logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సదాశివ నగర్ మండలం : మాటతప్పిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే తీరుని నిరసిస్తూ మాజీ వార్డు సభ్యుడు మోసర్ల శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం : మాస్టర్ ప్లాన్ లోని ఇండస్ట్రియల్ జోన్ ఎత్తివేస్తానని ఎన్నికల ముందు మాట ఇచ్చి ఏనాడూ అసెంబ్లీలో ప్రశ్నించని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ తీరును నిరసిస్తూ అడ్లూరు ఎల్లారెడ్డి మాజీ వార్డు సభ్యుడు మోసర్ల శ్రీకాంత్ రెడ్డి అలియాస్ (అబ్బు రెడ్డి ) ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఓట్ల కోసం మాస్టర్ ప్లాన్ జీవోను రద్దు చేస్తానని ప్రగల్బాలు పలికిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మాట తప్పేరన్నారు. ఈ విషయమై ఎన్నిసార్లు ఎమ్మెల్యే కు ఎన్ని సార్లు విన్నవించిన పెడచెవిన పెడుతున్నారన్నారు . ఓట్ల కోసం ఎమ్మెల్యే తాను గెలవడానికి ఈ మాస్టర్ ప్లాన్ ఇండస్ట్రియల్ జోన్లను రద్దు చేస్తానని కపట ప్రేమ చూపించారన్నారు. అడ్లూరు ఎల్లారెడ్డి సాక్షిగా ఎన్నికల ప్రచార సమయంలో తాను గెలిస్తే జీవో రద్దు చేస్తానని హామీ ఇచ్చి ఏనాడు మాస్టర్ ప్లాన్, ఇండస్ట్రియల్ జోన్ రద్దు పై అసెంబ్లీలో చర్చించని ఎమ్మెల్యే తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేకు చిత్త శుద్ధి ఉంటే ఇండస్ట్రియల్ జోన్ ఎత్తివేసి జీవో అందజేయలన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఎమ్మెల్యే రైతుల పాలిట శాపంగా మారారని, ఎమ్మెల్యే తీరు మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు.

16 hrs ago
user_Narmala Swapna
Narmala Swapna
Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
16 hrs ago

సదాశివ నగర్ మండలం : మాటతప్పిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే తీరుని నిరసిస్తూ మాజీ వార్డు సభ్యుడు మోసర్ల శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం : మాస్టర్ ప్లాన్ లోని ఇండస్ట్రియల్ జోన్ ఎత్తివేస్తానని ఎన్నికల ముందు మాట ఇచ్చి ఏనాడూ అసెంబ్లీలో ప్రశ్నించని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ తీరును నిరసిస్తూ అడ్లూరు ఎల్లారెడ్డి మాజీ వార్డు సభ్యుడు మోసర్ల శ్రీకాంత్ రెడ్డి అలియాస్ (అబ్బు రెడ్డి ) ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఓట్ల కోసం మాస్టర్ ప్లాన్ జీవోను రద్దు చేస్తానని ప్రగల్బాలు పలికిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మాట తప్పేరన్నారు. ఈ విషయమై ఎన్నిసార్లు ఎమ్మెల్యే కు ఎన్ని సార్లు విన్నవించిన పెడచెవిన పెడుతున్నారన్నారు . ఓట్ల కోసం ఎమ్మెల్యే తాను గెలవడానికి ఈ మాస్టర్ ప్లాన్ ఇండస్ట్రియల్ జోన్లను రద్దు చేస్తానని కపట ప్రేమ చూపించారన్నారు. అడ్లూరు ఎల్లారెడ్డి సాక్షిగా ఎన్నికల ప్రచార సమయంలో తాను గెలిస్తే జీవో రద్దు చేస్తానని హామీ ఇచ్చి ఏనాడు మాస్టర్ ప్లాన్, ఇండస్ట్రియల్ జోన్ రద్దు పై అసెంబ్లీలో చర్చించని ఎమ్మెల్యే తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేకు చిత్త శుద్ధి ఉంటే ఇండస్ట్రియల్ జోన్ ఎత్తివేసి జీవో అందజేయలన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఎమ్మెల్యే రైతుల పాలిట శాపంగా మారారని, ఎమ్మెల్యే తీరు మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ మేడే 140 కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపునిచ్చారు.
    3
    రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ మేడే 140 కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపునిచ్చారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
  • రాజన్నసిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో PACS ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సమయంలో గాలిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అన్నాడి సంపత్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు సుదగోని వెంకటేశం, నాయకులు -మండల నాయకత్వం మీద మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త ఐరెడ్డి మహేందర్ రెడ్డి మీద తిరగబడ్డారు. .పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడి పనిచేస్తే మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో లేని కొత్తగావచ్చిన వారిని ఆదరిస్తూ వారికే ప్రాముఖ్యతనిస్తూ పార్టీ గెలుపు కోసం సొంత పెట్రోల్, ఖర్చులతో గ్రామాలు తిరిగి పార్టీ అధికారంలోకి తెస్తే అప్పుడు లేనివారికి అధికారం అప్పజేప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేమెందుకు నచ్చడం లేదు, ఎందుకు కక్కోస్తున్నామో చెప్పాలని MLA చెప్పాలని అన్నారు...గ్రామాలకు వస్తే కనీసం సమాచారం ఇవ్వకుండా భజనపరులకు సమాచారం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలిపల్లి గ్రామనాయకులు ఎదురుతిరగడంతో సమాధానం చెప్పలేక మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త ఐరెడ్డి మహేందర్ రెడ్డి అక్కడినుండి వెళ్లిపోయారు. .
    1
    రాజన్నసిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో PACS ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సమయంలో గాలిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అన్నాడి సంపత్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు సుదగోని వెంకటేశం, నాయకులు -మండల నాయకత్వం మీద మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త ఐరెడ్డి మహేందర్ రెడ్డి మీద తిరగబడ్డారు. .పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడి పనిచేస్తే మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో లేని కొత్తగావచ్చిన వారిని ఆదరిస్తూ వారికే ప్రాముఖ్యతనిస్తూ పార్టీ గెలుపు కోసం సొంత పెట్రోల్, ఖర్చులతో గ్రామాలు తిరిగి పార్టీ అధికారంలోకి తెస్తే అప్పుడు లేనివారికి అధికారం అప్పజేప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేమెందుకు నచ్చడం లేదు, ఎందుకు కక్కోస్తున్నామో చెప్పాలని MLA చెప్పాలని అన్నారు...గ్రామాలకు వస్తే కనీసం సమాచారం ఇవ్వకుండా భజనపరులకు సమాచారం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలిపల్లి గ్రామనాయకులు ఎదురుతిరగడంతో సమాధానం చెప్పలేక మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త ఐరెడ్డి మహేందర్ రెడ్డి అక్కడినుండి వెళ్లిపోయారు. .
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer ఎల్లందకుంట, కరీంనగర్, తెలంగాణ•
    21 hrs ago
  • Post by Vodnala thirupthi
    1
    Post by Vodnala thirupthi
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    14 hrs ago
  • Post by Venu Gopal
    1
    Post by Venu Gopal
    user_Venu Gopal
    Venu Gopal
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    17 hrs ago
  • ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ* నేడు మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా యావత్తు కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు.. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, సమస్యల పరిష్కారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రివర్గం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం,11% పిఆర్సి పెంపు, కార్మిక సంఘాల ఎన్నికలకు అనుమతి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నేడు మే డే ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కరీంనగర్ ఆర్టీసీ 1 డిపో వద్ద ఆర్టీసీ కార్మిక సోదరులతో కలిసి మే డే సంబరాలను జరుపుకోవడం జరిగింది, ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి ఆర్టీసీ కార్మికులకు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. యావత్ కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం మరొకటి లేదు 50 రోజుల సమ్మె చేసినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ సమ్మె ప్రారంభించిన కేవలం రెండు రోజుల్లో నేటి ప్రజా పాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి మట్టి విక్రమార్కతో పాటు ముఖ్యంగా జిల్లాకు చెందిన బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల సాధక బాదకాలను అర్థం చేసుకొని వారి డిమాండ్లను పరిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్టీసీ కార్మికుల, కర్షకుల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యం.డి.ఇమ్రాన్, సుంకరి గణపతి, యం.డి. లయీక్, గడప శ్రీను, సిరిపురం మనోజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
    3
    ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ* నేడు మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా యావత్తు కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు.. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల  డిమాండ్లు, సమస్యల పరిష్కారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రివర్గం ఆర్టీసీ కార్మికుల  డిమాండ్లను పరిష్కరిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం,11% పిఆర్సి పెంపు, కార్మిక సంఘాల ఎన్నికలకు అనుమతి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నేడు మే డే ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కరీంనగర్ ఆర్టీసీ 1 డిపో వద్ద ఆర్టీసీ కార్మిక సోదరులతో కలిసి మే డే సంబరాలను జరుపుకోవడం జరిగింది, ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి ఆర్టీసీ కార్మికులకు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. యావత్ కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం మరొకటి లేదు 50 రోజుల సమ్మె చేసినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ సమ్మె ప్రారంభించిన కేవలం రెండు రోజుల్లో నేటి ప్రజా పాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి మట్టి విక్రమార్కతో పాటు ముఖ్యంగా జిల్లాకు చెందిన బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల సాధక బాదకాలను అర్థం చేసుకొని వారి డిమాండ్లను పరిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్టీసీ కార్మికుల, కర్షకుల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యం.డి.ఇమ్రాన్,  సుంకరి గణపతి, యం.డి. లయీక్, గడప శ్రీను, సిరిపురం మనోజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    10 min ago
  • సదాశివపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు గురువారం నిర్వహించారు. జెసిబి డిఎస్పి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగాయి. కార్యాలయంలోని ఉద్యోగులను ఏసేపి అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. తనిఖీలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
    1
    సదాశివపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు గురువారం నిర్వహించారు. జెసిబి డిఎస్పి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగాయి. కార్యాలయంలోని ఉద్యోగులను ఏసేపి అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. తనిఖీలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    21 hrs ago
  • కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం శిలాఫలకంలో ప్రోటోకాల్ పాటించక పోవడం సిగ్గు చేటు.. అడ్లూరు ఎల్లారెడ్డి పల్లె దావఖన ప్రారంభోత్సవం సమయంలో శిలా పాలకం పై ప్రజా ప్రతినిధిగా ఉన్న ఉప సర్పంచ్ పేరు పెట్టకపోవడం సిగ్గుచేటు అని ఉప సర్పంచ్ పయ్యావుల గంగాధర్ తెలిపారు. ఈ విషయమై తాను కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తన పేరును శిలాఫలకంపై లేకుండా చేసిన అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు.
    1
    కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం శిలాఫలకంలో ప్రోటోకాల్ పాటించక పోవడం సిగ్గు చేటు.. 
అడ్లూరు ఎల్లారెడ్డి  పల్లె దావఖన ప్రారంభోత్సవం సమయంలో  శిలా పాలకం పై ప్రజా ప్రతినిధిగా ఉన్న ఉప సర్పంచ్ పేరు పెట్టకపోవడం సిగ్గుచేటు  అని ఉప సర్పంచ్ పయ్యావుల గంగాధర్ తెలిపారు. ఈ విషయమై తాను  కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తన పేరును  శిలాఫలకంపై లేకుండా చేసిన అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    16 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దత్తత దేవాలయమైన నాంపల్లి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిదే వైశాఖ శుద్ధ చతుర్దశి గురువారం సందర్భంగా విశేష కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం 6.30 గంటలకు అభిషేకం, బలిహరణం నిర్వహించగా, ఉదయం 10.30 గంటలకు శ్రీ భూనీలా సమేత లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నివేదన, తీర్థప్రసాదాల పంపిణీ చేశారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం పూర్ణాహుతి, బలిహరణం, మంగళాశాసనం, తీర్థప్రసాద కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో కన్యాదాతలుగా రాచకొండ రామాచార్యులు, సంధ్య పాల్గొనగా, కళ్యాణోత్సవ దాతలుగా కరీంనగర్‌కు చెందిన కోటోజు శ్రీనివాస్, సుష్మ సేవలు అందించారు.ఆలయ అర్చకులు, వేద పండితులు అంగరంగ వైభవంగా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీడ టెంట్లు, కూలర్లు, చల్లని నీటి పందిళ్లు ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణ మండపాన్ని రంగురంగుల పూలతో అలంకరించి, గ్రీన్ మ్యాట్స్, అరటి తోరణాలు, మామిడి ఆకులతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఆమె కళ్యాణోత్సవంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దత్తత దేవాలయమైన నాంపల్లి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిదే వైశాఖ శుద్ధ చతుర్దశి గురువారం సందర్భంగా విశేష కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఉదయం 6.30 గంటలకు అభిషేకం, బలిహరణం నిర్వహించగా, ఉదయం 10.30 గంటలకు శ్రీ భూనీలా సమేత లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నివేదన, తీర్థప్రసాదాల పంపిణీ చేశారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.
సాయంత్రం పూర్ణాహుతి, బలిహరణం, మంగళాశాసనం, తీర్థప్రసాద కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో కన్యాదాతలుగా రాచకొండ రామాచార్యులు, సంధ్య పాల్గొనగా, కళ్యాణోత్సవ దాతలుగా కరీంనగర్‌కు చెందిన కోటోజు శ్రీనివాస్, సుష్మ సేవలు అందించారు.ఆలయ అర్చకులు, వేద పండితులు అంగరంగ వైభవంగా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీడ టెంట్లు, కూలర్లు, చల్లని నీటి పందిళ్లు ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణ మండపాన్ని రంగురంగుల పూలతో అలంకరించి, గ్రీన్ మ్యాట్స్, అరటి తోరణాలు, మామిడి ఆకులతో సుందరంగా తీర్చిదిద్దారు.
ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఆమె కళ్యాణోత్సవంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    21 hrs ago
  • Post by Venu Gopal
    1
    Post by Venu Gopal
    user_Venu Gopal
    Venu Gopal
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.