తుష్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థినులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ పాడేరు పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం బోదులూరు గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో తుష్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ (3898/90) సహకారంతో మొత్తం 56 మంది విద్యార్థినులకు పరీక్షలు రాయడానికి అవసరమైన ప్యాడ్లు, పెన్నులు, స్కేల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బంగారు వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థినులు అందరూ శ్రద్ధగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం చిన్నవీరభద్రం మాట్లాడుతూ ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థినులకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. మొదటి బహుమతిగా రూ.2000, రెండో బహుమతిగా రూ.1000, మూడో బహుమతిగా రూ.500 ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బోదులూరు గ్రామ యూత్ లీడర్ వీరవతుల నవకాంత్, ప్రధానోపాధ్యాయులు అరుణకుమారి, డిప్యూటీ ప్రధానోపాధ్యాయులు విశ్వేశ్వరావు, పీడీ లక్ష్మణ్, పాఠశాల ఉపాధ్యాయులు, సీనియర్ రికార్డ్ అసిస్టెంట్ గురుమూర్తి, ఏఎన్ఎమ్ మేడం తదితరులు పాల్గొన్నారు.

- అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రం. అడవుల్లో ఆదివాసీల ఆర్తనాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. వాకపల్లి ఘటన జరిగి నేటికి 18 ఏళ్లు గడిచినా, ఆ బాధ ఇప్పటికీ తగ్గలేదు. న్యాయం కోసం పోరాడిన ఆదివాసి మహిళల కన్నీటి గాధ ఇప్పటికీ సమాజ మనసులను కదిలిస్తోంది. చిన్న ఊరైన వాకపల్లి, కానీ అక్కడ జరిగిన ఘటన మాత్రం పెద్ద గాయంగా మారింది. అప్పట్లో జరిగిన ఆ దారుణం ఆదివాసి మహిళల జీవితాలను కలచివేసింది. న్యాయం కోసం వారు ఎన్నో సంవత్సరాలుగా కోర్టుల తలుపులు తట్టినా, సమాజం మాత్రం వారి కన్నీళ్లకు తగిన విలువ ఇవ్వలేదనే ఆవేదన ఇంకా ఉంది. వాకపల్లి ఘటన ఒక గ్రామానికే పరిమితమైన విషయం కాదు; అది ఆదివాసి మహిళల గౌరవం, హక్కులు, న్యాయం కోసం జరిగిన దీర్ఘ పోరాటానికి ప్రతీకగా నిలిచింది. అడవుల్లో నివసించే ఆదివాసీల అర్థనాదాలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. నేటికీ వాకపల్లి ఒక ముగియని కథగా మిగిలిపోయింది. ఆ గ్రామం చిన్నదైనా, అక్కడి గాయం మాత్రం పెద్దది. ఆ గాయానికి నిజమైన న్యాయం జరిగే వరకు ఆదివాసీల మనసుల్లోని బాధ తీరదని స్థానికులు చెబుతున్నారు.1
- Post by Shyam1
- డుంబ్రిగూడ మండలంలోని చాపరాయిలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. డుంబ్రిగూడకు చెందిన రామారావు విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంలో ఇంటికి వెళ్తుండగా ఆటో ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామారావుకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆయనను డుంబ్రిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి మెరుగైన చికిత్స నిమిత్తం అరకులోయ ఏరియా ఆసుపత్రికి అందించారు.1
- ट्रम्प का बड़ा दावा ईरान कर देगा सरेंडर1
- పార్వతీపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం ఆమిటి జంక్షన్లో అదుపుతప్పి కారు చెట్టుకు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయనగరం నుండి ఒడిశా గుమడ గ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు అనిల్ జైన్ గా గుర్తించారు. భార్య జ్యోతి జైన్, డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.3
- రామభద్రపురంలో యాక్సిడెంట్.. క్షతగాత్రుల వివరాలు1
- తన కళ్ళెదురుగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తన మానవత్వాన్ని చాటుకున్నారు.బుధవారం మండపేట నుండి ద్వారపూడి వైపు వెళుతున్న ఆటో, ద్వారపూడి నుండి మండపేట వస్తున్న మోటార్ సైకిల్ తాపేశ్వరం మలుపులో రెండూ ఒకదానినొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు ఆటో పల్టీ కొట్టింది. దీంతో ఆటో లో వెళుతున్న ఆరుగురు, మోటార్ సైకిల్ పై వస్తున్న ఇద్దరూ గాయాలపాలయ్యారు. సరిగ్గా అదే సమయంలో అటుగా వస్తున్న ఎమ్మెల్యే వేగుళ్ళ ఈ ప్రమాదాన్ని చూసి వెంటనే స్పందించారు. మరో ఆలోచన లేకుండా క్షతగాత్రులను తన కార్ లో మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వేగుళ్ళ సేవాభావాన్ని పలువురు ప్రశంసించారు.1
- పెదబయలు మండలంలోని గల్లెల, గోమంగి, కిముడుపల్లి పంచాయతీల పరిధిలోని గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై షెడ్యూల్డ్ ప్రాంతాల్లో స్థానిక ఆదివాసీలకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించేలా ప్రత్యేకంగా షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామక చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ అల్లూరి సీతారామరాజు జిల్లా చైర్మన్ రామారావు దొర మాట్లాడుతూ, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఆదివాసీలకు పూర్తిగా అమలు కావాలని, స్థానికులకు న్యాయం జరిగే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు1