logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*భూముల రీ సర్వే కచ్చితత్వంతో చేయాలి* *వివరాలు పక్కాగా నమోదు చేయాలి* *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్* *గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లిలో భూ భారతి కింద భూముల రీ సర్వే పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్* భూ భారతి కింద భూముల రీ సర్వే కచ్చితత్వంతో చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లిలో భూ భారతి కింద రోవర్ యంత్రంతో భూముల రీ సర్వే పనులు కొనసాగుతుండగా, మంగళవారం జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే యంత్రంతో వివరాలు ఎలా తీసుకుంటారో పరిశీలించి.. అడిగి తెలుసుకున్నారు. గ్రామ సరిహద్దు సర్వే పూర్తి అయిందని, ప్రస్తుతం ప్రభుత్వ భూముల సర్వే కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకువెళ్ళారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో భూ భారతి కింద భూముల రీ సర్వే పనులు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామంలో సర్వే పై రైతులకు ముందుగా సమాచారం అందించాలని సూచించారు. భూముల వివరాలను పూర్తి కచ్చితత్వంతో నమోదు చేయాలని స్పష్టం చేశారు. *బోర్ వెల్ రీచార్జ్ పనుల పరిశీలన* గంభీరావుపేట మండలం గజ సింగవరంలో గ్రామ బోర్ వెల్ వద్ద రీచార్జ్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. గ్రామంలో ఉన్న రైతులు, గృహ నిర్మాణదారులు బోర్ వెల్ రీచార్జ్ పనులు చేపట్టేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, ఏడీ సర్వే శ్రీనివాస్, ఎంపీడీఓ రాజేందర్ అధికారులు సిబ్బంది ఉన్నారు.

2 days ago
user_Gampa mahesh
Gampa mahesh
వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
2 days ago
b269c07b-c6dc-4133-8807-fc9454d6f11b

*భూముల రీ సర్వే కచ్చితత్వంతో చేయాలి* *వివరాలు పక్కాగా నమోదు చేయాలి* *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్* *గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లిలో భూ భారతి కింద భూముల రీ సర్వే పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్* భూ భారతి కింద భూముల రీ సర్వే కచ్చితత్వంతో చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లిలో భూ భారతి కింద రోవర్ యంత్రంతో భూముల రీ సర్వే పనులు కొనసాగుతుండగా, మంగళవారం జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

76986db6-e441-4bf9-af18-878e5ea1bb45

సర్వే యంత్రంతో వివరాలు ఎలా తీసుకుంటారో పరిశీలించి.. అడిగి తెలుసుకున్నారు. గ్రామ సరిహద్దు సర్వే పూర్తి అయిందని, ప్రస్తుతం ప్రభుత్వ భూముల సర్వే కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకువెళ్ళారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో భూ భారతి కింద భూముల రీ సర్వే పనులు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామంలో సర్వే పై రైతులకు ముందుగా సమాచారం అందించాలని సూచించారు. భూముల వివరాలను పూర్తి

59e79a67-dee8-4875-9cf5-2b16cddfc56c

కచ్చితత్వంతో నమోదు చేయాలని స్పష్టం చేశారు. *బోర్ వెల్ రీచార్జ్ పనుల పరిశీలన* గంభీరావుపేట మండలం గజ సింగవరంలో గ్రామ బోర్ వెల్ వద్ద రీచార్జ్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. గ్రామంలో ఉన్న రైతులు, గృహ నిర్మాణదారులు బోర్ వెల్ రీచార్జ్ పనులు చేపట్టేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, ఏడీ సర్వే శ్రీనివాస్, ఎంపీడీఓ రాజేందర్ అధికారులు సిబ్బంది ఉన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • మాతృ సంస్థలకు బదిలీ అయిన వేములవాడ దేవస్థాన ఉద్యోగులకు సన్మానం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు కూరగాయల రాములు, లక్ష్మారెడ్డికి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు వారి మాతృ సంస్థలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఈ మేరకు, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ నుండి కొండగట్టు దేవస్థానానికి బదిలీ అయిన కూరగాయల రాములు తిరిగి తమ మాతృ సంస్థ అయిన వేములవాడ దేవస్థానానికి బదిలీపై వచ్చారు. అలాగే, కొండగట్టు దేవస్థానం నుండి వేములవాడకు బదిలీపై వచ్చిన లక్ష్మారెడ్డి తిరిగి తమ మాతృ సంస్థ అయిన కొండగట్టు దేవస్థానానికి బదిలీ చేయబడ్డారు.ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన కార్యనిర్వాహణాధికారి ఎల్. రమాదేవి లక్ష్మారెడ్డి కి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేసి, ఆలయ అర్చకుల చేత ఆశీర్వచనం ఇప్పించారు.ఈ కార్యక్రమంలో డీఈఓ శ్రీ నవీన్ కుమార్ , ఈఈ శ్రీ రాజేష్ , ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
    1
    మాతృ సంస్థలకు బదిలీ అయిన వేములవాడ దేవస్థాన ఉద్యోగులకు సన్మానం
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు కూరగాయల రాములు, లక్ష్మారెడ్డికి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు వారి మాతృ సంస్థలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఈ మేరకు, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ నుండి కొండగట్టు దేవస్థానానికి బదిలీ అయిన కూరగాయల రాములు తిరిగి తమ మాతృ సంస్థ అయిన వేములవాడ దేవస్థానానికి బదిలీపై వచ్చారు. అలాగే, కొండగట్టు దేవస్థానం నుండి వేములవాడకు బదిలీపై వచ్చిన లక్ష్మారెడ్డి తిరిగి తమ మాతృ సంస్థ అయిన కొండగట్టు దేవస్థానానికి బదిలీ చేయబడ్డారు.ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన కార్యనిర్వాహణాధికారి ఎల్. రమాదేవి లక్ష్మారెడ్డి కి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేసి, ఆలయ అర్చకుల చేత ఆశీర్వచనం ఇప్పించారు.ఈ కార్యక్రమంలో డీఈఓ శ్రీ నవీన్ కుమార్ , ఈఈ శ్రీ రాజేష్ , ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    24 min ago
  • హలో విద్యార్థి చలో హైదరాబాద్ అక్టోబర్ 6న మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను విజయవంతం చేయండి..చెంచల నవీన్ మాదిగ MSF ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో ఇంచార్జి పిలుపునిచ్చారు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు MSF నూతన కమిటీల నిర్మాణంలో భాగంగా నేడు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఎలగందుల బిక్షపతి మాదిగ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయగా MSF మాజీ జిల్లా ఉపాధ్యక్షులు కనకం గంగ నరేష్ మాదిగ సమన్వయం చేయడం జరిగింది.. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా MSF ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో ఇంచార్జి చెంచల నవీన్ మాదిగ హాజరై మాట్లాడుతూ.. సమాజంలో సబ్బండ వర్గాలకు పోరాటం చేసి సేవలు అందించిన చరిత్ర ఎమ్మార్పీఎస్ కు ఉంది ఆరోగ్యశ్రీ పథకం వృద్ధులు వితంతువుల పెన్షన్ తెల్ల రేషన్ కార్డ్ బియ్యం కోట పెంపు ఇలా చూసుకుంటే ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసి జాతీయస్థాయిలో మాదిగ కులానికి పేరు తెచ్చిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న నాయకత్వంలో విద్యార్థి విద్యార్థినిలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పిలుపునివ్వడం జరిగింది.. సమావేశం అనంతరం కళాశాల నూతన కమిటీ వేయడం జరిగింది.. అధ్యక్షులుగా గుడిసె సందీప్ అధికార ప్రతినిధిగా బడుగు చరణ్ చందర్ ఉపాధ్యక్షులుగా బడుగు సుశాంత్ ప్రధాన కార్యదర్శిగా నౌండ్ల శ్రీనిథ్ సహాయ కార్యదర్శిగా బడుగు హర్షవర్ధన్ కార్యవర్గ సభ్యులుగా కే అభినయ్ కార్తీక్ మనీ రామ్ చరణ్ తదితరున ఎన్నుకోవడం జరిగింది..
    1
    హలో విద్యార్థి చలో హైదరాబాద్ 
అక్టోబర్ 6న మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను విజయవంతం చేయండి..చెంచల నవీన్ మాదిగ 
MSF ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో ఇంచార్జి పిలుపునిచ్చారు
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ  ఆదేశాల మేరకు MSF నూతన కమిటీల నిర్మాణంలో భాగంగా నేడు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఎలగందుల బిక్షపతి మాదిగ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయగా MSF మాజీ జిల్లా ఉపాధ్యక్షులు కనకం గంగ నరేష్ మాదిగ సమన్వయం చేయడం జరిగింది..
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా MSF ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో ఇంచార్జి చెంచల నవీన్ మాదిగ హాజరై మాట్లాడుతూ.. సమాజంలో సబ్బండ వర్గాలకు పోరాటం చేసి సేవలు అందించిన చరిత్ర ఎమ్మార్పీఎస్ కు ఉంది ఆరోగ్యశ్రీ పథకం వృద్ధులు వితంతువుల పెన్షన్ తెల్ల రేషన్ కార్డ్ బియ్యం కోట పెంపు ఇలా చూసుకుంటే ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసి జాతీయస్థాయిలో మాదిగ కులానికి పేరు తెచ్చిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న నాయకత్వంలో విద్యార్థి విద్యార్థినిలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పిలుపునివ్వడం జరిగింది..
సమావేశం అనంతరం కళాశాల నూతన కమిటీ వేయడం జరిగింది..
అధ్యక్షులుగా గుడిసె సందీప్ 
అధికార ప్రతినిధిగా బడుగు చరణ్ చందర్ ఉపాధ్యక్షులుగా బడుగు సుశాంత్ ప్రధాన కార్యదర్శిగా నౌండ్ల శ్రీనిథ్ సహాయ కార్యదర్శిగా బడుగు హర్షవర్ధన్ కార్యవర్గ సభ్యులుగా 
కే అభినయ్ కార్తీక్ మనీ రామ్ చరణ్ తదితరున ఎన్నుకోవడం జరిగింది..
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    5 hrs ago
  • గన్నేరువరం మండలం డబుల్ రోడ్డు కోసం 30న నిరాహార దీక్ష.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 30న 24 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో డబుల్ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చినా, రెండున్నరేళ్లు గడిచినా పనులు ప్రారంభం కాలేదని ఆరోపించారు. రోడ్డు సమస్యపై ప్రజలు, యువజన సంఘాలు పలుమార్లు ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు చిత్తశుద్ధి ఉంటే 30న లక్ష్మీనరసింహస్వామి కాంప్లెక్స్ ఎదుట జరిగే నిరాహార దీక్షకు హాజరై తమతో కలిసి కూర్చోవాలని కోరారు. రోడ్డు సమస్య పరిష్కారం కోసం పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు దీక్షకు మద్దతుగా తరలిరావాలని పిలుపునిచ్చారు. యువజన సంఘాల ఐక్యతతో డబుల్ రోడ్డు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తాం” అని నాయకులు స్పష్టం చేశారు.
    1
    గన్నేరువరం మండలం డబుల్ రోడ్డు కోసం 30న నిరాహార దీక్ష..
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 30న 24 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో డబుల్ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చినా, రెండున్నరేళ్లు గడిచినా పనులు ప్రారంభం కాలేదని ఆరోపించారు. రోడ్డు సమస్యపై ప్రజలు, యువజన సంఘాలు పలుమార్లు ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదన్నారు.
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు చిత్తశుద్ధి ఉంటే 30న లక్ష్మీనరసింహస్వామి కాంప్లెక్స్ ఎదుట జరిగే నిరాహార దీక్షకు హాజరై తమతో కలిసి కూర్చోవాలని కోరారు. రోడ్డు సమస్య పరిష్కారం కోసం పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు దీక్షకు మద్దతుగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
యువజన సంఘాల ఐక్యతతో డబుల్ రోడ్డు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తాం” అని నాయకులు స్పష్టం చేశారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    Tour operator గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    11 hrs ago
  • మిలాద్‌ ఉన్‌ నబీ ఊరేగింపు ప్రశాంతంగా నిర్వహణ : సహకరించినందుకు వారికి ధన్యవాదాలు సిపి గౌస్ ఆలం కరీంనగర్‌లో మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఊరేగింపు ప్రశాంతంగా, వైభవంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కరీంనగర్ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం తెలిపారు. సీపీ గౌష్‌ ఆలం స్థానిక పోలీసు అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యవేక్షించారు. నాఖా చౌరస్తా, తెలంగాణ చౌక్‌ వద్ద ముస్లిం మత పెద్దలను పూలమాలలతో సత్కరించి మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఊరేగింపును ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్‌ శాంతిభద్రతలు, పరమత సహనం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని, నగరంలోని గంగా–జమునా తెహజీబ్‌కు ఈ వేడుకలు నిదర్శనమని సీపీ పేర్కొన్నారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
    1
    మిలాద్‌ ఉన్‌ నబీ ఊరేగింపు ప్రశాంతంగా నిర్వహణ : సహకరించినందుకు వారికి ధన్యవాదాలు సిపి గౌస్ ఆలం
కరీంనగర్‌లో మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఊరేగింపు ప్రశాంతంగా, వైభవంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కరీంనగర్ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం తెలిపారు.
సీపీ గౌష్‌ ఆలం స్థానిక పోలీసు అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యవేక్షించారు. నాఖా చౌరస్తా, తెలంగాణ చౌక్‌ వద్ద ముస్లిం మత పెద్దలను పూలమాలలతో సత్కరించి మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఊరేగింపును ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.
కరీంనగర్‌ శాంతిభద్రతలు, పరమత సహనం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని, నగరంలోని గంగా–జమునా తెహజీబ్‌కు ఈ వేడుకలు నిదర్శనమని సీపీ పేర్కొన్నారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    1 day ago
  • *కుక్క కాటుకు ఇద్దరు.. ఆసుపత్రిలో చికిత్స* *కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స.. బాధితులను పరామర్శించిన మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర*
    1
    *కుక్క కాటుకు ఇద్దరు.. ఆసుపత్రిలో చికిత్స*

*కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స.. బాధితులను పరామర్శించిన మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర*
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    56 min ago
  • రామంచ ప్రైమరీ స్కూల్ లో రాఖీ పర్వదిన వేడుకలు....రాఖీలు కట్టుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్న విద్యార్థులు అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ వేడుకలు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. టీచర్ల సమక్షంలో విద్యార్థులు సోదరీ సోదర భావంతో రాఖీలు కట్టుకొని పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మనిద్దరం దేశానికి రక్ష అంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటు రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఆనంద్ టీచర్ చీల పద్మా తోపాటు పేరెంట్స్ విద్యార్థులు పాల్గొన్నారు.
    1
    రామంచ ప్రైమరీ స్కూల్ లో రాఖీ పర్వదిన వేడుకలు....రాఖీలు కట్టుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్న విద్యార్థులు 
అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ వేడుకలు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. టీచర్ల సమక్షంలో విద్యార్థులు సోదరీ సోదర భావంతో రాఖీలు కట్టుకొని పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మనిద్దరం దేశానికి రక్ష అంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటు రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఆనంద్ టీచర్ చీల పద్మా తోపాటు పేరెంట్స్ విద్యార్థులు పాల్గొన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం కామారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పట్నం శెట్టి శ్రీనివాస్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్య వర్గ ప్రమాణ స్వీకారము మహోత్సవం స్నేహ బంకెట్ హల్ లో ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి అధ్యక్షుడు పిన్నురి రమేష్ ఉపాధ్యక్షుడు కుశల్కంటి మహేష్, జెనరల్. సెక్రటరీ. యశ్వంత్ పవార్, కోశాదికారి రాచర్ల సంతోష్, అధికార ప్రతినిధి. ముస్త్యాల శ్రీధర్, షoబులింగం, సాయిరాంగౌడ్, పోచయ్య, గౌస్, అనిల్ నాయక్, బొల్లారం శ్రీనివాస్, బన్సిలాల్, మంగలి రాజు,ముఖర్రం సాయికుమార్ సోమయాజులు. ప్రమాణ స్వీకారం చేసారు. దీనికి గాను ముఖ్య అతిథి గా ఎల్లారెడ్డి ci రాజారెడ్డి, అడ్వకేట్ పండరి, లీగల్ అడ్వైజర్ గోపాల్ రావు అడ్వకేట్, కామారెడ్డి tuwj జిల్లా అధ్యక్షులు రాజనీకాంత్, కామారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్ సెక్రటరీ సుధాకరగౌడ్, చందు, మోయిన్ తదితరులు పాల్గొన్నారు.
    1
    ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం కామారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పట్నం శెట్టి శ్రీనివాస్  
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్య వర్గ ప్రమాణ స్వీకారము మహోత్సవం స్నేహ బంకెట్ హల్ లో ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి అధ్యక్షుడు పిన్నురి రమేష్  ఉపాధ్యక్షుడు కుశల్కంటి మహేష్, జెనరల్. సెక్రటరీ. యశ్వంత్ పవార్, కోశాదికారి రాచర్ల సంతోష్, అధికార ప్రతినిధి.  ముస్త్యాల శ్రీధర్, షoబులింగం, సాయిరాంగౌడ్, పోచయ్య, గౌస్, అనిల్ నాయక్, బొల్లారం శ్రీనివాస్, బన్సిలాల్, మంగలి రాజు,ముఖర్రం సాయికుమార్ సోమయాజులు. ప్రమాణ స్వీకారం చేసారు. దీనికి గాను ముఖ్య అతిథి గా ఎల్లారెడ్డి ci రాజారెడ్డి, అడ్వకేట్ పండరి, లీగల్ అడ్వైజర్ గోపాల్ రావు అడ్వకేట్, కామారెడ్డి tuwj జిల్లా అధ్యక్షులు  రాజనీకాంత్, కామారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్ సెక్రటరీ సుధాకరగౌడ్, చందు, మోయిన్ తదితరులు పాల్గొన్నారు.
    user_KODIPYAKA SAIRAM
    KODIPYAKA SAIRAM
    Salesperson బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • మున్సిపల్ కార్మికుల సమస్యలపై కౌన్సిల్లో చర్చించి వెంటనే సమస్యలను పరిష్కరించాలి సమస్యలు పరిష్కరించకపోతే పనులు బందు చేసి సమ్మె చేస్తాం సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ , చైర్మన్ లకు వినతిపత్రం అందజేత సిరిసిల్ల మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను రాబోయే కౌన్సిల్ సమావేశాలలో ఎజెండాగా పెట్టి చర్చించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ బుధవారం ఆధ్వర్యంలో మున్సిపల్ యూనియన్ నాయకులు కమిషనర్ ఖదీర్ పాషాకి మరియు చైర్మన్ జిందం కళా - చక్రపాణి లకు కలిసి సమస్యలను తెలియజేసి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం అనునిత్యం కష్టపడి పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను మున్సిపల్ అధికారులు , పాలకవర్గం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఇవ్వవలసిన బట్టలు , చెప్పులు , సబ్బులు , నూనెలు , గ్లౌజులు ఇతరత్రా సామాగ్రిని వెంటనే అందించాలని అదేవిధంగా కొంతకాలంగా 60 సంవత్సరాలు పైబడిన మరియు చనిపోయిన వారి స్థానాలలో వారి కుటుంబ సభ్యులను పనిలోకి తీసుకోక పోవడం వలన కార్మికులు తగ్గి ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులపై విపరీతంగా పని భారం పెరిగిందని వెంటనే పాలకవర్గంలో చర్చించి అదనంగా కార్మికులను నియమించి కార్మికులకు పని భారం తగ్గించాలని వీరిలో కార్మికుల కుటుంబ సభ్యులకే మొదటి ప్రాధాన్యత కల్పించాలని మరియు సిరిసిల్ల మున్సిపల్ లో కార్మికులకు సంబంధించి 2009 నుండి 2012 వరకు కార్మికుల పెండింగు పిఎఫ్ సమస్యను తొందరగా పరిష్కరించి కార్మికుల వ్యక్తిగత ఖాతాలలో డబ్బులు జమ చేయాలని , ఇంకా కొంతమంది కార్మికులకు సంబంధించినటువంటి పీఎఫ్ సమస్య , ఈఎస్ఐ సమస్యలను పరిష్కరించి కార్మికులందరికీ మున్సిపల్ ద్వారా ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని అన్నారు.పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ అభివృద్ధిలో భాగస్వాములై పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత పాలకవర్గ సభ్యుల పైన కూడా ఉంటుంది కాబట్టి రాబోయే కౌన్సిల్ సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రత్యేక ఎజెండా పెట్టి చర్చించి వెంటనే సమస్యల పరిష్కారానికి పాలకవర్గ సభ్యులందరూ కృషి చేయాలని అన్నారు.సమస్యలు పరిష్కరించకుంటే కనుక రానున్న రోజుల్లో అవసరమైతే కార్మికులందరూ కూడా పనులు బంద్ చేసి సమ్మెలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కాసర్ల శంకర్ , పట్టణ అధ్యక్షులు ఏల్పుల బాలయ్య నాయకులు నర్మెట బాబా కిషన్ , బత్తుల దేవరాజు , గడ్డం విజయ , నర్మెట ఉమ , రెడ్డిమల్ల మమత , మారుపాక లక్ష్మి , నక్క ఎల్లవ్వ తదితరులు పాల్గొన్నారు.
    3
    మున్సిపల్ కార్మికుల సమస్యలపై కౌన్సిల్లో చర్చించి వెంటనే సమస్యలను పరిష్కరించాలి
సమస్యలు పరిష్కరించకపోతే పనులు బందు చేసి సమ్మె చేస్తాం
సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ , చైర్మన్ లకు వినతిపత్రం  అందజేత
సిరిసిల్ల మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను రాబోయే కౌన్సిల్ సమావేశాలలో ఎజెండాగా పెట్టి చర్చించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ  సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ బుధవారం ఆధ్వర్యంలో మున్సిపల్ యూనియన్ నాయకులు కమిషనర్ ఖదీర్ పాషాకి మరియు చైర్మన్ జిందం కళా - చక్రపాణి లకు కలిసి సమస్యలను తెలియజేసి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం అనునిత్యం కష్టపడి పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను మున్సిపల్ అధికారులు ,  పాలకవర్గం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.
మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఇవ్వవలసిన బట్టలు , చెప్పులు , సబ్బులు , నూనెలు , గ్లౌజులు ఇతరత్రా సామాగ్రిని వెంటనే అందించాలని అదేవిధంగా కొంతకాలంగా 60 సంవత్సరాలు పైబడిన మరియు చనిపోయిన వారి స్థానాలలో వారి కుటుంబ సభ్యులను పనిలోకి తీసుకోక పోవడం వలన కార్మికులు తగ్గి ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులపై విపరీతంగా పని భారం పెరిగిందని వెంటనే పాలకవర్గంలో చర్చించి అదనంగా కార్మికులను నియమించి కార్మికులకు పని భారం తగ్గించాలని వీరిలో కార్మికుల కుటుంబ సభ్యులకే మొదటి ప్రాధాన్యత కల్పించాలని మరియు సిరిసిల్ల మున్సిపల్ లో కార్మికులకు సంబంధించి 2009 నుండి 2012 వరకు కార్మికుల పెండింగు పిఎఫ్ సమస్యను తొందరగా పరిష్కరించి కార్మికుల వ్యక్తిగత ఖాతాలలో డబ్బులు జమ చేయాలని , ఇంకా కొంతమంది కార్మికులకు సంబంధించినటువంటి పీఎఫ్ సమస్య , ఈఎస్ఐ సమస్యలను పరిష్కరించి కార్మికులందరికీ మున్సిపల్ ద్వారా ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని అన్నారు.పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ అభివృద్ధిలో భాగస్వాములై పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత పాలకవర్గ సభ్యుల పైన కూడా ఉంటుంది కాబట్టి రాబోయే కౌన్సిల్ సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రత్యేక ఎజెండా పెట్టి చర్చించి వెంటనే సమస్యల పరిష్కారానికి పాలకవర్గ సభ్యులందరూ కృషి చేయాలని అన్నారు.సమస్యలు పరిష్కరించకుంటే కనుక రానున్న రోజుల్లో అవసరమైతే కార్మికులందరూ కూడా పనులు బంద్ చేసి సమ్మెలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కాసర్ల శంకర్ , పట్టణ అధ్యక్షులు ఏల్పుల బాలయ్య నాయకులు నర్మెట బాబా కిషన్ , బత్తుల దేవరాజు , గడ్డం విజయ , నర్మెట ఉమ , రెడ్డిమల్ల మమత , మారుపాక లక్ష్మి , నక్క ఎల్లవ్వ తదితరులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.