logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరీంనగర్ జిల్లా// తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం డివైడర్ను ఢీకొట్టిన తార్ వాహనం, వ్యక్తి మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు కరీంనగర్ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ఘటన

5 hrs ago
user_OM NAMSHIVAYA
OM NAMSHIVAYA
Karimnagar, Telangana•
5 hrs ago

కరీంనగర్ జిల్లా// తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం డివైడర్ను ఢీకొట్టిన తార్ వాహనం, వ్యక్తి మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు కరీంనగర్ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ఘటన

More news from తెలంగాణ and nearby areas
  • హుస్నాబాద్ పట్టణంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి పలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పోచమ్మ తల్లి ఆలయ ప్రతిష్టాపనలో సతీసమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణంలో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బైండ్ల పంబాల కళాకారులతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు. జమదగ్ని మహర్షితో ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా ప్రారంభమైన జాతర ఉత్సవాలు నెలరోజుల పాటు కొనసాగనున్నాయి. తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తారని నిర్వాహకులు తెలిపారు.
    1
    హుస్నాబాద్ పట్టణంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి పలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పోచమ్మ తల్లి ఆలయ ప్రతిష్టాపనలో సతీసమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణంలో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బైండ్ల పంబాల కళాకారులతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు. జమదగ్ని మహర్షితో ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా ప్రారంభమైన జాతర ఉత్సవాలు నెలరోజుల పాటు కొనసాగనున్నాయి. తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తారని నిర్వాహకులు తెలిపారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
  • కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ అయిపోయి స్కూల్ సమీపంలో రోడ్డుపై ఆగిపోయిన టాక్టర్ ను పల్సర్ బైక్ ఢీ కొట్టింది. బైకిస్ట్ గోడ మహేష్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొండరాజుపల్లి కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తుండగా రోడ్డుపై నిలిచిపోయిన ట్రాక్టర్ ను వెనుక నుంచి బైక్ ఢీ కొట్టడంతో బైకిస్ట్ మహేష్ బైక్ పైనే ప్రాణాలు కోల్పోయారు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు దగ్గేవని స్థానికులు భావిస్తున్నారు.
    2
    కరీంనగర్ జిల్లా చిగురుమామిడి  మండలం చిన్నముల్కనూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ అయిపోయి స్కూల్ సమీపంలో రోడ్డుపై ఆగిపోయిన టాక్టర్ ను పల్సర్ బైక్ ఢీ కొట్టింది. బైకిస్ట్ గోడ మహేష్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొండరాజుపల్లి కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తుండగా రోడ్డుపై నిలిచిపోయిన ట్రాక్టర్ ను వెనుక నుంచి బైక్ ఢీ కొట్టడంతో బైకిస్ట్  మహేష్ బైక్ పైనే ప్రాణాలు కోల్పోయారు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు దగ్గేవని స్థానికులు భావిస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ మేడే 140 కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపునిచ్చారు.
    3
    రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ మేడే 140 కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపునిచ్చారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    7 hrs ago
  • Post by Venu Gopal
    1
    Post by Venu Gopal
    user_Venu Gopal
    Venu Gopal
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    19 hrs ago
  • :* కార్మిక చట్టాల సవరణలపై సీఫీఐ గళం: బెల్లంపల్లిలో 141వ మేడే ఘనం *బెల్లంపల్లి:* భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో 141వ మేడే [కార్మిక దినోత్సవం] వేడుకలు కామ్రేడ్ బాసెట్టి గంగారం పేరుతో ఉన్న విజ్ఞాన భవనంలో ఘనంగా జరిగాయి. బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి జెండా ఆవిష్కరించారు. మాట్లాడుతూ 1886లో చికాగో అమరవీరులు 12 గంటల పనివిధానాన్ని రద్దు చేసి 8 గంటల పని కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడులుగా కుదించి కార్మికులకు తీరని అన్యాయం చేస్తోందని, దీనిని సీఫీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని, ప్రజలపై భారం మోపే విధానాలను మార్చుకోవాలని, అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సీఫీఐ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలో వివిధ వార్డుల్లో మేడే పతాకావిష్కరణలు జరిగాయి: - *భగత్‌సింగ్ విగ్రహం:* నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్ - *రైల్వే స్టేషన్:* రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ - *శాంతిఖని:* గౌతూరి కిష్టయ్య - *9వ వార్డు రైల్వే స్టేషన్:* అక్కేపల్లి బాపు - *26వ వార్డు:* కాసిపేట స్వర్ణలత - *పాత బస్టాండ్:* బొల్లం తిలక్ అంబేద్కర్ - *అశోక్ నగర్:* జూపాక కొమురయ్య - *సింగరేణి హాస్పిటల్:* డాక్టర్ శ్రీధర్ సింగరేణి హాస్పిటల్‌లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిప్ప నరసయ్య, దాసరి తిరుపతి గౌడ్, బొంతల లక్ష్మీనారాయణ, రత్నం రాజం, జీ.సీ మాణిక్యం, కొంకుల రాజేష్, మీనుగు లక్ష్మీనారాయణ, మంతెన రమేష్, బియ్యాల ఉపేందర్, బొంకూరి రాంచందర్, బొల్లం సోని తదితరులు పాల్గొన్నారు
    1
    :* కార్మిక చట్టాల సవరణలపై సీఫీఐ గళం: బెల్లంపల్లిలో 141వ మేడే ఘనం
*బెల్లంపల్లి:* భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో 141వ మేడే [కార్మిక దినోత్సవం] వేడుకలు కామ్రేడ్ బాసెట్టి గంగారం పేరుతో ఉన్న విజ్ఞాన భవనంలో ఘనంగా జరిగాయి. 
బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి జెండా ఆవిష్కరించారు. మాట్లాడుతూ 1886లో చికాగో అమరవీరులు 12 గంటల పనివిధానాన్ని రద్దు చేసి 8 గంటల పని కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడులుగా కుదించి కార్మికులకు తీరని అన్యాయం చేస్తోందని, దీనిని సీఫీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని, ప్రజలపై భారం మోపే విధానాలను మార్చుకోవాలని, అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
సీఫీఐ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలో వివిధ వార్డుల్లో మేడే పతాకావిష్కరణలు జరిగాయి:
- *భగత్‌సింగ్ విగ్రహం:* నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్
- *రైల్వే స్టేషన్:* రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ 
- *శాంతిఖని:* గౌతూరి కిష్టయ్య
- *9వ వార్డు రైల్వే స్టేషన్:* అక్కేపల్లి బాపు
- *26వ వార్డు:* కాసిపేట స్వర్ణలత
- *పాత బస్టాండ్:* బొల్లం తిలక్ అంబేద్కర్
- *అశోక్ నగర్:* జూపాక కొమురయ్య
- *సింగరేణి హాస్పిటల్:* డాక్టర్ శ్రీధర్
సింగరేణి హాస్పిటల్‌లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. 
కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిప్ప నరసయ్య, దాసరి తిరుపతి గౌడ్, బొంతల లక్ష్మీనారాయణ, రత్నం రాజం, జీ.సీ మాణిక్యం, కొంకుల రాజేష్, మీనుగు లక్ష్మీనారాయణ, మంతెన రమేష్, బియ్యాల ఉపేందర్, బొంకూరి రాంచందర్, బొల్లం సోని తదితరులు పాల్గొన్నారు
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    1 hr ago
  • డివైడర్ను ఢీకొట్టిన తార్ వాహనం, వ్యక్తి మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు కరీంనగర్ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ఘటన
    2
    డివైడర్ను ఢీకొట్టిన తార్ వాహనం, వ్యక్తి మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు 
కరీంనగర్ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ఘటన
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    5 hrs ago
  • ధాన్యం కొనుగోలులో జాప్యం లేకుండా, రైతులు ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ప్రతి కొనుగోలు సెంటర్ కు మండల స్థాయి అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి, కొహెడ మండలాల్లో పర్యటించిన మంత్రి పొన్నం అధికారులు, పార్టీ శ్రేణులతో వెర్వేరుగా సమావేశమై ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పై సమీక్షించారు. ధాన్యం కొనుగోలు, వేసవిలో మంచినీటి ఎద్దడి, స్థానిక సమస్యలపై అధికారులకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించి ఎక్కడ రైతులు ఇబ్బంది పడకుండా పర్యవేక్షించాలని సూచించారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా ధాన్యం కొనుగోలు మొదలయ్యిందని ట్రాన్స్ పోర్ట్ సమస్య లేకుండా మిల్లర్లు కొర్రీలు పెట్టకుండా జిల్లా కలెక్టర్ లు రైస్ మిల్లర్లతో మాట్లాడుతారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో గ్రామ కార్యదర్శి, జిపివో, వారికి తోడుగా పార్టీ కమిటీ మండల స్థాయిలో తహశీల్దార్ ఎంపిడివో, ఏవో లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా స్థాయిలో డిఎస్వో, డిపివో, జిల్లా వ్యవసాయ అధికారి పర్యవేక్షిస్తు ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాలని మీ పరిధిలో పరిష్కారం కాకుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. తనకేం సంబంధం లేనట్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సీరియస్ గా చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు తోపాటు గ్రామాల్లో ఈ వేసవిలో ఎక్కడ మంచినీటి సమస్య తలెత్తకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇప్పటికి పనులు ప్రారంభించని వారి ఇళ్ళను రద్దు చేసి కొత్తవారిని ఎంపిక చేయాలని ఆదేశించారు.
    2
    ధాన్యం కొనుగోలులో జాప్యం లేకుండా, రైతులు ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ప్రతి కొనుగోలు సెంటర్ కు మండల స్థాయి అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి, కొహెడ మండలాల్లో పర్యటించిన మంత్రి పొన్నం అధికారులు, పార్టీ శ్రేణులతో వెర్వేరుగా సమావేశమై ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పై సమీక్షించారు. ధాన్యం కొనుగోలు, వేసవిలో మంచినీటి ఎద్దడి, స్థానిక సమస్యలపై అధికారులకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించి ఎక్కడ రైతులు ఇబ్బంది పడకుండా పర్యవేక్షించాలని సూచించారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా ధాన్యం కొనుగోలు మొదలయ్యిందని ట్రాన్స్ పోర్ట్ సమస్య లేకుండా మిల్లర్లు కొర్రీలు పెట్టకుండా జిల్లా కలెక్టర్ లు రైస్ మిల్లర్లతో మాట్లాడుతారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో గ్రామ కార్యదర్శి, జిపివో, వారికి తోడుగా పార్టీ కమిటీ మండల స్థాయిలో తహశీల్దార్ ఎంపిడివో, ఏవో లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా స్థాయిలో డిఎస్వో, డిపివో, జిల్లా వ్యవసాయ అధికారి పర్యవేక్షిస్తు ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాలని మీ పరిధిలో పరిష్కారం కాకుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. తనకేం  సంబంధం లేనట్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సీరియస్ గా చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు తోపాటు గ్రామాల్లో ఈ వేసవిలో ఎక్కడ మంచినీటి సమస్య తలెత్తకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇప్పటికి పనులు ప్రారంభించని వారి ఇళ్ళను రద్దు చేసి కొత్తవారిని ఎంపిక చేయాలని ఆదేశించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    16 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దత్తత దేవాలయమైన నాంపల్లి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిదే వైశాఖ శుద్ధ చతుర్దశి గురువారం సందర్భంగా విశేష కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం 6.30 గంటలకు అభిషేకం, బలిహరణం నిర్వహించగా, ఉదయం 10.30 గంటలకు శ్రీ భూనీలా సమేత లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నివేదన, తీర్థప్రసాదాల పంపిణీ చేశారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం పూర్ణాహుతి, బలిహరణం, మంగళాశాసనం, తీర్థప్రసాద కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో కన్యాదాతలుగా రాచకొండ రామాచార్యులు, సంధ్య పాల్గొనగా, కళ్యాణోత్సవ దాతలుగా కరీంనగర్‌కు చెందిన కోటోజు శ్రీనివాస్, సుష్మ సేవలు అందించారు.ఆలయ అర్చకులు, వేద పండితులు అంగరంగ వైభవంగా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీడ టెంట్లు, కూలర్లు, చల్లని నీటి పందిళ్లు ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణ మండపాన్ని రంగురంగుల పూలతో అలంకరించి, గ్రీన్ మ్యాట్స్, అరటి తోరణాలు, మామిడి ఆకులతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఆమె కళ్యాణోత్సవంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దత్తత దేవాలయమైన నాంపల్లి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిదే వైశాఖ శుద్ధ చతుర్దశి గురువారం సందర్భంగా విశేష కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఉదయం 6.30 గంటలకు అభిషేకం, బలిహరణం నిర్వహించగా, ఉదయం 10.30 గంటలకు శ్రీ భూనీలా సమేత లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నివేదన, తీర్థప్రసాదాల పంపిణీ చేశారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.
సాయంత్రం పూర్ణాహుతి, బలిహరణం, మంగళాశాసనం, తీర్థప్రసాద కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో కన్యాదాతలుగా రాచకొండ రామాచార్యులు, సంధ్య పాల్గొనగా, కళ్యాణోత్సవ దాతలుగా కరీంనగర్‌కు చెందిన కోటోజు శ్రీనివాస్, సుష్మ సేవలు అందించారు.ఆలయ అర్చకులు, వేద పండితులు అంగరంగ వైభవంగా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీడ టెంట్లు, కూలర్లు, చల్లని నీటి పందిళ్లు ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణ మండపాన్ని రంగురంగుల పూలతో అలంకరించి, గ్రీన్ మ్యాట్స్, అరటి తోరణాలు, మామిడి ఆకులతో సుందరంగా తీర్చిదిద్దారు.
ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఆమె కళ్యాణోత్సవంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.