logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మరిపల్లి శివారులో గురువారం రోజున కారు అదుపు తప్పి చెట్టుని ఢీకొట్టడం తో ఒకరి మృతి చెందారు... ఈ ఘటనలో కారు పూర్తిగా నుజ్జు అయింది... మృతి చెందిన వ్యక్తి కుమ్మరిపల్లికి చెందిన రాంబాబు మేస్త్రి గా గుర్తించారు.. కార్మికులను తీసుకు రావడానికి జగిత్యాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది..మృతిడికి భార్య ఇద్దరు పిల్లలు కుటుంబంతో కమ్మరిపల్లిలో నివాసం ఉంటున్నారు..

17 hrs ago
user_Venu Gopal
Venu Gopal
జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
17 hrs ago

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మరిపల్లి శివారులో గురువారం రోజున కారు అదుపు తప్పి చెట్టుని ఢీకొట్టడం తో ఒకరి మృతి చెందారు... ఈ ఘటనలో కారు పూర్తిగా నుజ్జు అయింది... మృతి చెందిన వ్యక్తి కుమ్మరిపల్లికి చెందిన రాంబాబు మేస్త్రి గా గుర్తించారు.. కార్మికులను తీసుకు రావడానికి జగిత్యాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది..మృతిడికి భార్య ఇద్దరు పిల్లలు కుటుంబంతో కమ్మరిపల్లిలో నివాసం ఉంటున్నారు..

More news from తెలంగాణ and nearby areas
  • ఖానాపూర్ పట్టణంలో మేడే ఉత్సవాలను కార్మికులు ఘనంగా నిర్వహించుకున్నారు. మేడే పురస్కరించుకొని మున్సిపాలిటీ కార్యాలయం ముందు మేడే జెండాను శుక్రవారం కార్మిక సంఘం నాయకులు ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో జావిద్, సురేష్,రమేష్ గౌడ్, జంగం రాజేశ్వర్, రాకేష్ శేఖర్, నగేష్, ఆమెర్, శెంకరమ్మ, లావణ్య, మున్సిపాలిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
    1
    ఖానాపూర్ పట్టణంలో మేడే ఉత్సవాలను కార్మికులు ఘనంగా నిర్వహించుకున్నారు. మేడే పురస్కరించుకొని మున్సిపాలిటీ కార్యాలయం ముందు మేడే జెండాను శుక్రవారం కార్మిక సంఘం నాయకులు ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో జావిద్, సురేష్,రమేష్ గౌడ్, జంగం రాజేశ్వర్, రాకేష్ శేఖర్, నగేష్, ఆమెర్, శెంకరమ్మ, లావణ్య, మున్సిపాలిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • డివైడర్ను ఢీకొట్టిన తార్ వాహనం, వ్యక్తి మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు కరీంనగర్ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ఘటన
    2
    డివైడర్ను ఢీకొట్టిన తార్ వాహనం, వ్యక్తి మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు 
కరీంనగర్ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ఘటన
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ మేడే 140 కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపునిచ్చారు.
    3
    రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ మేడే 140 కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపునిచ్చారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
  • Post by Vodnala thirupthi
    1
    Post by Vodnala thirupthi
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    14 hrs ago
  • *అంతర్జాతీయ మ్యాప్‌లో మంచిర్యాల: తొలి ఇంటర్నేషనల్ ఫిష్‌పాండ్‌కు శ్రీకారం* :* 85 ఎకరాల కేటాయింపు... 150 మంది మత్స్యకారుల జీవితాల్లో వెలుగు *మంచిర్యాల:* మత్స్య రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరలేపుతూ, దేశంలోనే ప్రథమంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘ఇంటర్నేషనల్ ఫిష్‌పాండ్’ ఏర్పాటుకు మంచిర్యాల జిల్లా వేదిక కానుంది. హాజీపూర్ మండలం గుడిపేట రెవెన్యూ పరిధిలో 85.10 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక జీవో విడుదల చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యే శ్రీ ప్రేమ్‌సాగర్‌రావు బుధవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. "ఇది కేవలం ఒక ప్రాజెక్టు కాదు... మత్స్యకార కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు వేసిన పునాది. ఈ మెగా ఫిష్‌పాండ్ ద్వారా ప్రత్యక్షంగా 150 మంది మత్స్యకారులకు శాశ్వత ఉపాధి లభించడంతో పాటు, పరోక్షంగా వందలాది కుటుంబాలకు జీవనోపాధి చేకూరనుంది" అని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి స్థాయిలో చేపల ఉత్పత్తి, శాస్త్రీయ పద్ధతుల్లో పెంపకం, శిక్షణా కేంద్రం ఏర్పాటు ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు. దూరదృష్టితో నిధులు మంజూరు చేసి, భూమి కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి జిల్లా ప్రజల తరఫున ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో మంచిర్యాల జిల్లా దేశ మత్స్య పటంలో ప్రత్యేక స్థానం సంపాదించుకోనుంది.
    1
    *అంతర్జాతీయ మ్యాప్‌లో మంచిర్యాల: తొలి ఇంటర్నేషనల్ ఫిష్‌పాండ్‌కు శ్రీకారం*
:* 85 ఎకరాల కేటాయింపు... 150 మంది మత్స్యకారుల జీవితాల్లో వెలుగు
*మంచిర్యాల:* మత్స్య రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరలేపుతూ, దేశంలోనే ప్రథమంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘ఇంటర్నేషనల్ ఫిష్‌పాండ్’ ఏర్పాటుకు మంచిర్యాల జిల్లా వేదిక కానుంది. హాజీపూర్ మండలం గుడిపేట రెవెన్యూ పరిధిలో 85.10 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక జీవో విడుదల చేసింది. 
ఈ మేరకు ఎమ్మెల్యే శ్రీ ప్రేమ్‌సాగర్‌రావు బుధవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. "ఇది కేవలం ఒక ప్రాజెక్టు కాదు... మత్స్యకార కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు వేసిన పునాది. ఈ మెగా ఫిష్‌పాండ్ ద్వారా ప్రత్యక్షంగా 150 మంది మత్స్యకారులకు శాశ్వత ఉపాధి లభించడంతో పాటు, పరోక్షంగా వందలాది కుటుంబాలకు జీవనోపాధి చేకూరనుంది" అని ఆయన పేర్కొన్నారు. 
అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి స్థాయిలో చేపల ఉత్పత్తి, శాస్త్రీయ పద్ధతుల్లో పెంపకం, శిక్షణా కేంద్రం ఏర్పాటు ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు. దూరదృష్టితో నిధులు మంజూరు చేసి, భూమి కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి జిల్లా ప్రజల తరఫున ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో మంచిర్యాల జిల్లా దేశ మత్స్య పటంలో ప్రత్యేక స్థానం సంపాదించుకోనుంది.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • రాజన్నసిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో PACS ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సమయంలో గాలిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అన్నాడి సంపత్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు సుదగోని వెంకటేశం, నాయకులు -మండల నాయకత్వం మీద మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త ఐరెడ్డి మహేందర్ రెడ్డి మీద తిరగబడ్డారు. .పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడి పనిచేస్తే మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో లేని కొత్తగావచ్చిన వారిని ఆదరిస్తూ వారికే ప్రాముఖ్యతనిస్తూ పార్టీ గెలుపు కోసం సొంత పెట్రోల్, ఖర్చులతో గ్రామాలు తిరిగి పార్టీ అధికారంలోకి తెస్తే అప్పుడు లేనివారికి అధికారం అప్పజేప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేమెందుకు నచ్చడం లేదు, ఎందుకు కక్కోస్తున్నామో చెప్పాలని MLA చెప్పాలని అన్నారు...గ్రామాలకు వస్తే కనీసం సమాచారం ఇవ్వకుండా భజనపరులకు సమాచారం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలిపల్లి గ్రామనాయకులు ఎదురుతిరగడంతో సమాధానం చెప్పలేక మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త ఐరెడ్డి మహేందర్ రెడ్డి అక్కడినుండి వెళ్లిపోయారు. .
    1
    రాజన్నసిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో PACS ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సమయంలో గాలిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అన్నాడి సంపత్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు సుదగోని వెంకటేశం, నాయకులు -మండల నాయకత్వం మీద మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త ఐరెడ్డి మహేందర్ రెడ్డి మీద తిరగబడ్డారు. .పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడి పనిచేస్తే మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో లేని కొత్తగావచ్చిన వారిని ఆదరిస్తూ వారికే ప్రాముఖ్యతనిస్తూ పార్టీ గెలుపు కోసం సొంత పెట్రోల్, ఖర్చులతో గ్రామాలు తిరిగి పార్టీ అధికారంలోకి తెస్తే అప్పుడు లేనివారికి అధికారం అప్పజేప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేమెందుకు నచ్చడం లేదు, ఎందుకు కక్కోస్తున్నామో చెప్పాలని MLA చెప్పాలని అన్నారు...గ్రామాలకు వస్తే కనీసం సమాచారం ఇవ్వకుండా భజనపరులకు సమాచారం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలిపల్లి గ్రామనాయకులు ఎదురుతిరగడంతో సమాధానం చెప్పలేక మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త ఐరెడ్డి మహేందర్ రెడ్డి అక్కడినుండి వెళ్లిపోయారు. .
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer ఎల్లందకుంట, కరీంనగర్, తెలంగాణ•
    21 hrs ago
  • జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మేడేను పురస్కరించుకొని జన్నారం మండల కేంద్రంలోని కవ్వాల్ చౌరస్తాలో హమాలీ కార్మికులు మేడే జెండాను ఎగరవేశారు అలాగే సిపిఎం, సిఐటియు, అనుబంధ సంఘాల నాయకులు స్థానిక మార్కెట్ కమిటీ, బస్టాండ్ ల వద్ద మేడే జెండాలను ఎగురవేశారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో కార్మిక హక్కులను కాపాడుకుందామని వారన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.
    1
    జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మేడేను పురస్కరించుకొని జన్నారం మండల కేంద్రంలోని కవ్వాల్ చౌరస్తాలో హమాలీ కార్మికులు మేడే జెండాను ఎగరవేశారు 
అలాగే సిపిఎం, సిఐటియు, అనుబంధ సంఘాల నాయకులు స్థానిక మార్కెట్ కమిటీ, బస్టాండ్ ల వద్ద మేడే జెండాలను ఎగురవేశారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో కార్మిక హక్కులను కాపాడుకుందామని వారన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • పదవ తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మంచి మార్కులతో ప్రతిభ కనబరిచారని విద్యార్థులు ,తల్లిదండ్రులు ఆలోచించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు*
    2
    పదవ తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మంచి మార్కులతో ప్రతిభ కనబరిచారని విద్యార్థులు ,తల్లిదండ్రులు ఆలోచించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు*
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    21 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దత్తత దేవాలయమైన నాంపల్లి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిదే వైశాఖ శుద్ధ చతుర్దశి గురువారం సందర్భంగా విశేష కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం 6.30 గంటలకు అభిషేకం, బలిహరణం నిర్వహించగా, ఉదయం 10.30 గంటలకు శ్రీ భూనీలా సమేత లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నివేదన, తీర్థప్రసాదాల పంపిణీ చేశారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం పూర్ణాహుతి, బలిహరణం, మంగళాశాసనం, తీర్థప్రసాద కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో కన్యాదాతలుగా రాచకొండ రామాచార్యులు, సంధ్య పాల్గొనగా, కళ్యాణోత్సవ దాతలుగా కరీంనగర్‌కు చెందిన కోటోజు శ్రీనివాస్, సుష్మ సేవలు అందించారు.ఆలయ అర్చకులు, వేద పండితులు అంగరంగ వైభవంగా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీడ టెంట్లు, కూలర్లు, చల్లని నీటి పందిళ్లు ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణ మండపాన్ని రంగురంగుల పూలతో అలంకరించి, గ్రీన్ మ్యాట్స్, అరటి తోరణాలు, మామిడి ఆకులతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఆమె కళ్యాణోత్సవంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దత్తత దేవాలయమైన నాంపల్లి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిదే వైశాఖ శుద్ధ చతుర్దశి గురువారం సందర్భంగా విశేష కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఉదయం 6.30 గంటలకు అభిషేకం, బలిహరణం నిర్వహించగా, ఉదయం 10.30 గంటలకు శ్రీ భూనీలా సమేత లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నివేదన, తీర్థప్రసాదాల పంపిణీ చేశారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.
సాయంత్రం పూర్ణాహుతి, బలిహరణం, మంగళాశాసనం, తీర్థప్రసాద కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో కన్యాదాతలుగా రాచకొండ రామాచార్యులు, సంధ్య పాల్గొనగా, కళ్యాణోత్సవ దాతలుగా కరీంనగర్‌కు చెందిన కోటోజు శ్రీనివాస్, సుష్మ సేవలు అందించారు.ఆలయ అర్చకులు, వేద పండితులు అంగరంగ వైభవంగా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీడ టెంట్లు, కూలర్లు, చల్లని నీటి పందిళ్లు ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణ మండపాన్ని రంగురంగుల పూలతో అలంకరించి, గ్రీన్ మ్యాట్స్, అరటి తోరణాలు, మామిడి ఆకులతో సుందరంగా తీర్చిదిద్దారు.
ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఆమె కళ్యాణోత్సవంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.