Shuru
Apke Nagar Ki App…
ఖానాపూర్ మున్సిపాలిటీలో ఘనంగా మేడే ఉత్సవాలు, పాల్గొన్న కార్మికులు ఖానాపూర్ పట్టణంలో మేడే ఉత్సవాలను కార్మికులు ఘనంగా నిర్వహించుకున్నారు. మేడే పురస్కరించుకొని మున్సిపాలిటీ కార్యాలయం ముందు మేడే జెండాను శుక్రవారం కార్మిక సంఘం నాయకులు ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో జావిద్, సురేష్,రమేష్ గౌడ్, జంగం రాజేశ్వర్, రాకేష్ శేఖర్, నగేష్, ఆమెర్, శెంకరమ్మ, లావణ్య, మున్సిపాలిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
P.G. Murthy
ఖానాపూర్ మున్సిపాలిటీలో ఘనంగా మేడే ఉత్సవాలు, పాల్గొన్న కార్మికులు ఖానాపూర్ పట్టణంలో మేడే ఉత్సవాలను కార్మికులు ఘనంగా నిర్వహించుకున్నారు. మేడే పురస్కరించుకొని మున్సిపాలిటీ కార్యాలయం ముందు మేడే జెండాను శుక్రవారం కార్మిక సంఘం నాయకులు ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో జావిద్, సురేష్,రమేష్ గౌడ్, జంగం రాజేశ్వర్, రాకేష్ శేఖర్, నగేష్, ఆమెర్, శెంకరమ్మ, లావణ్య, మున్సిపాలిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
More news from తెలంగాణ and nearby areas
- Post by Venu Gopal1
- *జర్నలిస్టులకు నూతన అక్రిడిటేషన్ కార్డులను ప్రారంభించి, తొలి కార్డును మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి, టియుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్రఅద్యక్షులు విరాహత్ అలీ కి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు.*1
- కమ్మర్ పల్లి: కార్మిక దినోత్సవం అయిన మేడేను కార్మికులు శుక్రవారం మండల కేంద్రంలోని భగత్ సింగ్ విగ్రహం వద్ద సఫాయి యూనియన్ మండల అధ్యక్షుడు రామాంజనేయులు జెండాను ఆవిష్కరించారు. ఐక్యతతో కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చుకోవచ్చని అన్నారు. తమ హక్కుల సాధనకు కార్మిక సంఘాలు చేపట్టిన పోరాటాలు, సాధించిన విజయాల గురించి సంఘాల నాయకులు మాట్లాడారు.1
- హాస్పిటల్ లో ఉన్న సమస్యపై సంబంధిత శాఖ అధికారులతో రివ్యూ మిట్టింగ్ నిర్వహించిన ఎమ్మెల్యే,డాక్టర్ల కొరతపై తన చేరణవాణి తో జిల్లా కలెక్టట్ తో మాట్లాడిన బోథ్ ఎమ్మెల్యే...అనంతరం హాసుపత్రిలో సందర్శించి రోగుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.బోథ్ ఎమ్మెల్యే మాట్లాడుతూ రోజు రోజుకు ఎండలు విపరీతంగా మండుతున్నాయి ప్రజలు ఎండలో పట్ల అప్రమతంగా ఉండలి అని అన్నారు అత్యవసరం అయితే కానీ ప్రజలు ఇంటి నుండి బయటికి రావద్దు అని దేశంలోనే మన జిల్లా 10వ స్థానంలో ఉంది తీవ్రమైన ఎండల దృశ్య ప్రజలు పనులు వీలైనంత తొరగా ముగించుకొని ఇంటికి చేరుకొవాలి అని అన్నారు అదేవిధంగా బోథ్ ప్రభుత్వ ఆసుపత్రి తోరలోనే ప్రజలకు అందుబాటులో వస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమం సూపడెంట్ రవీంద్ర ప్రసాద్, డాక్టర్లు,ఎలక్ట్రిసిటీ AE, స్థానిక సర్పంచ్ ఉన్నారు.1
- ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ* నేడు మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా యావత్తు కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు.. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, సమస్యల పరిష్కారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రివర్గం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం,11% పిఆర్సి పెంపు, కార్మిక సంఘాల ఎన్నికలకు అనుమతి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నేడు మే డే ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కరీంనగర్ ఆర్టీసీ 1 డిపో వద్ద ఆర్టీసీ కార్మిక సోదరులతో కలిసి మే డే సంబరాలను జరుపుకోవడం జరిగింది, ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి ఆర్టీసీ కార్మికులకు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. యావత్ కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం మరొకటి లేదు 50 రోజుల సమ్మె చేసినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ సమ్మె ప్రారంభించిన కేవలం రెండు రోజుల్లో నేటి ప్రజా పాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి మట్టి విక్రమార్కతో పాటు ముఖ్యంగా జిల్లాకు చెందిన బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల సాధక బాదకాలను అర్థం చేసుకొని వారి డిమాండ్లను పరిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్టీసీ కార్మికుల, కర్షకుల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యం.డి.ఇమ్రాన్, సుంకరి గణపతి, యం.డి. లయీక్, గడప శ్రీను, సిరిపురం మనోజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.3
- , Department of Fertilizers informed that the fertilizer availability remains robust as ever, and supplies continue to exceed the requirement. She also informed that the supply position continues to be strong in the states. The urea availability as on date is 73.81 LMT and the DAP availability is 23.47 LMT. For other fertilizer also the stock position is very good and this supports the strong opening position for the ongoing Kharif season.1
- జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మేడేను పురస్కరించుకొని జన్నారం మండల కేంద్రంలోని కవ్వాల్ చౌరస్తాలో హమాలీ కార్మికులు మేడే జెండాను ఎగరవేశారు అలాగే సిపిఎం, సిఐటియు, అనుబంధ సంఘాల నాయకులు స్థానిక మార్కెట్ కమిటీ, బస్టాండ్ ల వద్ద మేడే జెండాలను ఎగురవేశారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో కార్మిక హక్కులను కాపాడుకుందామని వారన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.1
- రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ ఛాంపియన్‌గా కరీంనగర్ జిల్లా జట్టు మంచిర్యాల రామకృష్ణాపూర్‌లో ముగిసిన అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ ఫుట్‌బాల్ లీగ్ ఫైనల్‌లో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌పై 1-0తో ఘనవిజయం క్రీడాకారిణులను అభినందించిన రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ కోశాధికారి / ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ W. గణపతి గారు , జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు నాయుడు గారు ,జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు W. వెంకట రావు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ వేదికగా గత మూడు రోజులుగా (ఏప్రిల్ 27 నుండి 29 వరకు) అత్యంత ఉత్సాహంగా సాగిన రాష్ట్ర స్థాయి అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ ఫుట్‌బాల్ లీగ్ బుధవారం ఘనంగా ముగిసింది. డీఎఫ్ఏ (DFA) ఆదిలాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో కరీంనగర్ జిల్లా జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి ఛాంపియన్‌షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితమైన ఫైనల్ పోరు నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కరీంనగర్ జిల్లా జట్టు, రంగారెడ్డి జిల్లాకు చెందిన బలమైన హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ జట్టుతో తలపడింది. ఆట ఆరంభం నుండే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే, కరీంనగర్ క్రీడాకారిణులు వ్యూహాత్మకంగా ఆడి 1-0 గోల్ తేడాతో విజయం సాధించి రాష్ట్రస్థాయిలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ రన్నరప్‌గా నిలిచింది. ప్రముఖుల అభినందనలు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన కరీంనగర్ జట్టును రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ కోశాధికారి / ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ W. గణపతి గారు , జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు నాయుడు గారు, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు W. వెంకట రావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరీంనగర్ క్రీడాకారిణులు ప్రదర్శించిన క్రమశిక్షణ, క్రీడా స్ఫూర్తి గర్వకారణమని, రాబోయే రోజుల్లో వీరు జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. హెడ్ కోచ్ W. విజయ్ మరియు అసిస్టెంట్ కోచ్ బొంతు రేవంత్ కు ప్రశంసలు జట్టును విజయపథంలో నడిపించిన హెడ్ కోచ్ W. విజయ్ గారిని మరియు అసిస్టెంట్ కోచ్ బొంతు రేవంత్ గారి కృషిని అసోసియేషన్ సభ్యులు కొనియాడారు. క్రీడాకారుల నిరంతర శ్రమ, క్రమశిక్షణ మరియు సరైన శిక్షణ వల్లే ఈ విజయం సాధ్యమైందని హెడ్ కోచ్ W. విజయ్ గారు సంతోషం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ప్రోత్సాహంతో ఈ విజయాన్ని సాధించారని తెలిపిన జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులు1
- కరీంనగర్ నగరంలోని శుభాష్ నగర్‌లో ఉన్న కార్మిక సంఘ కార్యాలయంలో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం (BRTU) ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం సంఘం అధ్యక్షులు బొంకూరి రాములు ఆధ్వర్యంలో జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ MLC నరదాసు లక్ష్మణ్ రావు, BRS మాజీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ మే డే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, కార్మికుల హక్కుల పరిరక్షణలో BRS పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం సంఘం అధ్యక్షులు బొంకూరి రాములు మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికులు తప్పనిసరిగా లేబర్ కార్డులు తీసుకోవాలని సూచించారు. సంఘాలకు సంబంధం లేని వ్యక్తులు లేబర్ కార్డులు ఇప్పిస్తామని చెప్పి కార్మికులను మోసం చేసే అవకాశమున్నందున అలాంటి వ్యక్తులను నమ్మవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో BRS మైనారిటీ నాయకులునాఇమ్,మొబీన్,BRS విద్యార్థి నాయకులు, బొంకూరి మెహన్, భావన నిర్మాణ సంఘం సభ్యులు పులిపాక లక్ష్మణ్, కొమ్ము రమేష్, నీర్ల శ్రీనివాస్, గంగాధర శంకర్, ఆశీర్వాదం, మొదుంపెల్లి శంకరయ్య, గంట లక్ష్మణ్, చిప్ప శ్రీనివాస్, బత్తుల అనిల్ రాజ్ పాల్గొన్నారు.1