Shuru
Apke Nagar Ki App…
పటాన్‌చెరు ఆబ్కారీ స్టేషన్ నుంచి హెరాయిన్ కేసు నిందితుడు పరారీ.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఆబ్కారీ స్టేషన్ నుంచి హెరాయిన్ కేసులో అరెస్టైన నిందితుడు సహిదూర్ రహమాన్ పరారయ్యాడు. మంగళవారం రాత్రి పటాన్‌చెరు శివారులో హెరాయిన్ విక్రయిస్తున్న సమయంలో ఆబ్కారీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆబ్కారీ స్టేషన్‌లోని లాక్‌అప్‌లో ఉంచారు. అయితే బుధవారం తెల్లవారుజామున లాక్‌అప్ గ్రీల్స్‌ను విరగగొట్టి నిందితుడు తప్పించుకున్నాడు. ఈ ఘటనపై ఆబ్కారీ అధికారులు పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పరారీకి సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
VN NEWS E PEPAR
పటాన్‌చెరు ఆబ్కారీ స్టేషన్ నుంచి హెరాయిన్ కేసు నిందితుడు పరారీ.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఆబ్కారీ స్టేషన్ నుంచి హెరాయిన్ కేసులో అరెస్టైన నిందితుడు సహిదూర్ రహమాన్ పరారయ్యాడు. మంగళవారం రాత్రి పటాన్‌చెరు శివారులో హెరాయిన్ విక్రయిస్తున్న సమయంలో ఆబ్కారీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆబ్కారీ స్టేషన్‌లోని లాక్‌అప్‌లో ఉంచారు. అయితే బుధవారం తెల్లవారుజామున లాక్‌అప్ గ్రీల్స్‌ను విరగగొట్టి నిందితుడు తప్పించుకున్నాడు. ఈ ఘటనపై ఆబ్కారీ అధికారులు పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పరారీకి సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
More news from తెలంగాణ and nearby areas
- కంటి వెలుగు ఆపేశారు: కేటీఆర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో కేటీఆర్ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి, కళ్లద్దాలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిన 'కంటి వెలుగు'ను కొనసాగించేలా ఈ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ అవసరమైన 171 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. మనల్ని చూసైనా ప్రభుత్వం ఈ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తే మంచిదని హితవు పలికారు.2
- సారు ఒక్క యూరియా బస్తా ఇవ్వండి, మీ కాళ్ళు మొక్కుతంటూ వృద్ధ రైతు ఆవేదన..! మెదక్ జిల్లా రంగంపేటలో ఒక్క యూరియా బస్తా కోసం సొసైటీ సిబ్బంది కాళ్లు మొక్కుతూ వేడుకున్న వృద్ధ రైతు. రేవంత్ సర్కార్‌లో రైతులకు తప్పని యూరియా కష్టాలు, యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నామని వాపోతున్న రైతులు.1
- కోదండరాం ను సోమాజిగూడ లో నిలదీసిన నిరుద్యోగులు, వీడియో వైరల్ కోదండరాంను పరిగెత్తించిన నిరుద్యోగులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంచే అంశంపై కోదండరాంను అడ్డుకుని నిలదీసిన నిరుద్యోగులు1
- హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు 2000 రూపాయలు జరిమానా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడి హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు సిబ్బందినిఎస్పి అభినందించారు. భార్యతో చనువుగా ఉండడం చూసి సహచర కూలీని కర్రతో కొట్టి హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ ప్రధాన న్యాయమూర్తి నీలిమ తీర్పు వెలువరించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. కేసు వివరాల ప్రకారం.. బిట్టు కుమార్ (22) తన భార్య పూజా కుమారి, పిల్లలతో కలిసి కళకల్ గ్రామంలో శ్రీరామ్ పండరి నిర్మిస్తున్న ఇంటి వద్ద కూలీ పనులు చేస్తూ అదే ఇంటిలో నివాసం ఉంటున్నాడు. అదే ఇంటిలో వీరికంటే ముందుగా మేస్త్రీ పనులు చేస్తూ ప్రమోద్ పాశ్వాన్ (43) నివాసం ఉంటున్నాడు.ప్రమోద్ పాశ్వాన్ తన భార్యతో చనువుగా ఉండటాన్ని గమనించి న బిట్టు కుమార్, అతడిని రెండు మూడు సార్లు హెచ్చరించాడు. మరోసారి ఈ విధంగా ప్రవర్తిస్తే చంపాలని నిర్ణహించుకున్నాడు. ఈ క్రమంలో 16.11.2024న సాయంత్రం బిట్టు కుమార్, ప్రమోద్ పాశ్వాన్ సరుకులు తీసుకురావడానికి బయటకు వెళ్లి రాత్రి సుమారు 9 గంటల సమయంలో నివాసం ఉంటున్న ఇంటికి తిరిగి వచ్చారు. బిట్టు కుమార్ సరుకులను తన భార్యకు ఇచ్చి బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ప్రమోద్ పాశ్వాన్ తన భార్య నడుముపై చేయి వేసి ఉండటాన్ని చూశాడు.దీంతో ఆగ్రహించిన బిట్టు కుమార్, ప్రమోద్ పాశ్వాన్‌ను ఎందుకు అలా చేస్తున్నావని ప్రశ్నిస్తే, తన ఇష్టమని, తనను ఎందుకు అడుగుతున్నావంటూ ప్రమోద్ పాశ్వాన్ దురుసుగా సమాధానం ఇచ్చాడు. అనంతరం బిట్టు కుమార్‌ను తోసివేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బిట్టు కుమార్ మంచంపై ఉన్న కర్రతో ప్రమోద్ పాశ్వాన్‌పై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయి పటాన్‌చెరువుకు వెళ్లాడు.ఈ ఘటనపై మనోహరాబాద్ ఎస్‌ఐ సుభాష్ గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి కేసు దర్యాప్తు అధికారి సీఐ రంగకృష్ణ పూర్తి సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్ బలమైన వాదనలు వినిపించారు. పోలీసులు సమర్పించిన పూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి నీలిమ, నిందితుడు బిట్టు కుమార్‌ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.ఈ కేసులో కోర్టు లైజనింగ్ అధికారులు ఎస్‌ఐ విఠల్, కానిస్టేబుల్ రవీందర్ గౌడ్, సీడీఓ మహిపాల్ రెడ్డి సహకరించారు.నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు చేసి, పూర్తి సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించిన దర్యాప్తు అధికారులు, కోర్టు లైజనింగ్ అధికారులు, సాక్ష్యాధారాల సేకరణలో సహకరించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, అభినందించారు.1
- తగ్గిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. నిత్య ఆర్జిత సేవలు శాస్త్రోక్తంగా నిర్వహించారు అందులో VIP దర్శనాల ద్వారా రూ.87,900, బ్రేక్ దర్శనాలతో తగ్గిన యాదగిరిగుట్ట రూ.88,200, అన్న ప్రసాదంతో రూ.1,26,335, కార్ పార్కింగ్ తో రూ.2,21,500, ప్రసాద్ విక్రయాలతో రూ.4,03,350 తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,54,133 ఆదాయం వచ్చినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.1
- కేసీఆర్, కేటీఆర్ కాళ్లు మొక్కింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా? పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని కాంట్రాక్టులు తీసుకొని ఎంజాయ్ చేసింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా? కేసీఆర్, కేటీఆర్‌ల పుణ్యాన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంత పెద్దోడు అయ్యాడు.. లేకుంటే ఆయన గతి ఏంటి? ఈరోజు వాళ్లనే తిడుతున్నాడు.. తిన్నింటి వాసాలు లెక్కపెట్టకు పొంగులేటి అసలు కాంగ్రెస్ నాయకులను పక్కనబెట్టి, ఈ దొంగ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి1
- మెదక్‌లో జిల్లా కేంద్రంలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల చలో కలెక్టరేట్ విద్యా రంగంలో సమస్యలను పరిష్కరించడంతో పాటు విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమం మెదక్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తతకు దారితీసింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలెక్టరేట్ వైపు ర్యాలీగా బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, పోలీసుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దీంతో కలెక్టరేట్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.1