Shuru
Apke Nagar Ki App…
వేంసూర్ లో పిడమర్తి పర్యటన పలువురిని కలిసిన మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి వేంసూరు మండలం లో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి పర్యటించారు ఈరోజు పిడమర్తి పలువురు నేతలను కలిశారు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు సత్తుపల్లి నియోజకవర్గం లో పర్యటన సందర్భంగా పిడమర్తి రవి ఆయా మండలాల్లో పర్యటించారు అందులో భాగంలో వేంసూరు లోని అనేక గ్రామాల్లో ఆయన ఈరోజు పర్యటించారు పలువురు నేతలను కలిసి ముచ్చటించారు
Ramprasad islavath
వేంసూర్ లో పిడమర్తి పర్యటన పలువురిని కలిసిన మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి వేంసూరు మండలం లో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి పర్యటించారు ఈరోజు పిడమర్తి పలువురు నేతలను కలిశారు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు సత్తుపల్లి నియోజకవర్గం లో పర్యటన సందర్భంగా పిడమర్తి రవి ఆయా మండలాల్లో పర్యటించారు అందులో భాగంలో వేంసూరు లోని అనేక గ్రామాల్లో ఆయన ఈరోజు పర్యటించారు పలువురు నేతలను కలిసి ముచ్చటించారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- గుంటూరు: ప్రత్తిపాడులో అంకమ్మ గుడి సెంటర్ వద్ద ఆర్టీసీ బస్సు టైర్ క్రింద మహిళ పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.ఈ సంఘటనలోరెండు కాళ్లు నుజ్జునుజ్ అయ్యాయి.ప్రత్తిపాడు మిరపకాయలకు కూలి పని చేసుకుని బస్సు ఎక్కే క్రమంలో జారిపడి ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురి అయిన మహిళ పెదనందిపాడు కు చెందిన బొమ్మతోటి సౌదామని అనే మహిళ గా గుర్తించారు.1
- ఈరోజు సుధనపల్లి గ్రామంలో Arrive Alive మరియు 'మన ఊరు మన బాధ్యత' సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డాక్టర్ శభాష్ పి ఐ పి ఎస్ గారు, తొర్రూర్ డిఎస్పి కృష్ణ కిషోర్ గారు మరియు మరిపెడ సిఐ పవన్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది.. ఈ సందర్భంగా ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ మన ఊరు మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసుకున్న సుదనపల్లి గ్రామంలో మూడు తీర్మానాలు 1. రోడ్డు భద్రతలో భాగంగా గ్రామంలో ఉన్న ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం 2. గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయించడం 3. గ్రామాన్ని గంజాయి రైతు గ్రామంగా తీర్చిదిద్దడం పై అంశాల గురించి గ్రామస్తులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ద్విచక్ర వాహనదారులకు 150 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ నీలం వెంకన్న మరియు ఉపసర్పంచ్ పాలకవర్గం ను ఎస్పీ గారు అభినందించారు, అలాగే గ్రామంలో గంజాయి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని గంజాయి సేవిస్తున్నట్టుగాని రవాణా చేస్తున్న సమాచారం తెలిస్తే వెంటనే 87126 56 99 9 ఇంటి నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందిస్తే 5000 వరకు బహుమతి అందజేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అలాగే గ్రామంలోని యువతకి పిల్లలకి ఎస్పి గారు స్పోర్ట్స్ కిట్ ను అందజేయడం జరిగింది అలాగే గ్రామంలో ఉన్న సైకిల్ కి సైకిల్ ముందు వెనక రేడియం స్టిక్కర్లు అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జిల్లా ఎస్పీ గారు చేసిన సూచనలను పాటిస్తామని విలేజ్ ని గంజాయి రైతు గ్రామంగా మారుస్తామని నిర్ణయించడం జరిగింది.1
- SIR ట్రైనింగ్ ప్రోగ్రామ్ అమరావతి: ఎలక్షన్ కమిషన్ తీసుకువచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో పేర్లు లేకుండా ఉండిపోతే తిరిగి పేర్లు ఓటర్ లిస్టులో రావటానికి ఏమి చేయాలో ఒక కార్యక్రమం విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మంగళవారం మెడికల్ హాల్ లో జరుగుతుందని ప్రజాసంఘాల నాయకులు కేఎంఏ సుభాన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాలు చూడగలరు. కార్యక్రమానికి వచ్చేవారు పేరు నమోదు చేసుకోగలరు.1
- నార్కట్పల్లి, ఏప్రిల్ 20: నార్కట్పల్లిలో నిన్న రాత్రి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరై లింగయ్య గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున వేలాది సంఖ్యలో తరలివచ్చారు. వీరితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, చెరుకు సుధాకర్, నోముల భగత్, నకిరేకల్ మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి హాజరయ్యారు. అంతేకాకుండా, ఈ జన్మదిన వేడుకల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పెద్ద సంఖ్యలో మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ప్రస్తుత సర్పంచులు పాల్గొని చిరుమర్తి లింగయ్య గారికి పుష్పగుచ్ఛాలు అందించి, కేక్ కట్ చేసి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానుల కోలాహలం, పటాకుల మోతతో నార్కట్పల్లి ప్రాంతం అంతా సందడిగా మారింది.1
- ప్రజాప్రస్థానం నకిరేకల్, నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన 53వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ జీవితం, ప్రజా సేవలపై స్థానికంగా చర్చలు జరుగుతున్నాయి. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో 1973 ఏప్రిల్ 20న జన్మించిన లింగయ్య చిన్ననాటి నుంచే కష్టజీవితాన్ని అనుభవిస్తూ ఎదిగారు. విద్యాభ్యాసంతో పాటు వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు తోడ్పడుతూ సామాన్య ప్రజల కష్టాలను దగ్గరగా తెలుసుకున్నారు. అంబేద్కర్, గాంధీ సిద్ధాంతాల ప్రభావంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన 1995లో ఎంపీటీసీగా, 2001లో జెడ్పీటీసీగా గెలిచి ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. 2009లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కమ్యూనిస్టుల కంచుకోటగా పేరున్న ప్రాంతంలో సంచలనం సృష్టించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రామీణ అభివృద్ధి, సీసీ రోడ్లు, చెరువుల పునరుద్ధరణ, విద్యుత్ సదుపాయాలు, తాగునీటి ప్రాజెక్టులు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేశారు. ముఖ్యంగా కృష్ణ జలాలను గ్రామాలకు అందించే ప్రయత్నాలు, ధర్మారెడ్డిపల్లి–పిల్లాయిపల్లి కాలువల పూర్తి కోసం చేసిన కృషి ప్రజల్లో ప్రశంసలు అందుకుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన తొలి నేతల్లో ఒకరిగా నిలిచారు. అనంతరం 2018 ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు. తరువాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీలో చేరి, కేటీఆర్, జగదీష్ రెడ్డి ఆశీస్సులతో నకిరేకల్ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు సాధించారు. అయిటిపాముల లిఫ్ట్, ఉదయ సముద్రం ప్రాజెక్ట్, ఆసుపత్రుల విస్తరణ, డిగ్రీ కళాశాల, మున్సిపల్ అభివృద్ధి వంటి పలు ప్రాజెక్టులను ముందుకు తీసుకువచ్చారు. 2023 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ ప్రజల మధ్యలోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నకిరేకల్ ప్రజలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు. 💐3
- హన్మకొండ నగరంలోని ఎక్సైజ్ కాలనీ పరిధిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. చింతల కల్పన ఇంటికి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న సుమారు 28 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రంజిత్ కుమార్ తెలిపారు.1
- ఈ సందర్భంగా దేవతామూర్తులకు పంచామృతాభిషేకం, బిల్వార్చన, పుష్పాలంకరణ చేయించిన తరువాత దేవాలయ ఆవరణలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రుల బృందాన్ని దేవాలయ అధికారులు స్వామి శేషవస్త్రాలతో సత్కరించి దేవతామూర్తి ప్రతిమను, చిత్రపటాలను కానుకగా అందజేశారు. వేద పండితుల చేత వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ఆలయఅభివృద్ధి పనులకు భూమిపూజ, బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.1
- పెదకూరపాడు: పోలీస్ సిబ్బంది ఉండేందుకు నిర్మించిన క్వార్టర్స్ శిథిలావస్థకు సుమారు 20 సంవత్సరాలు అయినప్పటికీ తొలగింపు చర్యలు చేపట్టలేదని స్థానికులు అన్నారు. వివిధ కేసుల నిమిత్తం స్టేషన్ వచ్చేవారికి శిథిలావస్థలో చేరిన బిల్డింగ్ నుండి విషసర్పలు సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. ఏ సమయంలో క్వార్టర్స్ పెచ్చులు ఊడి కింద పడతాయో తెలియని పరిస్థితిలో ఉన్నామన్నారు.1
- ములుగు జిల్లా:వెంకటాపురం మండల కేంద్రంలో జరిగిన పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, కాకులమర్రి ప్రదీప్ రావు, గ్రామ కమిటీ, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.1