Shuru
Apke Nagar Ki App…
హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్‌లో వేలమంది భక్తులతో హిందూ ఏక్తా యాత్ర కన్నుల పండువగా సాగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రతో నగరం కాషాయమయంగా మారింది. కులాల పేరుతో చీల్చుతున్న హిందూ సమాజాన్ని జాగృతం చేయడమే దీని ముఖ్య ఉద్దేశమని బండి సంజయ్ పేర్కొన్నారు.
K.V.REDDY
హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్‌లో వేలమంది భక్తులతో హిందూ ఏక్తా యాత్ర కన్నుల పండువగా సాగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రతో నగరం కాషాయమయంగా మారింది. కులాల పేరుతో చీల్చుతున్న హిందూ సమాజాన్ని జాగృతం చేయడమే దీని ముఖ్య ఉద్దేశమని బండి సంజయ్ పేర్కొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్‌లో వేలమంది భక్తులతో హిందూ ఏక్తా యాత్ర కన్నుల పండువగా సాగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రతో నగరం కాషాయమయంగా మారింది. కులాల పేరుతో చీల్చుతున్న హిందూ సమాజాన్ని జాగృతం చేయడమే దీని ముఖ్య ఉద్దేశమని బండి సంజయ్ పేర్కొన్నారు.2
- కరీంనగర్‌లో బీఆర్ఎస్ నేతలు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసులో అరెస్టు ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. పోలీసులు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆరోపించిన బీఆర్ఎస్, అసలు కేసును దారి మళ్లించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించింది. బండి సంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేసి, తన కుమారుడిని పోలీసులకు అప్పగించాలని డిమాండ్ చేసింది.1
- ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు... భక్తులతో కిరికిరిసిన ఆలయాలు.. గన్నేరువరం: మండలంలోని మైలారం మల్లికార్జున స్వామి ఆలయాలలో హనుమాన్ జయంతి వేడుకలు ధ్యాన ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా స్వామి వారికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. శ్రీరామ నామ స్మరణతో భక్తి పారవర్షం ఉప్పొంగింది. ఆలయ కమిటీ చైర్మన్ వరాల పరశురాములు మాట్లాడుతూ దాతల సహకారంతో 21 రోజు భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేపట్టామని అన్నారు ఆలయానికి వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాటు చేశామని కమిటీ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో అక్కనపెల్లి రాజేష్ విజయ్ మసాలా, జక్కన్న పెళ్లి సత్తయ్య, నూకల తిరుపతి, బద్ధం శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.1
- కేంద్ర మంత్రి బండి సంజయ్ విచారణ ఎదుర్కొని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని చెప్పడం జరిగింది..*మంత్రి పొన్నం ప్రభాకర్* బండి సంజయ్ కుమారుడి కేసులో బాధితురాలికి న్యాయం చేయాలని బాధితురాలికి న్యాయం చేసే అంశమే నిన్న నేను మాట్లాడాను.. నా మాటలు వక్రీకరించారు.. అందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ విచారణ ఎదుర్కొని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని చెప్పడం జరిగింది.. ఇందులో మున్నూరు కాపు సంఘాలు కాంగ్రెస్ పార్టీ కక్ష పూరితంగా చేస్తున్నారని అమ్మాయి కూడా అదే సామాజిక వర్గం అని చెప్పడం జరిగింది.. మీరు ఏం చేస్తారో పెళ్ళా అనే కంటెంట్ వాడను తప్ప నా ఉదేశ్యంలో బాధితురాలికి అన్యాయం జరగాలనే , వారికి న్యాయం జరగాలి ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు.. బాధితురాలికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.. వారికి పూర్తిగా మద్దతుగా ఉంటాం.. బాధితురాలికి న్యాయం జరగాల్సిందే న్యాయం కోసం పోరాడతాం1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెద్ద బోనాల గ్రామంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా చందనోత్సవం, పూజలు, యజ్ఞం నిర్వహించి, భారీ ఎత్తున మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కౌన్సిలర్‌తో పాటు పలువురు ప్రముఖులు, గ్రామస్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.3
- వరంగల్ జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో 'జై శ్రీరామ్' నామస్మరణ మారుమోగుతూ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.1
- జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో మూడు రోజుల హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు; ఆలయ పరిసరాలు భక్తి పారవశ్యంతో నిండిపోయాయి. ఈ మహోత్సవాలు భక్తులలో అపార భక్తి భావాన్ని నింపి ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచాయి.1
- కొడుకు తప్పు చేయలేదు... అయినా కొడుకును సమర్థించడం లేదు...కోర్టు నిర్ణయానికి శిరసావహిస్తాం... తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే - కేంద్ర మంత్రి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన కొడుకు బండి సాయిభగీరథ పై వస్తున్న ఆరోపణలు విమర్శలపై స్పందించారు. తన కొడుకు తప్పు చేయలేదని కొందరు క్రిమినల్ గా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కొడుకును సమర్థించకుండా చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తామని, కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తామన్నారు. తప్పు చేస్తే శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. కరీంనగర్ లో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రను హంపి పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారత స్వామి సమక్షంలో సంజయ్ ప్రారంభించి యాత్ర ఉద్దేశాన్ని వివరిస్తూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కొడుకుపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. నా టైమంతా సమాజానికే ఇచ్చానని, నా కొడుకుకు టైమియ్యలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకును క్రిమినల్ గా చూపే ప్రయత్నం చేస్తున్నారని, ఏ తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడని తెలిపారు. అయినా నా కొడుకును సమర్ధించకుండా విచారణకు సహకరిస్తున్నామని తెలిపారు. నా కొడుకుకు టైమివ్వకుండా నేను తప్పు చేశానని, తప్పు నాదే, నన్ను క్షమించండని కోరారు. తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడు... నిరూపించుకోవాలని చెప్పినానని తెలిపారు. నా చివరి శ్వాస వరకు హిందూ ధర్మం కోసమే పనిచేస్తానని, తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టం ముందు సమానమేనని స్పష్టం చేశారు. తన కొడుకు తప్పు చేస్తే శిక్ష పడాల్సిందేనని చట్టం ఎవరికి చుట్టం కాదన్నారు. సమాజంలో చట్టం అందరికీ సమానమేనని తెలిపారు. నేను ఏ దారిలో వెళ్తే అదే దారిలో నా భార్య నడుస్తుందని, కొందరు చేసే ఆరోపణ విమర్శలతో ఒక తల్లిగా తన భార్య ఎంత బాధ పడుతుందో తెలుసా? అని ప్రశ్నించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కొందరు చేసే మాటల దాడితో తన కుటుంబం డిప్రెషన్ గురవుతుందన్నారు. గత పాలకుల వైఖరితో 29 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోయారు, అప్పుడు ఆ తల్లుల బాద నేడు విమర్శించే వారికి కనబడలేదా వినబడలేదా అని ప్రశ్నించారు. వారందరిని సమకూర్చుతా, విమర్శలు చేసే వారి సంగతేంటో తేలుస్తానని హెచ్చరించారు. శ్రీరామచంద్రుడికే కష్టాలు తప్పలేదు ప్రస్తుతం తనకు ఎదురవుతున్న ఇబ్బందులు ఎంత? అన్నారు. కుట్రలు కుతంత్రాలతో తన కుటుంబాన్ని బజారుకీడ్చిన ఏ ఒక్కరిని వదిలిపెట్టనని చెప్పారు. బండి సంజయ్ బాధపడడం కొత్తేమి కాదన్నారు. దుష్ప్రచారాన్ని నమ్మకండని కోరారు. భయపడేవాడు బాధపడే వాడు హిందువే కాదన్నారు. రాజకీయం కోసమో ఓట్ల కోసమో వ్యక్తుల కోసమో హిందూ ఏక్తా యాత్ర నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. దేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. కులాల పేరుతో వర్గాల పేరుతో హిందూ సమాజాన్ని చీల్చుతున్నారని, మెజార్టీగా ఉన్న హిందువులు మైనార్టీలుగా మారే ప్రమాదం ఉందన్నారు. హిందువులను జాగృతం చేసేందుకే హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.4