Shuru
Apke Nagar Ki App…
తెలంగాణ అమరుల ఆశయాలు ఆదర్శంగా తీసుకోవాలి. ఎస్పీ స్నేహ మెహ్రా తెలంగాణ అమరుల త్యాగాలను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. గురువారం తెలంగాణ విలీన దినోత్సవం పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎంతోమంది ప్రాణాలకు తెగించి పోరాటం చేసి తెలంగాణను సాధించారని వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని ఎస్పీ తెలిపారు.
Jvnath
తెలంగాణ అమరుల ఆశయాలు ఆదర్శంగా తీసుకోవాలి. ఎస్పీ స్నేహ మెహ్రా తెలంగాణ అమరుల త్యాగాలను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. గురువారం తెలంగాణ విలీన దినోత్సవం పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎంతోమంది ప్రాణాలకు తెగించి పోరాటం చేసి తెలంగాణను సాధించారని వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని ఎస్పీ తెలిపారు.
More news from Telangana and nearby areas
- తెలంగాణ అమరవీరుల ఆశయాలు ఆదర్శంగా తీసుకోవాలి. స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలంగాణ సాధన కోసం ఎంతోమంది ప్రాణాలకు తరలించి తెలంగాణను సాధించుకున్నారని వారి ఆశయాలు ఆదర్శంగా తీసుకోవాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలంగాణ విలీన దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందన్నారు.1
- సదాశివపేట: సదాశివపేట సామాజిక ఆసుపత్రిలో మూడు 108 అంబులెన్స్ ల ఏర్పాటు..! సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దలోడి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం జరిగిన ఫుడ్ పాయిజన్ లో దాదాపు 31 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా వారిని సదాశివపేట, సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.వారిని సంగారెడ్డి జిల్లా డిఎం & హెచ్ఓ లలితాదేవి పర్యవేక్షించి విద్యార్థులందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందికి ఆదేశించారు.అదేవిధంగా డిఎం & హెచ్ఓ ఆదేశాల మేరకు సదాశివపేట సామాజిక ఆసుపత్రి నందు ముందస్తు చర్యగా మూడు 108 అంబులెన్స్లను ఏర్పాటు చేసినట్లు 108 ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సంపత్ తెలిపారు.1
- తెలంగాణ గడ్డపై ఆత్మగౌరవ శంఖారావం... తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొదటి ఆవిర్భావం... బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా... ఉదయించింది 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ'!* తెలంగాణ గడ్డ ఎప్పుడూ పోరాటాలకి పెట్టింది పేరు. అన్యాయం జరిగిన ప్రతిసారీ ఈ నేల తిరగబడింది... దోపిడీపై ధిక్కార స్వరం వినిపించింది. ఆ పోరాటాల స్ఫూర్తితో, అణగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీకగా, ఈ గడ్డపై పురుడుపోసుకున్న సరికొత్త ఆశల కిరణమే 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ.. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు... తరతరాలుగా అధికారానికి, హక్కులకు దూరంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ఆక్రందనల నుండి పుట్టిన ప్రజా చైతన్య ఉప్పెన.! ప్రశ్నించే గొంతుక... తీన్మార్ మల్లన్న పోరాటంవ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై, పాలకుల అహంకారంపై ఒంటరి పోరాటం మొదలుపెట్టిన ధీరుడు తీన్మార్ మల్లన్న... బెదిరింపులకు లొంగలేదు, అక్రమ కేసులకు భయపడలేదు. జైలు గోడలు ఆయన ప్రవాహాన్ని ఆపలేకపోయాయి. ప్రజా సమస్యలే అజెండాగా, ప్రజల గొంతుకై గర్జించిన మల్లన్న,.. నేడు తెలంగాణలో శతాబ్దాలుగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ సైన్యాన్ని నడిపిస్తున్నారు.ఆయన నడిపిన ప్రతి ఉద్యమం, చేసిన ప్రతి పోరాటం... వ్యవస్థను ప్రశ్నించే ధైర్యాన్ని సామాన్యుడికి నేర్పింది.. మా ఓట్లతో మీరు గద్దెనెక్కడం కాదు... మా ఓట్లతో మేమే పాలకులమవుతాం" అనే నిఖార్సైన సత్యాన్ని చాటిచెప్పింది.! సామాన్యుడి ఆయుధం ఓటు అయితే, ఆ ఓటుకు అసలైన విలువను ఇచ్చేందుకు సిద్ధమైంది రాజ్యాధికార పార్టీ. సమాజంలో పేరుకుపోయిన అసమానతలను, దోపిడీ వ్యవస్థలను కత్తిరించడమే ధ్యేయంగా 'కత్తెర' గుర్తుతో ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోతోంది..!1
- శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- తెలంగాణ దొంగలు YouTube ఛానల్, సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన BRSV కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై అభ్యంతరకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ, వారి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వీడియోలు ప్రచారం చేస్తున్నారని, ఆ ఛానల్లను బ్లాక్ చేసి వాటి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు1
- ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్ సిబ్బంది, మహిళా కానిస్టేబుళ్లు, ఎస్‌ఐలు భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాండ్ మేళాల మధ్య ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళా పోలీసుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తిభావంతో గణనాథుడిని సాగనంపారు.4
- జాతీయ జెండాను ఆవిష్కరణ చేసిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరణ చేశారు.1
- తెలంగాణ విముక్తితో ఈ ప్రాంత ప్రజలకు ప్రశాంతత లభించింది. తెలంగాణ విముక్తి కోసం ఎంతోమంది ఎంతోమంది పోరాటం చేసి నైజాం సర్కార్ నుంచి విముక్తి కల్పించాలని బిజెపి జిల్లా అధ్యక్షులు రమేష్ కుమార్ పేర్కొన్నారు గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద బిజెపి నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణకు విముక్తి పొందిన రోజుగా వారు అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మాధవరెడ్డి వడ్ల నందు రాజేందర్రెడ్డి సతీష్ వివేకానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు1