కూలీ, మీరట్ - స్వాధీనం: రూ.67,000 నగదు, 11.71 గ్రాముల బంగారం. 3. మొహమ్మద్ హసీన్ (19), మీరట్ - స్వాధీనం: రూ.58,000 నగదు, 14.01 గ్రాముల బంగారం. మొత్తం స్వాధీనం - రూ.2,09,000 నగదు - 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు - 64.98 గ్రాముల వెండి ఆభరణాలు సొంత అల్లుడు, మనుమడే కుట్రకు సూత్రధారులు దర్యాప్తులో బాధితుడు ఎం.డి. అజ్మత్ అలీ సొంత అల్లుడు రజావుద్దీన్ (A1), మనుమడు అజీమ్ రజా (A2) ఈ డెకాయిటీకి ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. రజావుద్దీన్‌పై గతంలో హత్య కేసు, ఆయుధాల కేసులతో పాటు ఇతర నేర కేసులు నమోదై ఉన్నాయి. కుటుంబ కలహాల కారణంగా అతని భార్య గత ఏడాది కరీంనగర్‌లోని పుట్టింటికి వచ్చింది. భార్యను తీసుకెళ్లేందుకు వచ్చిన రజావుద్దీన్ విఫలమవడంతో తిరిగి వెళ్లాడు. అనంతరం మళ్లీ వచ్చి ఆత్మహత్యాయత్నం చేయగా బాధిత కుటుంబ సభ్యులు అతనికి చికిత్స చేయించి తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. అనంతరం అతనికి బట్టల వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం కూడా అందించారు. అయితే వ్యాపారంలో నష్టపోయిన రజావుద్దీన్ తరచూ భార్య, మామ వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించేవాడు. ఇటీవల రూ.5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయగా నిరాకరించడంతో గొడవపడి, మంచిర్యాలలో కొత్త దుకాణం పెడుతున్నట్లు చెప్పి బాధితుడి కారుతో మీరట్ వెళ్లిపోయాడు. కరీంనగర్‌లో బాధితుడి ఇంట్లో నివసించిన సమయంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకున్న రజావుద్దీన్, తన కుమారుడు అజీమ్ రజా మరియు మీరట్‌కు చెందిన మరో ముగ్గురితో కలిసి పథకం రచించాడు. ఈ నెల 20న మీరట్ నుంచి రైలులో రామగుండం చేరుకుని, 21వ తేదీ అర్ధరాత్రి సమయంలో డమ్మీ పిస్టళ్లు, కత్తులతో బాధితుడి ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. పరారీలో ప్రధాన నిందితులు అరెస్టయిన ముగ్గురు నిందితులను మీరట్ గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు **రజావుద్దీన్ (A1), అజీమ్ రజా (A2)**తో పాటు ఇతర నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.1
- కరీంనగర్ భగత్‌నగర్ సంచలన ఇంటి డెకాయిటీ కేసును ఛేదించిన కరీంనగర్ పోలీసులు బాధితుడి సొంత అల్లుడు, మనుమడే ప్రధాన సూత్రధారులు – మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితుల అరెస్ట్ రూ.2.09 లక్షల నగదు, 43.67 గ్రాముల బంగారం, 64.98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో ఇటీవల జరిగిన సంచలన ఇంటి డెకాయిటీ కేసును కరీంనగర్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.2,09,000 నగదు, 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు, 64.98 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలు భగత్‌నగర్‌కు చెందిన ఎం.డి. అజ్మత్ అలీ నివాసంలో అర్ధరాత్రి సమయంలో దుండగులు డమ్మీ పిస్టళ్లు, కత్తులతో చొరబడి కుటుంబ సభ్యులను బెదిరించి, వారి చేతులు, కాళ్లు కట్టేసి ఇంట్లోని నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలం, నిందితులు పారిపోయిన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితులు దోపిడీ అనంతరం దొంగిలించిన ద్విచక్ర వాహనాలపై హుజురాబాద్ వైపు వెళ్లి, పెద్ద పాపయ్యపల్లి సమీపంలో వాటిని వదిలివెళ్లినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన వారని పోలీసులు నిర్ధారించారు. యూపీలో ప్రత్యేక బృందాల గాలింపు – ముగ్గురు అరెస్ట్ దర్యాప్తులో భాగంగా కరీంనగర్ పోలీసుల ప్రత్యేక బృందాలు మీరట్‌కు వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న ముగ్గురు నిందితులను జూలై 29న అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితులు 1. సల్మాన్ @ భూరే @ యాదవ్ (22), ఫల వ్యాపారి, మీరట్ - స్వాధీనం: రూ.84,000 నగదు, 11.95 గ్రాముల బంగారం. 2. సల్మాన్ @ విమాన్ (22), కూలీ, మీరట్ - స్వాధీనం: రూ.67,000 నగదు, 11.71 గ్రాముల బంగారం. 3. మొహమ్మద్ హసీన్ (19), మీరట్ - స్వాధీనం: రూ.58,000 నగదు, 14.01 గ్రాముల బంగారం. మొత్తం స్వాధీనం - రూ.2,09,000 నగదు - 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు - 64.98 గ్రాముల వెండి ఆభరణాలు సొంత అల్లుడు, మనుమడే కుట్రకు సూత్రధారులు దర్యాప్తులో బాధితుడు ఎం.డి. అజ్మత్ అలీ సొంత అల్లుడు రజావుద్దీన్ (A1), మనుమడు అజీమ్ రజా (A2) ఈ డెకాయిటీకి ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. రజావుద్దీన్‌పై గతంలో హత్య కేసు, ఆయుధాల కేసులతో పాటు ఇతర నేర కేసులు నమోదై ఉన్నాయి. కుటుంబ కలహాల కారణంగా అతని భార్య గత ఏడాది కరీంనగర్‌లోని పుట్టింటికి వచ్చింది. భార్యను తీసుకెళ్లేందుకు వచ్చిన రజావుద్దీన్ విఫలమవడంతో తిరిగి వెళ్లాడు. అనంతరం మళ్లీ వచ్చి ఆత్మహత్యాయత్నం చేయగా బాధిత కుటుంబ సభ్యులు అతనికి చికిత్స చేయించి తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. అనంతరం అతనికి బట్టల వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం కూడా అందించారు. అయితే వ్యాపారంలో నష్టపోయిన రజావుద్దీన్ తరచూ భార్య, మామ వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించేవాడు. ఇటీవల రూ.5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయగా నిరాకరించడంతో గొడవపడి, మంచిర్యాలలో కొత్త దుకాణం పెడుతున్నట్లు చెప్పి బాధితుడి కారుతో మీరట్ వెళ్లిపోయాడు. కరీంనగర్‌లో బాధితుడి ఇంట్లో నివసించిన సమయంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకున్న రజావుద్దీన్, తన కుమారుడు అజీమ్ రజా మరియు మీరట్‌కు చెందిన మరో ముగ్గురితో కలిసి పథకం రచించాడు. ఈ నెల 20న మీరట్ నుంచి రైలులో రామగుండం చేరుకుని, 21వ తేదీ అర్ధరాత్రి సమయంలో డమ్మీ పిస్టళ్లు, కత్తులతో బాధితుడి ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. పరారీలో ప్రధాన నిందితులు అరెస్టయిన ముగ్గురు నిందితులను మీరట్ గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు **రజావుద్దీన్ (A1), అజీమ్ రజా (A2)**తో పాటు ఇతర నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.1
- కరీంనగర్ లో 63 కిలోల గంజాయి దగ్ధం చేసిన పోలీసులు... నిషేధిత గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సిపి గౌస్ ఆలం హెచ్చరిక కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 38 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 63 కిలోల 621 గ్రాముల గంజాయిని, ఒక గంజాయి మొక్కను పోలీసులు దగ్ధం చేశారు. మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామంలో ఉన్న వెంకటరమణ ఇన్సినేటర్‌లో పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం సమక్షంలో డ్రగ్ డిస్పోసల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయిని దహనం చేశారు. ఒక గంజాయి మొక్కను సైతం దగ్దం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు శ్రీనివాస్ జి , వెంకటస్వామి ఇన్స్పెక్టర్లు రఫీక్ , శ్రీలత ,ఆర్ఐలు రజినీకాంత్ , శ్రీధర్ రెడ్డి అలాగే ఇన్సినరేటర్ ప్లాంట్ కు చెందిన తిరుపతి మరియు ప్రభాకర్ రెడ్డిలతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.1
- *జగిత్యాల పట్టణంలో దోశ సెంటర్ లో వడ లో బొద్దింక.. బాధితుని ఆందోళన యావర్ రోడ్డు శ్రీనివాస టాకీస్ ముందు గల దోశ టిఫిన్ సెంటర్ లో తన పిల్లలకు ఇడ్లీ, వడ టిఫిన్ తీసుకెళ్లిన వ్యక్తి., ఇంటికెళ్ళి పార్సిల్ విప్పి చూడగా వడలో బొద్దింక రోస్ట్ అయి కంపించింది, దీంతో దోశ టిఫిన్ సెంటర్ యజమానిని అడుగగా నిర్లక్ష్యం సమాధానం ఇవ్వడంతో టిఫిన్ సెంటర్ ముందు బాధితుని ఆందోళన1
- మంత్రుల చేతుల మీదగా ప్రారంభం కానున్న రగుడు చౌరస్తాలోని చేనేత జోట రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రగుడు చౌరస్తా లో గురువారం రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ల చేతుల చేనేత జోట ప్రారంభం కానుండగా అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేశారు.1
- భగత్‌నగర్ సంచలన ఇంటి డెకాయిటీ కేసును ఛేదించిన కరీంనగర్ పోలీసులు బాధితుడి సొంత అల్లుడు, మనుమడే ప్రధాన సూత్రధారులు – మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితుల అరెస్ట్ రూ.2.09 లక్షల నగదు, 43.67 గ్రాముల బంగారం, 64.98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో ఇటీవల జరిగిన సంచలన ఇంటి డెకాయిటీ కేసును కరీంనగర్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.2,09,000 నగదు, 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు, 64.98 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే భగత్‌నగర్‌కు చెందిన ఎం.డి. అజ్మత్ అలీ నివాసంలో అర్ధరాత్రి సమయంలో దుండగులు డమ్మీ పిస్టళ్లు, కత్తులతో చొరబడి కుటుంబ సభ్యులను బెదిరించి, వారి చేతులు, కాళ్లు కట్టేసి ఇంట్లోని నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలం, నిందితులు పారిపోయిన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితులు దోపిడీ అనంతరం దొంగిలించిన ద్విచక్ర వాహనాలపై హుజురాబాద్ వైపు వెళ్లి, పెద్ద పాపయ్యపల్లి సమీపంలో వాటిని వదిలివెళ్లినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన వారని పోలీసులు నిర్ధారించారు. యూపీలో ప్రత్యేక బృందాల గాలింపు – ముగ్గురు అరెస్ట్ దర్యాప్తులో భాగంగా కరీంనగర్ పోలీసుల ప్రత్యేక బృందాలు మీరట్‌కు వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న ముగ్గురు నిందితులను జూలై 29న అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితులు సల్మాన్ అలియాస్ భూరే యాదవ్ (22), సల్మాన్ అలియాస్ విమాన్ (22), మొహమ్మద్ హసీన్ (19), వారి వద్ద నుంచి రూ.2,09,000 నగదు 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు 64.98 గ్రాముల వెండి ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సొంత అల్లుడు, మనుమడే కుట్రకు సూత్రధారులు దర్యాప్తులో బాధితుడు ఎం.డి. అజ్మత్ అలీ సొంత అల్లుడు రజావుద్దీన్ (ఎ1), మనుమడు అజీమ్ రజా (ఎ2) ఈ డెకాయిటీకి ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. రజావుద్దీన్‌పై గతంలో హత్య కేసు, ఆయుధాల కేసులతో పాటు ఇతర నేర కేసులు నమోదై ఉన్నాయి. కుటుంబ కలహాల కారణంగా అతని భార్య గత ఏడాది కరీంనగర్‌లోని పుట్టింటికి వచ్చింది. భార్యను తీసుకెళ్లేందుకు వచ్చిన రజావుద్దీన్ విఫలమవడంతో తిరిగి వెళ్లాడు. అనంతరం మళ్లీ వచ్చి ఆత్మహత్యాయత్నం చేయగా బాధిత కుటుంబ సభ్యులు అతనికి చికిత్స చేయించి తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. అనంతరం అతనికి బట్టల వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం కూడా అందించారు. అయితే వ్యాపారంలో నష్టపోయిన రజావుద్దీన్ తరచూ భార్య, మామ వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించేవాడు. ఇటీవల రూ.5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయగా నిరాకరించడంతో గొడవపడి, మంచిర్యాలలో కొత్త దుకాణం పెడుతున్నట్లు చెప్పి బాధితుడి కారుతో మీరట్ వెళ్లిపోయాడు. కరీంనగర్‌లో బాధితుడి ఇంట్లో నివసించిన సమయంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకున్న రజావుద్దీన్, తన కుమారుడు అజీమ్ రజా మరియు మీరట్‌కు చెందిన మరో ముగ్గురితో కలిసి పథకం రచించాడు. ఈ నెల 20న మీరట్ నుంచి రైలులో రామగుండం చేరుకుని, 21వ తేదీ అర్ధరాత్రి సమయంలో డమ్మీ పిస్టళ్లు, కత్తులతో బాధితుడి ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. పరారీలో ప్రధాన నిందితులు అరెస్టయిన ముగ్గురు నిందితులను మీరట్ గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు రజావుద్దీన్ (ఎ1), అజీమ్ రజా (ఎ2) తో పాటు ఇతర నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని సీపీ తెలిపారు1