Shuru
Apke Nagar Ki App…
సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ గా బిరుదు రాధాకృష్ణ వైస్ చైర్మన్ గా అంతటి పుష్పలత బాధ్యతలు స్వీకరణ పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. క్యాంపు నుండి నేరుగా కార్యాలయానికి చేరుకున్న 12 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు సహా బీజేపీ, బీఆర్ఎస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలకు చెందిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల అధికారి వీరబుచ్చయ్య ప్రమాణం చేయించగా, ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఎమ్మెల్యే విజయ రమణ రావు పాల్గొన్నారు. మున్సిపల్ ఛైర్మన్‌గా బిరుదు రాధాకృష్ణ, వైస్ ఛైర్మన్‌గా అంతటి పుష్పలత బాధ్యతలు స్వీకరించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ గా బిరుదు రాధాకృష్ణ వైస్ చైర్మన్ గా అంతటి పుష్పలత బాధ్యతలు స్వీకరణ పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. క్యాంపు నుండి నేరుగా కార్యాలయానికి చేరుకున్న 12 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు సహా బీజేపీ, బీఆర్ఎస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలకు చెందిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల అధికారి వీరబుచ్చయ్య ప్రమాణం చేయించగా, ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఎమ్మెల్యే విజయ రమణ రావు పాల్గొన్నారు. మున్సిపల్ ఛైర్మన్‌గా బిరుదు రాధాకృష్ణ, వైస్ ఛైర్మన్‌గా అంతటి పుష్పలత బాధ్యతలు స్వీకరించారు.
More news from తెలంగాణ and nearby areas
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులో పెద్దపులి సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. సిద్దిపేట వైపు అడవుల నుంచి వచ్చినట్లు భావిస్తున్న పులి రెండు రోజులుగా సంచరిస్తూ మూడు ఆవు దూడలను బలి తీసుకుంది. అటవీశాఖ అధికారులు గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, పులిని అడవిలోకి తరలించే చర్యలు చేపట్టారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో రాష్ట్ర స్థాయి 8 వ వాలీబాల్ పోటీలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. 33 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. వేములవాడలో రాష్ట్రస్థాయి పోటీలు జరగడం సంతోషంగా ఉందన్నారు ఆది శ్రీనివాస్. రాబోయే ఒలంపిక్స్ లో రాటు తేలిన క్రీడాకారులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సీఎం క్రీడాజ్యోతి పథకంలో భాగంగా 40 క్రీడల్లో యువతీ, యువకులకు శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. గతంలో జరిగిన జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో వేములవాడ ప్రాంతంలోని క్రీడాకారులు అనేక పథకాలు సాధించారని, గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వేములవాడలో జరిగే ఈ పోటీల్లో యువతీ యువకులు తమ ప్రతిభ పాటవాలను ప్రదర్శించాలని కోరారు.2
- తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి పాలన వరకు ప్రతి దశలో ఆయన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు.1
- మహా శివరాత్రి సందర్భంగా రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారంగపూర్ మండలం పెంబట్ల కొనపూర్ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం పది గంటలకు ఆలయంలో మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అర్చకులు అందజేశారు మాజీ మంత్రి వెంట మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- Post by Ravi Poreddy1
- శివ స్వాములు దీక్ష విరమణ శివరాత్రి సందర్భంగా 8 రోజులు కాలినడకన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రం నుంచి ఈనెల ఏడో తారీఖున శ్రీశైలం కాలి నడకన బయల్దేరారు. స్వాములు చందాపూర్ బసవన్న గడ్డ దగ్గరికి వెళ్ళగానే వీరిని ఒక కుక్క వెంబడించడం జరిగింది. తన కుక్కపిల్లలను కూడా వదిలి ఆ శివ స్వాముల వెంబడి శ్రీశైలం వరకు అంటే స్నానం చేసే తను స్నానం చేస్తుంది ఇలా చివరికి వారితో పాటు ఆ శునకం శ్రీశైల దర్శనం చేసుకుంది. తిరిగి ప్రయాణంలో కూడా వారి వెంటే వాహనం తీసుకొని దానిని చందాపూర్ లో వదిలేయడం జరిగింది.ఇది తెలిసిన వారందరూ అది ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి యొక్క మహిమ అని ఆశ్చర్యానికి,ఆనందానికి గురవుతున్నారు.4
- తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అమ్మపురం వద్ద అడ్డుకున్నారు. ఆయన వెంట ఉన్న బిఆర్ఎస్ కౌన్సిలర్లను మాత్రమే తొర్రూర్ కు పంపించి ఆయనతోపాటు ఆయన సతీమణి ఉషను సైతం వెనక్కి పంపించారు. దీంతో కొద్దిసేపు అమ్మపురం గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.2
- జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో సినిమా హీరో అర్జున్ శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు అలాగే స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని అన్నారు1