జిల్లేడుబండ రిజర్వాయర్ ప్రాజెక్టు పురోగతిపై మంత్రి రామానాయుడుతో చర్చించిన మంత్రి సత్య కుమార్ యాదవ్ శ్రీ సత్యసాయి జిల్లా, ఫిబ్రవరి 17:– ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీ లాబీలో మంగళవారం ఉదయం జలవనరుల శాఖ మంత్రి నిమ్మకాయల రామానాయుడుతో ముదిగుబ్బ మండలం జిల్లేడుబండ రిజర్వాయర్ ప్రాజెక్టు పురోగతి గురిoచి చర్చించారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి (HNSS) ప్రాజెక్టు పరిధిలో చేపట్టిన జిల్లేడుబండ రిజర్వాయర్ ద్వారా సుమారు 23,000 ఎకరాలకు సాగునీరు, అలాగే తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు మొత్తం 2.41 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కల్పించే అంశంపై సమగ్రంగా చర్చించారు. ఇప్పటికే సుమారు రూ.200 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ మంజూరు అయిన నేపథ్యంలో, మిగిలిన నిధులు విడుదల చేసి ప్రాజెక్టును వేగవంతం చేయాలనే అంశం వారి మధ్య ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. విడుదలయ్యే నిధులను సమర్థవంతంగా వినియోగించి ఎంతమంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుందో, ప్రాంతీయ అభివృద్ధికి ఎలా దోహదపడుతుందో మంత్రి సత్యకుమార్ యాదవ్ మంత్రి రామనాయుడుకు వివరించారు. గత ప్రభుత్వ కాలంలో వ్యక్తిగత ప్రయోజనాల కారణంగా జరిగిన లోపాలను కూడా చర్చలో ప్రస్తావిస్తూ, ప్రాజెక్టు పూర్తయితే సుమారు 1.50 లక్షల మందికి సాగునీటి లాభం, 5 లక్షల మందికి తాగునీటి ప్రయోజనం కలుగుతుందని మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు. మంత్రి సత్యకుమార్ ను అభినందించిన రామానాయుడు, మంత్రి రామానాయుడు స్పందిస్తూ ఇప్పటివరకు నన్ను ఇన్ని కోట్లు ఇవ్వండి అని మాత్రమే అడిగిన వారినే చూశాను; కానీ విడుదలైన నిధులను ఎలా వినియోగించాలి, దాని ద్వారా ఎంతమందికి లాభం చేకూరుతుంది, భవిష్యత్ అభివృద్ధి దిశ ఏమిటి అని ఆలోచించి వివరంగా చర్చించిన తొలి వ్యక్తి మీరు అంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ ని ప్రశంసించారు. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగే నాయకత్వానికి ఇది నిదర్శనమని రామానాయుడు అభిప్రాయపడ్డారు.

- అనంతపురం నగరంలో ఈరోజు “సేవ్ ఆర్‌డీటీ” ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తూ భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆర్‌డీటీకి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసనకారులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు నష్టం జరుగుతోందని వారు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. జేఏసీ ప్రతినిధులు తమ సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందజేసి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం హనుమరెడ్డిపల్లి గ్రామ శివారులో కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన టీచర్ పాతిరెడ్డి కారు అదుపుతప్పి పంట పొలంలోకి దూసుకుని వెళ్లిన కారు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- మదనపల్లెలో బాలిక హత్య పై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పందన. మదనపల్లెలో బాలిక హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో డీఐజీ మీడియాతో మాట్లాడారు. 'సోమవారం సాయంత్రం బాలిక అదృశ్యమైన వెంటనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీఐ మహమ్మద్ రఫీ స్పందించి సిబ్బందితో గాలించారు. నేను ఇప్పుడే మదనపల్లెకు వచ్చాను. త్వరలో అన్నీ వివరాలు వెల్లడిస్తా' అని డీఐజీ చెప్పారు.1
- మదనపల్లి సిల్క్ టౌన్ లో ఏడేళ్ల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కులవర్ధన్ ను కఠినంగా శిక్షించాలి, అని మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్నారు.అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న కారణంగా బాధిత కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించలేకపోయాను, కానీ వారిని ఫోన్లో పరామర్శించానని, అన్నారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు వెళ్ళనున్నట్లు, ఎమ్మెల్యే మీడియా ముఖంగా తెలిపారు..1
- బద్వేలు:నేషనల్ హైవే రహదారుల్లో ఫ్రీ లెఫ్ట్ లో వాహనాలు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లను సిఐ రామకృష్ణ పరిశీలించారు . అనంతరం పట్టణం లోని నాలుగు రోడ్ సర్కిల్లో ట్రాఫిక్ ను అర్బన్ సీఐ రామకృష్ణ పరిశీలించి పట్టణంలో వాహనదారులకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోనున్న పోలీస్ సిబ్బంది సిఐ రామకృష్ణ పాలు రకాల సూచనలను తెలియజేశారు.1
- అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి తల్లిదండ్రులు,బంధువులు రోడ్డుపై ఆందోళన.... ఆందోళన కారులకు మద్దతు తెలిపిన మదనపల్లె వైసిపి ఇన్ ఛార్జ్ నిస్సార్ అహ్మద్.... ట్రాఫిక్ మళ్లించిన పోలీసులు.... పోలీసుల అదుపులో నిందితుడు1
- అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ1
- చింతల ఘాట్ రోడ్డులో అదుపుతప్పి గుంతలోకి ఒరిగిన ఆర్టీసీ బస్సు.. తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు.. ప్రయాణికులను బస్సు నుంచి క్షేమంగా దించిన వాహనదారులు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1