అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారి కార్యాలయం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బుల్లి మోహన్ రెడ్డి గారి మాతృమూర్తి మృతి: నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి దంపతులు భాస్కరమ్మ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే దంపతులు అనపర్తి మండలం అనపర్తి గ్రామంలో తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు; వెంకటేశ్వర రైస్ మిల్ నెంబర్-1 మేనేజింగ్ పార్ట్నర్ శ్రీ నల్లమిల్లి బుల్లి మోహన్ రెడ్డి గారి మాతృమూర్తి శ్రీమతి భాస్కరమ్మ గారు ఈరోజు (11.05.2026, సోమవారం) పరమపదించారు. భాస్కరమ్మ గారి పార్థివదేహానికి అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు నివాళులర్పించారు. భాస్కరమ్మ గారి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే దంపతులు బుల్లి మోహన్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారు ఆకాంక్షించారు.
అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారి కార్యాలయం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బుల్లి మోహన్ రెడ్డి గారి మాతృమూర్తి మృతి: నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి దంపతులు భాస్కరమ్మ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే దంపతులు అనపర్తి మండలం అనపర్తి గ్రామంలో తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు; వెంకటేశ్వర రైస్ మిల్ నెంబర్-1 మేనేజింగ్ పార్ట్నర్ శ్రీ నల్లమిల్లి బుల్లి మోహన్ రెడ్డి
గారి మాతృమూర్తి శ్రీమతి భాస్కరమ్మ గారు ఈరోజు (11.05.2026, సోమవారం) పరమపదించారు. భాస్కరమ్మ గారి పార్థివదేహానికి అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు నివాళులర్పించారు. భాస్కరమ్మ గారి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే దంపతులు బుల్లి మోహన్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారు ఆకాంక్షించారు.
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి పేదల వైద్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి ఎంపీడీవో కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.8,52,871 చెక్కులను ఆరుగురు బాధితులకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైసిపి హయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేశారన్నారు.1
- ఎర్రవరం జలపాతం సందర్శకుల సందడి.. చింతపల్లి మండలంలోని గొందిపాకలు పంచాయతీ పరిధిలో ఉన్న ఎర్రవరం జలపాతం ప్రకృతి అందాలతో సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఎత్తయిన కొండల మధ్య నుంచి జాలువారుతున్న జలధారలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. జలపాతం నుంచి వెదజల్లే చల్లటి పొగమంచు సందర్శకులకు ప్రశాంతతను, ఆహ్లాదాన్ని పంచుతోంది. వేసవి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కుటుంబ సమేతంగా జలపాతం వద్దకు చేరుకొని సేదతీరుతున్నారు. ప్రకృతి సోయగాల నడుమ యువత సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ సందడి చేస్తున్నారు. పర్యాటక ప్రాంతంగా పేరుగాంచుతున్న ఈ జలపాతానికి మరిన్ని సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో లారీ యార్డ్ వద్ద జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఇతర రాష్ట్రానికి చెందినవాడని పోలీసులు గుర్తించగా, పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.2
- 'ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆకాశయానం' సాధారణంగా పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం లేదా దాతలు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేయడం చూస్తుంటాం. కానీ విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గోపన్నవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు ఎం. సత్యారావు విద్యార్థుల్లో మరింత స్ఫూర్తిని నింపేందుకు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురు విద్యార్థులను ఆయన తన సొంత ఖర్చులతో విమాన ప్రయాణం చేయించి వారి కలలను నిజం చేశారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఈ విద్యార్థులు విమానం ఎక్కడం తమ జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని ఆనందం వ్యక్తం చేశారు. చదువులో రాణిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చనే సందేశాన్ని విద్యార్థులకు ప్రాక్టికల్‌గా చూపించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఉపాధ్యాయుడు సత్యారావు తెలిపారు. ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తన జీతపు సొమ్మును విద్యార్థుల ప్రోత్సాహం కోసం ఈ విధంగా వెచ్చించడం పట్ల విద్యాశాఖ అధికారులు మరియు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విమాన ప్రయాణం కేవలం ఒక విహారయాత్ర మాత్రమే కాకుండా, విద్యార్థుల ఉన్నత లక్ష్యాలకు ఒక గొప్ప పునాదిగా నిలుస్తుందని వారు కొనియాడారు.1
- ఐపీఎల్ 2024 లో నిన్న జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లలో ఆర్‌సీబీ వర్సెస్ ఎంఐ, సీఎస్‌కే వర్సెస్ ఎల్‌ఎస్‌జీ జట్లు తలపడ్డాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజయాలు నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలతో పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు లక్ష్మీపురం లారీ యార్డు వద్ద ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో బీహార్‌కు చెందిన కుందన్ సింగ్‌ను బండరాయితో కొట్టి చంపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.1
- సత్తనపల్లిలో చోరీ... నిందితులను పట్టుకొని అరెస్టు చేసిన పోలీసులు. పల్నాడు జిల్లా.. సత్తెనపల్లి లో చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన పోలీసులు ఇద్దరు నిందితులు, ఇద్దరు బాల నేరస్తులు అదుపులోకి – రూ.1.33 లక్షల బంగారం, బైక్ స్వాధీనం సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను ఇద్దరు బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 11వ తేదీన ఉదయం సత్తెనపల్లి పట్టణంలో ఓ మహిళ మెడలో ఉన్న బంగారు తాళిబొట్టును అపహరించిన ఘటనపై కేసు నమోదు చేశారు. కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించారు. నిందితుల నుంచి సుమారు 13.88 గ్రాముల వెండి ఆభరణాలు, అంచనా విలువ రూ.1,33,000 నగలు, అలాగే AP 07 BA 2113 నంబర్ గల హీరో స్పెండర్ ప్లస్ మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఉపయోగించిన ఇతర వస్తువులను కూడా పోలీసులు జప్తు చేశారు. ఈ కేసును ఛేదించడంలో ఎం. పవన్ కుమార్ నేతృత్వంలో హెడ్ కానిస్టేబుల్ ఏ.వి. ఆంజనేయులు, పోలీస్ కానిస్టేబుల్ కే. రాజు కీలక పాత్ర పోషించారు. వారి సేవలను సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అభినందించారు.1
- ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించండి -పిల్లలను చేర్పించండి: కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి తమ పిల్లలను చేర్పించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తోందని తెలిపారు. వివిధ కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న 26 మంది విద్యార్థులు ఒకేసారి ప్రభుత్వ పాఠశాలలో చేరడం విశేషంగా నిలిచింది. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి వరకు విద్యార్థులు ఈ పాఠశాలలో అడ్మిషన్ పొందారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి ప్రోత్సహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా మౌలిక వసతులు, డిజిటల్ సదుపాయాలు, నాణ్యమైన బోధన అందిస్తున్నామని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించగల నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో 91 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచామని కలెక్టర్ గుర్తు చేశారు. అదేవిధంగా జిల్లాలో 60 పాఠశాలలు శతశాతం ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు.1