logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ములుగు జిల్లా ప్రగతిలో జర్నలిస్టుల పాత్ర కీలకం: సీతక్క ములుగు జిల్లా అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని మంత్రి సీతక్క అన్నారు. పాత డీపీఆర్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా విభాగాన్ని ప్రారంభించారు. నిత్యం ప్రజా సమస్యలను వెలికితీస్తూ సమాజంలో చైతన్యం నింపుతున్న ములుగు ప్రాంత జర్నలిస్టులు వృత్తి పరంగా మరింత రాణించాలని సీతక్క అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి సహకారం అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు మంత్రిని సన్మానించారు.

50 min ago
user_Mana Mulugu News
Mana Mulugu News
ములుగు, ములుగు, తెలంగాణ•
50 min ago
a0c243cd-0b30-44b6-a8a1-f3b45b94751a
325d7e80-8da3-4b13-9910-0588c9fa8530
26e3d4bc-2f4c-4f39-84e0-020232ba9f23

ములుగు జిల్లా ప్రగతిలో జర్నలిస్టుల పాత్ర కీలకం: సీతక్క ములుగు జిల్లా అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని మంత్రి సీతక్క అన్నారు. పాత డీపీఆర్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా విభాగాన్ని ప్రారంభించారు. నిత్యం ప్రజా సమస్యలను వెలికితీస్తూ సమాజంలో చైతన్యం నింపుతున్న ములుగు ప్రాంత జర్నలిస్టులు వృత్తి పరంగా మరింత రాణించాలని సీతక్క అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి సహకారం అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు మంత్రిని సన్మానించారు.

More news from తెలంగాణ and nearby areas
  • ములుగు కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు' పాల్గొన్న మంత్రి సీతక్క ములుగు జిల్లాలోని ఘట్టమ్మ సమీపంలో గల కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సీతక్కకు జిల్లా కలెక్టర్ బోర్కాడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపిఎస్ స్వాగతం పలికారు. మంత్రి సీతక్క ముందుగా మహనీయులకు పూలమాలలు వేసి తెలంగాణ గీతం ఆలాపన అనంతరం పోలీసు గౌరవనీయులు స్వీకరించారు.జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాలపన చేశారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై సీతక్క ప్రసంగం అనంతరం 265 స్వయం సహాయక సంఘాలకు 22 కోట్ల 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. *ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ...* తెలుగు ప్రజలందరికీ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మేము నూతన ములుగు జిల్లా కార్యాలయంలో ఘనంగా, సగర్వంగా మన జాతీయ జెండాను ఎగరవేసుకున్నామని,నిజాం పాలనలో విడిగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం ఆనాడు మన ప్రథమ ప్రధాని నెహ్రూ గారి ఆదేశాల అనుసారం, ఉప ప్రధానిగా, హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి హోంశాఖ మంత్రిగా ఆనాడు తెలంగాణ భారతదేశంలో భాగమైందని,విముక్తి కోసం, విమోచనం కోసం, విలీనం కోసం అనేక పోరాటాలు, 'భూమి, భుక్తి, విముక్తి' అని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలు, కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వంలో పెద్ద ఎత్తున జరిగాయని, ఆ పోరాటంలో వేలాది మంది బిడ్డలు కులమత రహితంగా తమ ప్రాంత విముక్తి కోసం, విలీనం కోసం, విమోచనం కోసం పోరాటం చేసి, ఈ పీడన అంతం కావాలి, మనం కూడా స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాలని ఆరోజు పెద్ద ఎత్తున పోరాటం జరిగిందని,ఆ పోరాటాన్ని చూసినటువంటి ఆనాటి ప్రధాని నెహ్రూ గారు భారతదేశంలో తెలంగాణను విలీనం చేసి, నేటికి 78 సంవత్సరాలు పూర్తయి, 79వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంస్కరణలు పెద్ద ఎత్తున మన తెలంగాణ ప్రాంతం సాధించడం జరిగిందని,ఆ తర్వాత ఆంధ్ర-తెలంగాణ ఉద్యమాలు, వాటి పోరాటాల ఫలితంగా మళ్లీ సోనియమ్మ నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి సారథ్యంలో తెలంగాణకు సంపూర్ణమైన ప్రాంతీయ సమస్యలను కూడా తొలగించి, ప్రత్యేక రాష్ట్రంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, మంత్రి సీతక్క అన్నారు.
    1
    ములుగు కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ  ప్రజా పాలన దినోత్సవ వేడుకలు' పాల్గొన్న మంత్రి సీతక్క
ములుగు జిల్లాలోని ఘట్టమ్మ సమీపంలో గల  కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సీతక్కకు జిల్లా కలెక్టర్ బోర్కాడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపిఎస్ స్వాగతం పలికారు. మంత్రి సీతక్క ముందుగా మహనీయులకు పూలమాలలు వేసి తెలంగాణ గీతం ఆలాపన అనంతరం పోలీసు గౌరవనీయులు స్వీకరించారు.జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాలపన చేశారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై సీతక్క ప్రసంగం అనంతరం 265 స్వయం సహాయక సంఘాలకు 22 కోట్ల 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. 
*ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ...*
తెలుగు ప్రజలందరికీ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ  ఈరోజు మేము నూతన ములుగు జిల్లా కార్యాలయంలో ఘనంగా, సగర్వంగా మన జాతీయ జెండాను ఎగరవేసుకున్నామని,నిజాం పాలనలో విడిగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం ఆనాడు మన ప్రథమ ప్రధాని నెహ్రూ గారి ఆదేశాల అనుసారం, ఉప ప్రధానిగా, హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి హోంశాఖ మంత్రిగా ఆనాడు తెలంగాణ భారతదేశంలో భాగమైందని,విముక్తి కోసం, విమోచనం కోసం, విలీనం కోసం అనేక పోరాటాలు, 'భూమి, భుక్తి, విముక్తి' అని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలు, కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వంలో పెద్ద ఎత్తున జరిగాయని, ఆ పోరాటంలో వేలాది మంది బిడ్డలు కులమత రహితంగా తమ ప్రాంత విముక్తి కోసం, విలీనం కోసం, విమోచనం కోసం పోరాటం చేసి, ఈ పీడన అంతం కావాలి, మనం కూడా స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాలని ఆరోజు పెద్ద ఎత్తున పోరాటం జరిగిందని,ఆ పోరాటాన్ని చూసినటువంటి ఆనాటి ప్రధాని నెహ్రూ గారు భారతదేశంలో తెలంగాణను విలీనం చేసి, నేటికి 78 సంవత్సరాలు పూర్తయి, 79వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంస్కరణలు పెద్ద ఎత్తున మన తెలంగాణ ప్రాంతం సాధించడం జరిగిందని,ఆ తర్వాత ఆంధ్ర-తెలంగాణ ఉద్యమాలు, వాటి పోరాటాల ఫలితంగా మళ్లీ సోనియమ్మ నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి సారథ్యంలో తెలంగాణకు సంపూర్ణమైన ప్రాంతీయ సమస్యలను కూడా తొలగించి, ప్రత్యేక రాష్ట్రంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, మంత్రి సీతక్క అన్నారు.
    user_Karunya
    Karunya
    ములుగు, ములుగు, తెలంగాణ•
    4 hrs ago
  • తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న నూతన కలెక్టరేట్ ములుగు జిల్లా, సెప్టెంబర్ 16 (భారత శక్తి): నేడు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ములుగు నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
    2
    తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న నూతన కలెక్టరేట్

 ములుగు జిల్లా, సెప్టెంబర్ 16 (భారత శక్తి): నేడు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ములుగు నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
    user_KOMURAIAH ANAGANDULA
    KOMURAIAH ANAGANDULA
    ములుగు, ములుగు, తెలంగాణ•
    23 hrs ago
  • వచ్చే సంవత్సరం నాటికి అందుబాటులోకి వస్తాయి: తుమ్మల నాగేశ్వరరావు ములుగు జిల్లాలోని ఇంచెర్ల, భూపాలపల్లి జిల్లాలోని చైన్పాక ప్రాంతాల్లో ఆయిల్ పామ్ మిల్లుల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ.. వచ్చే సంవత్సరం నాటికి మిల్లులు అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ పంట సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.
    1
    వచ్చే సంవత్సరం నాటికి అందుబాటులోకి వస్తాయి: తుమ్మల నాగేశ్వరరావు 
ములుగు జిల్లాలోని ఇంచెర్ల, భూపాలపల్లి జిల్లాలోని చైన్పాక ప్రాంతాల్లో ఆయిల్ పామ్ మిల్లుల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ.. వచ్చే సంవత్సరం నాటికి మిల్లులు అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ పంట సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.
    user_Madhu
    Madhu
    కన్నాయిగూడెం, ములుగు, తెలంగాణ•
    17 hrs ago
  • హైదరాబాద్ లో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు 🤔రూమ్ ఫ్రీ. జీతం :20,000₹. below 10th. #hyderabad #security
    1
    హైదరాబాద్ లో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు 🤔రూమ్ ఫ్రీ. జీతం :20,000₹. below 10th. #hyderabad #security
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Khanapur, Warangal•
    22 hrs ago
  • fabo laundry and dry cleaning pickup and delivery fre wash&steam iron per 120 kg wash&fold 100 s team iron 100 shirt 👔 100 rs T. shart👕100 rs paint👖100 rs saree 200 rs lahanga 350 rs jacket 200 rs kurta 100 rs suaes 450 rs blanket (single )350 (double )450 rs bleizer.. 300₹ sairwani. 300₹
    4
    fabo laundry and dry cleaning 
pickup and delivery fre
wash&steam iron per 120 kg
wash&fold 100
s team iron 100
shirt  👔  100 rs
T. shart👕100 rs
paint👖100 rs
saree 200 rs
lahanga  350 rs
jacket 200 rs
kurta 100 rs
suaes 450 rs
blanket (single )350 (double )450 rs
bleizer.. 300₹
sairwani. 300₹
    user_Desh Pream
    Desh Pream
    Warangal, Telangana•
    53 min ago
  • గిరిజనుల ఆరాధ్య దైవం కేసీఆర్: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజనుల ఆరాధ్య దైవం కేసీఆర్: మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు* *కురవి:* గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన చారిత్రక నిర్ణయానికి కృతజ్ఞతగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండా గ్రామంలో *మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి ఆధ్వర్యంలో* భారీ ఎత్తున కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా *బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి చిత్రపటానికి సత్యవతి రాథోడ్ గారు పాలాభిషేకం నిర్వహించారు* అనంతరం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా *సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ...* *“గిరిజనుల ఆరాధ్య దైవం మాజీ సీఎం కేసీఆర్ గారు* గిరిజనుల ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవ భవనాలను నిర్మించడంతో పాటు, గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడం, గిరిజన బంధు, పోడు భూములకు హక్కులు కల్పించడం వంటి నిర్ణయాలు చారిత్రాత్మక ఘట్టాలు అన్నారు రాష్ట్రంలో సుమారు 45 లక్షల మంది గిరిజనులు ఉన్నారు, గిరిజనుల జీవితాల్లో సెప్టెంబర్ 17 ఒక మైలురాయిగా నిలిచింది, రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడంతో గిరిజన విద్యార్థులు, నిరుద్యోగ యువతకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో మరింత ప్రయోజనం కలిగింది *విద్య ద్వారానే వికాసం సాధ్యమని నమ్మిన కేసీఆర్ గారు దేశంలో ఎక్కడా లేని విధంగా గిరిజన గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందించారు* గిరిజన బిడ్డల భవిష్యత్తుకు బలమైన పునాది వేశారు దశాబ్దాలుగా పాలించిన ప్రభుత్వాల పాలన ఒక ఎత్తయితే, కేసీఆర్ గారి పాలన మరో ఎత్తు. గత పాలనల్లో గిరిజన ప్రాంతాల్లో కనీస వసతులు కూడా సరిగా కల్పించిన దాఖలాలు లేవు. తాగునీటి కోసం గిరిజన మహిళలు కిలోమీటర్ల దూరం నడవాల్సిన పరిస్థితులు ఉండేవి. *కేసీఆర్ గారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో 3,416 తండాలు గ్రామపంచాయతీలుగా మారాయి. గిరిజన బిడ్డలే స్థానిక పాలకులుగా ఎన్నికై తమ తండాల అభివృద్ధిలో భాగస్వాములయ్యారు* గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, గిరిజనుల ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు ఇవ్వాలి *దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ అభివృద్ధికి ఏం చేసిందో ప్రజలకు వివరించాలి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది* కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా బీఆర్ఎస్‌ను ప్రజల నుంచి దూరం చేయలేరు, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని సత్యవతి రాథోడ్ అన్నారు గిరిజనుల సంక్షేమం, ఆత్మగౌరవం, హక్కుల కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు
    1
    గిరిజనుల ఆరాధ్య దైవం కేసీఆర్: మాజీ  మంత్రి సత్యవతి రాథోడ్ 
గిరిజనుల ఆరాధ్య దైవం కేసీఆర్: మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు*
*కురవి:* గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన చారిత్రక నిర్ణయానికి కృతజ్ఞతగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండా గ్రామంలో *మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి ఆధ్వర్యంలో* భారీ ఎత్తున కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు
ఈ సందర్భంగా *బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి చిత్రపటానికి సత్యవతి రాథోడ్ గారు పాలాభిషేకం నిర్వహించారు* అనంతరం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు
ఈ సందర్భంగా *సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ...*
*“గిరిజనుల ఆరాధ్య దైవం మాజీ సీఎం కేసీఆర్ గారు* గిరిజనుల ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవ భవనాలను నిర్మించడంతో పాటు, గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడం, గిరిజన బంధు, పోడు భూములకు హక్కులు కల్పించడం వంటి నిర్ణయాలు చారిత్రాత్మక ఘట్టాలు అన్నారు
రాష్ట్రంలో సుమారు 45 లక్షల మంది గిరిజనులు ఉన్నారు, గిరిజనుల జీవితాల్లో సెప్టెంబర్ 17 ఒక మైలురాయిగా నిలిచింది, రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడంతో గిరిజన విద్యార్థులు, నిరుద్యోగ యువతకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో మరింత ప్రయోజనం కలిగింది
*విద్య ద్వారానే వికాసం సాధ్యమని నమ్మిన కేసీఆర్ గారు దేశంలో ఎక్కడా లేని విధంగా గిరిజన గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందించారు* గిరిజన బిడ్డల భవిష్యత్తుకు బలమైన పునాది వేశారు
దశాబ్దాలుగా పాలించిన ప్రభుత్వాల పాలన ఒక ఎత్తయితే, కేసీఆర్ గారి పాలన మరో ఎత్తు. గత పాలనల్లో గిరిజన ప్రాంతాల్లో కనీస వసతులు కూడా సరిగా కల్పించిన దాఖలాలు లేవు. తాగునీటి కోసం గిరిజన మహిళలు కిలోమీటర్ల దూరం నడవాల్సిన పరిస్థితులు ఉండేవి.
*కేసీఆర్ గారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో 3,416 తండాలు గ్రామపంచాయతీలుగా మారాయి. గిరిజన బిడ్డలే స్థానిక పాలకులుగా ఎన్నికై తమ తండాల అభివృద్ధిలో భాగస్వాములయ్యారు*
గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, గిరిజనుల ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు ఇవ్వాలి
*దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ అభివృద్ధికి ఏం చేసిందో ప్రజలకు వివరించాలి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది*
కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా బీఆర్ఎస్‌ను ప్రజల నుంచి దూరం చేయలేరు, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని సత్యవతి రాథోడ్ అన్నారు
గిరిజనుల సంక్షేమం, ఆత్మగౌరవం, హక్కుల కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు
    user_గొల్లపల్లి సురేష్
    గొల్లపల్లి సురేష్
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • కరీంనగర్ లో ఈనెల 23న గణేష్ నిమజ్జనోత్సవం...ఏర్పాట్లను పరిశీలించిన కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్ లో గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీగా విస్తృత ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. మానకొండూరు, చింతకుంట, కొత్తపల్లిలో వినాయక నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లను మేయర్ శ్రీనివాస్, కలెక్టర్ చిత్రా మిశ్రా సిపి గౌస్ ఆలం తో కలిసి బండి సంజయ్ పరిశీలించారు. కరీంనగర్‌ లో ఈ నెల 23న నిర్వహించనున్న వినాయక నిమజ్జనోత్సవాన్ని బ్రహ్మాండంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గతంలో నిమజ్జన సమయంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్‌, లైటింగ్‌, భారీ క్రేన్లు, పారిశుధ్యం, ట్రాఫిక్‌ నియంత్రణ తదితర సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. మానకొండూరు చెరువుతో పాటు చింతకుంట కాకతీయ కెనాల్‌, కొత్తపల్లి ప్రాంతాల్లో నిమజ్జనానికి అవసరమైన నీటిని విడుదల చేయాలని సాగునీటి శాఖ మంత్రి, ఉన్నతాధికారులను కోరినట్లు ఆయన చెప్పారు. నిమజ్జనోత్సవ సమయానికి అవసరమైన నీటిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. కరీంనగర్‌లోని సుమారు 50 శాతం వినాయక విగ్రహాలు మానకొండూరు చెరువు వద్ద నిమజ్జనం కానున్నందున అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
    1
    కరీంనగర్ లో ఈనెల 23న గణేష్ నిమజ్జనోత్సవం...ఏర్పాట్లను పరిశీలించిన కేంద్రమంత్రి బండి సంజయ్
కరీంనగర్ లో గణేష్ నిమజ్జనోత్సవానికి  పకడ్బందీగా విస్తృత ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. మానకొండూరు, చింతకుంట, కొత్తపల్లిలో వినాయక నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లను మేయర్ శ్రీనివాస్, కలెక్టర్ చిత్రా మిశ్రా సిపి గౌస్ ఆలం తో కలిసి బండి సంజయ్ పరిశీలించారు. కరీంనగర్‌ లో ఈ నెల 23న నిర్వహించనున్న వినాయక నిమజ్జనోత్సవాన్ని బ్రహ్మాండంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గతంలో నిమజ్జన సమయంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్‌, లైటింగ్‌, భారీ క్రేన్లు, పారిశుధ్యం, ట్రాఫిక్‌ నియంత్రణ తదితర సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. మానకొండూరు చెరువుతో పాటు చింతకుంట కాకతీయ కెనాల్‌, కొత్తపల్లి ప్రాంతాల్లో నిమజ్జనానికి అవసరమైన నీటిని విడుదల చేయాలని సాగునీటి శాఖ మంత్రి, ఉన్నతాధికారులను కోరినట్లు ఆయన చెప్పారు. నిమజ్జనోత్సవ సమయానికి అవసరమైన నీటిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు ఇందుకు
అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.
కరీంనగర్‌లోని సుమారు 50 శాతం వినాయక విగ్రహాలు మానకొండూరు చెరువు వద్ద నిమజ్జనం కానున్నందున అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    35 min ago
  • కార్మికుల పై నిర్భందాన్ని నిరసిస్తూ సామూహిక నిరసన దీక్ష ఈ రోజు CITU ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం లో అంబేద్కర్ విగ్రహం ముందు సామూహిక నిరసన దీక్ష చేపట్టారు.ఈ దీక్షలను రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి గారు ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ కు వెళ్లి అదనపు కలెక్టర్ మహేందర్ జి గారికి, జిల్లా ఎస్ పి కార్యాలయం లో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కార్మిక వర్గానికి అనేక హమీలు ఇచ్చి అమలు చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. స్కీం వర్కర్లఐన ఆశా, అంగన్వాడి తదితరులకు కనీస వేతనం 18 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడిచినప్పటికీ, కార్మిక వర్గానికి ఇచ్చిన హమీల అమలు పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. దీనితో కార్మిక వర్గం తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన - పోరాటాలు చేస్తుంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల్లో తీవ్ర నిర్భంధాన్ని ప్రయోగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కనీసం ధర్నా చేసుకునేందుకు కూడా అనుమతిని నిరాకరిస్తున్నారు. ఇది కార్మికుల హక్కులను అప్రాజాస్వామికంగా నిరాకరించటమేనని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని విమర్శించారు.* *2026 సెప్టెంబర్ 8,9తేదీల్లో జరిగిన అంగన్వాడీ,ఆశా రెండు సంఘాల "ఛలో హైదరాబాద్" పిలుపులను భగ్నం చేయడానికి కాంగ్రెస్ సర్కార్ పడరాని పాట్లు పడింది. వివిధ జిల్లాల్లో నాయకులను ఇండ్ల వద్దే ముందు రోజు రాత్రే అరెస్టులు చేశారు. వందలాది మంది పోలీసులు తమ బలగాలతో వచ్చి అక్రమ ముందస్తు అరెస్ట్లకు పాల్పడుతున్నారు.* *ఆశా వర్కర్స్, అంగన్వాడి లకు రూ.18,000/-ల ఫిక్స్డ్ వేతనం, పిఎఫ్ సౌకర్యం అమలు,గ్రామ పంచాయితీ, మున్సిపల్,RTC విద్యుత్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్, బిల్డింగ్, హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు డిమాండ్ చేస్తున్నాము.వీటి ఎజెండా కోసం ఆందోళన- పోరాటాలు చేస్తున్నారు. బాధ్యత కల్గిన రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సమస్యలను పరిష్కరించాలి.పరిష్కరించకుండా ఆందోళనా-పోరాటాలు నిర్వహిస్తున్న కార్మికులను అణచివేస్తూ తీవ్ర నిర్భంధాన్ని ప్రయోగిస్తున్నారనీ అన్నారు.* ఈ కార్యక్రమం లో సిఐటియు జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, జిల్లా అధ్యక్షులు కొప్పుల రఘుపతి, గుండె బోయిన రవిగౌడ్, కురేందుల సమ్మక్క, శ్రావ్య, రమాదేవి, శ్రీనాథ్, మహేష్, పద్మ, భాగ్య, సరిత, లక్ష్మీనరసమ్మ , నాగమణి, సంధ్య, పూర్ణ, సుధా, వెంకటరమణ , సడాలు, రజిత, కవిత, సమ్మక్క ఆశా అంగన్వాడి, గ్రామపంచాయతీ కార్మికులు, హమాలీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    కార్మికుల పై నిర్భందాన్ని  నిరసిస్తూ సామూహిక నిరసన దీక్ష
ఈ రోజు CITU ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం లో అంబేద్కర్ విగ్రహం ముందు సామూహిక నిరసన దీక్ష చేపట్టారు.ఈ దీక్షలను రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి గారు ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ కు వెళ్లి అదనపు కలెక్టర్ మహేందర్ జి గారికి, జిల్లా ఎస్ పి కార్యాలయం లో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ   గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కార్మిక వర్గానికి అనేక హమీలు ఇచ్చి అమలు చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. స్కీం వర్కర్లఐన ఆశా, అంగన్వాడి తదితరులకు కనీస వేతనం 18 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడిచినప్పటికీ, కార్మిక వర్గానికి ఇచ్చిన హమీల అమలు పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. దీనితో కార్మిక వర్గం తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన - పోరాటాలు చేస్తుంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల్లో తీవ్ర నిర్భంధాన్ని ప్రయోగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కనీసం ధర్నా చేసుకునేందుకు కూడా అనుమతిని నిరాకరిస్తున్నారు. ఇది కార్మికుల హక్కులను  అప్రాజాస్వామికంగా నిరాకరించటమేనని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం  కాదని విమర్శించారు.*
*2026 సెప్టెంబర్ 8,9తేదీల్లో జరిగిన అంగన్వాడీ,ఆశా రెండు సంఘాల "ఛలో హైదరాబాద్" పిలుపులను భగ్నం చేయడానికి కాంగ్రెస్ సర్కార్ పడరాని పాట్లు పడింది. వివిధ జిల్లాల్లో నాయకులను ఇండ్ల వద్దే ముందు రోజు రాత్రే అరెస్టులు చేశారు. వందలాది మంది పోలీసులు తమ బలగాలతో వచ్చి అక్రమ ముందస్తు అరెస్ట్లకు పాల్పడుతున్నారు.*
*ఆశా వర్కర్స్, అంగన్వాడి లకు రూ.18,000/-ల ఫిక్స్డ్ వేతనం, పిఎఫ్ సౌకర్యం అమలు,గ్రామ పంచాయితీ, మున్సిపల్,RTC విద్యుత్,  ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్, బిల్డింగ్, హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు డిమాండ్ చేస్తున్నాము.వీటి ఎజెండా కోసం  ఆందోళన- పోరాటాలు చేస్తున్నారు. బాధ్యత కల్గిన రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సమస్యలను పరిష్కరించాలి.పరిష్కరించకుండా ఆందోళనా-పోరాటాలు నిర్వహిస్తున్న కార్మికులను అణచివేస్తూ తీవ్ర నిర్భంధాన్ని ప్రయోగిస్తున్నారనీ అన్నారు.*
ఈ కార్యక్రమం లో  సిఐటియు జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, జిల్లా అధ్యక్షులు కొప్పుల రఘుపతి, గుండె బోయిన రవిగౌడ్, కురేందుల సమ్మక్క, శ్రావ్య, రమాదేవి, శ్రీనాథ్, మహేష్, పద్మ, భాగ్య, సరిత, లక్ష్మీనరసమ్మ , నాగమణి, సంధ్య, పూర్ణ, సుధా, వెంకటరమణ , సడాలు, రజిత, కవిత, సమ్మక్క ఆశా అంగన్వాడి, గ్రామపంచాయతీ కార్మికులు, హమాలీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు,  తదితరులు పాల్గొన్నారు.
    user_Karunya
    Karunya
    ములుగు, ములుగు, తెలంగాణ•
    1 day ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.