బెజ్జంకి మండలంలోని తోటపల్లి లో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా అభివృద్ధి పనులు ప్రారంభం బెజ్జంకి, జూలై 31: బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని సర్పంచ్ కవ్వంపల్లి అశ్విని శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పౌర హక్కుల పరిరక్షణ, రాజ్యాంగ విలువలు, సమానత్వం, సామాజిక న్యాయం ప్రాధాన్యంపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామాభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామంలోని ప్రధాన రహదారుల ఇరువైపులా పెరిగిన చెట్లు, ముళ్లపొదలను జేసీబీ యంత్రాలతో తొలగించి రాకపోకలకు అనుకూలంగా మారుస్తున్నారు. అలాగే మొదటి వార్డుకు దారి ఏర్పాటు పనులను ప్రారంభించారు. ఈ పనులు పూర్తయితే స్థానికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని సర్పంచ్ తెలిపారు. అభివృద్ధి పనులను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాంపల్లి శంకర్, వార్డు సభ్యులు బుర్ర మహేందర్, ఎన్న వజ్రమ్మ నర్సయ్య, రెవెన్యూ అధికారులు సుహాసిని, రజిత, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, మహిళా సంఘాల ప్రతినిధులు స్వప్న, మహాలక్ష్మి, లలిత, గ్రామ యువకులు నవీన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
బెజ్జంకి మండలంలోని తోటపల్లి లో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా అభివృద్ధి పనులు ప్రారంభం బెజ్జంకి, జూలై 31: బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని సర్పంచ్ కవ్వంపల్లి అశ్విని శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పౌర హక్కుల పరిరక్షణ, రాజ్యాంగ విలువలు, సమానత్వం, సామాజిక న్యాయం ప్రాధాన్యంపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామాభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామంలోని ప్రధాన రహదారుల ఇరువైపులా పెరిగిన చెట్లు, ముళ్లపొదలను జేసీబీ యంత్రాలతో తొలగించి రాకపోకలకు
అనుకూలంగా మారుస్తున్నారు. అలాగే మొదటి వార్డుకు దారి ఏర్పాటు పనులను ప్రారంభించారు. ఈ పనులు పూర్తయితే స్థానికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని సర్పంచ్ తెలిపారు. అభివృద్ధి పనులను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాంపల్లి శంకర్, వార్డు సభ్యులు బుర్ర మహేందర్, ఎన్న వజ్రమ్మ నర్సయ్య, రెవెన్యూ అధికారులు సుహాసిని, రజిత, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, మహిళా సంఘాల ప్రతినిధులు స్వప్న, మహాలక్ష్మి, లలిత, గ్రామ యువకులు నవీన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
- రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఘన సన్మానం సేవలను కొనియాడిన ఈవో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఘనంగా వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు భీమేశ్వర సదన్‌లో టి.ఎన్.జి.ఓస్ స్పెషల్ యూనిట్ మినిస్టీరియల్ & 4వ తరగతి సిబ్బంది యూనియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కృష్ణ యజుర్వేద పారాయణదార్ సువర్ణ రాధాకృష్ణ శర్మ, సేవాదార్ వేముల లక్ష్మీనారాయణలను దేవస్థానం తరఫున ఘనంగా సత్కరించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి ఈవో రమాదేవి వారికి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని అందజేసి సన్మానించారు.ఈ సందర్భంగా ఈవో రమాదేవి మాట్లాడుతూ, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు దేవస్థాన అభివృద్ధికి, భక్తుల సేవకు ఎన్నో సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. ఉద్యోగ విరమణ అనేది సేవకు ముగింపు కాదని, రాజన్న–భీమన్నల సేవలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు ఎప్పుడైనా ఆలయానికి వచ్చి సేవలందించవచ్చని తెలిపారు. పదవీ విరమణ అనంతరం వారికి రావలసిన అన్ని పదవీ విరమణ ప్రయోజనాలను (రిటైర్మెంట్ బెనిఫిట్స్) నిబంధనల ప్రకారం అందజేస్తామని హామీ ఇచ్చారు.పదవీ విరమణ పొందిన ఉద్యోగులు మాట్లాడుతూ, దేవస్థానంలో పనిచేసిన కాలాన్ని తమ జీవితంలో చిరస్మరణీయమైన ఘట్టంగా అభివర్ణించారు. సహోద్యోగులు, అధికారులు అందరూ కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి పనిచేశారని, అందరి సహకారం ఎప్పటికీ మరువలేమని భావోద్వేగంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, ఆలయ అర్చకులు, వేద పండితులు, ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, యూనియన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమానికి టి.ఎన్.జి.ఓస్ స్పెషల్ యూనిట్ మినిస్టీరియల్ & 4వ తరగతి సిబ్బంది యూనియన్ అధ్యక్షుడు కూరగాయల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వంశీమోహన్ అధ్యక్షత వహించి సమన్వయం చేశారు.1
- సుదర్శన్ రెడ్డి, అంత్యక్రియల్లో పాల్గొననున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... పెద్ది సుదర్శన్ రెడ్డి, సొంతూరు నల్లబెల్లి మండలం మహేశ్వరం గ్రామానికి చేరుకున్న అంతిమయాత్ర. మరికాసేపట్లో జరిగే పెద్ది సుదర్శన్ రెడ్డి, అంత్యక్రియల్లో పాల్గొననున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...1
- రాజాపేట మండలంలో భూ సర్వే పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ రాజాపేట మండలంలోని బసంతపురం, కాల్వపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూ సర్వే పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ కె. వెంకా రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. సర్వేలో ఖచ్చితత్వం పాటిస్తూ రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూ రికార్డులను నమోదు చేసి, వివాదాలకు తావులేకుండా సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.1
- *పత్రిక మరియు మీడియా మిత్రులకు నమస్కారములు* 🙏🙏🙏🙏🙏 *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటనికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ యస్ పార్టీ నాయకులు *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు* ఈరోజు ఢీల్లి లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్థూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమం లో ఉద్దేశించి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి *నార్లగిరి రమేష్* మాజీ కార్పొరేటర్ *జోరిక రమేష్* గార్లు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాకుండా బి ఆర్ ఎస్ పార్టీ కి తీరని నష్టమని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ మలిదిశ ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ నాయకుడు అని మచ్చలేని ఎమ్మెల్యేగా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రజలకు ఎన్నో సేవలు చేశాడని పెద్దికి రైతుల పట్ల ఉద్యమకారుల పట్ల ఏదో ఒకటి చేయాలనే తపన ఉండేదని 2001 నుండి పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉద్యమంలో కలిసి పనిచేసినమని పెద్దన్న మరణం నాలాంటి ఉద్యమకారులకు బి ఆర్ ఎస్ పార్టీకి తీవ్ర నష్టమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూన్నాము అని తెలియజేసినారు ఇంకా ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి *గబ్బెట శ్రీనివాస్* శిరుమల్ల దశరథం సంకు నర్సింగ రావు MD ఆఫ్జాల్ MD హుస్సేన్ సుంచు అశోక్ కోండ్ర శంకర్ తండమళ్ళ వేణు కుమ్మరి రాజ్ కుమార్ పోలేపల్లి రామ్మూర్తి గడ్డం రఘు వంశీ మాచర్ల గణేష్ కనకం రమేష్ మారపాక గణేష్ రాబర్ట్ అయాన్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు *మీ.. గబ్బేట శ్రీనివాస్ బి ఆర్ యస్ పార్టీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి* 86866186642
- ప్రజల నాయకుడు తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో నర్సంపేట ప్రజా జనం వరంగల్ జిల్లా ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రలో1
- జగిత్యాల జిల్లాలో వర్షం ఎఫెక్ట్ తో కూలిన ఇళ్ళు...బాధితులను ఆదుకోవాలని అధికారులను కోరిన జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం లోని పెంబట్ల కోనపూర్ గ్రామాలలో నీట మునిగిన లోతట్టు ప్రాంతాల్లో మాజీమంత్రి బిఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి పర్యటించారు. అధిక వర్షానికి కూలిపోయిన ఇళ్ళను పరిశీలించారు. MRO, RDO తో ఫోన్ లో మాట్లాడారు. ఇల్లు పూర్తిగా కూలితే నష్ట పరిహారం ఎంత వస్తుందని అడిగారు. జీవో ప్రకారం ఎంత ఉంటే అంత పూర్తిగా ఇల్లు కూలినందుకు నష్టపరిహారం అందజేయాలని సూచించారు . ఇల్లు కూలి నష్టపోయిన కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని సూచించారు. ఇల్లు కూలినందుకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని ఇల్లు మంజూరు అయ్యేలా అధికారులతో మాట్లాడి చేపిస్తామని తెలిపారు.4
- సంచలనాత్మకంగా ఇంటి దోపిడీ కేసును చేదించిన కరీంనగర్ పోలీసులు కరీంనగర్ భగత్‌నగర్‌లోని 80 ఏళ్ల ఎం.డి. అజ్మత్ అలీ ఇంట్లోకి జూలై 21/22న డమ్మీ పిస్టళ్లు, కత్తులతో చొరబడి కుటుంబ సభ్యులను నిర్బంధించి దారిదోపిడీ చేశారు. ప్రధాన సూత్రధారులు: బాధితుడి సొంత అల్లుడు మొహమ్మద్ రాజావుద్దీన్ (A1), మనవడు మొహమ్మద్ అజీమ్ రజా (A2) కలసి ఈ దోపిడీకి ప్లాన్ చేశారు. కుటుంబ, ఆర్థిక వివాదాలు, వ్యాపార నిమిత్తం అడిగిన ₹5 లక్షలు ఇవ్వలేదన్న కక్షతోనే అల్లుడు ఈ కుట్ర పన్నాడని పోలీసులు తెలిపారు. మీరట్‌లో అరెస్టులు: ప్రత్యేక పోలీసు బృందాలు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టి, ముగ్గురు నిందితులను (A3, A4, A5) అరెస్ట్ చేశాయి. అరెస్ట్ అయిన వారి వద్ద నుంచి ₹2,09,000 నగదు, 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు, 64.98 గ్రాముల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు A1, A2 తమ పాత కేసుల్లో మీరట్ కోర్టులో లొంగిపోగా, వారిని పిటి (PT) వారెంట్‌పై కరీంనగర్‌కు తీసుకురావడానికి పోలీసులు లీగల్ ప్రాసెస్ ప్రారంభించారు.2
- సిరిసిల్ల మున్సిపల్ లో అదనంగా కార్మికులను నియమించి కార్మికులపై పని భారం తగ్గించాలి. మున్సిపల్ చైర్మన్ మరియు పాలకవర్గానికి వినతిపత్రం అందించిన సీఐటీయూ నాయకులు సిరిసిల్ల మున్సిపల్ లో పనిచేస్తూ చనిపోయిన కార్మికులు మరియు 60 సంవత్సరాలు పైబడి రిటైర్మెంట్ అయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు పని కల్పించాలని అదేవిధంగా అదనంగా కార్మికులను నియమించి ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులపై పని భారం తగ్గించాలని మరియు మున్సిపల్ కార్మికులకు సంబంధించిన పెండింగ్ ఈ పి ఎఫ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని తదితర డిమాండ్లతో శనివారం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , జిల్లా కార్యదర్శి కోడం రమణ లు మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణికి వినతి పత్రం అందించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో రోజు వారీగా చెత్తా, చెదారం , మురుగును శుభ్రం చేస్తూ ఎండనక , వాననక , చలనక మురుగులో అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాలకు రక్షణ కల్పిస్తున మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా మున్సిపల్ పాలకవర్గం పనిచేయాలని అన్నారు.ఈ మధ్యకాలంలో మున్సిపల్ లో పనిచేస్తూ చనిపోయిన మరియు 60 సంవత్సరాలు పైబడి రిటైర్మెంట్ అయినా కార్మికులు దాదాపు 10 మంది వరకు ఉన్నారని ఒకవైపు వీరి స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలో పెట్టుకోక పోవడం వలన వారి కుటుంబాలలో వచ్చే ఆదాయాలు కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మరోవైపు వారి స్థానాలు ఖాళీగా ఉండడం వలన ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులకు పని భారం పెరిగిందని కార్మికులు అదనంగా పనిచేస్తూ కూడా పని చేయని వారుగా మిగిలిపోతున్నా రన్నారనీ కావున పాలకవర్గం వెంటనే స్పందించి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేవరకు కార్మికుల కుటుంబ సభ్యులకు తాత్కాలికంగా నైనా పనిలో పెట్టుకుని వేతనాలు అందించాలని ప్రస్తుతం రోజు రోజుకు పట్టణం విస్తరిస్తున్నందున పనికి తగిన విధంగా ఇంకా అదనంగా కార్మికులను నియమించి కార్మికులకు పని భారం తగ్గించాలని మరియు కార్మికులకు సంబంధించి పెండింగ్ పీఎఫ్ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ మరియు చైర్మన్ లకు తెలియజేయడం జరిగిందని వారు కూడా సానుకూలంగా స్పందించి తొందర్లోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసి సమస్యలను పరిష్కరించాలని లేకుంటే కార్మికులందరితో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామన్నారు.1
- ఈగల్ టీమ్ కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజును కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ గంజాయి కేసులో కానిస్టేబుల్ అరెస్ట్ సివిల్ తగాదాలో ప్రత్యర్థిని ఇరికించేందుకు కుట్ర పన్నిన ఈగల్ టీమ్ కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజును కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను ACP విజయ్ కుమార్ వెల్లడించారు. నాగరాజు తన మిత్రుడి భూ వివాదంలో ప్రత్యర్థి శ్రీనివాస్ రెడ్డిని ఇరికించేందుకు గంజాయి తెప్పించి అతడి షాపులో పెట్టించి చిగురుమామిడి స్టేషన్లో కేసు నమోదయ్యే లా చేశాడు. మిగిలిన 370.96 గ్రాముల గంజాయిని తనఇంట్లో దాచుకోగా పట్టుబడ్డాడు.1